- Home
- Entertainment
- TV
- Guppedantha Manasu serial 20th December:వసు చేతికి రిషి బ్రెస్ లెట్, మరోసారి శైలేంద్ర ఉచ్చులో వసు..!
Guppedantha Manasu serial 20th December:వసు చేతికి రిషి బ్రెస్ లెట్, మరోసారి శైలేంద్ర ఉచ్చులో వసు..!
మనసులో రిషి నిన్ను వదలనురా, నిన్ను, ఆ వసుధారను అడ్డు తొలగిస్తాను అని అనుకుంటాడు.

Guppedantha Manasu
Guppedantha Manasu serial 20th December:తన గదిలోకి వచ్చి, ఎండీ సీటులో కూర్చోవాలని ఆశపడిన శైలేంద్ర ఆశలపై వసుధార నీళ్లు జల్లుతుంది. ఆ గదిలో నుంచి ప్యూన్ తో గదిలో నుంచి మెడపట్టుకొని బయటకు గెంటమని చెబుతుంది. ప్యూన్ వసుధార చెప్పడంతో ముందుకు కదలడంతో, వాడిని ఆగమని శైలేంద్ర తన తల్లితో కలిసి బయటకు కదులుతాడు. అప్పుడు వసుధార ప్యూన్ ని తిడుతుంది. ఎవరిని పడితే వాళ్లని లోపలికి రానిస్తావా..? ముందు ఎండీ సీటును శానిటైజర్ తో శుభ్రం చేయమని, చాలా వైరస్ లు అంటుకున్నాయని చెబుతుంది.
Guppedantha Manasu
అది విని దేవయాణికి విపరీతంగా కోపం వస్తుంది. కానీ, శైలేంద్ర ఆమెను కంట్రోల్ చేస్తాడు. ‘ముసలికి నీటిలో బలం ఉన్నట్లు, ఈ వసుధారకు కాలేజీలో బలం ఉంటుంది. మనం ఇప్పుడు కామ్ గా ఉండటమే నయం అని చెప్పి, తల్లిని అక్కడి నుంచి తీసుకొని వెళతాడు.అంటే మనం తలదించుకొని వెళ్లాలా అని దేవయాణి అంటే.. ఇప్పుడు తల దించుకొని వెళ్లకపోతే, తర్వాత అందరి ముందు తల దించుకోవాల్సి వస్తుంది అని సర్దిచెప్పి తల్లిని తీసుకొని వెళతాడు.
Guppedantha Manasu
మరోవైపు మహేంద్ర, అనుపమ ఓ చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మహేంద్ర ఎందుకు ఇలా ఉన్నావ్ అంటే, జగతితో కలిసి తాను ఇక్కడే కూర్చొని మాట్లాడుకునేవాళ్లం అని, తన అభిప్రాయాలన్నీ చెప్పేదని, ఇంట్లో మంచి భార్యలాగా ఉంటూ, కాలేజీలో మంచి టీచర్ లాగా ప్రవర్తించేదని, కాలేజీ గురించి, స్టూడెంట్స్ భవిష్యత్తు గురించి ఎక్కువగా మాట్లాడేదని గుర్తు చేసుకుంటాడు. జగతి కూర్చున్న ప్లేస్ కాబట్టే, తనకు కూడా ఏదో బంధం ఏర్పడిందని అనుపమ చెబుతుంది. జగతితో ఉన్న స్నేహమే, నాకు కూడా ఈ కాలేజీతో బంధం ఏర్పడింది. జగతి గురించి చాలా మంది చాలా గొప్పగా చెబుతున్నారని, ఆ మాటలు వింటుంటే తనకు చాలా సంతోషంగా ఉందని అనుపమ అంటుంది. ‘కానీ, ఆ సంతోషాన్ని మించిన దుఖం ఏంటంటే... ఇప్పుడు జగతి లేకపోవడమే. జగతి చావుకు కారణం ఎవరో తెలుసుకోవాలని అనుకొని ఇక్కడికి వస్తే, రిషి కూడా కనిపించకపోయాడు. రిషితో నా బంధం చాలా తక్కువే కానీ నాకే చాలా బాధగా ఉంటుంది. అలాంటిది వసు ఎంత బాధపడుతుందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని విషయాల్లో ధైర్యంగా ఉండే వసుధార.. రిషి విషయంలో ఎండుటాకులా వణికిపోతోంది. రిషిని వసు ఓ గురువులా చూస్తోంది. రిషి కోసం వసు చాలా సతమతమౌతుంది. ఇప్పటికే నోటీసు బోర్డులో రిషి మిషన్ ఎడ్యుకేషన్ కోసం వెళ్లినట్లు నోటీసు పెట్టింది.’ అని అనుపమ చెబితే, ముకుల్ తో మాట్లాడానని, త్వరోలనే రిషి, వసులు కలిసిపోతారు అని మహేంద్ర ధైర్యం చెబుతాడు.
