Guppedantha Manasu 12th February Episode:పారిపోదాం అన్న మహేంద్ర, నిన్ను ఎవరూ కాపాడలేరు శైలేంద్ర ఉచ్చులో వసు..
మాకు కాస్త ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వండి అని అడుగుతుంది. దానికి వాళ్లు 24గంటల సమయం ఇస్తున్నాం అని.. ఆలోగా ఏధో ఒకటి డిసైడ్ అవ్వండి అని చెప్పి వెళ్లిపోతారు.
Guppedantha Manasu
Guppedantha Manasu 12th February Episode: కాలేజీకి ఇద్దరు వ్యక్తులు వచ్చి తమకు రిషి సర్ రూ.40కోట్లు ఇవ్వాలని లేకపోతే.. కాలేజీని రాసి ఇవ్వాలని అడిగిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై కాలేజీలో బోర్డు మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. అయితే డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా ఉండటంతో.. ఏం చేయాలో ఎవరికీ అర్థం కాదు. అయితే.. వాళ్లు కోర్టుకు వెళతాం అని బెదిరిస్తారు. దానికి మహేంద్ర వెళ్లమని అంటాడు. కానీ.. కోర్టుకు వెళితే వాళ్లే గెలుస్తారని అనుపమ అంటుంది. వెంటనే శైలేంద్ర ఏమీ తెలియని అమాయకుడిలా.. అయ్యో ఇప్పుడు ఎలా? కాలేజీ వీళ్లకు ఇచ్చేయాలా? స్టూడెంట్స్ ఏమైపోతారు? వారిని వేరే కాలేజీలో జాయిన్ చేసుకుంటారో లేదో అని అంటూ ఉంటాడు. మిగిలిన బోర్డు మెంబర్స్ కూడా కూర్చొని మాట్లాడుకోవాలని.. ఇలా కోర్టు చుట్టూ తిరిగితే స్టూడెంట్స్ భవిష్యత్తు నాశనం అవుతుంది అని చెబుతూ ఉంటారు.
Guppedantha Manasu
అయితే.. వసుధార.. మీరు ఇంత సడెన్ గా ఎందుకు వచ్చి డబ్బులు అడుగుతున్నారు అని అడుగుతుంది. అయితే.. రిషి సర్ ఉండి ఉంటే తాము అడిగేవాళ్లం కాదని.. ఇప్పుడు ఆయన చనిపోయారు కదా అందుకే.. అని వాళ్లు అనగానే వసు ఆవేశంగా సర్ ఉన్నారు అని చెబుతుంది. అయితే.. వాళ్లు సర్ సంగతి పక్కన పెట్టండి.. మాకు డబ్బులు ఇస్తారా లేక కాలేజీ రాసిఇచ్చేస్తారా ఏ విషయం త్వరగా తేల్చి చెప్పండి అని అంటారు. దానికి వసు ఏం చేద్దాం మామయ్య అంటుంది. అదే నాకు కూడా అర్థం కావడం లేదమ్మా అని మహేంద్ర అంటాడు. అప్పుడు.. అనుపమ.. మీరు ఇప్పుడే కదా వచ్చి మాకు చెప్పారు.. మాకు కాస్త ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వండి అని అడుగుతుంది. దానికి వాళ్లు 24గంటల సమయం ఇస్తున్నాం అని.. ఆలోగా ఏధో ఒకటి డిసైడ్ అవ్వండి అని చెప్పి వెళ్లిపోతారు.
Guppedantha Manasu
బోర్డు మెంబర్స్ కూడా అసహనంగా అక్కడి నుంచి వెళతారు. మహేంద్ర ఏం చేయాలా అని ఆలోచిస్తూ వెళ్లిపోతాడు. అప్పుడే వసుధార కూర్చొని ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఆలోచిస్తూ ఉంటుంది. ఇక.. శైలేంద్ర వసుధారను కదిలిస్తాడు. వసుకి కోపం వచ్చేస్తుంది. ఇందాక కొట్టింది గుర్తులేదా అని అడుగుతుంది. దానికి శైలేంద్ర.. నాలాంటి వాడిని అలా కొట్టావో లేదో.. నీకు ఇలాంటి సమస్య వచ్చి పడింది అంటాడు. దానికి వసు.. ఇదంతా నీ ప్లానే కదా అని అడుగుతుంది. అయితే.. తాను అమాయకుడినని... తనకు ఏ సంబంధం లేదు అని శలేంద్ర అంటాడు. కానీ వసు నమ్మదు. ఇదంతా నీ కుట్రే అని అంటుంది.
