- Home
- Entertainment
- TV
- Guppedantha Manasu Serial 21st December:శైలేంద్రకే ఎండీ సీటు, రిషి కోసం త్యాగం చేసిన వసు..!
Guppedantha Manasu Serial 21st December:శైలేంద్రకే ఎండీ సీటు, రిషి కోసం త్యాగం చేసిన వసు..!
అందుకనే నీకు నమ్మకం కలిగించాలనే రిషి బ్రెస్ లెట్ తీసుకొచ్చా. ఇప్పటికైనా నమ్ముతావా? రిషి నా దగ్గరే ఉన్నాడని’ అని శైలేంద్ర అంటాడు. అదంతా విన్న వసు.. ‘ అంటే రిషి సర్ నీ దగ్గరే ఉన్నారా? ఎక్కడ ఉన్నారో చెప్పు ’ అని అడుగుతుంది.

Guppedantha Manasu
Guppedantha Manasu Serial:తన చేతికి లెటర్, రిషి బ్రెస్ లెట్ రావడంతో, కాలేజీకి వెళ్లకుండా ఆ లెటర్ లో ఉన్న అడ్రస్ కి వసుధార చాలా వేగంగా చేరుకుంటుంది. తర్వాత... అక్కడ ఎవరూ లేరు ఏంటని వెతుకుతూ ఉంటుంది. అప్పుడే వెనక నుంచి ఓ వ్యక్తి చప్పట్లు కొడుతూ కనిపిస్తాడు. ఎవరా అని వసు వెనక్కి తిరిగిచూసే సరికి శైలేంద్ర కనపడతాడు.‘ ఏంటీ షాకయ్యావా? ఊహించి ఉండవు కదా నేను ఇక్కడ ఉంటానని’ అని శైలేంద్ర అంటాడు. ‘ అంటే.. ఈ బ్రెసెలెట్ పంపించింది నువ్వేనా?’ అని వసు అడుగుతుంది. ‘ ఇంకా డౌటా..నేనే పంపాను. ఈ అడ్రస్ కి రమ్మని చెప్పాను, వచ్చావ్ కదా, ఈ బ్రెస్ లెట్ చూస్తుంటే, రిషిని చూస్తున్నట్లుగా ఉందా? గుర్తొస్తున్నాడా? తనని బాగా మిస్ అవుతున్నావా? రిషి విషయంలో మీరు ఏవేవో అనుమానాలు పెంచుకొని ఉంటారు. మీరంతా తెలివైనవారు. అందులోనూ ఒకరికి ముగ్గురు తోడు అయ్యారు. నువ్వు, బాబాయ్, అనుపమ అందరూ మేధావుల్లాగా ఆలోచించేవారే. నిజంగా రిషి నా దగ్గర ఉన్నాడో లేడో, నేనేదో మిమ్మల్ని కావాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నాను, నా దగ్గర ఉన్నట్లు నమ్మిస్తున్నాను.. ఇలా ఏదేదో అనుకుంటారు కదా, అందుకనే నీకు నమ్మకం కలిగించాలనే రిషి బ్రెస్ లెట్ తీసుకొచ్చా. ఇప్పటికైనా నమ్ముతావా? రిషి నా దగ్గరే ఉన్నాడని’ అని శైలేంద్ర అంటాడు. అదంతా విన్న వసు.. ‘ అంటే రిషి సర్ నీ దగ్గరే ఉన్నారా? ఎక్కడ ఉన్నారో చెప్పు ’ అని అడుగుతుంది.
