Guppedantha manasu: జగతి మరణవార్త విని కుప్పకూలిన అనుపమ..!
జగతి లేదు అనే విషయం రిషి చెప్పేలేగా, ఎవరో వచ్చి ప్రోగ్రాం మొదలుపెడదామని అనుపమను తీసుకొని వెళ్లిపోతారు. జగతి గురించి అనుపమకు ఎలా తెలుసు అని రిషి, వసులు ఆలోచిస్తూ ఉంటారు.
Guppedantha Manasu
Guppedantha manasu: ఈరోజు ఎపిసోడ్ లో రిషి, వసులు కలిసి మహేంద్రకు గెట్ టూ గెదర్ ఫంక్షన్ కి తీసుకువస్తారు. కారు ఆగిన తర్వాత తాను ఉన్న ప్లేస్ చూసి మహేంద్ర షాక్ అవుతాడు. తనను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావ్ అని రిషిని అడుగుతాడు. ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అని మహేంద్ర ,రిషిని అడుగుతాడు. తనకు ఇష్టం లేదని వెళ్లిపోదాం అని బలవంత పెడతాడు. రిషి ఎంత కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినా మహేంద్ర అంగీకరించడు. దీంతో, వసు కూడా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది.
Guppedantha Manasu
ఇక్కడి దాకా వచ్చి మీ స్నేహితులను కలవకపోతే ఏం బాగుంటుంది, ఇలాంటి అరుదైన అవకాశం మళ్లీ రాదు అని వసు చెబుతుంది. అయినా సరే, మహేంద్ర వెళ్లాలని పట్టుపడతాడు. నాకు అసలు ఫ్రెండ్స్ లేరు అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే అనుపమ ఎంట్రీ ఇస్తుంది. మహేంద్ర అని పిలిచి, అక్కడికి వస్తుంది. ఎలా ఉన్నావ్ అని అడుగుతుంది. అంతేకాదు, ఫ్రెండ్స్ ఎవరూ లేరని చెబుతున్నావ్ ఏంటి అని అడిగి, కొన్ని పరిస్థితుల నుంచి తప్పించుకోవాలని అనుకున్నా, తప్పించుకోలేవ్ అని చెబుతుంది. ముఖ్యంగా స్నేహితుల నుంచి తప్పించుకోలేవ్ అని చెబుతుంది.
Guppedantha Manasu
ఇంతలో మిగిలిన ఫ్రెండ్స్ అందరూ మహేంద్ర ను చూసి, అక్కడికి వచ్చేస్తారు. ఇక, తప్పని పరిస్థితిలో మహేంద్ర కూడా లోపలికి వెళ్లాల్సి వస్తుంది. ఇంతలో అనుపమ.. రిషి, వసులతో మాట్లాడుతుంది. జగతిని కూడా తీసుకురమ్మని చెప్పాను కదా అని రిషి అని అడుగుతుంది. కానీ, ఆ ప్రశ్నకు రిషి సమాధానం చెప్పడు. మీ నాన్న, మీ అమ్మను తీసుకురావద్దని చెప్పాడా? అసలు ఈ ఫంక్షన్ జరుగుతుందని జగతికి తెలుసా? తెలిస్తే, నా కోసం అయినా వచ్చేది అని బాధపడుతుంది. ఇంకా ఎంత కాలం మహేంద్ర, జగతికి దూరంగా ఉంటాడు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. అనుపమ వేసే ఏ ప్రశ్నకు రిషి, వసులు సమాధానాలు ఉండవు. జగతి లేదు అనే విషయం రిషి చెప్పేలేగా, ఎవరో వచ్చి ప్రోగ్రాం మొదలుపెడదామని అనుపమను తీసుకొని వెళ్లిపోతారు. జగతి గురించి అనుపమకు ఎలా తెలుసు అని రిషి, వసులు ఆలోచిస్తూ ఉంటారు.
