బిగ్ బాస్ ఎంత ప్రమాదమో చూడండి... అడిక్ట్ అయిన నాలుగేళ్ళ బాలిక వింత ప్రవర్తన!
బిగ్ బాస్ షో సమాజం మీద దుష్ప్రభావం చూపుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తుండగా... ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. నాలుగేళ్ళ బాలిక షోకి అడిక్ట్ కావడం విస్మయానికి గురి చేస్తుంది.

Bigg Boss Telugu 7
బుల్లితెర కంటెంట్ విషయంలో ప్రభుత్వాలు కఠినంగా ఉండాలి. ఇంటిల్లపాది చూస్తే కార్యక్రమాలు మంచి చేయకపోయినా చెడు చేయకూడదు. బిగ్ బాస్ ప్రమాదకరమైన షో అని విమర్శలు ఉన్నాయి. ఇది సమాజానికి చెడు చేస్తుంది. విష సంస్కృతిని పెంపొందిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆందోళనలకు నిలువెత్తు రూపం తాజా ఘటన.
Bigg Boss Telugu 7
నాలుగేళ్ళ బాలిక మనసుపై బిగ్ బాస్ షో ముద్ర వేసింది. షోలో గేమ్స్, ఎవరు ఎలాంటి వారు అనే ఒక అభిప్రాయానికి వచ్చింది. అంత పసిప్రాయంలో మనుషులను జడ్జి చేసే స్థితికి ఆ బాలిక చేరుకుంది. బిగ్ బాస్ హౌస్లో ఆడే గేమ్స్ గురించి చెబుతుంది. తనకు పల్లవి ప్రశాంత్, రతిక అంటే ఇష్టం అంటుంది.
శ్రేయాంచిక అనే నాలుగేళ్ల పాప పేరెంట్స్ తో పాటు బిగ్ బాస్ షో చూసేది. మెల్లగా ఆ షోకి ఆ బాలిక అడిక్ట్ అయ్యింది. పల్లవి ప్రశాంత్ పై ప్రేమ పెంచుకుంది. పేరెంట్స్ చెప్పడం వలన కానీ, తన ఆలోచన కానీ... పల్లవి ప్రశాంత్ మంచోడు అని ఫిక్స్ అయ్యింది. అతడి హావ భావాలు అనుకరించడం ప్రారంభించింది.
అరెస్ట్ అయిన పల్లవి ప్రశాంత్ శనివారం విడుదల అవుతున్నాడని తెలిసి జైలు వద్దకు వచ్చింది. పల్లవి ప్రశాంత్ పై దిగులుతో పాపకు జ్వరం కూడా వచ్చిందట. వాళ్ళ అమ్మమ్మ, అమ్మతో పాటు పల్లవి ప్రశాంత్ ని చూడాలని, కలవాలని చంచల్ గూడ జైలు వద్ద గంటల తరబడి ఎదురు చూసింది.
పల్లవి ప్రశాంత్ ని చూడకుండా ఆ పాప నిద్రపోయేది కాదట. మారాం చేయడంతో ఏకంగా పాపను తీసుకుని హైదరాబాద్ వచ్చారు. పల్లవి ప్రశాంత్ మామకు ఇచ్చేందుకు చాక్లెట్స్ తెచ్చాను. కలిస్తే ఐ లవ్ యూ మామ అని చెబుతానని, ఆ పాప ఎలాంటి బెరుకు లేకుండా చెబుతుంది.
ఇది ఆందోళన కలిగించే పరిణామం. ఒక పసి హృదయం పై బిగ్ బాస్ షో కంటెంట్ ముద్రవేయడం ప్రమాదానికి సంకేతం. బిగ్ బాస్ హౌస్ విషపూరిత వాతావరణంతో నిండి ఉంటుంది. నామినేట్ చేయడానికి కంటెస్టెంట్స్ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేయాలి. ఆ క్రమంలో వాళ్ళ మధ్య వాదులాటలు. విద్వేషం, కోపం తారాస్థాయిలో కనిపిస్తాయి.
బిగ్ బాస్ టాస్క్స్ కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు పెట్టేవిగా ఉంటాయి. ఇక వయసులో ఉన్న యువతులు, యువకులు కలిసి పడుకోవడం, ముద్దులు, హగ్గులు వెరీ కామన్. పెళ్ళికి ముందు ఒక అబ్బాయి, అమ్మాయి రాసుకుపూసుకు తిరగడం తప్పుకాదు అన్నట్లు వారి ప్రవర్తన ఉంటుంది.
పసి వయసులో ఈ హానికర అంశాలు నేరుగా వాళ్ళ మెదళ్లలో తిష్ట వేస్తాయి. పెద్దయ్యాక వాళ్ళ ప్రవర్తన వైల్డ్ గా ఉండే ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఓవర్ అగ్రెసివ్, ఓవర్ ఎమోషనల్ గా ఉంటారు. కంటెంట్ ఇవ్వకపోతే పంపేస్తారని.. ఫేక్ గా ప్రవర్తిస్తారు.
Bigg Boss Telugu 7
నాలుగేళ్ళ బాలిక బిగ్ బాస్ షో గురించి క్షుణ్ణంగా చెబుతుంది. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే... ఆ పాప పేరేంట్స్ దాన్ని ఒక అఛీవ్మెంట్ గా చూస్తున్నారు. ఆ పాప భవిష్యత్ కి అది మంచిది కాదని గ్రహించలేకపోతున్నారు.
Bigg Boss Telugu 7
అన్నీ తెలిసిన యువకులైన బిగ్ బాస్ ఆడియన్స్... ఫ్యాన్స్ అంటూ ఉన్మాదుల్లా ప్రవర్తించారు. ఇక పిల్లల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. స్కూల్ లో తోటి పిల్లలపై దాడులు చేసే ప్రమాదం లేకపోలేదు. ఇకనైనా బిగ్ బాస్ షో పై చర్యలు తీసుకోకపోతే పర్యవసానాలు మన ఊహకు అందవు.