- Home
- Entertainment
- TV
- Guppedantha Manasu 16th December Episode:శైలేంద్ర జస్ట్ మిస్.. అదరగొట్టిన ఫణీంద్ర, కొడుకుపై అనుమానం..!
Guppedantha Manasu 16th December Episode:శైలేంద్ర జస్ట్ మిస్.. అదరగొట్టిన ఫణీంద్ర, కొడుకుపై అనుమానం..!
వాళ్లు వెల్లగానే శైలేంద్ర హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాడు. దేవయాణి వచ్చి.. కొడుకు తో ప్రేమగా మాట్లాుడుతంది. నీకేం కాలేదు కదా, బాగానే ఉన్నావు కదా అని అడుగుతుంది. ధరణిని మంచినీళ్లు అడుగుతాడు.తేవడానికి వెళ్తుంది.

Guppedantha Manasu
Guppedantha Manasu 16th December Episode:నేటి ఎపిసోడ్ లో శైలేంద్ర వెనక మహేంద్ర తుపాకీ పట్టుకొని పరుగులు తీస్తూ ఉంటాడు. ఎట్టకేలకు శైలేంద్రను పట్టుకుంటాడు. దేవయాణి, ధరణి అడ్డురావడంతో వాళ్లను పక్కకు నెట్టి శైలేంద్రను కాల్చబోతాడు. కానీ, అనుపమ వచ్చి కాపాడేస్తుంది. సరిగ్గా అదే సమయానికి వసుధార కూడా వస్తుంది. కానీ, అనుపమ మహేంద్ర చెయ్యి పట్టుకోవడంతో బులెట్ పక్కు వెళ్తుంది. శైలేంద్రకు ఏమీ కాలేదని దేవయాణి సంతోషిస్తుంది. మహేంద్ర మాత్రం అనుపమను పక్కకు తప్పుకోమని, ఈరోజు తాను శైలేంద్రను కాల్చేయాల్సిందేనని, ఈ రాక్షసుడి వల్లే తమ ఇల్లు నరకంగా మారిందని అంటాడు. వసుధార, అనుపమ వచ్చి ఆపేస్తారు. రిషి గురించి ఏమీ చెప్పడం లేదని, ఇలాంటివాడిని ప్రాణాలతో వదిలిపెట్టకూడదని, వీడు చస్తేనే మనమంతా సంతోషంగా ఉంటామని చెబుతాడు. చాలాసేపు పెనుగులాట జరుగుతుంది.
Guppedantha Manasu
తాను దోషినైనా, జైలు పాలైనా కూడా ఈ రోజు శైలేంద్రను వదిలిపెట్టను అంటాడు. కానీ, అనుపమ, వసుధారలు బలవంతంగా మహేంద్రను తీసుకొని వెళ్లిపోతారు. వెళ్తూ వెళ్తూ కూడా.. ఈరోజు తప్పించుకున్నా, రేపు నిన్ను వదలను అని వార్నింగ్ ఇచ్చివెళతాడు. వాళ్లు వెల్లగానే శైలేంద్ర హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాడు. దేవయాణి వచ్చి.. కొడుకు తో ప్రేమగా మాట్లాుడుతంది. నీకేం కాలేదు కదా, బాగానే ఉన్నావు కదా అని అడుగుతుంది. ధరణిని మంచినీళ్లు అడుగుతాడు.తేవడానికి వెళ్తుంది.
