Guppedantha Manasu 25th March Episode: ఆ ప్రశ్నను మనుని అడగకు, అనుపమ రిక్వెస్ట్, ఇంటికి రమ్మని పిలిచిన వసు
ఇక ఆమెకు ఒక కొడుకు ఉన్నాడని మీ అందరికీ తెలిసాకే తెలిసింది. అంటే మా అత్తయ్య ఒక చట్రంలో బతికేస్తుంది. కాబట్టి.. మీరు ఎంత అడిగినా నిజం చెప్పదు అని ఏంజెల్ అంటుంది.
Guppedantha Manasu
Guppedantha Manasu 25th March Episode:వసుధార కాలేజీకి వెళ్లిన తర్వాత మహేంద్ర... అనుపమతో మాట్లాడతాడు. ఇంతకాలం మాకు మను నీ కొడుకనే విషయం ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు. ఎంత క్లోజ్ అయినా కొన్ని విషయాలు చెప్పలేం మహేంద్ర అని అనుపమ అంటుంది. నీకు, మనుకి మధ్య గొడవేంటి అని అడుగుతాడు. దానికి నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను అని అనపమ అంటుంది. ఇక. ఏకంగా మహేంద్ర.. మను తండ్రి ఎవరు..? అతను ఏం చేస్తూ ఉంటాడు..? జగతి డెలివరీ తర్వాత.. నువ్వు కనిపించకుండా వెళ్లిపోయావ్..? ఎక్కడికి వెళ్లావ్ అని అడుగుతుంది. ఇలా ఎన్ని ప్రశ్నలు అడిగినా.. అనుపమ సమాధానం చెప్పడానికి ఇష్టపడదు. అప్పుడే ఏంజెల్ ఎంట్రీ ఇస్తుంది.
Guppedantha Manasu
ఎంటి సర్.. మా అత్తయ్యను ఏవో ప్రశ్నలు అడుగుతున్నట్లున్నారు..మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా మా అత్తయ్య సమాధానం చెప్పదు. అసలు నాకు ఒక అత్తయ్య ఉందని.. తెలియడానికే నాకు పాతికేళ్లు పట్టింది.. ఇక ఆమెకు ఒక కొడుకు ఉన్నాడని మీ అందరికీ తెలిసాకే తెలిసింది. అంటే మా అత్తయ్య ఒక చట్రంలో బతికేస్తుంది. కాబట్టి.. మీరు ఎంత అడిగినా నిజం చెప్పదు అని ఏంజెల్ అంటుంది.
Guppedantha Manasu
పోనీ ఇప్పుడు నువ్వు అడుగమ్మా.. చెబుతుందేమో అని మహేంద్ర అంటాడు. దానికి ఏంజెల్.. మా అత్తయ్య చెబితే తెలుసుకోవాలని తనకు కూడా ఉందని.. కానీ.. తాను ఇంత కాలం ఈ విషయాలన్నీ చెప్పకుండా దాచి పెట్టింది అంటే.. ఆ గతం చాలా బాధాకరమైనది కావచ్చు. అందుకే చెప్పడం లేదు అని అంటుంది. మహేంద్ర మాత్రం వినడు. నీకు పెళ్లి కాలేదు అన్నావ్ కదా..? మరి మను తండ్రి ఎవరు...? నీ బాధేంటో చెప్పు అని అడుగుతుంది. ఇక.. అనుపమ చిరాకు పడుతుంది.
Guppedantha Manasu
నాకు నీరసంగా ఉంది.. నువ్వు ఈ ప్రశ్నలతో నన్ను ఇబ్బంది పెట్టకు అని అంటుంది. ఏంజెల్ కూడా.. వదిలేయమని.. తెలిసే రోజు తెలుస్తుందిలే అని అంటుంది. సరే అని.. మహేంద్ర వదిలేస్తాడు. ఏంజెల్ , మహేంద్ర వెళ్లిపోతుంటే.. అనుపమ పిలిచి మరీ... ఈ ప్రశ్న... మనుని మాత్రం అడగకు అని అంటుంది. ఆ మాటకు మహేంద్ర షాకౌతాడు.
Guppedantha Manasu
తర్వాత మను కాలేజీకి రాలేదని..చాలా సార్లు వసుధార ఫోన్ చేస్తుంది. కానీ మను లిఫ్ట్ చేయడు. ఏమైందా అని మళ్లీ ఫోన్ చేస్తుంది. దీంతో.. మను లిఫ్ట్ చేస్తాడు. బిజీగా ఉన్నారా అని వసు అడుగుతుంది. లేదని.. ఇందాక ఫోన్ చూడలేదు అని చెబుతాడు. తర్వాత.. కాలేజీకి ఎందుకు రాలేదు అని అడుగుతుంది. జరిగింది... మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేదు అని చెబుతాడు. అనుపమ తనను కాలేజీలో నుంచి వెళ్లిపొమ్మని చెప్పిన విషయం వసుధారకు గుర్తుకువస్తుంది... ఆ తప్పు మీరు చేయలేదు అని రుజువైంది కదా.. కాలేజీకి రమ్మని అడుగుతుంది. కానీ.. అనుపమ మేడమ్ పిలిస్తేనే వస్తాను అని మను చెబుతాడు.
Guppedantha Manasu
కనీసం ఇంటికైనా రమ్మని చెబుతుంది. తన కోసం కాకపోయినా.. మీ అమ్మ గారి కోసం అయినా రమ్మని అడుగుతుంది. సాయంత్రం.. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని.. సాయంత్రం ఇంటికి రమ్మని చెబుతుంది. దానికి మను సరే అంటాడు.