- Home
- Entertainment
- TV
- Guppedantha Manasu serial 29th December :రిషి ఉన్న ప్లేస్ కనిపెట్టేసిన రౌడీలు, వసు మెడపై కత్తిపెట్టి..!
Guppedantha Manasu serial 29th December :రిషి ఉన్న ప్లేస్ కనిపెట్టేసిన రౌడీలు, వసు మెడపై కత్తిపెట్టి..!
మీరు నాకు పునర్జన్మ ఇచ్చారని, మీరు మరోసారి నాకు ప్రాణం పోశారు అంటాడు. ఇంకా కొన్ని రోజులు పసరు మందు తీసుకుంటే వెంటనే కోలుకుంటావ్ అని వాళ్లు రిషికి ధైర్యం చెబుతారు.

Guppedantha Manasu
Guppedantha Manasu serial 29th December :నిన్నటి ఎపిసోడ్ లో శైలేంద్రకు ఊహించని షాక్ ఎదురైంది. ఎప్పుడెప్పుడు ఎండీ సీటు దక్కించుకుందామా అని ఎదురుచూస్తున్న శైలేంద్ర కు తండ్రి షాకిచ్చాడు. తనకు అసలు ఎండీ సీటు మీద ఎలాంటి వ్యామోహం లేదు అని నోటితో చెప్పించడమే కాదు.. రాత పూర్వకంగా కూడా రాయించుకున్నాడు. తర్వాత.. ఆ రాసిన లెటర్ తీసుకొని ఫణీంద్ర డైరెక్ట్ గా వసుధార వద్దకు రావడం విశేషం. మరి వసు దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడారో ఈరోజు ఎపిసోడ్ లో చూద్దాం...
Guppedantha Manasu
ఫణీంద్ర లోపలికి వస్తాడు.. కూర్చోమని వసుధార చెప్పగానే పర్వాలేదు అని అసలు విషయంలోకి వచ్చేస్తాడు. ‘ నాకు నా తమ్ముడు మహేంద్ర, వాడి కొడుకు రిషి అంటే ఇష్టమో, నువ్వుంటే కూడా అంతే ఇష్టం. వాళ్ల మీద నాకు ఎంత నమ్మకమో, నీ మీద కూడా అంతే నమ్మకం. నీ మాట గానీ, నీ పని గానీ చాలా కచ్చితంగా ఉంటాయి. తొందరపడి ఒక మాట అనరు. తొందరపడి ఓ నిర్ణయం తీసుకోరు. మీరు ఏదైనా మాట అన్నా, ఏదైనా పని చేసినా దాని వెనక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం ఏంటో చెప్పమనే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. శైలేంద్ర మీద మీకు అనుమానం ఎందుకు వచ్చిందో చెప్పమనే అడుగుతున్నాను. మీరేమీ చెప్పడం లేదు. మొన్న ఇంటికి వచ్చి కూడా మహేంద్రను అడిగాను. మహేంద్ర కూడా మౌనంగా ఉన్నాడు. మహేంద్ర ఏమీ చెప్పడం లేదు. నిజంగా శైలేంద్ర ఏదైనా చేస్తే వాడిని నేను వదిలిపెట్టనమ్మా. నువ్వేమో వాడికి ఎండీ సీటు మీద ఆశ ఉంది అన్నట్లుగా ఫోన్ లో మాట్లాడావ్. నేను కూడా వాడిని అదే విషయం అడిగాను. వాడు అలాంటిది ఏమీ లేదని.. ఏకంగా లెటర్ మీద కూడా రాసి ఇచ్చాడు. ఇదిగో లెటర్ కూడా తీసుకువచ్చాను. తను నీకు ఏ విధంగానూ అడ్డురాడమ్మ తన వల్ల నీకు ఏ భయం లేదు. ఆ విషయంలో నేను నీకు హామీ. వాడు లెటర్ రాసిచ్చాడని కాదు. నేను హామీ ఇస్తున్నాను. ఆ విషయంలో నువ్వు ఎలాంటి కంగారుపడాల్సిన అవసరం లేదు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా?’ అని ఆ లెటర్ వసు చేతిలో పెట్టి ఫణీంద్ర వెళ్లిపోతాడు.