Guppedantha Manasu
వీళ్లు బయటకు రాగానే ఫణీంద్ర ఎదురౌతాడు. మహేంద్ర వెళ్లి, వాళ్ల నాన్నను హత్తుకుంటాడు. ఏం జరిగింది మహేంద్ర, అలా ఉన్నావ్ ఏంటి అని అడుగుతాడు. తర్వాత రిషి గురించి ఏమైనా తెలిసిందా అని అడిగి, రిషికి ఏమీకాదని, రిషి కినిపించకుండా పోవడానికి కారణం ఏవరని తెలిస్తే, వాడిని తన చేతులతోనే మట్టిలో కలిపేస్తా అంటాడు. తర్వాత, తన తమ్ముడిపై ఉన్న ప్రేమను కురిపిస్తాడు. వెంటనే శైలేంద్ర వచ్చి మధ్యలో దూరిపోతాడు. ‘నేను కూడా అదే చెబుతున్నాను డాడ్. నా ఆరోగ్యం కొంచెం బాగైన తర్వాత రిషి ఎక్కడ ఉన్నాడో నేను వెతుకుతాను అని చెప్పినా, బాబాయ్ వినకుండా బాధపడుతున్నాడు, తనలో తాను కుంగిపోతున్నాడు.’ అని ఓవర్ యాక్షన్ చేస్తాడు. కొడుకు కనిపించకపోతే తండ్రి బాధ అలానే ఉంటుందని ఫణీంద్ర అంటాడు. దానికి శైలేంద్ర... రిషి కినిపించడం లేదని తెలిసినప్పటి నుంచి ఓ అన్నయ్యగా తాను రిషి గురించే బాధపడుతున్నానని చెబుతాడు. కొడుకు చెప్పడం ఆలస్యం తల్లి కూడా అందుకుంటుంది. శైలేంద్ర..రాత్రి పగలు అనే తేడా లేకుండా రిషి గురించే బాధపడుతున్నాడు అని చెబుతుంది.
Guppedantha Manasu
‘బాబాయ్.. మీరు భయపడకండి మీకు నేనున్నాను. రిషిని ఎలాగైనా పట్టుకొస్తాను’ అని శైలేంద్ర చెబుతాడు. వాడి మాటలకు వసు, అనుపమ ముఖాలు చాలా చిరాకుగా పెడతారు. తర్వాత వసుధార.. తాము వెళ్తాం అని చెబుతుంది. ఫణీంద్ర.. భోజనం చేసి వెళ్లమంటాడు. కానీ, మహేంద్ర లేదని.. తాము వెళ్లాలి అని చెప్పి, అక్కడి నుంచి వెళ్లిపోతారు. దీంతో, ఫణీంద్ర ఇంట్లోకి వెళతాడు. ధరణి చెల్లా చెదురుగా పడిపోయిన ఇంటిని సర్దుతూ ఉంటుంది. అది ఫణీంద్ర చూసేస్తాడు.
Guppedantha Manasu
‘ఏంటి ఇదంతా? ఇల్లంతా ఇలా అయిపోయిందేంటి? మహేంద్ర కూడా నాకు చెప్పకుండా ఇంటికి వచ్చాడు. ఒళ్లంతా చెమటలు పట్టి ఉన్నాయి. కంగారు కనిపిస్తోంది. అనుపమ, వసుధారలు కూడా ఏదో టెన్షన్ లో ఉన్నట్లున్నారు. అసలు ఏం జరిగింది చెప్పండి.. మిమ్మల్నే అడిగేది’ అని ఫణీంద్ర అడుగుతాడు. దేవయాణి ఏదో కవర్ చేయడానికి ప్రయత్నిస్తే, తనని ఆపి, ధరణిని అడుగుతాడు. ధరణి చెప్పకుండా నాన్చుతుంటే.. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, నీ మీద నమ్మకంతో అడుగుతున్నానని, ఏం జరిగిందో క్లియర్ గా చెప్పు అంటాడు.
Guppedantha Manasu
దాంతో ధరణి‘ రిషి కనిపించకుండా పోవడం వెనక ఈయన హస్తం ఉందని చిన్న మామయ్యఅనుమానిస్తున్నారు. రిషిని ఏం చేశావ్ అని ఈయనను చిన్న మామయ్య నిలదీశారు..’ అని జరిగింది మొత్తం పూస గుచ్చినట్లు చెప్పేస్తుంది. అది విని ఫణీంద్ర షాకౌతాడు. ఇక, దేవయాణి ఓవర్ యాక్షన్ చేస్తుంది. ‘ జగతి విషయంలోనూ నా కొడుకునే అనుమానించారు. ఇప్పుడు రిషి విషయంలోనూ నా కొడుకునే అనుమానించారు. నా కొడుకు ఏమైనా తప్పు చేశాడా? పోన్లే మహేంద్ర మీ తమ్ముడే కదా అని మౌనంగా ఉన్నాను’ అంటుంది. ‘లేకపోతే.. ఏం చేసేదానికి ’ అని ఫణీంద్ర సీరియస్ గా అడుగుతాడు. అంటే.. ‘ నాకొడుకు ప్రాణాలు తీస్తుంటే, చూస్తూ ఊరుకోవాలా’ అనిఅడుగుతుంది. దానికి ఫణీంద్ర ‘ మరి ముందు ఎందుకు నిజం చెప్పలేదు , అబద్ధం చెప్పాలని ఎందుకు ప్రయత్నించావ్, ఎందుకు నిజం చెప్పలేదు’ అని నిలదీస్తాడు. ‘ఈ గొడవలన్నీ మీకు చెప్పి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పలేదు’ అని సమాధానం చెబుతుంది. ‘ ఈ నాటకాలు నా దగ్గరవద్దు. అంటే, నాకు తెలీకుండా చాలా జరుగుతుంది. ఈరోజు గన్ తో కాల్చడానికి వచ్చాడుు అంటే, మీకు దీనికి ముందు చాలా చర్చలే జరిగి ఉంటాయి. గన్ పట్టుకని వచ్చాడంటే ఏమనుకోవాలి? ఒక్కసారిగా అయితే రాడు. చిన్న అనుమానం తో రాడు, తాను ఏదో బలంగా నమ్మి ఉంటేనే వస్తాడు.’ అని మహేంద్రకు సపోర్ట్ గా ఫణీంద్ర మాట్లాడతాడు.