Guppedantha Manasu
కాలేజీ నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత వసు చేసిన పనికి, అన్న మాటలు తలుచుకొని దేవయాణి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నావ్ అని శైలేంద్ర అడిగితే, ‘ అది నిన్ను అన్నిమాటలు అంది ఏంటి రా? జగతి కూడా అంత ధైర్యంగా ఎప్పుడూ మాట్లాడింది లేదు.తను ఎప్పుడూ మన ముందు అలాంటి సాహాసాలు చేయలేదు. కానీ ఇదేంటి రా మనపై ఒంటికాలుపై లేస్తోంది. పురుగుల్ని చూసినట్లు చూస్తోంది. వైరస్ అంటోంది. ఎంత పెద్దమాట వైరస్ అంటే.. నువ్వు ముట్టుకున్న చైర్ ని శానిటైజ్ చేయాలంట.’ అని బాధతో చెబుతూ ఉంటుంది. దానికి ఎందుకు బాధపడుతున్నావ్ మామ్, ఇప్పుడు ఏం జరిగిందని..? అని శైలేంద్ర అడుగుతాడు.
Guppedantha Manasu
దానికి దేవయాణి ‘ ఇంకేం కావాలిరా..? ఒక తల్లి ముందు కొడుకును అవమానిస్తే ఎలా ఉంటుందో నీకు తెలీదు. నాకు చాలా బాధగా ఉంది.’ అంటుంది. అయితే. శైలేంద్ర తల్లికి ధైర్యం చెబుతాడు. అంతకు అంత తనకు జరిగేలా చేస్తాను అని శైలేంద్ర అంటాడు. అయితే, దేవయాణి మాత్రం.. ‘నాకు నమ్మకం లేదురా, ఆవసుధార నీకు భయపడటం లేదు,రిషి కనిపించకపోయినా తను మనకు వార్నింగ్ ఇచ్చింది, రిషి కనిపించడంలేదనే బాధ కూడా తనలో లేదు. మన గురించి తెలిసి కూడా కొంచెం కూడా తొణకలేదు , బెనకలేదు. అసలు తనకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. నువ్వు వాళ్లను అది చేస్తా, ఇది చేస్తా అంటావ్. కానీ చివరి నిమిషంలో తనకు అడ్డు చెప్పకుండా తప్పు చేసినవాడిలా వెనక్కి తీసుకొచ్చావ్. ఎందుకు అలా చేశావ్? అక్కడే తాడోపేడో తేల్చేసేదాన్ని కదా’ అంటుంది. దానికి శైలేంద్ర.. ‘ చెప్పా కదా మామ్.. అటెండర్ మనల్ని మెడపట్టి గెంటేస్తే ఏం బాగుంటుంది చెప్పు’ అంటాడు. ‘ అంటే అటెండర్ కి కూడా భయపడుతున్నావా ’ అని దేవయాణి అడుగుతుంది. ‘ఈరోజు మనల్ని మెడపట్టి గెంటేయాలని చూసింది, త్వరలోనే తనను మెడపట్టి గెంటేస్తాను’ అని శైలేంద్ర అంటాడు.