Guppedantha Manasu
దానికి శైలేంద్ర తనకు సంబంధం లేదని మళ్లీ చెబుతాడు. అయితే.. వసు తాను ఈ సమస్యను పరిష్కరిస్తాను అని అంటుంది. అది నీ వీళ్ల కాదు అని శైలేంద్ర అంటాడు. ఏంటి అని వసు మళ్లీ అడిగే సరికి.. మన వళ్ల కాదు అని అంటాడు. వసు అక్కడి నుంచి వెళ్లగానే.. ఇక నీ పని అయిపోయింది వసుధార అని శైలేంద్ర అనుకుంటాడు. ఇక ఎండీ సీటు తనకు అప్పగించక తప్పదని, ఈ సమస్య నుంచి నిన్ను కాపడటానికి ఎవరూ రారు అని శైలేంద్ర సంబరపడిపోతూ ఉంటాడు.
Guppedantha Manasu
ఇక.. ఇంట్లో మహేంద్ర బ్యాగ్ సర్దుతూ ఉంటాడు. అయితే అనుపమ వద్దు ఆగు మహేంద్ర అని చెబుతూ ఉంటుంది. వసుధార ఇందుకు ఒప్పుకోదు అని అంటూ ఉంటుంది. అయితే.. మహేంద్ర మాత్రం. ఇక్కడే ఉంటే మనకు ఇంకా సమస్యలు వస్తూనే ఉంటాయి. వసుధార కూడా రిషి జ్నాపకాలతో సతమతమౌతూ ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్లిపోవడమే కరెక్ట్ అని మహేంద్ర అంటాడు. అప్పుడే వసుధార.. మామయ్య అనుకుంటూ వస్తుంది.
లగేజ్ సర్దుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు మామయ్య అని అడుగుతుంది. దానికి మహేంద్ర.. వెళ్తున్నాను కాదు.. వెళ్తున్నాం.. నీ లగేజ్ కూడా సర్దుకో... మనం వెళ్లిపోదాం అని చెబుతాడు. మరి కాలేజీ పరిస్థితి అని వసు అడిగితే.. దాని వల్లే కదా మనకు సమస్యలు.. దానిని వదిలేస్తే మనకు ఏ సమస్య ఉండదు అని చెబుతాడు.
Guppedantha Manasu
అయితే.. ఇక్కడ సమస్య కాలేజీ కాదని.. శైలేంద్ర అని వసు చెబుతుంది. కానీ మహేంద్ర వినడు.. చెబుతున్నా కదా వెళ్లిపోదాం అని అంటాడు. కానీ వసు తాను చెప్పేది వినమని.. తనకు ఆ కాలేజీతో చాలా అను బంధం ఉందనది, ఆ కాలేజీ వదిలేస్తే తన ప్రాణం పోతుందని.. తనకు రిషి సర్, మీరు అందరూ ఆ కాలేజీలో నే పరిచయం అయ్యారని, తాను ఈ స్థాయికి ఎదగడానికి కూడా కాలేజీనే కారణం అని.. అలాంటి కాలేజీని తాను వదలలేను అని చెబుతుంది.