Guppedantha Manasu
దీంతో, దేవయాణి తమ్ముడికి సపోర్ట్ చేస్తున్నారని, కొడుకు కన్నా తమ్ముడే ఎక్కువా అని అడుగుతుంది. ‘ నేను కొడుకు, తమ్ముడు అని చూడట్లేదు. జగతి చనిపోయి బాధపడుతోంది మహేంద్ర, ఇప్పుడు రిషి కనిపించక బాధపడుతోంది కూడా మహేంద్ర, సొంత కొడుకు కనిపించకుంటే ఎలా ఉంటుంది ఆ బాధ’ అని అంటాడు. ‘రిషి కనిపించకపోవడానికి, శైలేంద్రకు ఏంటి సంబంధం, అప్పుడు హాస్పిటల్ లో ఉన్నాడు కదా, కనీసం స్పృహలో కూడా లేడు కదా’ అని దేవయాణి తన కొడుకు మంచివాడు అనినమ్మించాలని చూస్తుంది.
Guppedantha Manasu
కానీ, ఫణీంద్ర ‘అంతక ముందే ప్లాన్ చేసి ఉండొచ్చు కదా , చేయాలని అనుకుంటే, హాస్పిటల్ లో ఉన్నా, అండమాన్ జైలులో ఉన్నా చేయవచ్చు. నువ్వు నన్ను డైవర్ట్ చేయాలని చూడకు దేవయాణి’ అని ఫణీంద్ర సీరియస్ అవుతాడు. ‘ అంటే మీరు కూడా నా కొడుకునే అనుమానిస్తున్నారా’అని దేవయాణి ఫీలౌతూ అడుగుతుంది. ‘నేను ఎవరినీ అనుమానించడం లేదు. నిజా నిజాలు, సాధ్యాసాధ్యాలు ఆలోచిస్తున్నాను. ఏమీ లేకుండా శైలేంద్రను అనుమానించడు కదా. ఏదో ఒక చిన్న అనుమానం అయినా వచ్చే ఉంటుంది కదా ’ అంటాడు. వెంటనే శైలేంద్రను ప్రశ్నిస్తాడు. ‘నిన్నే ఎందుకు అనుమానిస్తున్నారు?’ అని అడుగుతాడు. దానికి శైలేంద్ర తనకు తెలీదంటాడు. దేవయాణి మాత్రం ఏదో దురుద్దేశంతో అలా చేస్తున్నారు అంటుంది. అంటే అని ఫణీంద్ర అడగడంతో.. ‘ అన్నదమ్ములు ఉన్న ఏ ఇల్లు అయినా కురక్షేత్రమే కదా , ఆస్తుల విషయంలో కావచ్చు, పదవుల కోసమైనా కావచ్చు. లేదంటే మనసులో ఇంకా ఏదైనా ఉండొచ్చు’ అని దేవయాణి అనగానే, ఫణీంద్ర నోర్ముయ్ అంటాడు.
