- Home
- Entertainment
- TV
- Guppedantha Manasu 23January Episode:మారు వేషంలో వచ్చి వసుకి ఎదురుపడిన రాజీవ్, గుర్తుపట్టిన వసు..?
Guppedantha Manasu 23January Episode:మారు వేషంలో వచ్చి వసుకి ఎదురుపడిన రాజీవ్, గుర్తుపట్టిన వసు..?
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నువ్వు ఫెస్ట్ కి ఒప్పుకోకుండా ఉండాల్సిందమ్మా అని మహేంద్ర అంటాడు. అయితే... ఫణీంద్ర సర్ కూడా అడగడంతో తాను కాదనలేకపోయాను అని చెబుతుంది.

Guppedantha Manasu
Guppedantha Manasu 23January Episode: కాలేజీలో బోర్డు మీటింగ్ జరుగుతూ ఉంటుంది. బోర్డు మెంబర్స్ అందరూ కాలేజీలో ఫెస్ట్ పెడదాం అని అంటూ ఉంటారు. కొద్ది రోజుల తర్వాత పెడదాం అని వసుధార అంటుంది. కానీ.. బోర్డు మెంబర్స్ మాత్రం.. ఇదే కరెక్ట్ సమయం అని.. ఇప్పుడే పెట్టాలి అంటారు. ఫణీంద్ర కూడా.. ఇదే మంచి సమయం అని, మన కాలేజీ రెప్యూటేషన్ మరింత పెరుగుతుందని సలహా ఇస్తాడు. దీంతో.. చేసేది లేక.. వసుధార సరే చేద్దాం అని అంటుంది. ఎదైనా సహాయం కావాలంటే అడగమని ఫణీంద్ర అంటాడు.. సరే అని వసు చెబుతుంది.
Guppedantha Manasu
సీన్ కట్ చేస్తే.. ఎండీ సీటు వైపు చూస్తూ వసుధార ఆలోచిస్తూ ఉంటుంది. గతంలో తమ కాలేజీలో జరిగిన ఫెస్ట్ గుర్తు చేసుకుంటుంది. అప్పుడు తాను స్టూడెంట్ గా ఉండగా, జగతి మేడమ్ ఉండటం, రిషి ఎండీగా ఉంటారు. అవన్నీ గుర్తొచ్చి వసు ఎమోషనల్ అవుతుంది. అదే విషయాన్ని వచ్చి మహేంద్ర అడుగుతాడు. జగతి మేడమ్, రిషి సర్ లేకుండా ఫెస్ట్ చేయాల్సి వస్తుందని అనుకోలేదు మామయ్య అంటుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నువ్వు ఫెస్ట్ కి ఒప్పుకోకుండా ఉండాల్సిందమ్మా అని మహేంద్ర అంటాడు. అయితే... ఫణీంద్ర సర్ కూడా అడగడంతో తాను కాదనలేకపోయాను అని చెబుతుంది.
Guppedantha Manasu
దానికి మహేంద్ర కూడా అవును నిజమే అంటాడు. చాలా మంది నువ్వు ఎండీ సీటుకు అనర్హురాలివి అన్నా కూడా.. అన్నయ్య ఏరోజూ ఆ మాట అనలేదు. నీ మీద చాలా మంచి నమ్మకంతో ఉన్నాడు. కాబట్టి.. ఇలాంటి సమయంలో నువ్వు ఫెస్ట్ ఘనంగా చేసి.. నీ సత్తా నిరూపించుకోవాలి అని చెబుతాడు. నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను అని మహేంద్ర అంటాడు. వసుధార సరే అంటుంది.
Guppedantha Manasu
ఇక.. ఇంట్లో శైలేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. అసలు వసుధారను తాను వేసిన ఉచ్చులో నుంచి ఎలా బయటపడుతోందని అనుకుంటాడు. ఎన్నిసార్లు దెబ్బ తీయాలని చూసినా తప్పించుకుంటోందని, ఈ సారి ఎలాగైనా దెబ్బతీయాలని అనుకుంటాడు. సడెన్ గా శైలేంద్రకు రాజీవ్ గుర్తుకు వస్తాడు. దానికితోడు కాలేజీలో ఫెస్ట్ పెట్టాలని కూడా అనుకోవడడంతో.. వసుధార తనను తాను దెబ్బ తీసుకోవడానికి మంచి అవకాశం ఇచ్చిందని అనుకుంటాడు. ఇఫ్పటి వరకు తాను ఒక్కడినే నీకు శత్రువుగా ఉన్నానని, ఇప్పుడు వసు బావ కూడా తనకు తోడు అయ్యాడని ఆనందపడతాడు. తామిద్దరం చేసుకున్న డీల్ ప్రకారం..వసు ని చెత్త ఎండీగా ముద్ర వేయాలని అనుకుంటాడు. అలా ముద్ర వేసి... ఆ ఎండీ సీటు నుంచి వసుని తొలగించాలని అనుకుంటాడు. ఎండీ సీటు తనకు, వసు.. రాజీవ్ కి దక్కేలా చేయడమే తమ లక్ష్యం అని అనుకుంటాడు. ఇప్పుడు ఆ రాజీవ్ ఏం చేస్తున్నాడో అని శైలేంద్ర అనుకుంటాడు.