Guppedantha Manasu
‘ అంత ఈజీగా ఎలా చెబుతాను అనుకున్నావ్ వసుధారా.. 15 మార్కుల ప్రశ్నకు, రెండు మార్కుల సమాధానం ఎలా చెబుతాను అనుకున్నావ్ , నాకు 15 మార్కులు కావాలి. 15 మార్కులు అంటే ఎండీ సీటు అని అర్థం.’అని శైలేంద్ర తన మనసులోని కుట్రను బయటపెడతాడు. దానికి వసు అసలు నువ్వు మనిషివేనా అని అడుగుతుంది. ‘ రెండు చేతులు, రెండు కాళ్లు ఉన్నాయి కాబట్టి, నేను మనిషినే’ అంటాడు.‘ ఆకారానికి మనిషివి అయితే సరిపోతుందా, బుద్ధి మాత్రం మృగంలా ఉంది’ అని వసు అంటుంది. దానికి శైలేంద్ర‘ నేను మృగాన్నే నేను యానిమల్. నా ఆకలి తప్ప నేను దేని గురించి ఆలోచించను. అందుకే కదా వాడు నా తమ్ముడైనా సరే, నాకు ఎండీ సీటు కావాలి. నీకు రిషి కావాలంటే తీసుకో, అప్పటి నుంచి అదే కదా చెబుతున్నాను. ఇప్పటికే చాలా ఆలస్యం చేశావ్ వసుధారా’ ‘ నువ్వు చాలా తప్పు చేస్తున్నావ్’ అని వసు అంటే.. ‘ నీ భర్త విషయం వచ్చేసరికి నువ్వు పిలిచే విధానం కూడా మారిపోయిందే, అంతకముందు శైలేంద్ర సర్ అని పిలిచేవాడివి, ఇప్పుడు శైలేంద్ర, శైలేంద్ర అని పిలుస్తున్నావ్, పర్లేదులే ఇప్పుడు నాకు మర్యాదలు, గౌరవాల కంటే నేను అనుకున్న స్థానం కావాలి. ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాలి కదా వసుధార, నువ్వు రిషిని కావాలనుకుంటున్నావ్,నాకు ఎండీ సీటు ఇచ్చేయ్. తను ఎక్కడ ఉన్నాడో చెప్పేస్తాను. రిషి దగ్గరకు నువ్వే సరాసరి వెళ్లి తీసుకొచ్చుకోవచ్చు.’ అని అంటాడు.
Guppedantha Manasu
‘ నీ స్వార్థం కోసం నువ్వు ఎంత అరాచకం చేస్తున్నావో, దాని ప్రతిఫలం ఎంత ఘోరంగా ఉంటుందో నీకు అర్థం కావడం లేదు. మర్యాదగా రిషి సర్ ఎక్కడ ఉన్నారు, ఏం చేసావో చెప్పు’ అని వసు అడుగుతుంది. ‘ నేను అనుకున్నది చేయడమే తప్ప, మరొకరు చెప్పింది చేసే అలవాటు నాకు లేదు. నీకు నీ భర్త కావాలంటే, ఎండీ సీటు వదిలేయ్. రేపు కొరియర్ లో బ్రెస్ లెట్ పెట్టుకున్న చెయ్యి కూడా రావచ్చు’ అంటాడు. అంతే వసు ఆవేశంగా శైలేంద్ర కాలర్ పట్టుకుంటుంది. ‘ ఆవేశ పడకు వసుధార, నువ్వు ఆవేశ పడితే నీకే నష్టం. నీకు నష్టం, అక్కడున్న రిషికి కూడా నష్టం. తొందరగా ఒక నిర్ణయానికి వచ్చేయ్. ఎండీ సీటు నాకు ఇస్తావా లేదా? లేదంటే అక్కడ రిషి ప్రాణాలు కోల్పోతాడు. నేను నీకు 24 గంటల సమయం ఇస్తున్నాను. నీకు, నాకు అనుకూలమైన నిర్ణయం తీసుకో, చాలా భయపడుతూ టెన్షన్ పడుతూ వచ్చావ్.. వెళ్లు ’ అంటాడు.. వసు వెళుతుంటే.. చిటికెలు వేసి.. ‘ రిషి నా దగ్గర ఉన్నాడని నీకు చెబితే నువ్వు బాబాయ్ కి చెప్పావ్, ఆయన వచ్చి రచ్చ చేశాడు. ఇప్పుడు కూడా నేను నీకు బ్రెస్ లెట్ విషయం ఎవరికైనా చెబితే, అక్కడ రిషి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కాబట్టి, చాలా జాగ్రత్తగా వెళ్లు’ అని వార్నింగ్ ఇస్తాడు. పాపం వసు.. ఏడ్చుకుంటూ, ఆలోచించుకుంటూ వెళ్తుంది.