Guppedantha Manasu
సరిగ్గా అప్పుడే ధరణి ఎంట్రీ ఇస్తుంది. ‘ మిమ్మల్ని మెడపట్టి బయటకు గెంటేశారా..? అయ్యో ఎంత పని జరిగింది. అక్కడికి వెళ్లి ఫైల్స్ పై సంతకం చేయాలి,రిషి జాడ తెలుసుకోవాలి అని చెప్పారు కదండి. మరి, మీరు అది కాకుండా, ఇంకేం చేశారు..? అత్తయ్యగారు మిమ్మల్ని కూడా గెంటేశారా?’ అని అమాయకంగా అడుగుతుంది. దానికి శైలేంద్ర, ‘ మేము మాట్లాడుకున్నది మొత్తం వినేశావా’ అని అడుగుతాడు. ధరని ‘ ఆ.. మొత్తం వినేశానండి. అత్తయ్యగారు మీకు అలా జరగడం ఏంటో.? అయినా మీకు నేను ముందే చెప్పాను కదా, ఆయనతో నేను వెళ్తాను అని, నా మాట వినకుండా మీరే వెళ్లారు. చూడండి ఇప్పుడు ఏం అయ్యిందో. అదే నేను వెళ్లి ఉంటే ఇలా అయ్యేది కాదు కదా, ఏంటో నేను చెప్పినా అర్థం కాదు, ఈ మనుషులు నేను చెప్పేది ఎప్పుడు అర్థం చేసుకుంటారో’ అనుకుంటూ ధరణి అక్కడి నంచి వెళ్లిపోతుంది.
Guppedantha Manasu
‘ఏంట్రా ఇది మన ఖర్మ కాకపోతే, ఆ వసుధార చేసిన అవమానం కంటే, ఈ ధరణి చేసిన అమానం భరించలేకపోతున్నాను. శైలేంద్ర.. ఇంత జరుగుతున్నా, నువ్వు ఇంత ప్రశాంతంగా ఉంటున్నావ్ అంటే, అసలు నువ్వు నువ్వేనా లేక, నీకు ఏదైనా గాలి సోకిందా?’ అని దేవయాణి అడుగుతుంది. దానికి శైలేంద్ర.. తాను నీ కొడుకునే అని చెబుతాడు. మరి ఇన్ని జరుగుతున్నా నీకు ఏమీ అనిపించడం లేదా అని అడుగుతుంది ‘ ఎందుకు అనిపించడం లేదు మామ్, వాళ్లను చంపేయాలని ఉంది. కానీ నాకు ఎండీ సీటు కావాలి. అందుకే ఈ సహనం’ అంటాడు. ‘ అలా అని నువ్వు మౌనంగా ఉంటే, వాళ్లు రెచ్చిపోతారు కదరా’ అంటుంది.‘ వాళ్లకు ఆ అవకాశం ఇవ్వను కదా, నేను ఇప్పుడు వేసే అడుగు చాలా భయకరంగా ఉంటుంది’ అంటాడు. అంటే ఏం చేస్తున్నావ్ అని దేవయాణి అడిగితే, ‘ చూస్తూ ఉండు. ఏం జరిగినా నువ్వు భయపడకు. మనల్ని అవమానించిన వసుధార.. మన అడ్డురాదు. తన నోరు ఎలా మూయించాలో అలానే మూయిస్తాను. ’అని అంటాడు. మనసులో రిషి నిన్ను వదలనురా, నిన్ను, ఆ వసుధారను అడ్డు తొలగిస్తాను అని అనుకుంటాడు.
