- Home
- Entertainment
- TV
- Guppedantha Manasu 14th December Episode:ఎండీ సీటు ఇస్తేనే, రిషిని వదిలేస్తా.. శైలేంద్ర రాక్షసత్వం.!
Guppedantha Manasu 14th December Episode:ఎండీ సీటు ఇస్తేనే, రిషిని వదిలేస్తా.. శైలేంద్ర రాక్షసత్వం.!
రేపు నీకు కూడా ఏదైనా జరిగితే , రిషి పక్కన ఎవరు ఉంటారు..? ఒక వేళ నీకు ఏం కాకపోయినా, రిషికి ఏదైనా జరిగితే..?’ అని అంటాడు. దానికి వసు‘ అలాంటి ఆలోచనలు మీ మైండ్ లో కి రానివ్వకండి. అలాంటి ఆలోచనలు వస్తే, మీ ఆలోచనలనే చంపేస్తాను’ అంటుంది.

Guppedantha Manasu
Guppedantha Manasu 14th December Episode:రిషి గురించి చెప్పమని వసు. శైలేంద్రను ప్రాధేయపడుతుంది. ఎంత బతిమిలాడినా శైలేంద్ర చెప్పడానికి ఇష్టపడడు. తన ఇగో శాంతించడం లేదు అంటాడు. దీంతో, వసుధార.. చేతులు జోడించి మరీ అడుగుతుంది. చేతులు జోడించి అడగటంతో అప్పుడు అతని ఇగో శాంతిస్తుంది. కానీ, రిషి గురించి చెప్తే తనకు ఏంటి అని అడుగుతాడు. దీంతో, వసుధార మీకు ఏం కావాలి అని అడుగుతుంది. తెలిసినా కూడా ఎందుకు మళ్లీ మళ్లీ అడుగుతావ్..? ఆ ఎండీ సీటు కావాలి నాకు అని మనసులో మాట చెబుతాడు.
Guppedantha Manasu
అయితే, వసు ఆ ఎండీ సీటు ఇవ్వడానికి మాత్రం అంగీకకరించను అని తేల్చిచెప్పేస్తుంది. దీంతో, శైలేంద్ర.. ‘పిన్ని కూడా ఎండీ సీటు నాకు దక్కకుండా చేసింది, తన కొడుక్కే దక్కాలని చూసింది , ఎండీ సీటు చుట్టూ ఓ వలయంలా మారి చాల కాపాడుకుంది, కానీ చివరకు శైలేంద్ర ప్రళయంలో కొట్టుకుపోయింది. ఏకంగా తన కొడుక్కే దూరమైపోయింది. రేపు నీకు కూడా ఏదైనా జరిగితే , రిషి పక్కన ఎవరు ఉంటారు..? ఒక వేళ నీకు ఏం కాకపోయినా, రిషికి ఏదైనా జరిగితే..?’ అని అంటాడు. దానికి వసు‘ అలాంటి ఆలోచనలు మీ మైండ్ లో కి రానివ్వకండి. అలాంటి ఆలోచనలు వస్తే, మీ ఆలోచనలనే చంపేస్తాను’ అంటుంది.
