షార్ట్ మిడ్డీలో రెచ్చిపోయిన ఆ హీరో తల్లి... గుప్పెడంత మనసు జగతిని ఇలా చూస్తే తట్టుకోవడం కష్టమే!
గుప్పెడంత మనసు ఫేమ్ జ్యోతి రాయ్ సోషల్ మీడియా సంచలనాలు కొనసాగుతున్నాయి. గ్లామరస్ ఫోటో షూట్ తో అమ్మడు కుర్రాళ్ళ గుండెల్లో గుబులు రేపింది. ఆమె లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
కర్ణాటకలో పుట్టిన జ్యోతి రాయ్ మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. బుల్లితెరపై ఆమె ప్రస్థానం మొదలైంది. కన్నడ సీరియల్ 'బందె బరాటవ కాలా'తో నటిగా మారింది. తర్వాత తమిళ్, తుళు భాషలలో కొన్ని సీరియల్స్ లో నటించింది.
ఇక తెలుగులో ఆమె గుప్పెడంత మనసు సీరియల్ తో పాప్యులర్ అయ్యింది. హీరో తల్లి అయిన జగతి పాత్రలో మాతృత్వం కురిపించింది. కొడుకు ప్రేమ కోసం తప్పించే తల్లిగా ఎమోషన్ పండించింది.
సినిమాలు, వెబ్ సిరీస్లలో బిజీ అయిన జ్యోతి రాయ్ గుప్పెడంత మనసు సీరియల్ కి గుడ్ బై చెప్పింది. కథలో ఆమె పాత్రను చంపేశారు. జగతి పాత్రలో ఆమెను చూసి పెద్దావిడ అనుకున్నారు. కానీ జ్యోతి రాయ్ సో యంగ్.
ఇటీవల తన రియల్ ఏజ్ కూడా రివీల్ చేసింది. తనకు జస్ట్ 30 ఇయర్స్ అంటూ ప్రూఫ్ తో సహా బయటపెట్టింది. మొన్నటి వరకు ఆమెకు 38 ఏళ్ళని అందరూ భావించారు.
Jyothi Rai
ప్రస్తుతం ప్రెట్టీ గర్ల్, నో మోర్ సీక్రెట్స్ అనే వెబ్ సిరీస్లలో జ్యోతి రాయ్ నటిస్తుంది. ఈ సిరీస్లలో తన పాత్ర చాలా బోల్డ్ గా ఉంటుందని సమాచారం. పోస్టర్స్ చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది.
Jyothi Rai
తాజాగా షార్ట్ మిడ్డీలో హాట్ లుక్ లో షాక్ ఇచ్చింది. జగతి పాత్రకు పూర్తి భిన్నమైన గ్లామరస్ అవతార్ లో చూసి జనాలు షాక్ అవుతున్నారు. హీరో రిషి తల్లి జగతీ మేడమేనా ఇలా తెగించిందని కామెంట్స్ చేస్తున్నారు. జ్యోతి రాయ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.