Jyothi Rai : ‘ఆ పనిలోనే ఉన్నాను.. కాస్తా ఆగండి’.. ‘గుప్పెడంత మనసు’ జ్యోతి రాయ్ పోస్ట్!
‘గుప్పెడంత మనస్సు’ జగతి త్వరలో వెండితెరపై అలరించబోతోంది. గ్లామర్ విందుతో మెస్మరైజ్ చేయబోతోంది.. ఈ క్రమంలో తన సినిమా గురించి అప్డేట్ ఇచ్చింది.
టీవీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని నటి జ్యోతి రాయ్ Jyothi Rai. ‘గుప్పెడంత మనస్సు’ సీరియల్ తో యమా క్రేజ్ దక్కించుకుంది. జగతి పాత్రలో కన్నడ బ్యూటీ జ్యోతి రాయ్ Jyothi Rai నటనకు ఫిదా అవ్వని ఆడియెన్స్ లేరు.
బుల్లితెరపై సీరియల్ లో పద్ధతిగా మెరిస్తున్న జ్యోతి రాయ్ సోషల్ మీడియాలో ఎలాంటి అవతారం ఎత్తుతుందో అందరికీ తెలిసిందే. ఆమె పెట్టే పోస్టులు ఎంత సెన్సేషన్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
గ్లామర్ మెరుపులతో ఈ ముద్దుగుమ్మ చేసే మెస్మరైజ్ కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇక ఇటీవల మరీ గ్లామర్ డోస్ పెంచి ఫొటోలు షేర్ చేస్తోంది. స్కిన్ షోతో మైండ్ బ్లాక్ చేస్తోంది. ఇందుకో కారణం కూడా ఉంది. త్వరలో ఆమె ఆయా చిత్రాలతో వెండితెరపై మెరియబోతోంది.
తను నటిస్తున్న వెబ్ సిరీస్ ‘ప్రెటీ గర్ల్’ Pretty Girl’ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించింది... ఈ సందర్భంగా అదిరిపోయే పోస్టర్ ను వదిలింది. సినిమాలో తన పాత్ర గురించి కూడా వివరించింది. సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.
జ్యోతిరాయ్ పోస్టులో.. ‘అతి త్వరలోనే భయంకరమైన, విచిత్రమైన, కఠినమైన, గ్లామర్ డోస్డ్ బ్లడ్ బాత్ థ్రిల్లర్ రాబోతోంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఇంకా 3 షెడ్యూల్స్ మిగిలి ఉన్నాయి. సిరీస్ గ్లింప్స్ సరైన సమయంలో రానుంది. దయచేసి ఆ విషయంలో ఓపిక పట్టండి.
ఈ లైవ్లీ మల్టీలేయర్డ్ క్యారెక్టరైజేషన్ ను నాకోసం డిజైన్ చేసిన నా టీమ్‌కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ పాత్రతో నన్ను నేను డిఫరెంట్‌గా చూపించుకోవడాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నాను. మీరూ త్వరలోనే దీన్ని ఇష్టపడతారని ఆశిస్తున్నాం’. అంటూ పేర్కొంది.