Guppedantha Manasu 21st march Episode:ఇంకోసారి అమ్మ అని పిలవను, చేతులెత్తి దండం పెట్టిన మను..!
మీరు నోరు తెరవకపోవడమే కారణం. ఇప్పుడు కూడా మీరు ఈ విషయంలోనూ నోరు తెరవకపోతే కష్టం. నిజంగానే అనుపమ మేడమ్ మీ అమ్మ అని అడుగుతుంది.
Guppedantha Manasu
Guppedantha Manasu 21st march Episode:అనుపమ నీ తల్లి అన్న విషయం నువ్వు ఎందుకు దాచావ్ అని మహేంద్ర ప్రశ్నిస్తాడు, కానీ.. మను నోరు విప్పడు. నువ్వు కూడా అనుపమ వారసత్వం తీసుకున్నావా? తను కూడా ఏమీ చెప్పదు అని అని మహేంద్ర అంటాడు. తర్వాత ఏంజెల్ కూడా అడుగుతుంది మీరు.. నిజంగా అనుపమ అత్తయ్య కొడుకా..? చాలా సార్లు మిమ్మల్ని, అత్తయ్యని అడిగాను. కానీ చెప్పలేదు అని అంటుంది.
Guppedantha Manasu
తర్వాత వసుధార మొదలుపెడుతుంది. ఇందాక మీ పీఏ మాట్లాడారు అని, ఆ ఫోటో, పోస్టర్ విషయంలో మీ తప్పేమీ లేదని ఆయన చెప్పారని చెబుతుంది. మిమ్మల్ని నేను అపార్థం చేసుకున్నాను నిజమే కానీ.. దానికి మీరు నోరు తెరవకపోవడమే కారణం. ఇప్పుడు కూడా మీరు ఈ విషయంలోనూ నోరు తెరవకపోతే కష్టం. నిజంగానే అనుపమ మేడమ్ మీ అమ్మ అని అడుగుతుంది.
Guppedantha Manasu
వీళ్లు వరసగా ప్రశ్నించడంతో... ఆవేశంగా పైకి లేచిన మను.. అవును అని అంటాడు. అనుపమ మా అమ్మ అని చెబుతాడు.నీను ఆవిడకు మాట ఇచ్చాను. మాట ఇచ్చాను అనే బదులు.. నాతో ఆవిడే బలవంతంగా ఒట్టు వేయించుకుందని చెప్పాలి. మళ్లీ అమ్మ అని పిలవద్దు అని చెప్పిందని.. కానీ.. తానుు ఆ మాట తప్పి పిలిచాను అని అంటాడు. నిజానికి తన ప్లేస్ లో ఎవరు ఉన్నా.. అలానే చేసి ఉండేవారని చెబుతాడు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి తెలిసిన ఒకే ఒక్క పదం అమ్మ అని, ఒకే ఒక ముఖం కూడా అమ్మే అని చెబుతాడు. తన కోసం ఆవిడ ఎన్నో త్యాగాలు చేసిందని కానీ.. నేను తరచూ ఓ ప్రశ్నతో ఆమెను వేధించేవాడినని చెబుతాడు.( ఒకవేళ తండ్రి ఎవరో తెలుసుకోవడానికి ప్రశ్నించి ఉండొచ్చు. దానికి అనపమ దగ్గర సమాధానం చెప్పడం ఇష్టం లేకపోవడంతో.. కొడుకుని దూరం పెట్టి ఉండొచ్చు.)
Guppedantha Manasu
ఈలోగా డాక్టర్ వచ్చి.. అనుపమకు స్పృహ వచ్చిందని చెబుతుంది.మీరు వెళ్లి చూడొచ్చని.. ఎక్కువగా డిస్టర్బ్ చేయవద్దని చెబుతారు. అయితే.. మను లోపలికి వెళ్లడానికి ఆలోచిస్తాడు. మహేంద్ర లోపలికి రమ్మని పిలిచినా.. మీరు వెళ్లండి నేను తర్వాత వస్తాను అని చెబుతాడు. మహేంద్ర అయినా మనుని పిలవాలి అనుకుంటే.. వసుధార వద్దు అని లోపలికి తీసుకొని వెళ్తుంది.
Guppedantha Manasu
లోపలికి వెళ్లిన తర్వాత.. ఏంజెల్ పలకరిస్తుంది. ఇప్పుడు ఎలా ఉందని అడుగుతుంది. పర్వాలేదని అనుపమ అంటుంది. తర్వాత.. మహేంద్ర.. నువ్వు త్వరగా కోలుకుంటావ్ అనుపమ అని ధైర్యం చెబుతాడు. వెంటనే నేను నీకు ధైర్యం చెప్పడం ఏంటి? కొడుకు కోసం నీ ప్రాణాలను అడ్డం వేసి మరీ కాపాడుకున్నావ్.. నిజమైన తల్లివి అనిపించుకున్నావ్.. ఆరోజు కొద్దిగా పొలమారితేనే తట్టుకోలేకపోయావ్.. అలా కన్న తల్లిమాత్రమే చేయగగలదు అని అంటాడు.
Guppedantha Manasu
వెంటనే వసుధార.. అవును మేడమ్.. మను వచ్చిన దగ్గరి నుంచి మీలో వచ్చిన ప్రవర్తనను మేం గమనిస్తూనే ఉన్నాం.. మీరు నిజమైతే దాచారు కానీ.. తల్లి ప్రేమను మాత్రం ఏ రోజూ దాచలేదు అని అంటుంది. ఇక ఏంజెల్.. మనుతో నీకు గతంలో ఏవైనా మనస్పర్థలు ఉన్నాయేమో.. వేలు విడిచిన చుట్టం ఏమో అనుకున్నాను కానీ.. కన్న కొడుకు అనుకోలేదని.. ఇప్పుడు కూడా నీ కళ్లు మను కోసమే వెతుకుతున్నాయని నాకు తెలుసు అని అంటుంది. తాము మనుని కూడా లోపలికి రమ్మని పిలిచామని.. కానీ మను రాలేదు అని ఏంజెల్ చెబుతుంది.