Guppedantha Manasu
నెక్ట్స్ సీన్ లో రాజీవ్.. పుడ్ డెలివరీ బాయ్ అవతారంలో వసుధార ఉన్న ఇంటికి వచ్చేస్తాడు. వచ్చి.. మరదలు పిల్లా వచ్చేశా అనిమనసులో అనుకుంటాడు. ఇప్పుడు ఇంట్లో ఉందా? లేక బయటకు వెళ్లిందా? బయటకు వెళ్లి ఉంటే ఫుడ్ బిల్లు బొక్క అనుకుంటూ వెళ్లి..డోర్ కొడతాడు. వసు వచ్చి డోర్ తీస్తుంది. వసుని చూసి.. ఎంత అందంగా ఉన్నావ్ అంటూ వసు అందాన్ని ఆస్వాదిస్తాడు. వసు పిలవడంతో ఈ లోకంలోకి వస్తాడు. ఎవరు..? ఏం కావాలి..? అని అడుగుతుంది. ఫుడ్ డెలివరీ మేడమ్ అని చెబుతాడు.
తాను ఫుడ్ ఆర్డర్ ఇవ్వలేదు అని వసు అంటుంది.. ఇంట్లో వాళ్లు ఎవరైనా ఆర్డర్ చేశారేమో అని అంటాడు. ఫుడ్ ఇచ్చేటప్పుడు, మనీ ఇచ్చే టప్పుడు ఇలా ప్రతిసారీ వసు చేతిని తాకడానికి రాజీవ్ ప్రయత్నిస్తాడు. వసుని తాకినప్పుడు తన బాడీలోకి పవర్ వస్తోందని రాజీవ్ లోలోపల సంబరపడిపోతూ ఉంటాడు. అది వసుకి అర్థమౌతుంది. తర్వాత వెళ్లిపోతుంటే.. ముఖానికి ఉన్న మాస్క్ తీయమని.. అడుగుతుంది. కానీ.. రాజీవ్ తనకు దగ్గు ఉందని తీయడానికి ఒఫ్పుకోడు. అయినా.. వసు ఒప్పుకోదు. రాజీవ్ ని ఎక్కడో చూసినట్లు ఉందని.. మాస్క్ తయమని బలవంతపెడుతుంది. రాజీవ్.దొరికిపోయానని భయపడతాడు. ఈ లోగా వసుని మహేంద్ర పిలవడంతో.. అటు తిరిగేలోగా.. రాజీవ్ అక్కడి నుంచి తప్పించుకుంటాడు.
Guppedantha Manasu
ఇక.. కాలేజీలో వసుధార ఫెస్ట్ కి సంబంధించిన పనులు చూస్తూ ఉంటుంది. కాలేజీలో స్టూడెంట్స్తో ఎవరు ఏం చేయాలి అని పనులు విధిస్తూ ఉంటుంది. అదంతా శైలేంద్ర చూస్తాడు. తర్వాత.. వెళ్లిపోతున్న వసుధారను పిలిచి మరీ.. వాదన పెట్టుకుంటాడు. చాలా సంతోషంగా కనపడుతున్నావ్?. రిషి మీద ప్రేమ చచ్చిపోయిందా అని వసు బాధపడేలా మాట్లాడతాడు.
Guppedantha Manasu
కానీ.. వసు ఆ బాధ కనిపిచంకుండా.. కౌంటర్లు ఇస్తుంది. కానీ.. శైలేంద్ర మాత్రం.. ఈ ఫెస్ట్ సరిగా జరగనివ్వను అని, దాని వల్ల నీకు మరిన్ని కష్టాలు తప్పవు అని హెచ్చరిస్తాడు. అక్కడ శైలేంద్రకు కౌంటర్ ఇచ్చి లోపలికి వెళ్తుంది.
Guppedantha Manasu
కానీ.. వసు బాధగా రావడం అనుపమ చూసి.. ఏమైందని అడుగుతుంది. ఇలా.. శైలేంద్ర బెదిరించిన మాటలు మొత్తం చెబుతుంది. అయితే.. ఈ విషయంలో మీదే తప్పు అని, మొదట శైలేంద్ర గురించి తెలిసినప్పుడే మీరు ఫణీంద్ర, రిషిలకు చెప్పకుండా తప్పు చేశారని.. అలా దాచకపోయి ఉంటే.. జగతి, రిషి లకు ఇలా జరిగి ఉండేది కాదు అని.. అనుపమ అంటుంది. అన్నయ్య తెలుసుకుంటాడు లే అని ఆగామని.. ఇక్కడిదాకా వస్తుందని అనుకోలేదు అని మహేంద్ర అంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.