Guppedantha Manasu 12th December Episode: శైలేంద్ర నిజ స్వరూపం బయటపెట్టిన ధరణి, అనుపమ ఏం చేయనుంది?
‘మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. నన్ను మభ్య పెట్టాలని చూస్తున్నారేమో కానీ, నేను మీ మాటలు నమ్మను.’ అంటుంది. పక్కనుండి దేవయాణి.. తన కొడుకు ఇప్పుడు మారిపోయాడని చెబుతూ ఉంటుంది.
Guppedantha Manasu
Guppedantha Manasu 12th December Episode:చాలా తెలివిగా ముకుల్ నుంచి శైలేంద్ర తప్పించుకుంటాడు. శైలేంద్ర తెలివి చూసి తల్లి దేవయాణి తెగ మురిసిపోతూ ఉంటుంది. వాళ్లిద్దరూ గదిలోకి దూరి ముచ్చట్లుపెట్టుకుంటూ ఉంటారు. అప్పుడే సరిగ్గా ధరణి వస్తుంది. డోర్ కొడుతూ ఉంటుంది. డోర్ కొడుతున్నది ధరణి అనే విషయం వీళ్లకు తెలుసు. అంతేకాదు.. కొన్ని నిజాలు ధరణికి కూడా తెలుసు అని కూడా వీళ్లకు తెలుసు. అయితే, ధరణి ఈ విషయాలు బయటపెడుతుందేమో అని దేవయాణి సందేహం వ్యక్తం చేస్తుంది. కానీ, అలా చేయదని, ప్రేమగా తాను రెండు మాటలు మాట్లాడితే, మూసుకొని ఓ మూలన పడిఉంటుంది అని శైలేంద్ర అంటాడు. ఆతర్వాత దేవయాణి వెళ్లి తలుపు తీస్తుంది. ఎదురుగా ధరణి నిలపడి ఉంటుంది.
‘తర్వాత ఏంటి ధరణి ఏమైంది...? ఎందుకు తలుపు అలా కొడుతున్నావ్’ అని దేవయాణి అడుగుతున్నా వినిపించుకోకుండా.. డైరెక్ట్ గా శైలేంద్ర వద్దకు వెళ్లి.. ఆ గొంతు మీదే కదా? చెప్పండి అంటూ సీరియస్ గా అడుగుతుంది. శైలేంద్ర కూల్ గా.. ‘ నాదే, ఇంటిరాగేషన్ లో కూడా నేను అదే చెప్పాను కదాై’ అంటాడు. దానికి ధరణి ‘మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. నన్ను మభ్య పెట్టాలని చూస్తున్నారేమో కానీ, నేను మీ మాటలు నమ్మను.’ అంటుంది. పక్కనుండి దేవయాణి.. తన కొడుకు ఇప్పుడు మారిపోయాడని చెబుతూ ఉంటుంది.
Guppedantha Manasu
ధరణి. ‘ ఆ వాయిస్ నేను గుర్తుపట్టాను. ఆ రోజు మీరు రౌడీకి డబ్బులు ఇవ్వడం కూడా నేను చేశాను. కానీ, అక్కడెందుకు అలా చెప్పారు? అది టెక్నాలజీ అని, ఏదేదో చెప్పి వాళ్లను నమ్మించారు. కానీ, నన్ను నమ్మించలేరు’ అని అంటుంది. శైలేంద్ర ఏదో చెప్పబోతున్న కూడా ధరణి వినదు. ‘ నేను మీరు ఏం చెప్పినా వినను. అది మీ వాయిస్ కాదు అన్నారు. అంటే, దీని వెనక ఏదో కుట్ర ఉందని అనుమానం కలుగుతోంది.’ అంటుంది. ‘నేను అలా చేసింది నీ కోసమే ధరణి. నాకు శిక్ష పడితే, నువ్వు ఒంటరిగా అయిపోతావ్, అందుకే అలా తప్పించుకున్నాను’ అని శైలేంద్ర చెబుతాడు. ‘ అయితే, నా కోసమే ఇదంతా చేశారా?’ అని అడుగుతుంది. ‘నేను చెప్పేది నిజం ధరణి. నిన్ను ఇష్టపడటం మొదలుపెట్టిన తర్వాత నాకు ఏమీ కనపడటం లేదు. నువ్వు నాకు జీవితాంతం తోడు ఉంటే చాలు. నాకు ఎండీ సీటు కూడా అవసరం లేదు. మనం ఇద్దరం సంతోషంగా ఉంటే చాలు. ఇదే విషయం మమ్మీతో చెబుతున్నాను కదా మమ్మీ’ అని శైలేంద్ర అంటాడు. ఇక, దేవయాణి కొడుకుతో కలిసి తన నటనను మొదలుపెడుతుంది. ధరణి వెళ్లి, నిజం చెప్పకుండా ఉండేందుకు చాలా పెద్ద పెద్ద డైలాగులు కొడుతుంది. తర్వాత..మీరిద్దరూ మాట్లాడుకోండి.. అని దేవయాణి వెళ్లబోతుంటే, ధరణి.. మీరు కాదు, నేను వెళ్లిపోతాను. మీకు నచ్చినంత సేపు చెవులు చిల్లులు పడేలా మాట్లాడుకోండి అని చెప్పి అక్కడి నుంచి చిరాకుగా వెళ్లిపోతుంది. వీళ్ల మాటలు ధరణి నమ్మలేదని దేవయాణి టెన్షన్ పడుతుంటే, తనను ఎలా కూల్ చేయాలో తనకు బాగా తెలుసు అని, టెన్షన్ పడవద్దని శైలేంద్ర అంటాడు.
