- Home
- Entertainment
- TV
- Guppedantha Manasu 11th December Episode:రాజ్ జీవితంలో మరో అమ్మాయి, రుద్రాణికి చుక్కలు చూపించిన కనకం..!
Guppedantha Manasu 11th December Episode:రాజ్ జీవితంలో మరో అమ్మాయి, రుద్రాణికి చుక్కలు చూపించిన కనకం..!
తాను నిజమైన ప్రేమను అర్థం చేసుకుంటానని చెబుతాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే,... అందరి ప్రేమలు అర్థం చేసుకుంటారు..కానీ, తన ప్రేమను మాత్రం అర్థం చేసుకోరు అని కావ్య తనలో తానే అనుకొని బుంగమూతి పెడుతుంది.

Brahmamudi
Guppedantha Manasu 11th December Episode: కావ్య కిచెన్ లో పని చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి కళ్యాణ్ వస్తాడు. ఏంటి కవి గారు అని కావ్య అడుగుతుంది. ఆ మొక్క నాటింది మీరే అని నాకు తెలుసు అని కావ్య థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను అంటాడు. దానికి కావ్య.. నువ్వు ఎప్పుడు చూశావ్ అని అడుగుతుంది. రాత్రి సమయంలో తానే మొక్కను మార్చుదాం అనుకున్నప్పుడు.. మీరు మార్చడం చూశాను అని కళ్యాణ్ చెబుతాడు. ఇంత మంచివిషయం మీరు నాకు ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు. ఇంట్లో వాళ్లకు తెలిస్తే ఒప్పుకోరు కదా అని అందుకే చెప్పలేదని కావ్య అంటుంది. అయితే, కళ్యాణ్.. తాను కూడా మొక్క మార్చాలని అనుకున్నానని, కానీ ధైర్యం సరిపోలేదంటాడు. కానీ, మీకు తప్పు చేశాను అని అనిపించడం లేదా అని అడుగుతాడు. దానికి కావ్య.. అనిపించింది కానీ , తప్పలేదు అని చెబుతుంది. తనకు దేవుడి మీద నమ్మకం ఉందని, సంప్రదాయాల మీద గౌరవం కూడా ఉందని, కానీ, జాతక దోషం చూపించి ప్రేమికులను దూరం చేయడం కరెక్ట్ కాదని అనిపించిందని అంటుంది. ప్రేమ ఉంటే, భార్యభర్తల బంధం నిలపడుతుంది, మీ ఇద్దరి మధ్య కూడా ప్రేమ ఉంటే.. అదే మీ బంధాన్ని నిలపెడుతుందని చెబుతుంది. ఆ మాటలకు కళ్యాణ్ సంతోషిస్తాడు. తర్వాత థ్యాంక్స్ చెప్పి వెళతాడు.
Brahmamudi
దూరం నుంచి అదంతా రాజ్ చూస్తాడు. ఏదో చెప్పాలని కావ్య ప్రయత్నిస్తుంది కానీ, రాజ్ వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ విషయం తెలిసి రాజ్ ఎంత గొడవ చేస్తాడో అని భయపడి గదిలోకి వెళ్తుంది. రాజ్ సీరియస్ గా ఉండటం చూసి, అందరినీ పిలిచి గొడవ చేస్తారేమో అనుకున్నాను అంటుంది. ఇద్దరూ మళ్లీ, ఈ విషయంలో చాలా సేపు కీచులాడుకుంటారు. అన్ని విషయాల్లో మీరు గొడవ చేస్తారని కావ్య అంటుంది. తాను తప్పు చేయకపోయినా, చాలాసార్లు గొడవ చేసేవారని, ఈసారి నిజంగానే తప్పు చేస్తే మీరు ఊరుకుంటారా అని అంటుంది. కానీ, నువ్వు చేసిన పని వల్ల తన తమ్ముడు సంతోషిస్తున్నాడని, అతని ప్రేమ గెలుస్తోందని అందుకే గొడవ చేయడం లేదని అంటాడు. తాను నిజమైన ప్రేమను అర్థం చేసుకుంటానని చెబుతాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే,... అందరి ప్రేమలు అర్థం చేసుకుంటారు..కానీ, తన ప్రేమను మాత్రం అర్థం చేసుకోరు అని కావ్య తనలో తానే అనుకొని బుంగమూతి పెడుతుంది.