Guppedantha Manasu
వసు ఆ లెటర్ చూసి ఏమి మాట్లాడాలో అర్థం కాక ఉండిపోతుంది. మరోవైపు మహేంద్ర.. అనుపమ ను కలిసి మాట్లాడుతూ ఉంటాడు. ‘ నేను ఆల్రెడీ ముకుల్ తో మాట్లాడాను. మార్చురీలో ఉన్న డెడ్ బాడీ ఎవరిదో కనుకుంటాను అన్నాడు. వాడి దగ్గరి రిషి ఫోన్ ఎలా వచ్చిందో కూడా కనుక్కుంటాను అని అన్నాడు. కానీ, డెడ్ బాడీ మీద క్లాత్ తీసిన క్షణం నేను చచ్చిపోయానేమో అనిపించింది. ఒకవేళ అక్కడ రిషి ఉంటే పరిస్థితి ఏంటి? ఒక్క నిమిషం గుండె ఆగినంత పని అయ్యింది’అని మహేంద్ర అంటాడు. అప్పుడు అనుపమ ధైర్యం చెబుతుంది. రిషి ఎక్కడో ఒక చోట క్షేమంగానే ఉంటాడు అని చెబుతుంది. మన దగ్గరకు వచ్చే అవకాశం వస్తే, కచ్చితంగా వస్తాడని అనుపమ చెబుతుంది. తాను కూడా అదే ధైర్యంతో ఉన్నానని, కానీ ఒక్కోసారి చాలా భయం వేస్తోందని, నా కొడుక్కి ఏమైనా అయ్యిందేమో అని భయం వేస్తోందని, రిషి ఎప్పుడు వస్తాడో అని మహేంద్ర బాధగా అంటాడు.
Guppedantha Manasu
వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటే.. అక్కడికి వసుధార వస్తుంది. ఏంటని అడిగితే, శైలేంద్ర రాసిన ఉత్తరం ఇస్తుంది. ఫణీంద్ర సర్ ఈ లెటర్ ఇచ్చారనే విషయం చెబుతుంది. అందులో ఉన్నది చదివి మహేంద్ర షాకౌతాడు. ఈ లెటర్ అన్నయ్య ఎందుకు ఇచ్చాడు అంటే... శైలేంద్రతో రాయించి తీసకువచ్చారు అని చెబుతుంది. అసలు శైలేంద్రకు ఎండీ సీటు మీద ఆశ ఉందనే అనుమానం అన్నయ్యకు ఎలా వచ్చింది అని మహేంద్ర అడుగుతాడు. అప్పుడు వసు తాను ఫోన్ లో మాట్లాడిన విషయం మొత్తం చెబుతుంది.
అయినా మన దగ్గర వీడియో ఉన్నా కూడా అంత ధైర్యం ఎలా చేశాడు..? అంటే వాడి దగ్గర మరో ఏదో ప్లాన్ ఉంది. ఈ సమయంలో మనం మరింత జాగ్రత్తగా ఉండాలి అని మహేంద్ర అంటాడు. వాళ్ల నాన్నకు విషయం తెలిసింది కాబట్టి.. శైలేంద్ర మరింత జాగ్రత్త పడతాడేమో అని అనుపమ అంటుంది. కానీ ఆ రాక్షసుడు జాగ్రత్తపడతాడో, మరింత దుర్మార్గానికి తలపడతాడో ఎవరికి తెలుసు అని మహేంద్ర అంటాడు. ఇంత మంది కళ్లకు గంతలు కట్టినవాడు.. కన్న తండ్రి కళ్లకు గంతలు కట్టలేడా పైగా అక్కడ ఉంది తన కొడుకు కాబట్టి, అన్నయ్య శైలేంద్రనే నమ్మే అవకాశం ఉంది. వాడు వాడి నటనతో అన్నయ్యను నమ్మించగలడు అని మహేంద్ర అంటాడు.
అలా ఎందుకు అనుకుంటున్నావ్ అని అనపమ అడిగితే, తన అన్నయ్య ఎంత మంచివాడైనా, ఎంత నిజాయితీ పరుడైనా కొడుకనే పాశం వాటిని చీకట్లోకి నెట్టేస్తుంది అని మహేంద్ర అంటాడు. కానీ అనుపమ మాత్రం.. ఎక్కడో ఒకచోట శైలేంద్ర దొరకుతాడని, అప్పుడు మనకు రిషి గురించి తెలుస్తుంది అంటుంది. రిషి వస్తే.. ఆ దుర్మార్గుడికి గుణపాఠం చెబుతాడని, అందుకే రిషి త్వరగా రావాలి అని మహేంద్ర కూడా కోరుకుంటాడు.