Guppedantha Manasu
సీన్ కట్ చేస్తే, ముకుల్.. అనుపమతో మాట్లాడుతుంటాడు. శైలేంద్రే అసలు దోషి అని, కావాలని డ్రామాలు చేస్తున్నాడని చెబుతాడు. ఆధారాలు దొరికినట్లే దొరికి తప్పించుకుంటున్నాడని అంటాడు. అయితే, అనుపమ.. ఆ వాయిస్ శైలేంద్ర తనది కాదని చెబుతున్నాడు కదా, టెక్నాలజీ తో మార్చి ఉండొచ్చు కదా అంటుంది. లేదని, శైలేంద్ర నేరం చేశాడు అని తనకు బలంగా అనిపిస్తుందిన చెబుతాడు. మరోవైపు రిషి గురించి ఏమైనా తెలిసిందా అని అనుపమ అడుగుతుంది. కొంత సమాచారం తెలిసిందని, చివరగా రిషి ఫోన్ సిగ్నల్స్ హాస్పిటల్ దగ్గర మాత్రమే కనిపించాయి అని చెబుతాడు. రిషి సర్ కారు సిటీ అవుట్ స్కర్ట్స్ లో దొరికిందని, కానీ రిషి ఆచూకీ మాత్రం తెలియడం లేదని అంటాడు. రిషిని ఎవరైనా కిడ్నాప్ చేశారా లేక, సర్ కి ఏమైనా అయ్యిందా అనేది తెలియడం లేదని అంటాడు. ఏం చేసైనా, రిషిని కనిపెడతాను అంటాడు. ఇక, శైలేంద్ర పై జరిగిన ఎటాక్ విషయంలో తనకు చాలా అనుమానం ఉందంటాడు. శైలేంద్ర చావకుండా ఉండేలా ఎటాక్ చేశారని , అందుకే తనకు అనుమానంగా ఉందంటాడు. ఇక, అనుపమ.. రిషిని వెతకడానికి ఎలాంటి సహాయం కావాలన్నా తాను చేస్తాను అంటుంది.
Guppedantha Manasu
సీన్ కట్ చేస్తే, శైలేంద్ర. రౌడీలతో మాట్లాడుతూ ఉంటాడు. అది మళ్లీ, ధరణి కంటపడుతుంది.‘ యాక్టింగ్ ఏంటి సర్, మేము మిమ్మల్ని నిజంగా పొడిచాం కదా, పొడిచింది మీరే అయినా, కావాలని మీతో పొడిపించుకుంది నేనే కదా. దానినే యాక్టింగ్ అంటారు. కత్తి దింపారు కానీ, ప్రాణాలకు ఎలాంటి హానీ జరగలేదు. అంతా నేను చెప్పినట్లే చేశారు. చివరలో నేను చెప్పకుండానే ఆ డైలాగ్ ఎందుకు చెప్పారు రా’ అని శైలేంద్ర రౌడీలతో అంటూ ఉంటాడు. వాళ్లతో మాట్లాడుతున్నది మొత్తం ధరణి మొత్తం వినేస్తుంది. తర్వాత, వాళ్లకు శైలేంద్ర డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బు తీసుకున్న తర్వాత ఆ రౌడీలు అక్కడి నుంచి వెళ్లిపోతారు.
