Guppedantha Manasu 29th January Episode:చక్రపాణి తలపగలకొట్టి రిషి కిడ్నాప్, వార్త విని కుప్పకూలిన వసుధార
నాకు నా డార్లింగ్ మరదలు దక్కాలంటే కచ్చితంగా ఆ రిషిగాడు చావాల్సిందే. నీకంటే.. నాకే.. ఆ రిషి గాడు చావాల్సిన అవసరం ఉంది.. అది నేను చూసుకుంటాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు.
Guppedantha Manasu
Guppedantha Manasu 29th January Episode: కాలేజీలో ఫెస్ట్ జరుగుతూ ఉంటుంది. మరోవైపు రాజీవ్.. రిషికి ట్రీట్మెంట్ జరిగే ఇంటికి చేరుకుంటాడు. తీరా చూస్తే ఆ ఇంటికి లాక్ వేసి ఉంటుంది. దీంతో.. రిషి గాడు మరోసారి తన నుంచి తప్పించుకున్నాడు అని అనుకుంటాడు. తన మరదలు పిల్ల ప్రతిసారీ తనపై గెలుస్తోందని.. ఎలాగైనా రిషి గాడిని చంపేయాలి అని అనుకుంటాడు.
Guppedantha Manasu
ఈ లోగా.. రాజీవ్ కి శైలేంద్ర ఫోన్ చేస్తాడు. ఆ రిషి గాడు ఎక్కడ ఉన్నాడో తెలిసిందా అని అడుగుతాడు. అయితే.. జస్ట్ మిస్ అయ్యారని.. తాను అక్కడికి వచ్చేసరికి ఎవరూ లేరు అని చెబుతాడు. దీంతో.. శైలేంద్రకు విపరీతంగా కోపం వచ్చేస్తుంది. ఫ్రస్టేషన్ తో రాజీవ్ ని తిట్టేస్తాడు. అది చేస్తా, ఇది చేస్తా.. రిషి గాడిని పట్టుకొని ఏసేస్తా అని అన్నావ్ కదా... ఇప్పుడు అమాయకంగా మిస్ అయ్యారు అని చెబుతావేంటి అని సీరియస్ అవుతాడు. అయితే.. శైలేంద్ర తిడుతూ ఉంటే రాజీవ్ కి కోపం వస్తుంది. నువ్వు మేడమ్ గారి అబ్బాయివి కాబట్టి కూల్ గా ఉన్నాను.. అలా అని ఏది పడితే అది అంటే ఊరుకోను అంటాడు. నీకు ఎండీ సీటు కావాలంటే. ఆ రిషిగాడు ఉన్నా, లేకున్నా దక్కించుకోవచ్చు.. కానీ.. నాకు నా డార్లింగ్ మరదలు దక్కాలంటే కచ్చితంగా ఆ రిషిగాడు చావాల్సిందే. నీకంటే.. నాకే.. ఆ రిషి గాడు చావాల్సిన అవసరం ఉంది.. అది నేను చూసుకుంటాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు.
Guppedantha Manasu
ఇక, కాలేజీలో ఫెస్ట్ గ్రాండ్ గా జరుగుతూ ఉంటుంది. స్టూడెంట్స్ పాటలకు డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఇంకా రిషి రావడానికి సమయం ఉంది కాబట్టి.. ఆ సమయంలోగా.. స్టూడెంట్స్ అభిప్రాయాలు అడుగుదాం అని వసు అంటుంది. సరే అని ఓ లెక్చరర్ అదేవిధంగా స్టూడెంట్స్ ని పిలుస్తూ ఉంటుంది. వాళ్లు వచ్చి మాట్లాడుతూ ఉంటారు.
Guppedantha Manasu
ఇక.. ఫెస్ట్ ని అట్టర్ ప్లాప్ చేద్దాం అంటే.. గ్రాండ్ సక్సెస్ అయ్యిందని, ఇక రిషి కూడా వస్తే మరింత సక్సెస్ అవుతుందని శైలేంద్ర అనుకుంటూ ఉంటాడు. ఒకవేళ ఆ రిషిగాడికి అన్ని నిజాలు తెలిసిపోతే... తన పరిస్థితి ఏంటి అని శైలేంద్ర భయపడుతూ ఉంటాడు. ఈ లోగా.. ఏం చేయాలా అని తలబాదుకుంటూ ఉంటాడు. అప్పుడే శైలేంద్రకు ఓ ఐడియా వస్తుంది. ఇప్పుడు వసుధారను పిలిచి.. రిషి ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటే.. భద్రకు చెప్పి.. ఆ ప్లేస్ కి పంపించి ఎటాక్ చేయవచ్చు కదా అని అనుకుంటాడు.
Guppedantha Manasu
వెంటనే వసుధార దగ్గరకు వెళ్లి.. రిషి ఇంకా రాలేదు.. ఎక్కడిదాకా వచ్చారో ఫోన్ చేయమని అడుగుతాడు. ఫణీంద్ర కూడా అవునమ్మ మినిస్టర్ గారు వెయిట్ చేస్తున్నారు కదా ఫోన్ చెయ్యమని అడుగుతాడు. దీంతో వసు సరే అంటుంది. దానికంటే ముందు.. అందరూ వసుధార ఫెస్ట్ చాలా గ్రాండ్ గా చేసిందని.. మెచ్చుకుంటూ ఉంటారు. ఫణీంద్ర చాలా ఆనందపడతాడు. అదే విషయాన్ని వసుధారకు చెప్పి.. మెచ్చుకుంటాడు. మినిస్టర్ సైతం వసుధారను పొగడ్తలతో ముంచెత్తుతాడు.