Guppedantha Manasu
ఇక, ప్రోగ్రామ్ మొదలౌతుంది. ఒకరి తర్వాత మరొకరు మాట్లాడుతూ ఉంటారు. అనుపమ వంతు వస్తుంది. ‘ ఇలా అందరూ కలవడానికి కారణం తానే అయినా, అందరూ స్పందించి రావడం సంతోషంగా ఉంది. మీ అందరినీ చూస్తుంటే, కాలేజీ రోజులు గుర్తుకు వచ్చాయి. ఫ్రెండ్స్ దూరంగా ఉన్నా, మనసులు మాత్రం దగ్గరగానే ఉంటాయి.’ అని అనుపమ చెబుతుంది. వెంటనే ఫ్రెండ్స్ లో ఒకరు జగతి, మహేంద్ర నీ బెస్ట్ ఫ్రెండ్స్ కదా అంటారు. దానికి అనుపమ కూడా స్పందిస్తుంది. ‘ నిజంగానే జగతి, నేను, మహేంద్ర మంచి ఫ్రెండ్స్ అని చెబుతుంది. క్యాంటీన్ కి వెళ్లాలన్నా, లైబ్రరీకి వెళ్లాలన్నా, కాలేజీ బంక్ కొట్టాలన్నా, ముగ్గురం కలిసే ఉండేవాళ్లం అని అనుపమ గుర్తు చేసుకుంటుంది. ఆ రోజులు మళ్లీ తిరిగి వస్తే బాగుండు అనిపిస్తుంది. ’ అని అనుపమ అంటుంది. వెంటనే, మహేంద్ర మనసులో మాట్లాడుకుంటాడు. కాలం వెనక్కి వెళ్లి, జగతి మళ్లీ బతికి వస్తే బాగుండు అని అనుకుంటాడు.
Guppedantha Manasu
ఇక, ఇలోగా, అక్కడికి విశ్వనాథం, ఏంజెల్ వస్తారు. వారికి రిషి,వసులు హాయ్ చెబుతారు. అప్పుడే అనుపమ అక్కడికి వచ్చి విశ్వనాథం ని డాడ్ అని పిలుస్తుంది. వారి బంధం తెలిసి మహేంద్ర, రిషి కూడా షాకౌతారు. ఈ ఒక్క ఎపిసోడ్ లో తెలియాల్సిన నిజాలు అన్నీ తెలిసిపోతాయి. అనుపమ విశ్వనాథం కూతురని, ఏంజెల్ మేనకోడలు అని తెలిసిపోతుంది. ఇక అనుపమ కూడా మహేంద్ర, జగతి తన స్నేహితులు అన్న విషయం బయటపెడుతుంది. అది విని విశ్వనాథం కూడా షాకౌతాడు.
Guppedantha Manasu
ఆ తర్వాత మహేంద్ర ను స్టేజీ మీదకు పిలిచి మాట్లాడమని అడుగుతారు. ఇక తప్పక మహేంద్ర మాట్లాడాల్సి వస్తుంది. ‘స్నేహం గొప్పదే కానీ, ప్రేమను మించినది కాదు. కానీ, ఏ బంధం మనం అనుకున్నట్లుగా ఉండదు. స్నేహ బంధమైనా, ప్రేమ బంధమైనా చివరి వరకు ఉండదు. ఏదో ఒక రోజు పలచపడిపోతుంది. కొన్నాళ్లకు పూర్తిగా కనుమరుగౌతుంది. ఈ నిజం మనందరికీ తెలిసిందే అయినా, ఏదో ఒక ఆశతో అబద్ధంలో బతికేస్తూ ఉంటాం.’ అని మహేంద్ర అంటాడు. అంతలో అందరూ జగతి గురించి చెప్పాలి అంటూ అరుస్తారు. దీంతో, మహేంద్ర నేను, జగతి అంటూ ఎమోషనల్ అయిపోయి అక్కడి నుంచి వెళ్లిపోతాడు..
Guppedantha Manasu
కన్నీళ్లు పెట్టుకుంటాడు. దీంతో, అక్కడికి అనుపమ వస్తుంది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావ్ అని ప్రశ్నిస్తుంది. జగతి ని నువ్వే దూరం పెట్టావ్ అనే అర్థం వచ్చేలా చాలా ప్రశ్నలు వేస్తుంది. దీంతో, ఆ ప్రశ్నలు తట్టుకోలేక, మహేంద్ర నిజం బయటపెడతాడు. జగతి చనిపోయిందనే నిజం చెబుతాడు. అది విని అనుపమ షాకౌతుంది. ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. మరి తర్వాతి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.