Guppedantha Manasu
అదంతా విని ధరణి గుండె పగిలిపోతుంది. అంటే, ఇన్ని రోజులు తనపై చూపించిన ప్రేమంతా నాటకమే అని అర్థమౌతుంది. అది తలుచుకొని మరింత బాధపడతుుంది. అదంతా నిజమని నమ్మినందుకు మరింత ఎక్కువ బాధపడుతుంది. చిన్నత్తయ్యని చంపింది నువ్వేనని, నువ్వు కుక్కలా చచ్చేదాకా నిన్ను వదలను. ఏది ఏమైనా సరే, ఈ విషయం చిన్న మామయ్య, వసుధారకు చెప్పి తీరతాను. అని అనుకుంటుంది.
Guppedantha Manasu
మరోవైపు మహేంద్ర, వసుధార ఇద్దరూ వాళ్ల ఇంట్లో బాధగా కూర్చుకుంటారు.‘ ఏ తప్పు చేయని తన కొడుకు కనిపించకుండా పోయాడని, తన భార్య చావుకు కారణమైన వాడు కళ్ల ముందే ఉన్నా, వాడిని ఏం చేయలేకపోతున్నాను’ అని మహేంద్ర అంటూ ఉండగా, ధరణి.. మామయ్య గారు అని పిలుచుకుంటూ లోపలికి పరిగెత్తుకుంటూ వస్తుంది. వెంటనే మోసం జరిగిపోయింది మామయ్య, చాలా అన్యాయం జరిగిపోయింది అని చెబుతుంది.
‘చిన్నత్తయ్యను చంపింది మా ఆయన శైలేంద్రనే. నాకు తెలుసు. ఇందాక ముకుల్ గారు వాయిస్ వినిపించారు కదా, అది ఆయనదే. కచ్చితంగా తెలుసు. దాంట్లో ఇంకొకరి వాయిస్ ఉంది కదా, ఆ షూటర్ ది. అతనికి డబ్బులు ఇవ్వడం నేను చూశాను. వారిద్దరి గొంతు సేమ్. రిషి మీద ఏదో ప్లాన్ చేశారు అనిపించి, అప్పుడు నేను వసుకి చెప్పాను. కానీ, ఆయన ఈ మధ్య మారిపోయాడనే అనుకున్నాను. కానీ ఆ దుర్మార్గుడు మారిపోలేదు. ఆయన పాపాత్ముడు. నన్ను ప్రేమగా చూసుకుంటానని, ఎవరికీ చెడు చేయనని, తనలోని రాక్షసుడు చనిపోయాడని ఏవేవో చెప్పాడు. అవన్నీ నిజమే అని పిచ్చిదానిలా నమ్మాను. కానీ, తను మారలేదు. తన నిజ స్వరూపాలు బయటపెట్టకుండా ఉండేందుకు మారినట్లు నటించాడని చాలా ఆలస్యంగా గుర్తించాను. ఆయన ఎంత నీచుడో ఎవరూ ఊహించలేదు. మామయ్య, ఆయన మీద జరిగిన ఎటాక్ విషయంలో మీకున్న అనుమానాలు నిజమే. కానీ, ఇంతకు ముందే నిజం ఏంటో తెలిసింది. జగతి అత్తయ్య కేసు విషయంలో తానే దోషి అని అందరూ నిరూపిస్తారని, దీని నుంచి బయటపడటానికి ఆయనే ఆ రౌడీలకు డబ్బులు ఇచ్చి మరీ పొడిపించుకున్నాడు. ఆ ఎటాక్ గురించి ఎవరికీ అనుమానం రాకుండా , నా కళ్లుముందే జరిగేలా ప్లాన్ చేసుకున్నాడు’ అని ధరణి అంటుంది.
ఇదంతా నీకు ఎవరు చెప్పారు అని మహేంద్ర అంటే, తానే స్వయంగా తన కళ్లతో చూశానని, ఇందాక రౌడీలకు డబ్బులు ఇవ్వడం చూశాను అని చెబుతుంది. ఆరోజు జగతి అత్తయ్య చనిపోవడానికి, ఈరోజు రిషి సర్ కనపడకపోవడానికి కారణం మా ఆయనే అంటుంది. సరిగ్గా అదే సమయానికి అనుపమ ఎంట్రీ ఇస్తుంది. నువ్వు చెప్పేది నిజమా అని అనుపమ అడిగితే, ఒట్టేసి మరీ, శైలేంద్రే అని చెబుతుంది. ఎండీ పదవి కోసమే, చాలా సార్లు రిషిని చంపాలని చూశాడని ధరణి అన్ని విషయాలను బయటపెట్టేస్తుంది. ఈ సీన్ తో సీరియల్ ఇంట్రస్టింగ్ మారింది. మరి, రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.