Guppedantha Manasu
దానికి శైలేంద్ర.. ‘నేను చెప్పాల్సింది చెప్పాను.. తర్వాత నీ ఇష్టం. అయినా, ఎండీ సీటుది ఏముంది.. భర్త కోసం సర్వస్వం వదులుకున్న మహిళలు మన దేశంలో ఉన్నారు. నువ్వు కూడా అదేవిధంగా ఎండీ సీటు వదిలై. భర్త కోసం చిరకాలం నిలిచిపోతావ్. ఎందుకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటావ్. నాకు ప్రాణాలు తీయడం పెద్దగా ఇష్టం లేదు. కానీ చేయాల్సి వస్తోంది. పిన్ని చనిపోయిన తర్వాత ఆ పదవి నాకు వస్తుందని చాలా ఆశపడ్డాను. కానీ, చివరి నిమిషంలో నీ భర్త నిన్ను కూర్చోపెట్టాడు. మర్యాదగా ఆ సీటు నుంచి తప్పుకో వసుధార అని నేను అంటే నువ్వు పౌరుషానికి పోయి.. పులులు, సింహాలు అంటూ ఎదురు సమాధానం చెప్పావ్. నేను హర్ట్ అయ్యాను. వెయిట్ చేయడం వేస్ట్ అని అర్థమైంది. అందుకే ఈ దారి ఎంచుకున్నాను. నీకు మాటలు రావడం లేదని నాకు అర్థమౌతోంది. నీకు పూర్తిగా అసలు విషయం కూడా అర్థమైందనుకుంట. నా భర్తను వదిలిపెట్టు అని ఏడుపులు, బతిమిలాడటలు లాంటివి చేయకు. నా మనసు కరగదు అని కూడా నీకు తెలుసు. భర్తా, ఎండీ సీటా బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకో. అది ఏంటి అనేది మాత్రం నువ్వే ఆలోచించుకో. అదే ఎండీ సీటు నాకు అప్పగిస్తే నీ భర్త ప్రాణాలతో బయటకు వస్తాడు. లేదంటే.. అర్థం చేసుకో. వసుధార.. నువ్వు వేరే ఏదైనా ప్లాన్ వేయాలని చూస్తే.. నా గురించి తెలుసు కదా. ఆ సీటు కోసం ఎవరి అడ్డు అయినా తొలగిస్తాను. ఆ ఎండీ సీటు ఎంత తొందరగా నాకు అప్పగిస్తే... నీకు అంత మంచిది. వెళ్లు’ అంటాడు.. వసు ఏం చేయాలో, ఏం మాట్లాడాలో తెలీక బాధగా వెళ్లిపోతుంది.
Guppedantha Manasu
వసు వెళ్తుంటే,.. శైలేంద్ర మనసులో అసలు ఆ రౌడీ వెదవలు రిషిని ఎక్కడ దాచి పెట్టారో.. కనీసం తనకు అయినా చెబుతారో లేదో అనుకుంటూ ఉంటాడు. అంటే, రిషిని కిడ్నాప్ చేయించింది శైలేంద్రే కానీ సరిగ్గా ఎక్కడ దాచి పెట్టాడు అనే విషయం మాత్రం తనకు కూడా తెలియదు. ఇక వసు.. గుండెనిండా బాధతో ఏడుస్తూ.. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లిపోతూ ఉంటుంది. తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ‘ ఎది నిజం, ఏది అబద్దం. ఎండీ సీటు రిషి సర్ నాకు అప్పగించిన బాధ్యత. నిజంగానే శైలేంద్ర రిషి సర్ ని బంధించాడా? ఒక వేళ శైలేంద్ర చెప్పింది అబద్ధం అయితే..? రిషి సర్ తిరిగి వస్తే, నేను ఏం సమాధానం చెప్పాలి. కానీ వాడు చెప్పింది నిజమైతే..? ఏంటి ఈ పరీక్ష. రిషి సర్.. ఎక్కడున్నారు మీరు..?’ అని ఏడ్చుకుంటూ ఇంటికి చేరుకుంటుంది.
Guppedantha Manasu
వసు కోసం మహేంద్ర, అనుపమ ఎదురుచూస్తూ ఉంటారు. వసు బాధగా రావడం చూసి.. ఏమైందని మహేంద్ర అడుగుతాడు. ‘ నాకు ఎండీ సీటు వద్దు మామయ్య. నాకు ఆ పదవి అక్కర్లేదు మామయ్య.’ అంటుంది. ఎందుకు అలా అంటున్నావ్ అని మహేంద్ర అంటే.. ‘ ఆ పదవి వదిలేస్తేనే, రిషి సర్ ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది మామయ్య. ఆ ఎండీ పదవి వద్దు అనుకుంటేనే రిషి సర్ క్షేమంగా ఉంటారు మామయ్య’ అంటుంది. అని ఎవరు చెప్పారు..? మహేంద్ర అంటే... శైలేంద్ర చెప్పాడు అని చెబుతుంది. అర్థంకాక.. ఎందుకు అలా అన్నాడు అని అనుపమ అంటే.. రిషి ని మాయం చేసింది శైలేంద్రే అందుకే అలా అన్నాడు అని చెబుతాడు.