Guppedantha Manasu
ఇక.. రిషి ఎక్కడిదాకా వచ్చాడో తెలుసుకోవడానికి.. తన తండ్రి ఫోన్ కి వసు కాల్ చేస్తుంది. అయితే.. ఎవరూ లిఫ్ట్ చేయరు. కాస్త భయపడుతుంది. దీంతో.. మహేంద్ర.. మరోసారి ఫోన్ చేయమని అడుగుతాడు. దీంతో.. వసు ఫోన్ చేసి నాన్న ఎక్కడి దాకా వచ్చారు అని అడుగుతుంది. అయితే.. అవతల నుంచి.. ఈ ఫోన్ వ్యక్తి మీకు నాన్న అవుతారా..? గాయంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు అని చెబుతుంది. పక్కన రిషి సర్ లేరా అని అడిగితే.. ఎవరూ లేరు అని అంటుంది. అంతే... ఆ మాట విని వసు కళ్లు తిరిగి కిందపడిపోతుంది
Guppedantha Manasu
అందరూ కంగారుపడిపోతారు. సీన్ కట్ చేస్తే.. వసుధార ఇంట్లో ఉంటుంది. ఒక్కసారిగా సర్ అంటూ లేస్తుంది. ఎదురుగా తలకు కట్టుతో చక్రపాణి కూడా ఉంటాడు. నాన్న.. ఏమైంది, సర్ ఎక్కడ అని అడుగుతుంది. అయితే.. దారిలో ఎవరో తమపై ఎటాక్ చేశారని, తన తలపై కొట్టడంతో తాను పడిపోయానని.. తర్వాత హాస్పిటల్ లో ఉన్నాను అని చెబుతాడు. అల్లుడు గారిని కాపాడలేకపోయినందుకు క్షమాపణలు చెబుతాడు.
రిషి మరోసారి కిడ్నాప్ అయ్యాడనే విషయం వాళ్లకు అర్థమైపోతుంది. తన కొడుక్కే ఇలా ఎందుకు జరుగుతోందని మహేంద్ర బాధపడతాడు. అయితే.. వసు.. రిషి సర్ కి ఏమీ కాదు మామయ్య అని భరోసా ఇస్తుంది.సర్ ఎక్కడ ఉన్నారో తనకు తెలుసు అని.. ఇప్పుడే వెళ్లి తీసుకువస్తాను అని చెప్పి.. ఎవరూ చెప్పినా వినకుండా లేచి బయలుదేరుతుంది. వసు వెంటనే మహేంద్ర, అనుపమ కూడా వెళతారు.
Guppedantha Manasu
సీన్ కట్ చేస్తే.. కాలేజీకి రిషి రానందుకు శైలేంద్ర సంబరపడిపోతూ ఉంటాడు. మధ్యలో రిషి రాకుండా భద్ర ఆపి ఉంటాడు అని అనుకుంటాడు. అదే విషయం భద్రకు ఫోన్ చేసి అడుగుతాడు. నువ్వు సూపర్ రా అంటూ పొగిడేస్తూ ఉంటాడు. మీరు నన్ను ఎందుకు పొగుడుతున్నారు అని భద్ర అడిగితే.. ఆ రిషిని మాయం చేసింది నువ్వే కదా అని అంటాడు. రిషిని ఎక్కడ దాచిపెట్టావ్ అని అడుగుతాడు అయితే.. తాను ఏమీ చేయలేదని.. తాను కాదు అని అంటాడు. తనకు అసలు రిషి కనిపించలేదని అంటాడు. ఆ మాట విని శైలేంద్ర షాకౌతాడు. మరి ఎవరు చేశారు..? అని ఆలోచనలో పడతాడు.
Guppedantha Manasu
ఇక.. వసుధార శైలేంద్ర ఇంటికి వెళ్లి గొడవ చేస్తుంది. శైలేంద్ర బయటికి రారా అని అరుస్తుంది. రిషి సర్ ఎక్కడ అని ప్రశ్నిస్తుంది. మహేంద్ర ఆపాలని చూసినా వసు వినదు. శైలేంద్ర కాలర్ పట్టుకొని అడుగుతుంది. ఎవరు ఏం చెప్పినా వినకుండా రిషి సర్ ఎక్కడ అని అడుగుతూనే ఉంటుంది. తనకు తెలీదు అని శైలేంద్ర అంటున్నా వినిపించుకోకుండా.. చెంపలు వాయిస్తూనే ఉంటుంది. దేవయాణి వచ్చి.. ఆపేస్తుంది. తన కొడుకుని పశువులా కొడుతున్నావేంటి అని దేవయాణి అంటే.. వాడు పశువే కదా అని అంటుంది.
వసుధారను అలా చూసి.. ఫణీంద్ర షాకౌతాడు. ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని అడుగుతాడు. రిషి సర్ కోసం ఇలా చేస్తున్నాను అని వసు అంటుంది. దానికి శైలేంద్రను కొడితే ఏం వస్తుంది అంటే.. వీడే సర్ రిషి సర్ ని ఏదో చేశాడు అని చెబుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.