Guppedantha Manasu 24th February Episode:మనుకి అమ్మచేతి వంట, రిషికి కర్మకాండలు, వసు ఒప్పుకుంటుందా?
అనుపమ మేడమ్ పెళ్లి చేసుకోలేదు కదా, మరి కొడుకు ఎలా అవుతాడు.. వీరి మధ్య ఏ బంధం ఉందో తెలుసుకుంటేనే అన్ని విషయాలు తెలుస్తాయి అని వసుధార మనసులో అనుకుంటూ ఉంటుంది.
Guppedantha Manasu
Guppedantha Manasu 24th February Episode: మను భోజనం పూర్తైన తర్వాత అనుపమ లోపలికి వెళ్లి వాళ్ల పెద్దమ్మకు ఫోన్ చేస్తుంది. ఇక్కడికే భోజనానికి వస్తున్నాడని ఎందుకు చెప్పలేదు అని సీరియస్ అవుతుంది. వాళ్ల పెద్దమ్మ చెప్పేది వినిపించుకోకుండా ఫోన్ పెట్టేస్తుంది. అయితే.. ఈ అనుపమ, ఆ మను ఇద్దరూ తనకు అర్థం కారు అని వాళ్ల పెద్దమ్మ అనుకుంటుంది.
Guppedantha Manasu
ఇక భోజనం తర్వాత మను, మహేంద్ర , వసుధార, అనుపమ కూర్చొని ఉంటారు. భోజనం ఎలా ఉంది అని మహేంద్ర అడిగితే.. అమ్మ చేతి భోజనం తిన్న అనుభూతి కలిగింది అని మను అంటాడు. చాలా కాలం తర్వాత ఇలాంటి భోజనం చేశాను అని చెబుతాడు. మా అనుపమ చేతి వంట నీకు అమ్మ భోజనం లా అనిపించిందా అంటాడు. మను అన్న మాటకు అనుపమ సంతోషిస్తుంది. తర్వాత మహేంద్ర..ఇప్పటి నుంచి నీకు ఎవరూ లేరని చెప్పొద్దని, నీకు మేం ఉన్నాం అని చెబుతాడు. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు అని చెబుతాడు. ఇక మను కుటుంబం గురించి మహేంద్ర మరోసారి అడుగుతాడు. కానీ, మను చెప్పడానికి ఇష్టపడడు. తానేమీ బ్యాంక్ డీటైల్స్ అడగడం లేదని, నీకు ఇష్టం లేకపోతే చెప్పకపోయినా పర్లేదు అని కాకపోతే మనసుకు నచ్చిన వ్యక్తుల గురించి తెలుసుకోవాలని ఉంటుంది కదా అని అంటాడు. తర్వాత కాలేజీ కి నువ్వు తీర్చిన కష్టం చిన్నది కాదని.. చాలా పెద్దదని మహేంద్ర పొగుడుతాడు. అయితే.. అది తాను చేసిన సహాయం కాదని.. రిషి నే చేశాడు అనుకోండి అంటాడు. రిషి మిషన్ ఎడ్యుకేషన్ ద్వారా చాలా మందికి చాలా చేశాడని.. ఆ మంచే ఇాలా జరిగింది అనుకోమని చెబుతాడు. తర్వాత.. మహేంద్రకు వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరుతాడు. వెళ్లే ముందు అనుపమ వైపు ఒక లుక్ ఇస్తాడు. అనుపమ ముఖం ఒకలా పెట్టడం వసుధార కూడా చూస్తుంది. వీళ్ల మధ్య ఏదో ఉందనే అనుమానం కలుగుతుంది.