మీరైనా మామయ్యను ఆపాలి కదా అనుుపమను అడుగుతుంది. అయితే దానికి కూడా మహేంద్ర బదులిస్తాడు. అనుపమ కూడా తనతో రావడానికి రెడీ అయ్యిందని చెబుతాడు. ఈ కాలేజీ వల్ల ముందు మీ అమ్మగారు, తర్వాత జగతి, ఇప్పుడు రిషి చనిపోయారు అని మహేంద్ర అంటాడు. అయితే.. రిషి చనిపోయాడు అనే మాట మాత్రం అనొద్దు అని వసు అంటుంది. నువ్వు నమ్మకపోయినా అదే నిజం అని మహేంద్ర అంటే.. ఇంకోసారి ఆ మాట అంటే.. తన చావును చూస్తారు అని వసు బెదిరిస్తుంది. అందరూ కలిసి తననే బెదిరిస్తున్నారని మహేంద్ర అంటాడు. ఇప్పటికే ఇద్దరూ చనిపోయారని.. నువ్వు కూడా చచ్చిపోతే నేను ఏం చేయాలి? నేను కూడా చావాలా అని మహేంద్ర అంటాడు.
ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్లకపోతే.... ఈ సమస్యను ఎలా పరిష్కరించాలని, మన దగ్గర అంత డబ్బు లేదు కదా..? ఎలా ఎరేంజ్ చేద్దాం.. అని అడుగుతాడు. అయితే.. ఆ డబ్బును తాను ఎరేంజ్ చేయడానికి ప్రయత్నిస్తానని... ఇంకోసారి ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అనొద్దు అని వసు చెబుతుంది.
వసు వెళ్లిన తర్వాత ఆ డబ్బు మా నాన్నని అడగనా అని అనుపమ అంటుంది. వద్దని.. ఈ ప్రాబ్లం సాల్వ్ చేసినా, శైలేంద్ర మరో సమస్య తీసుకువస్తాడు అని మహేంద్ర అంటాడు. ఇప్పటికే జగతి, రిషి లను కోల్పోయానని.. ఇక వసుని కూడా కోల్పోలేనని అందుకే ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అంటున్నాను అని మహేంద్ర చెబుతాడు. కానీ వసుధార రాను అంటోంది కదా అని అనుపమ అంటే... ఇప్పుడు డబ్బులు కట్టకపోతే.. వాళ్లు కాలేజీ తీసుకుంటారు కదా.. అప్పుడే తానే వస్తుంది అని, ఎవరినీ డబ్బు అడగొద్దు అని అంటాడు.మరోవైపు డబ్బు కోసం వసు అందరికీ ఫోన్లు చేస్తూ ఉంటుంది. కానీ.. ఎవరూ డబ్బు ఇవ్వడానికి ఇంట్రస్ట్ చూపించరు.
Guppedantha Manasu
ఇక, ఇంట్లో శైలేంద్ర, దేవయాణి కూర్చొని ఉంటారు. వాళ్లిద్దరూ వసుధార పతనం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు వేసిన ప్లాన్ వేరు.. ఈ ప్లాన్ వేరు అని.. ఇది సూపర్ అని, కొడుకును దేవయాణి తెగ పొగిడేస్తుంది. ఈసారి మాత్రం వసుధార పతనం అవ్వడం ఖాయమని సంబరంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక.. నువ్వు ఎండీ అవ్వడం ఖాయమని, ఇన్నాళ్లకు నా కళ నిజం అవుతుంది అని దేవయాణి అంటుంది.
Guppedantha Manasu
మీ కళ నిజం కాదు అని ధరణి ఎంట్రీ ఇస్తుంది. ఏంటి ధరణి ఏం మాట్లాడుతున్నావ్ అని దేవయాణి అడిగితే.. మీ కళ కళగానే మిగిలిపోతుందని అంటుంది. మీరు తిట్టినా, ఏం చేసినా కూడా నేను ఈ రోజు చెప్పాలని అనుకున్నది చెబుతాను అని.. మొదటి నుంచి వాళ్లు చేసిన ప్రయత్నాలన్నీ చెబుతుంది. ఏం చేసినా కూడా మీరు ఆ ఎండీ సీటు దక్కించుకోలేరని.. ఇప్పుడు కూడా అది సాధ్యం కాదు అని చెబుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక వసుధార సమస్యను కొత్త హీరో పరిష్కరించే అవకాశం ఉందని తెలుస్తోంది.