Guppedantha Manasu
మరోవైపు కాలేజీలో మీటింగ్ కోసం బోర్డు మెంబర్స్ ఎదురుచూస్తూ ఉంటారు. ఛాన్స్ దొరికిందని దేవయాణి ఓవర్ యాక్షన్ చేయడం మొదలుపెడుతుంది. మహేంద్ర వాళ్లకు సర్దిచెప్పడానికి ప్రయత్నించినా, బోర్డు మెంబర్స్ వినిపించుకోరు. తమ టైమ్ వేస్ట్ చేస్తున్నారని, రిషి సర్ ఎండీగా ఉన్నప్పుడు కాలేజీలో ఎలాంటి సమస్యలు లేవు. వసుధార సారధ్యం అంత సరిగా లేదు. దీని గురించి కచ్చితంగా మేడమ్ సంజాయిషీ చెప్పాలి అని,.. అందరూ లెటర్స్ రాసి అక్కడ పెట్టేసివెళ్లిపోతారు. వసుధార ఇలా చేసిందేంటి అని ఫణీంద్ర అంటాడు. ఏదో జరిగి ఉంటుందని లేకపోతే వసు ఇలా చేయదని, తాను కనుక్కుంటాను అని మహేంద్ర వెళతాడు. ఫణీంద్ర ముందు కూడా దేవయాణి.. వసుధార ఇలా చేస్తుందని అనుకోలేదు అంటుంది. అసలు నీవల్లే ఇదంతా జరిగింది.. నువ్వు అడుగుపెట్టావ్.. బోర్డ్ మీటింగ్ క్యాన్సిల్ అయ్యింది అని ఫణీంద్ర విసుక్కుంటాడు. దేవయాణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
Guppedantha Manasu
వసు ఇంట్లో రిషి బ్రెస్ లెట్ పట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది. మహేంద్ర వచ్చి.. ఎక్కడికి వెళ్లావ్ వసుధార అని అడుగుతాడు. ‘ రిషి సర్ కోసం మామయ్య’ అంటుంది. నిజానికి బ్రెస్ లెట్ విషయంచెప్పేదే కానీ, శైలేంద్ర బెదిరించడంతో చెప్పకుండా ఆగిపోతుంది. మహేంద్ర మాత్రం.. ‘ మీటింగ్ కి ఎందుకు రాలేదు. రిషి కోసం అయితే, మీటింగ్ తర్వాత అందరం కలిసి వెళ్లి వెతికేవాళ్ం కదా, ఆరోజుకూడా రాత్రి ఒక్కదానివే రిషిని వెతకడానికి వెళ్లిపోయావ్. నాకు చెప్పకుండా వెళ్లేసరికి కంగారుపడ్డాను. నువ్వు మీటింగ్ కి రాకపోయే సరికి అన్నయ్య కూడా అడిగాడు. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుంది’ అంటాడు.‘ సారీ మామయ్య, రేపు బోర్డ్ మీటింగ్ ఏర్పాటుచేయండి.రేపు నేను ఒక నిర్ణయం తీసుకుంటాను. ఆ నిర్ణయాన్ని మీరు గౌరవించాలి. ప్లీజ్ మామయ్య’ అని వసు అంటుంది.