Guppedantha Manasu
ఏంజెల్, వసులను మనుని తీసుకురమ్మని మహేంద్ర చెబుతాడు. సరే అని ఇద్దరూ వెళతారు. ఈలోగా దేవుడా అమ్మకి ఏమీ కాకూడదు అని మను మనసులో అనుకుంటూ ఉంటాడు. ఈలోగా ఏంజెల్ వచ్చి.. అత్తయ్య దగ్గరకు రమ్మని చెబుతుంది. కానీ.. మను నేను రాలేను అని.. వస్తే తను ఇబ్బంది పడుతుందని మను అంటాడు. అని నీకు చెప్పిందా అని ఏంజెల్ అంటుంది. తనకు తెలుసు అని.. ఇంతకాలం తమ మధ్య జరిగింది అదే అని మను అంటాడు. అయితే.. ఆమె నిన్ను పిలించింది అంటే కూడా మీరు వెళ్లరా అని వసుధార అడుగుతుంది.
Guppedantha Manasu
దానికి మను ఎమోషనల్ అవుతాడు.నన్ను పిలిచిందా అని అడుగుతాడు. అవును అని వసుధార అంటుంది. నోటితో పిలిచిందా అని మను అడిగితే.. ఆమె కళ్లు మీ కోసమే వెతుకుతున్నాయి అని, ఇప్పటి వరకు లోపల మీ గురించే మాట్లాడుకున్నామని.. మిమ్మల్ని తీసుకువస్తామని మేం బయటకు వచ్చాం అని వసుధార చెబుతుంది. ఇక.. అత్తయ్య బాధలో ఉందని.. నువ్వు లోపలికి వెళ్లాలి అని ఏంజెల్ చెబుతుంది. ఇద్దరూ కలిసి బలవంత పెట్టడంతో.. మను లోపలికి వస్తాడు.
Guppedantha Manasu
అసలు ఆ ఎటాక్ చేయడానికి వచ్చిన వ్యక్తి ఎవరు..? ముందే అతను నీకు తెలుసా అని మహేంద్ర అడుగుతాడు. రిషి మీద ఎటాక్ చేయడానికి వచ్చిన వ్యక్తి అని అనుపమకు గుర్తుకు వస్తుంది కానీ.. ఆ విషయం చెప్పదు. సరే వద్దులే.. అని అంటాడు. ఇక.. మహేంద్ర డిస్టర్బ్ చేయను అంటూనే గుచ్చి గుచ్చి మాటలు అంటూనే ఉంటాడు. ఇంత ప్రేమ పెట్టుకొని ఎలా దాచుకున్నావ్ అని అడుగుతాడు.
Guppedantha Manasu
ఇక.. మను దూరం నుంచి అనుపమను చూస్తూ ఉంటాడు. నెమ్మదిగా నడుచుకుంటూ ఆమె వద్దకు వస్తాడు. ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉన్నారు కదా అని మను అడుగుతాడు. డాక్టర్ గారు తొందరగానే కోలుకుంటారని చెప్పారని, ధైర్యంగా ఉండమని మను చెబుతాడు. ఆ మాటలు చెప్పేటప్పుడు కూడా మను ఏడుస్తూనే ఉంటాడు. అది మహేంద్ర గమనిస్తాడు. ఏమైందని అడిగితే.. ఏమీలేదని మను చెబుతాడు. అయితే.. నీ ప్రతిమాటలోనూ చివరన ఓ మాట మిస్ అవుతుందని, దాని వల్ల నీ ఎమోషన్ బ్యాలెన్స్ దెబ్బ తింటోందని మహేంద్ర అంటాడు.
‘మీ ప్రాణాలకు తెగించి, నా ప్రాణాలు కాపాడారు. కానీ మీరు అలా రాకుండా ఉండి ఉంటే.. నా మీద ఎటాక్ చేసి ఉండేవాడు కదా , పోతే నేను పోయి ఉండేవాడిని కదా’ అని మను అంటాడు. ఆ సమయంలో మీకు ఇచ్చిన మాట తప్పినందుకు నన్ను క్షమించండి. ఇంకెప్పుడు మిమ్మల్ని అలా పిలవను అని చేతులెత్తి దండం పెడతాడు. అయితే.. మనుని మహేంద్ర ఓదారుస్తాడు. కానీ... మను అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
Guppedantha Manasu
ఇక, అనుపమకు ఎలా ఉందో తెలుసుకోవడానికి మహేంద్రకు ఫణీంద్ర ఫోన్ చేస్తాడు. ఎలా ఉందని అడుగుతాడు. పర్వాలేదని మహేంద్ర చెబుతాడు. మనుపై ఎటాక్ చేసిన వ్యక్తి ఎవరు..? అతను ఎవరికీ హాని చేయడు కదా అని ఫణీంద్ర అంటే.. ఈ రోజుల్లో మంచి చేయడం కన్నా పెద్ద తప్పు ఇంకేముంటుంది అన్నయ్య అని అంటాడు. అసలు అనుపమ మనుకి తల్లి ఏంటి అని ఫణీంద్ర అడుగుతూ ఉంటాడు. ఈ మాటలన్నీ శైలేంద్ర, దేవయాణి, ధరణి అక్కడే ఉండి వింటూ ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.