‘ నాకు రిషి సర్ కావాలి మామయ్య. నాకు మా ఆయన క్షేమంగా ఇంటికి రావాలి. నేను ఆ పదవికి రిజైన్ చేస్తేనే రిషి సర్ ఇంటికి వస్తారు’ అని ఏడుస్తూ అంటుంది. కానీ, మహేంద్ర.. అది నీకు రిషి అప్పగించిన బాధ్యతమ్మ అంటాడు. దానికి వసు ‘ తెలుసు మామయ్య. ఆ రోజు ఆయన నాకు ఆ పదవి అప్పగిస్తూ... చాలా జాగ్రత్తలు చెప్పారు. నా తెలివి తేటలు, ప్రతిభతో కాలేజీని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని చెప్పారు. ఆయన ఎంతో నమ్మకంతో ఆ పదవిని నాకు అప్పగించారు. కానీ, ఆయన నా పక్కన లేకుండా, నా పక్కన ఏది ఉన్నా అది నాకు గడ్డి పొరకతో సమానం. అందుకే వదిలేద్దాం అనుకుంటున్నాను.’ అంటుంది. దానికి అనుపమ.. ‘ నువ్వు ఎండీ పదవి వదిలేసినంత మాత్రాన రిషి గురించి చెప్తాడని నమ్మకం ఏంటి? తొందరపడి ఎలాంటి ముందుడుగు వేయకు. రిషి ఎవరి కంట్రోల్ లో ఉన్నాడు అనే విషయం తెలిసింది కదా, అందరం కలిసి రిషి ని కాపాడుకుందాం’ అని అనుపమ సలహా ఇస్తుంది.
‘ అంత టైమ్ లేదు మేడమ్. ఈలోపు వాడు రిషి సర్ కి ఏ ప్రమాదం అయినా తలపెట్టవచ్చు. వాడికి ఆ అవకాశం ఇవ్వకూడదు. నా రిషి సర్ ఎలా వెళ్లారో.. అలానే తిరిగి రావాలి. నాకు రిషి సర్ కావాలి’ అని వసు ఏడుస్తూ ఉంటుంది. దానికి అనుపమ.. ‘ రిషి క్షేమంగా ఉండాలనే అందరం కోరుకుంటున్నాం. ఆ విషయం నీకు ఎందుకు అర్థం కావడం లేదు..? ముందు నువ్వు కూల్ గా ఉండు.’అని వసుకి సర్దిచెప్పడానికి ప్రయత్నిస్తుంది.
Guppedantha Manasu
మరోవైపు ధరణి.. శైలేంద్ర కోసం కాఫీ తీసుకువస్తుంది. ఇచ్చి వెళ్లిపోతుంటే.. శైలేంద్ర పిలుస్తాడు. ‘ ఏంటి వెళ్లిపోతున్నావ్..? సైలెంట్ గా ఎందుకు ఉన్నావ్’ అని అడుగుతాడు. తాను బాగానే ఉన్నాను అని ధరణి చెబుతుంది. కానీ, శైలేంద్ర..‘నువ్వు నన్ను పాత శైలేంద్రలాగానే చూస్తున్నావ్. నువ్వు అలా చూస్తుంటే నాకు బతకాలనే అనిపించడం లేదు. నువ్వు నమ్మాలంటే ఏం చేయాలో చెప్పు. ’అని అడుగుతాడు. ధరణి మాత్రం.. మీరు రెస్ట్ తోసుకొండి ఏమీ మారాల్సిన అవసరం లేదు అని చెప్పి వెళ్లిపోతుంటే. మళ్లీ పలిచి.. పక్కనే కూర్చోపెట్టుకుంటాడు.
తర్వాత, వసుధార నీకు ఎక్కడ కలిసింది అని అడుగుతాడు. దానికి ధరణి తిన్నగా కాకుండా, ఎక్కడంటే.. ఇక్కడే కలిసిందని, తాను ఉన్నదగ్గరే కలిసింది అని తిక్క గా సమాధానాలు చెబుతుంది. మెల్లగా.. నీకు తెలిసిన నిజాలు ఏమైనా వసుధారకు చెప్పావా అని అడుగుతాడు. ‘నాకు తెలిసిన నిజాలు గుండెల్లోనే సమాధులు అయిపోతాయి’ అని ధరణి చెబుతుంది. అయితే, నిజం చెప్పలేదనమాట అనుకొని ఊపిరి పీల్చుకుంటాడు. తర్వాత నిన్ను ఏమైనా అడిగిందా అంటే.. మీరు ఎక్కడ ఉన్నారు అని మాత్రమే అడిగింది అని చెబుతుంది. అప్పుడే దేవయాణి అక్కడికి రావడంతో.. ధరణి వెళ్లిపోతుంది.
