Guppedantha Manasu 18th march Episode: రిషి కోసం చేయించిన కంకణం.. మను చేతికి..?
తనకు కాలేజీలో పని ఉందని అనుపమ వెళ్లిపోతుంది. మనసులో మాత్రం.. ఈ మహేంద్ర.. నిజంగానే తెలుసుకుంటాడా అని టెన్షన్ పడుతుంది.

Guppedantha Manasu
Guppedantha Manasu 18th march Episode: ఉదయాన్నే కాలేజీకి వెళ్లడానికి వసుధార రెడీ అయ్యి ఉంటుంది. వెళ్లేముందు మహేంద్రకు కాఫీ ఇస్తుంది. ఆయన తాగుతూ.. అనుపమను ఏమైంది అలా ఉన్నావ్..? ఇందాకా ఎవరితోనే ఫోన్ మాట్లాడుతున్నావ్..? అని అడుగుతాడు. ఏంజెల్ తో మాట్లాడుతున్నానని, కలుస్తానని చెప్పానని.. మళ్లీ తర్వాత పని ఉందని సాయంత్రం కలుస్తాను అని చెప్పాను అని చెబుతుంది. తర్వాత.. మహేంద్ర కావాలనే అనుపమ మీద సెటైర్లు వేస్తాడు. మనసులో ఉన్న విషయం బయటపెట్టరు అని.. చాలా కౌంటర్లు వేస్తాడు. ఎవరిని అంటున్నావ్ అని అనుపమ అడిగితే నిన్ను కాదులే అంటాడు.
Guppedantha Manasu
తర్వాత వసుధార, అనుపమలను తనకు ఒక సహాయం చేయమని అడుగుతాడు. ఏంటి అని వసుధార అంటే.. మను పుట్టినరోజు తెలుసుకోవడానికి మంచి ఐడియా ఇవ్వమని మహేంద్ర అడుగుతాడు. వసుధార సరే అంటుంది. వెంటనే కావాలని అనుపమను కూడా ఐడియాలు చెప్పమని అడుగుతాడు. మను చెప్పను అన్నాడు కదా అని అనుపమ అంటే... అందుకే ఎలాగైనా తెలుసుకోవడానికి ఐడియా చెప్పమని అడుగుతాడు. అయితే.. తనకు కాలేజీలో పని ఉందని అనుపమ వెళ్లిపోతుంది. మనసులో మాత్రం.. ఈ మహేంద్ర.. నిజంగానే తెలుసుకుంటాడా అని టెన్షన్ పడుతుంది.
Guppedantha Manasu
ఇక.. అనుపమ వెళ్లిన తర్వాత.. వసుధారతో మహేంద్ర మాట్లాడతాడు. మనం కష్టాల్లో ఉన్న సమయంలో ఈ మను వచ్చాడని.. కాలేజీని దక్కించుకోవడానికి శైలేంద్ర చేస్తున్న కుట్రలను అడ్డుకొని, కాలేజీని కాపాడాడని.. ఇప్పుడు కాలేజీలోనే ఉంటున్నాడని అంటాడు. నీకు కూడా ప్రతి విషయంలోనూ అండగా ఉంటున్నాడని, రిషి వస్తాడనే నమ్మకం కూడా కలిగించాడు అని అంటాడు. రాజీవ్ నుంచి కూడా చాలా సార్లు మను కాపాడాడు అని వసుధార చెబుతుంది. మను ని చూసి రాజీవ్ భయపడుతున్నాడని, తన జోలికి రావడం లేదని వసుధార చెబుతుంది. అందుకే.. ఇంత చేసిన మనుకి మనం ఏదో ఒకటి చేయాలని, మను బర్త్ డే గ్రాండ్ గా చేయాలి అని అంటాడు. సరే అని.. కాలేజీకి టైమ్ అవుతుంది వెళతాను అని వసుధార చెబుతుంది.
Guppedantha Manasu
అయితే... తనకు పని ఉందని, కాసేపు ఆగి కాలేజీకి వస్తాను అని మహేంద్ర చెబుతాడు. వసుధార కాలేజీకి వెళ్లిన తర్వాత.. మహేంద్ర.. జగతి ఫోటో దగ్గరకు వెళతాడు. ఇక.. వాళ్ల గతం మొత్తం గుర్తు చేసుకుంటాడు. జగతి నువ్వు దూరం అయ్యామని.. తర్వాత.. రిషి కూడా కనిపించకుండా పోయాడని.. ఆ సమయంలోనే మను వచ్చాడని.. అలాంటి మనుకి ఏదో ఒకటి చేయాలి అనుకుంటున్నాను అని జగతి ఫోటో దగ్గర చెబుతాడు.
Guppedantha Manasu
ఆ తర్వాత.. రిషి ఫోటో దగ్గరకు వెళ్లి తన మనసులో బాధను పంచకుంటాడు. నువ్వు ఎక్కడున్నావ్.. ఎప్పుడు వస్తున్నావ్ అని అంటాడు. నీ కోసం ఈ కంకణం చేయించాను అని తీస్తాడు. అయితే... ఇప్పుడు ఈ కంకణం మనుకి ఇవ్వాలి అనుకుంటున్నాను అని అంటాడు. మను కూడా.. రిషి లాగా తాము అందరూ సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాడని.. తన కోసం ఏదో ఒకటి చేయాలని ఈ కంకణం ఇచ్చి కొంచెం అయినా తృప్తి పడతాను అని అనుకుంటాడు.