Guppedantha Manasu
తర్వాత రాత్రి ఇంట్లో ఒక్కతే ఆలోచిస్తూ ఉంటుది. ‘ నన్ను క్షమించండి సర్, మీ కోసం నేను కాలానికి తల వంచక తప్పడం లేదు’ అని అనుకుంటుంది. తర్వాత శైలేంద్రకు ఫోన్ చేసి బోర్డ్ మీటింగ్ కి రమ్మని చెబుతుంది. ‘ నువ్వు నిర్ణయం తీసుకున్నావా’ అని అడుగుతాడు. ‘ మీరు దేని కోసం అయితే, ఇన్ని అరాచకాలు చేస్తున్నారో, అది మీ సొంతమౌతుంది.’ అని చెబుతుంది. అది అంటే ఏంటి అని అడుగుతాడు. ‘ రేపు అందరి సమక్షంలో నేను మీకు ఎండీ సీటు అప్పగిస్తాను’ అంటుంది. ‘ నిజమా వసుధార, నిజంగా నాకు ఎండీ సీటు ఇస్తావా?’ అని అడుగుతాడు. ‘రిషి సర్ కోసం ఇస్తాను’ అంటుంది. దానికి శైలేంద్ర పొంగిపోతాడు. ‘ కానీ, రిషి సర్ ఎక్కడ ఉన్నాడో చెప్పాలి, నాకు అప్పగించాలి’ అని వసు అంటుంది. ‘ నువ్వు ఎండీ సీటు ఇస్తానంటే, నాకు రిషి ఎందుకు, ఇచ్చేస్తాను. నీ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు కదా’ అని అడుగుతాడు. ఎలాంటి మార్పు ఉండదు, ఇదే ఫైనల్ అని చెబుతుంది.
Guppedantha Manasu
దేవయాణి వచ్చి, ఎవరు ఫోన్ చేశారు అని అడుగుతుంది. వసుధార ఫోన్ చేసిందని, ఎండీ సీటు ఇస్తాను అని చెప్పిందనే విషయాన్ని తల్లితో పంచుకుంటాడు. రేపు డైరెక్ట్ గా చూడమని, తన ఆనందానికి అవధులు లేవు అంటాడు. నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి అని చెప్పి,దేవయాణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ రోజు కోసం చాలా సంవత్సరాలుగా ఎదురుచూశానని, ఎండీ అయ్యి.. అందరికీ బాస్ అవుతాను అని తనలో తానే అనుకుంటాడు.
Guppedantha Manasu
తదుపరి సీన్ లో బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తారు. నిన్న రాకపోవడానికి ముందుగా క్షమాపణలు చెబుతుంది. నిన్న రాకపోవడానికి కారణం చెప్పమని అడుగుతారు. చెబుతాను అంటుంది. మరోవైపు శైలేంద్ర.. తనకు ఎండీ సీటు దక్కబోతోందని తల్లితో చెబుతూ ఉంటాడు. ఇక, బోర్డు మెంబర్స్ అడిగిన ప్రశ్నలకు సంజాయిషీ ఇస్తుంది. నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం అయ్యింది కానీ, తాను ఏ రోజూ నిర్లక్ష్యంగా లేను అని చెబుతుంది. మీ అందరికీ కొన్ని విషయాలు చెప్పకుండా ఉండిపోయాను. రిషి సర్.. కనిపించకుండా పోయారు, మిషన్ ఎడ్యుకేషన్ పనిమీద బయటకు వెళ్లలేదని అసలు విషయం చెబుతుంది. అబద్ధం చెప్పినందుకు క్షమాపణలు చెబుతుంది.
రిషి సర్ ఎక్కడికి వెళ్లాడు, ఎప్పటి నుంచి కనపడటం లేదు అని బోర్డు మెంబర్స్ అడిగితే.. శైలేంద్ర హాస్పటల్ లో జాయిన్ అయినప్పటి నుంచి కనపడటం లేదు అని చెబుతుంది. రిషి సర్ కనిపించకపోవడం వల్లే, తాను డిస్టర్బ్ అయ్యి.. యాక్టివ్ గా ఉండలేకపోతున్నాను,అందుకే నేను ఈ ఎండీ పదవి నుంచి తప్పుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేస్తుంది. అందరూ షాకౌతారు. శైలేంద్ర, దేవయాణి సంతోషిస్తారు. ఈ పదవి బాధ్యతలను సరిగా నిర్వహించలేకపోతున్నాను అందుకే, ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెబుతుంది. మహేంద్ర అడ్డు చెబుతాడు. కానీ, శైలేంద్ర వార్నింగ్ గురించి మాత్రం బయటపెట్టదు. ఈనిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి అని మహేంద్ర అడుగుతూ ఉంటాడు. అక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.