Guppedantha Manasu
వసుధార ఎందుకు వచ్చింది అని దేవయాణి ప్రశ్నలు వేస్తుంది. ‘ రిషి కోసం వచ్చింది, నా దగ్గరే ఉన్నాడు. నేనే రిషిని కిడ్నాప్ చేయించాను. సేఫ్ ప్లేస్ లో ఉంచాను’ అని చెబుతాడు. ఆ విషయం తెలిసి, అంత సైలెంట్ గా వసుధార ఎలా వెళ్లింది అని దేవయాణికి డౌట్ వస్తుంది. ‘ఎండీ సీటు నాకు అప్పగించి, రిషిని తీసుకువెళ్లమని చెప్పాను. లేకుంటే, రిషి ప్రాణాలు తీసేస్తాను అన్నాను. ఆల్రెడీ పిన్ని చావు చూసింది . ఆ భయం ఇంకా గుండెల్లోనే ఉంది. ఇప్పుడు ఎండీ సీటు ఇవ్వకపోతే ఏం జరుగుతుందో తనకు బాగా తెలుసు ’ అని తల్లితో నిజం చెప్పేశాడు.
Guppedantha Manasu
‘భలే ఇరికించావ్ ఆ వసుధారను. ఇన్నాళ్లకు మన కళ నెరవేరబోతుంది.’ అని దేవయాణి సంబరపడుతుంది. ‘ ఇలా మనం చాలా సార్లు అనుకున్నాం. కానీ, ఈసారి మాత్రం పక్కాగా జరుగుతుంది. నేను డీబీఎస్టీకి రారాజు అవుతాను’ అని శైలేంద్ర సంబరపడిపోతూ ఉంటాడు. మరోవైపు వసుధార.. జగతి ఫోటో దగ్గర నిలపడి మాధపడుతూ ఉంటుంది. శైలేంద్ర చెప్పిన మాటలు తలుచుకుంటుంది. ‘ రిషి సర్ ని ఎలా కాపాడుకోవాలో..? ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆరోజు మీరు మీ ప్రాణాలు అడ్డేసి ఆయన ప్రాణాలు కాపాడారు. ఈరోజు మళ్లీ ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మీరు కాపాడిన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. మీ ప్రాణ త్యాగానికి అర్థం లేకుండా పోతుంది. కాబట్టి, నేను ఎండీ సీటు వదిలేసి, రిషి సర్ ని కాపాడుకోవాలని అనుకుంటున్నాను’ అని ఏడుస్తూ ఉంటుది. అనుపమ వచ్చి.. వసుధార భుజంపై చెయ్యి వేస్తుంది. ‘ నువ్వు చెప్పింది నిజమే వసుధార. రిషి ని మనం కాపాడుకోలేకపోతే, జగతి చేసిన త్యాగానికి అర్థం లేకుండా పోతుంది. రిషి కోసం నువ్వు పడుతున్న టెన్షన్ , నువ్వు చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది.’ అని అంటుంది. ‘ మేడమ్, సర్ లేకుండా నేను బతకలేను. సర్ కనిపించనప్పటి నుంచి నా గుండె అదిరిపోతోంది. భయమేస్తోంది.’ అని వసు ఏడుస్తుంది. అయితే.. ‘ రిషి ఎక్కడ ఉన్నాడో కనిపెట్టి, మీ ఇద్దరినీ కలిపే బాధ్యత నాది, శైలేంద్రకు బుద్ధి చెబుతాను. మన భయాన్ని శైలేంద్ర ఆసరాగా తీసుకుంటున్నాడు.వాడిని దోషిలా ఎలా నిలపెట్టాలో నాకు బాగా తెలుసు.’ అని అనుపమ ధైర్యం చెబుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.