Guppedantha Manasu
మరోవైపు రిషికి కొద్ది కొద్దిగా స్పృహ వస్తూ ఉంటుంది. వసుధార పేరు కలవరిస్తూ ఉంటాడు. రిషికి వైద్యం చేస్తున్న దంపతులు మందులతోపాటు ఆహారం కూడా తినిపిస్తారు. తర్వాత నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని అడుగుతాడు. చెట్ల పొదల్లో దెబ్బలతో కనిపిస్తే.. మేమే తీసుకువచ్చాం అని వాళ్లు చెబుతారు. హాస్పిటల్ కి తీసుకువెళదాం అనుకున్నా ం కానీ, నీకు ఏదైనా ఆపద కలగుుతందని తీసుకువెళ్లలేదని, అసలు నవ్వు ఎవరు? నిన్ను ఎవరు కొట్టారు? వసుధార ఎవరు అని అడుగుతారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడు కానీ, మిమ్మల్ని ఆ దేవుడే పంపించాడు అని చెబుతాడు. మీరు లేకపోతే నేను ఏమి అయ్యేవాడినో ఊహించుకోలేకపోతున్నాను అని, మీరు నాకు పునర్జన్మ ఇచ్చారని, మీరు మరోసారి నాకు ప్రాణం పోశారు అంటాడు. ఇంకా కొన్ని రోజులు పసరు మందు తీసుకుంటే వెంటనే కోలుకుంటావ్ అని వాళ్లు రిషికి ధైర్యం చెబుతారు.
రిషి వసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వు నా కోసం ఎంత ఎదురుచూస్తున్నావో నాకు తెలుసు. మనం మళ్లీ కలుసుకోవడం కోసం ఆ దేవుడే వీళ్లిద్దరినీ పంపించాడేమో లేదంటే,.. అమ్మ పంపిందేమో, మనం మళ్లీ కలుస్తాం వసుధార అనుకుంటూఉంటాడు. ఆ దంపతుల.. రిషి కోలుకున్నందుకు దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు. అదే సమయానికి రిషిని వెతుక్కుంటూ రౌడీలు వస్తారు. వాళ్లను ఈ దంపతులు చూస్తారు. వాళ్లు రిషి కోసమే వచ్చారనే అనుమానం వీళ్లకు కలుగుతుంది. వెంటనే వెళ్లి రిషికి చెబుతారు. తనకోసమే వచ్చారని రిషి అనుకుంటాడు. వెళ్లి వాళ్లనే కనుక్కుంటాను అని రిషి అంటే,ఇంకా కొద్ది రోజులు కోలుకోవాలని, అప్పుడే వద్దు అని ఆ పెద్దాయన చెబుతాడు. ఆ రౌడీలను తాము మాయ చేసి పంపించేస్తామని, ఇప్పుడు వాళ్లతో దెబ్బలాడటానికి కూడా నీకు శక్తి సరిపోదని, ఇప్పుడు నువ్వుకోలుకుంటే, తర్వాత వాళ్ల మీద గెలుస్తావు అని నచ్చచెబుతాడు. రిషి సరే అని అంగీకరిస్తాడు.
Guppedantha Manasu
మరోవైపు రౌడీలు రిషి కోసం వెతుకుతూ రిషి ఉన్న ఇంటికే వస్తారు.ఆ ముసలివాళ్లను బెదిరించి, లోపలికి వెళ్లి చెక్ చేస్తారు. కానీ అప్పటికే ఆ పెద్దాయన రిషిని వాళ్లకు కనిపించకుండా దాచి పెడతాడు. రౌడీలు ఇళ్లంతా వెతుకుతూ సరిగ్గా రిషి దాక్కున్న చోటికే వస్తారు. అప్పుడే రౌడీకి ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోతారు.
Guppedantha Manasu
శైలేంద్ర నియమించిన భద్ర.. వసుని చంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. అందరూ నిద్రపోతున్న సమయంలో వసుని చంపాలని ఫిక్స్ అవుతాడు. వసు పక్కన అనుపమ కూడా ఉంటుంది. కర్చీఫ్ కి మత్తు మందు రాసి వసుకి పెట్టబోతూ ఉంటాడు. ఈ లోగా ఎవరో వసు మెడకు కత్తిపెట్టి రిషిని పిలుస్తున్నట్లుగా చూపిస్తారు. అది రిషి కల అయ్యి ఉండొచ్చు. ఇక్కడితో ఎపిసోడ్ ముగిసింది.