Guppedantha Manasu
మరోవైపు వసుధార ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. మహేంద్ర వచ్చి ఏం ఆలోచిస్తున్నావ్..? రిషి గురించేనా అని అడుగుతాడు. దానికి వసు.. ‘శైలేంద్ర చెప్పింది నిజమేనా? శైలేంద్ర దగ్గర రిషి ఉంటే ఎక్కడ దాచి పెట్టి ఉండొచ్చు? అసలు ఆ శైలేంద్ర దుర్మార్గుడు. అవసరం కోసం ఎన్ని అబద్దాలు అయినా చెబుతాడు. ఇప్పుడు కూడా ఎండీ సీటు కోసం రిషి సర్ తన దగ్గరే ఉన్నారని అబద్ధం చెబుతున్నాడా? మరి రిషి సర్ ఏమైపోయినట్లు’ అంటుంది. తాను కూడా ముకుల్ తో మాట్లాడానని, ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడని మహేంద్ర అంటాడు. ‘తనకు ఈ ఆాలోచనలతో పిచ్చెక్కిపోతోందని, రిషి సర్ ని చూసే వరకు నా మనసు మనసులో ఉండదు.సర్ ఎప్పుడు వస్తారు మామయ్య?’ అని అడుగుతంది. ‘వస్తాడమ్మా, రిషి నీకోసం, నీ ప్రేమ కోసం వస్తాడు. నువ్వు ఎక్కువగా ఆలోచించకు. ఈ రోజు బోర్డు మీటింగ్ ఉంది కదా, నేను కాలేజీకి వెళ్తాను. నువ్వు తొందరగా వచ్చేయ్’ అని చెప్పి మహేంద్ర వెళతా
Guppedantha Manasu
తర్వాత అందరూ బోర్డ్ మీటింగ్ కోసం కూర్చొని ఉంటారు. ఆ మీటింగ్ కి దేవయాణి కూడా వస్తుంది. అందరూ దేవయాణికి విష్ చేస్తూ ఉంటారు. దేవయాణి రావడంతో మహేంద్ర, ఫణీంద్ర షాకౌతారు. తర్వాత.. ఫణీంద్ర.. నువ్వు ఎందుకు వచ్చావ్, నా ప్రాణాలు తీయడానికి అని అడుగుతాడు. ఇక, దేవయాణి ఓవర్ యాక్షన్ చేస్తుంది. అసలు.. నిన్ను ఎవరు పిలిచారు..? ఎందుకు వచ్చావ్ అని ఫణీంద్ర అడిగితే.. బోర్డు మీటింగ్ ఉందని, అసలే రిషి కూడా లేడు కదా అందుకే వచ్చాను అని చెబుతుంది. ఆ మాటకు ఫణీంద్రకు కాలుతుంది. మరి, మేం ఉన్నది ఎందుకు..? ఆ నిర్ణయాలు తీసుకోవడానికి మేం ఉన్నాం కాదా, నువ్వు ఎందుకు అని అంటాడు. దేవయాణి మాత్రం తన గురించి తాను బిల్డప్ ఇస్తుంది.
Guppedantha Manasu
తర్వాత వసుధార ఇంకా రాలేదని, డైలాగులు మీద డైలాగులు కొడుతుంది. ఆమె డైలాగులకు మహేంద్ర రియాక్ట్ అవుతాడు. కరెక్ట్ గా సమాధానం ఇస్తాడు. తర్వాత ఫణీంద్ర కూడా ఎందుకైనా మంచిదని ఒకసారి వసుధారకు ఫోన్ చేయమని చెబుతాడు. అప్పుడు వసు.. ఇంటికి తాళం వేస్తూ ఉంటుంది. అందరూ వెయిట్ చేస్తున్నారు అని మహేంద్ర చెప్పడంతో, బయలుదేరుతున్నాను అని అంటుంది. వసు బయలుదేరగానే ఏదో కొరియర్ వస్తుంది.
Guppedantha Manasu
అందులో లెటర్ ఉంటుంది. అది తీసి చూ్సతుంది. లెటర్ తో పాటు.. రిషి బ్రెస్ లెట్ కూడా అందులో ఉంటుంది. దీనిని తనకు ఎవరు పంపించి ఉంటారు అని ఆలోచిస్తుంది. లెటర్ లో.. నీ భర్త ని నువ్వు చూడాలంటే, చెప్పిన అడ్రస్ కి రమ్మని, ఆలస్యం చేస్తే, నీ భర్తను నువ్వు జన్మలో చూడలేవు’ అని రాసి ఉంటుంది. బోర్డు మీటింగ్ పక్కనపెట్టి,రిషిని కలవాలని వసు బయలు దేరుతుంది. ఇది కూడా కచ్చితంగా శైలేంద్ర ప్లాన్ అని తెలుస్తోంది.