Brahmamudi
మరోవైపు.. మొక్క మళ్లీ పచ్చగా ఎలా మారిందా అని ఆలోచిస్తూ, తల బాదుకుంటూ ఉంటుంది. మరోవైపు రుద్రాణి బెడ్ మీద కూర్చొని మందు తాగుతూ ఉంటుంది. కనకం లేచి ఉంటే, తన బుర్ర తింటుందని, పడుకోపెట్టాలి అనుకుంటుంది. అందుకే కనకం ని పిలిచి, బలవంతంగా మందు తాగిస్తుంది. కనకం కి పండ్ల రసం అని చెప్పి నమ్మించి తాగిస్తుంది. టెన్షన్లు అన్నీ దూరమైపోతాయని చెబుతుంది. నమ్మేసి, కనకం తాగేస్తుంది. గ్లాసుల మీద గ్లాసులు లాగించేస్తుంది. తాగిన తర్వాత కనకం కి బాగా మత్తు ఎక్కుతుంది. ఆ మత్తులో పిచ్చిపట్టినట్లుగా మారుతుంది. అంతే, రుద్రాణి గొంతు పట్టుకొని చంపేస్తా అంటూ రచ్చ చేయడం మొదలుపెడుతుంది. తన కూతుళ్లను ఏమైనా అంటే ఊరుకోను అంటూ వార్నింగ్ ఇస్తుంది. నీ వయసుకు స్లీవ్ లెస్ జాకెట్లు వేసుకుంటావ్ అంటూ, గది మొత్తం పరుగులు పెట్టిస్తుంది. రుద్రాణికి చుక్కలు చూపిస్తుంది. తట్టుకోలేక వెళ్లి.. రుద్రాణి బాత్రూమ్ లో కూర్చుంటుంది. అయినా కనకం వదలదు. డోర్ తీయమని తలుపులు బాదుతూ ఉంటుంది. తర్వాత కనకం ఆ మత్తులో వెళ్లి బెడ్ మీద పడుకుంటుంది. రుద్రాణి బయటకు రావాలని చూడగానే, మళ్లీ కనకం లేస్తూ ఉంటుంది. దాంతో, భయపడిపోయి రుద్రాణి.. బాత్రూమ్ లోనే కూర్చుంటుంది. కనకం హ్యాపీగా నిద్రపోతుంది.
Brahmamudi
మరోవైపు కావ్య రాత్రిపూట కృష్ణుడి దగ్గర దీపం పెట్టి, ఆ దేవుడితో మాట్లాడుతూ ఉంటుంది.ఆ మొక్క మార్చి తాను తప్పు చేయలేదను అనే అభిప్రాయాన్ని దేవుడితో పంచుకుంటుంది. మంచి కోసమే, ప్రేమను గెలిపించడానికి మాత్రమే తాను అలా చేశానని చెబుతుంది.తనకు దక్కని ప్రేమను, వాళ్లకు దక్కేలా చేయమని చెబుతుంది. ఇక, తన కాపురంలో చిచ్చపెట్టొద్దు అని దేవుడికి దండం పెట్టుకుంటుంది.
తర్వాత, సీరియల్ లో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది.పేరు శ్వేత. రాజ్ కి ఫోన్ చేస్తుంది. ఈ సమయంలో ఎందుకు ఫోన్ చేశావ్ అని రాజ్ అడుగుతాడు. రాజ్ ఆమెతో మాట్లాడే మాటలు చూస్తుంటే, వారిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందని అనుమానం వచ్చేలా ఉండటం విశేషం. ఇంతలో కావ్య రాగానే, ఏమీ తెలియనట్లు మాట మార్చి కావ్యకు వినపడకుండా మాట్లాడేస్తాడు. ఆమె మాత్రం రాజ్ ని కలవాలి అంటుంది. కావ్యకు వినపడకుండా రాజ్ సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.
Brahmamudi
ఇక, రాజ్ ఎవరితో మాట్లాడుతున్నారు అనే విషయం తెలియని కావ్య, ఆఫీస్ కాల్ అంత సీక్రెట్ గా ఎందుకు మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్న రాజ్... టాపిక్ డైవర్ట్ చేస్తాడు. తెల్లారిన తర్వాత కళ్యాణ్.. అనామిక తో మాట్లాడుతూ ఉంటాడు. కళ్యాణ్ ఎవరితో మాట్లాడుతున్నాడా అని... కనకం వింటూ ఉంటుంది. తర్వాత అనామిక వాళ్లు వస్తున్నారని చెప్పి కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అంతలో కనకం. పెళ్లి ఆపడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తూఉంటుంది. కమింగ్ అప్ లో మరో కీడు జరుగుతుంది. దానికి మళ్లీ కావ్యను బలి చేయాలని చూస్తారు.