Guppedantha Manasu
మను వెళ్లిపోయిన తర్వాత వసుధార ఆలోచనలో పడుతుంది. మను ని చూసిన ప్రతిసారీ అనుపమ అదోలా అయిపోతున్నారని, వాళ్లిద్దరి మధ్య తల్లీ కొడుకుల బంధం ఉందని అనిపిస్తోందని అని అనుకుంటూ ఉంటుంది. కానీ అనుపమ మేడమ్ పెళ్లి చేసుకోలేదు కదా, మరి కొడుకు ఎలా అవుతాడు.. వీరి మధ్య ఏ బంధం ఉందో తెలుసుకుంటేనే అన్ని విషయాలు తెలుస్తాయి అని వసుధార మనసులో అనుకుంటూ ఉంటుంది.
Guppedantha Manasu
ఇక ఒకవైపు అనుపమ, మరోవైపు మను ఆలోచిస్తూ ఉంటారు. ఒకరితో మరొకరు మాట్లాడుకుంటున్నట్లుగా స్క్రీన్ ప్లే డిజైన్ చేశారు. మను ప్రశ్నలకు.. అనుపమ సమాధానాలు చెబుతున్నట్లుగా ఉంటుంది. తన ఐడెండిటిటీ లేకుండా చేసింది నువ్వే అని మను అనుకుంటాడు. కొంతకాలమే తాను ఈ ప్రశ్నలు బరిస్తానని.. తర్వాత తన గుండెల్లోని బాధను తీర్చేసుకుంటాను అని నిర్ణయం తీసుకుంటాడు.
Guppedantha Manasu
మరుసటి రోజు ఉదయం మహేంద్ర ఆఫీసుకు బయలుదేరుతుంటూ ఉంటాడు. అప్పుడే ఫణీంద్ర ఫోన్ చేసి.. ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని, నువ్వు ఒక్కడివే ఇంటికి రా అని పిలుస్తాడు. సరే అని మహేంద్ర అంటాడు. అదే విషయం చెప్పి.. మహేంద్ర బయలదేరుతూ ఉంటే.. వసు ఏమైందని అడుగుతుంది. ఫణీంద్ర రమ్మన్న విషయం చెబుతుంది. అయితే.. వసు నేను కూడా వస్తాను అంటుంది. అయితే.. తనని ఒక్కడినే రమ్మని చెప్పాడని, తాను మాత్రమే వెళతాను అని అని వెళతాడు.
Guppedantha Manasu
అయితే తనను రానివ్వలేదని శైలేంద్ర ఏదైనా ప్లాన్ వేశాడా అని వసులో అనుమానం మొదలు అవుతుంది. వసు అనుకున్నట్లుగానే.. అది శైలేంద్ర ప్లానే. అదే విషయాన్ని తన తల్లితో పంచుకుంటాడు. తాను వేసిన ప్లాన్ సక్సెస్ అయితే వసుధార గుండె పగిలిపోవడం ఖాయమని, తనకు ఎండీసీటు దక్కడం ఖాయం అని తల్లితో చెబుతూ ఉంటాడు. తమ ప్లాన్ సక్సెస్ అయ్యి.. మహేంద్ర, వసులకు మధ్య గొడవలు వస్తాయని, గట్టిగా కేకలు పెడుతుందని.. ఆ అరుపులు చూసి వసుకి పిచ్చి పట్టిందని ఎండీ సీటు నుంచి తొలగిస్తారు అని దేవయాణి అంటుంది. ఈ సంఘటనతో మహేంద్ర, వసుధారల మధ్య విభేదాలు వచ్చి.. ఒకరికొకరు శత్రువుల్లా మారుతారు అని, ఇక నువ్వు ఎండీ అవ్వడం ఖాయం అని దేవయాణి అంటుంది.
Guppedantha Manasu
ఇంతకీ వాళ్ల ప్లాన్ ఏంటంటే.. రిషి చనిపోయాడు కాబట్టి దశదిన కర్మలు చేయాలి కదా అని ఫణీంద్ర చెబుతాడు. మరి ఈ విషయం తెలసిన తర్వాత వసుధార ఎలా రియాక్ట్ అవుతుంది..? ఈ విషయంలో మను ఎలా వసుకి సహాయం చేస్తాడు అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి.