- Home
- Entertainment
- TV
- Guppedantha Manasu 11th December Episode:సాక్ష్యాలు చూపిస్తూ, రిషి మీదకు నేరం నెట్టేసిన శైలేంద్ర...!
Guppedantha Manasu 11th December Episode:సాక్ష్యాలు చూపిస్తూ, రిషి మీదకు నేరం నెట్టేసిన శైలేంద్ర...!
జగతిని చంపినట్లు తన దగ్గర సాక్ష్యం ఉందని, కావాలంటే నిన్ను తప్పిస్తానని, అలా తప్పిస్తే.. రూ.50లక్షలు నాకు ఇవ్వాలని, మీరు డబ్బులు ఇస్తే, నిర్దోషిగా నిరూపిస్తానని, డబ్బులు రెడీ చేసి ఉంచుకో అని ముకుల్ చెప్పినట్లుగా వినిపిస్తాడు

Guppedantha Manasu
Guppedantha Manasu 11th December Episode:ఓ వైపు రిషి కనిపించకుండా పోయాడు. మరోవైపు ఆస్పత్రి నుంచి కోలుకొని ఇంటికి వచ్చిన శైలేంద్రను ముకుల్ ఇంటిరాగేట్ చేస్తున్నాడు. ఈ ఇంటిరాగేషన్ లో భాగంగా ముకుల్ అడిగే ప్రశ్నలకు శైలేంద్ర, దేవయాణిలకు చెమటలు పట్టేస్తాయి. గతంలో రిషిపై నిందలు వేసిన వారు కూడా ముకుల్ స్నేహితులు అనే విషయం బయటపడుతుంది. ఇక, నేటి ఎపిసోడ్ లో అదే కంటిన్యూ అవుతుంది. ఆ వాయిస్ మీదా కాదా అని ముకుల్ శైలేంద్ర ను గట్టిగా అడుగుతాడు. ముకుల్ ప్రశ్నకు ఆ వాయిస్ తనదేనని శైలేంద్ర అంగీకరిస్తాడు. దీంతో, ఫణీంద్ర వెంటనే వెళ్లి... శైలేంద్రను పిచ్చి కొట్టుడు కొడతాడు. ఎవరు ఆపినా వినకుండా , దుర్మార్గుడా, తల్లిలాంటి జగతిని ఎలా పొట్టనపెట్టుకున్నావ్ రా అంటూ తిడతాడు. ముకుల్ ఫణీంద్రను కంట్రోల్ చేస్తాడు.
Guppedantha Manasu
నేరం అంగీకరించినందుకు స్టేషన్ కి వస్తారా? తీసుకువెళ్లమంటారా అని శైలేంద్ర అడుగుతాడు. దానికి శైలేంద్ర.. వస్తాను అని చెప్పి, ఒక్క నిమిషం ఆగమని చెబుతాడు. అంటే, అప్పటికే.. దీని నుంచి తప్పించుకోవడానికి ప్లాన్ వేశాడనే విషయం అర్థమైపోతుంది. తన ఫోన్ తెమ్మని వాళ్ల అమ్మకు చెబుతాడు. డిశ్చార్జ్ అయ్యే ముందు తనకు ఓ ఫోన్ వచ్చిందని.. తన ఫోన్ లో కాల్ రికార్డర్ ఉందని, అది వినమని చెబుతాడు.
అందులో ముకుల్ వాయిస్ వినపడుతుంది. జగతిని చంపినట్లు తన దగ్గర సాక్ష్యం ఉందని, కావాలంటే నిన్ను తప్పిస్తానని, అలా తప్పిస్తే.. రూ.50లక్షలు నాకు ఇవ్వాలని, మీరు డబ్బులు ఇస్తే, నిర్దోషిగా నిరూపిస్తానని, డబ్బులు రెడీ చేసి ఉంచుకో అని ముకుల్ చెప్పినట్లుగా వినిపిస్తాడు. అది ముకుల్ తో పాటు, ఇంట్లో అందరూ షాకౌతారు. తర్వాత, ముకుల్ ఆ వాయిస్ నాది కాదు అని చెబుతాడు. అది తన వాయిస్ కాదని, ఎవరో క్రియేట్ చేశారని, అదంతా ఫ్రాడ్ అని, తన సర్వీస్ లో ఇప్పటి వరకు ఎవరి దగ్గరా లంచం తీసుకోలేదని, తీసుకోనని చెబుతాడు. అయితే, శైలేంద్ర.. మీరు ఇందాక వినిపించింది నా వాయిస్ అయితే, ఇప్పుడు నేను వినిపించింది మీ వాయిస్ అవుతుంది అని అంటాడు. దానికి ముకుల్.. తాను అసలు మీకు ఫోన్ చేయలేదు కదా అంటే, మరి, నేను కూడా షూటర్ కి ఫోన్ చేయలేదు అని శైలేంద్ర ప్రశ్నిస్తాడు.
Guppedantha Manasu
‘ ఆ షూటర్ ఎవరో నాకు తెలీదు, వాడి నెంబర్ నా దగ్గర లేదు. మరి వాడికి నేనెలా ఫోన్ చేస్తాడు. డీప్ ఫేక్ యాప్ ద్వారా మనిషిని లేనిచోట ఉన్నట్లు క్రియేట్ చేస్తున్నారు సర్, అలాంటిది ఒక వాయిస్ క్రియేట్ చేయడం ఒక లెక్కా చెప్పండి. మీరు అంత పెద్ద ఆఫీసర్, ఎన్నో కేసులు సాల్వ్ చేసి ఉంటారు. ఇప్పుడున్న టెక్నాలజీ తో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో మంచి పనులు ఎన్ని చేయవచ్చో, చెడు పనులు కూడా చేయవచ్చు. ఈ విషయం మీకు నేను చెప్పక్కర్లేదు. ఏదో ఒక వాయిస్ పట్టుకొని వచ్చి, పేషెంట్ అని చూడకుండా ప్రశ్నలు అడుగుతున్నారు. మా పిన్ని హత్య కేసులో నన్ను దోషిని చేయాలని చూస్తున్నారు. నేను ఎంత బాధపడతాను సర్.’ అని శైలేంద్ర అంటాడు.
అయితే, వ్యక్తిగత పగతో అడగలేదని, ఇన్వెస్టిగేషన్ లో భాగంగానే కదా అడిగారు అని అనుపమ అంటుుంది. అయితే, శైలేంద్ర తన యాక్టింగ్ షురూ చేస్తాడు. అలా అడగడం వల్ల, తన తండ్రే తనను అనుమానించాడని, తాను తల్లిలా భావించే తన పిన్ని చావుకు కారణమని, తన మీద చెయ్యి చేసుకున్నారని, తన గుండె ముక్కలు అయ్యిందని ఓవర్ యాక్షన్ చేస్తాడు. ఆ తర్వాత తన తల్లిని పిలిచి, తన కొడుకు అలాంటివాడు కాదు అని నువ్వు చెప్పాలి కదా మమ్మీ అంటాడు. దేవయాణి వెంటనే తాను చెప్పానని.. ఎవరూ వినిపించుకోలేదు అని చెబుతుంది.
Guppedantha Manasu
ఇక, శైలేంద్ర తన ఫర్ఫార్మెన్స్ ఆపడు.‘ మా పిన్ని కేసులో నన్ను నిందితుడిని చేసినప్పుడే, మీరంతా నమ్మినప్పుడు నన్ను అందరూ చంపేశారు. అసలు ఆ ఫోన్ నెంబర్, సిమ్ ఎవరి పేరు మీద ఉన్నాయో మీరు కనుక్కున్నారా? చెప్పండి సర్.. ఆ సిమ్ నా పేరుమీద ఉందా? అది కదా మీరు కనుక్కోవాల్సింది. మీరు నమ్మడానికి, వినడానికి కూడా ఇష్టపడరు. కానీ, మీకు ఓ వాయిస్ వినిపిస్తాను. మీరు నమ్మడానికి కూడా ఇష్టపడరు. కవాలంటే వినండి.’ అంటూ రిషి మాట్లాడినట్లుగా ఉన్న ఓ వాయిస్ వినిపిస్తాడు. ‘ అన్నయ్య, ఇక నీ చాప్టర్ క్లోజ్, నీ విషయంలో ఇఫ్పటికే చాలా ఆలస్యం చేశాను, వసుధారను ఎండీగా కూర్చోపెట్టినప్పుడు అమ్మ అడ్డుగా అనిపించింది, అందుకే అమ్మను అడ్డు తొలగించి వసుధార ఎండీ సీటులో కూర్చోపెట్టాను. కానీ, ఫ్యూచర్ లో నీనుంచి కూడా సమస్య రాకుండా ఉండాలి అంటే, నీ మీద కూడా ఎటాక్ చేయించాను. త్వరలోనే నిన్ను కూడా ఫినిష్ చేస్తాను’ అంటూ రిషి మాట్లాడినట్లుగా ఓ వాయిస్ వినిపిస్తాడు. అది విని వసు, మహేంద్రకు ఫ్యూజులు ఎగిరిపోతాయి.
వెంటనే మహేంద్ర రియాక్ట్ అవుతాడు.. ‘ రేయ్ శైలేంద్ర తప్పు చేస్తున్నావ్, అది రిషి వాయిస్ కాదు, రిషి అలాంటివాడు కాదు’ అని అరుస్తాడు. దానికి శైలేంద్ర.. ‘నాకు తెలుసు బాబాయ్.. రిషి అలాంటివాడు కాదని , నా తమ్ముడి క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు కదా, ఎప్పుడైతే పిన్ని అడ్డు తప్పించా అన్నాడో నేను నమ్మలేదు. ఎవరో కావాలనే మన ఫ్యామిలీపై పగతో చేస్తున్నారని అర్థమైంది. కానీ, మీరంతా నా వాయిస్ విని నమ్మడం మొదలుపెట్టారు. సొంత కొడుకైతే ఓ లెక్క, అన్న కొడుకు అయితే ఒక లెక్క చెప్పు బాబాయ్ ? నేను మిమ్మల్ని ఎప్పుడూ మా డాడ్ తర్వాత డాడ్ లాగా చూశాను, కానీ మీరు మాత్రం పరాయివాడిలా శత్రువులా చూశారు. నాకు అర్థమౌతోంది (నొప్పితో బాధపడుతున్నట్లు ఓవర్ యాక్షన్ చేస్తాడు)’ అని శైలేంద్ర అంటాడు.
Guppedantha Manasu
Gupమధ్యలో దేవయాణి వచ్చి, నీకు కుట్లు మానలేదు, తెగితే నొప్పి పెడతాయి అని కొడుకుతో పాటు ఓవర్ యాక్షన్ చేయడం మొదలుపెడుతుంది. ఇక శైలేంద్ర.. తనను చేయని తప్పుకు దోషులుగా చేస్తున్నారని, అది కూడా అయినవాళ్లే చేస్తున్నారని అంటాడు. అదంతా చూసి అనుుపమ.. అసలు ఏది నమ్మాలో.. ఏది నమ్మకూడదో అర్థం కావడం లేదని అనుకుంటూ ఉంటుంది. ఈలోగా శైలేంద్ర.. ముందు రిషిని కనిపెట్టమని ముకుల్ కి చెబుతాడు. తన తమ్ముడు దూరమైతే తాను భరించలేనని, అసలు బతికున్నాడో లేదో అంటాడు.
Guppedantha Manasu
ఆ మాటకు వసుధార కు బాగా కాలుతుంది. ఆపుతారా అని అరుస్తుంది. ‘అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? బుద్దుండే మాట్లాడుతున్నారా? తనకు ఏదైనా అయితే నేను ఎవరినీ వదలను’ అని వసు అంటుంది. దానికి శైలేంద్ర.. ‘నేను ఏమన్నాను వసుధార, నాకు వార్నింగ్ ఇచ్చిన రౌడీలు మన ఫ్యామిలీలో ఎవరినీ వదలను అన్నారు. అందుకే అంటున్నాను , ఏం ధరణి.. ఆ రోజు రౌడీలు అదే కదా వార్నింగ్ ఇచ్చారు.’ అని ధరణిని అడిగితే.. ధరణి కూడా అవును అని చెబుతుంది.
Guppedantha Manasu
ఇక శైలేంద్ర.. ‘ అదండీ ముకుల్ గారు, తమ ఫ్యామిలీపై ఎవరో పగపట్టారు. మా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. అవును వసుధారా.. రిషి ఏ పని అయినా నీకు చెప్పే చేస్తాడు.ఎక్కడికి వెళ్లినా నీకు చెప్పే వెళతాడు కదా? ఇప్పుడెందుకు చెప్పలేదు. తను ఏం చేసినా నీకు తెలుస్తుంది. ఎప్పుడూ నీడలా ఉండే నవ్వు రిషిని ఎందుకు వదిలిపెట్టావ..?’ అని అడుగుతాడు.
అంటే ఏంటి మీ ఉద్దేశం అని వసుధార అంటే... ఆ కోణంలో ఆలోచించి, అన్నీ కనిపెట్టమని సర్ కి చెబుతున్నా అంటాడు. అయితే, తన వాయిస్ అలా వినిపించడంతో ముకుల్ కి ఈగో బాగా హర్ట్ అవుతుంది. కచ్చితంగా నేరస్తులను పట్టుకుంటానని, ఈ కేసును ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారో తనకు అర్థమౌతోందని, అలాగే, మీకు ఆ ఫోన్ కాల్స్ ఎలా వచ్చాయో కూడా వదిలిపెట్టను అంటాడు. తర్వాత తల్లీకొడుకులు ఓవర్ యాక్షన్ చేస్తారు. తర్వాత ముకుల్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
Guppedantha Manasu
శైలేంద్ర.. ఇంత మాయ చేస్తాడని అనుకోలేదని మహేంద్ర.. వసుతో అంటాడు. చాలా తెలివిగా, క్రిమినల్ బ్రెయిన్ తో, పక్కా ప్లాన్ తో తనను తాను కాపాడుకున్నాడు అని వసు అంటుంది. శైలేంద్ర ఇలా మాయ చేస్తే, జగతి మేడమ్ హత్య కేసులో అతనే నేరస్తుడు అని ఎలా నిరూపించగలం అని బాధపడుతుంది. ఈలోగా, రిషి ఎక్కడికి వెళ్లాడు అని ఆలోచిస్తూ ఉంటారు. రిషికి ఏమైనా అయ్యిందేమో అని వసు బాధపడుతుంటే, మహేంద్ర ధైర్యం చెబుతాడు.
అయితే, మహేంద్ర.. శైలేంద్రపై ఓ అనుమానం వ్యక్తం చేస్తాడు. తన వాయిస్ ముకుల్ కి దొరికిపోయిందని తెలిసి, తనపై తానే ఎటాక్ చేయించుకున్నాడని అనిపిస్తోందంటాడు. తర్వాత.. ఈ కేసులో శైలేంద్రే నిందితుడు అనేది రిషి మాత్రమే కనిపెట్టగగలడని, కచ్చితంగా శిక్ష వేయిస్తాడని అనుకుంటారు. ఈలోగా, రిషిని కినిపెట్టాలని అనుకుంటారు.
ఇక, శైలేంద్ర కేసు నుంచి ఈజీగా తప్పించుకోవడంతో దేవయాణి సంబరపడిపోతూ ఉంటుంది. కొడుకు తెలివి చూసి మురిసిపోతుంది. అసలు.. ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయి నాన్న అని అడుగుతుంది. ఇలాంటి వాటి మీద ఏదైనా యూనివర్శిటీలో కోర్సు చేశావా అంటే.. అవునుమ్మా అని చెబుతాడు. దేవయాణి తన గురువు అని, నీ నుంచే నేర్చుకున్నాను అంటాడు. ఇక, తల్లీకొడుకులు ఇద్దరూ.. ఒకరి కుట్రను మరొకరు ప్రశంసించుకుంటారు. ఆనందంతో దేవయాణి ముఖం వెలిగిపోతుంది. ఇక, వీళ్లిద్దరూ మాట్లాడుకుంటుంటే, ధరణి వచ్చి డోర్ కొడుతుంది. ధరణితో ఏదైనా ప్లాబ్లం వస్తుందా అని దేవయాణి అనుకుంటే, ఏమీ జరగదు అని, ప్రేమగా నాలుగు మాటలు విసిరితే, అదే పడి ఉంటుందని శైలేంద్ర అంటాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.