Guppedantha Manasu
‘ మహేంద్ర, రిషి అలా ఆలోచించేవారే కాదు. ఏదో జరుగుతోంది. శైలేంద్ర ఏదో చేస్తున్నాడు. అందుకే వాళ్లు అనుమానిస్తున్నారు. సరే, వీళ్లు అనుమానిస్తున్నారంటే పక్కనపెడదాం. జగతి కేసులో ముకుల్ కూడా ఒక వాయిస్ తీసుకువచ్చాడు కదా ? ఆ వాయిస్ ఎందుకు వచ్చింది?’ అని ఫణీంద్ర అడిగే సరికి.. ‘వామ్మో ఎస్కేప్ అయిపోవాలి. ముకుల్ కంటే డాడ్ ఎక్కువ ఇన్వెస్టిేగేట్ చేస్తున్నాడు’ అని మనసులో అనుకొని, బయటకు మాత్రం నొప్పి ఎక్కువైనట్లు ఓవర్ యాక్టింగ్ చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు.
Guppedantha Manasu
తర్వాత శైలేంద్ర బెడ్రూమ్ లో ఆలోచిస్తూ ఉంటాడు. ధరణి మాటలు గుర్తు చేసుకుంటాడు. వెంటనే ధరణిని పిలుస్తాడు. రా ధరణి.. అక్కడే నిల్చున్నావే రా అని పిలుస్తాడు. ‘థ్యాంక్స్ ధరణి ’ అని చెబుతాడు. ‘ ఇప్పుడు నేను ఇలా ప్రాణాలతో ఉండటానికి నువ్వే కారణం. రెండుసార్లు నువ్వు నన్ను కాపాడావ్. ఇంతకముందు నాపై ఎటాక్ జరిగినప్పుడు, ఇప్పుడు బాబాయ్ నుంచి మరోసారి , నీకు తెలీకుండానే నన్ను నువ్వు కంటికి రెప్పలా చూసుకుంటున్నావ్. నాకు ఎదురైన సమస్యల నుంచి నువ్వే కాపాడుతున్నావ్. అసలు నువ్వు నా భార్యగా దొరకడం నా అదృష్టం. అసలు నీ రుణం ఎలా తీసుకోవాలో అర్థం కావడం లేదు. నీకు ఏం కావాలో కోరుకో’ అంటాడు. దానికి ధరణి మనసులో ‘ మీ నిజ స్వరూపం నాకు తెలుసు’ అనుకుంటుంది. తర్వాత.. ‘ మీరు నన్ను పావులా వాడుకుంటున్నారని నాకు తెలుసు. మీరు అబద్ధం చెబుతున్నారు నాకు తెలుసు. నన్ను మోసం చేశారు. నా ఫీలింగ్స్ తో ఆడుకున్నారు.’ అంటుంది. అలాంటి మాటలు అనకు ధరణి, నా గుండె ఆగిపోతుంది అని శైలేంద్ర అంటాడు. ‘ఇలాంటి మాటలతో నన్ను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారా’అనిఅడుగుతుంది. శైలేంద్ర ఏదో మాటలతో మాయ చేయాలని కవర్ చేస్తాడు. ‘మీరు చాలా తప్పులు చేశారు కదండి, లెక్కపెట్టలేనన్ని తప్పులు చేశారు కదండి’ అని ధరణి అంటుంది. తర్వాత మళ్లీ కొన్ని ఎమోషనల్ డైలాగులు కొట్టి తర్వాత.. నాన్న ముందు నిజం ఎందుకు చెప్పావ్? ఏదైనా కట్టుకథ చెప్పొచ్చు కదా అంటాడు. ‘నేను అలా చెప్పనండి,నేను చూసింది, విన్నది మాత్రమే చెబుతాను’ అని ధరణి అంటుుంది. ‘నీ నిజాయితీనే నాకు నచ్చుతుంది ధరణి, నా కో డౌట్.. రిషి ఏమయ్యాడని అనుకుంటున్నావ్? నా దగ్గర ఉన్నాడు అనుకుంటున్నావా లేడనుకుంటున్నావా? రిషి ఎక్కడ ఉన్నాడు అనుకుంటున్నావ్? ఆ విషయం నీకు తెలిస్తే.. ముందు నాకే చెప్పాలి ఒకేనా? కొంచెం తలనొప్పిగా ఉంది.. కాఫీ తీసుకురా..’ అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. ధరణి వెళ్లిన తర్వాత ‘వసుధార.. నిన్ను ఏం చేస్తానో చూడు’ అని మనసులో అనుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.