బాలయ్యకు సూపర్ హిట్ ఇచ్చిన హీరోయిన్ కూతురుతో మోక్షజ్ఞ రొమాన్స్, ఎవరూ ఉహించని కాంబినేషన్
మోక్షజ్ఞకు జంటగా యంగ్ బ్యూటీని సెట్ చేశాడట దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఒకప్పటి స్టార్ హీరోయిన్ కూతురితో మోక్షజ్ఞ రొమాన్స్ చేయనున్నాడట.
బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ త్వరలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో డెబ్యూ మూవీ చేస్తున్నాడు. మోక్షజ్ఞ వయసు 30 ఏళ్ళు. ఆయన ఇప్పటికే పరిశ్రమకు వచ్చి కనీసం ఐదారేళ్ళు కావాల్సింది.
మోక్షజ్ఞకు ఇష్టం లేకపోయినా... బాలకృష్ణ బలవంతం చేశాడనే వాదన ఉంది. మోక్షజ్ఞ మనసు మారాలని ఆయన యజ్ఞ యాగాదులు కూడా చేశాడట. ఎట్టకేలకు ఓ ఏడాది క్రితం మోక్షజ్ఞ ఓకే చెప్పారట. అప్పటి నుండి షేప్ అవుట్ బాడీని ఫిట్ బాడీగా మార్చాడు. ఇటీవల ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మోక్షజ్ఞ లుక్ కి మిశ్రమ స్పందన దక్కింది.
దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశాడట. విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు హైలెట్ కానున్నాయట. బడ్జెట్ కూడా భారీగా పెట్టనున్నారట. ఇటీవల నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. బాలకృష్ణ వారసుడైన మోక్షజ్ఞ హీరోగా సక్సెస్ అవుతాడు. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని ఆయన అన్నారు.
ఇక మోక్షజ్ఞకు జంటగా ఎవరు నటిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. హీరోయిన్ శ్రీలీల పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. శ్రీలీలకు బాలయ్యతో మంచి అనుబంధం ఉంది. భగవంత్ కేసరి చిత్రంలో శ్రీలీల కీలక రోల్ చేసిన సంగతి తెలిసిందే. భగవంత్ కేసరి సెట్స్ లో శ్రీలీలను మోక్షజ్ఞ కలిశాడు. అప్పుడు వీరి ఫోటోలు వైరల్ అయ్యాయి.
శ్రీలీల-మోక్షజ్ఞ జంట బాగుంటుందని ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు. ఈ కాంబినేషన్ పట్ల ఆడియన్స్ లో కొంత క్రేజ్ ఉంది. అయితే శ్రీలీల కాదంటూ మరో యంగ్ బ్యూటీ పేరు తెరపైకి వచ్చింది. సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రషా తడానీ ని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంపిక చేశాడంటూ కథనాలు వెలువడుతున్నాయి.
ఇటీవల రషా తడానీ ఆడిషన్స్ లో పాల్గొన్నారట. సంతృప్తి చెందిన ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞకు జంటగా ఎంపిక చేశాడంటూ వార్తలు వెలువడుతున్నాయి. కాగా రషా తడానీ చాలా అందంగా ఉంటుంది. ఆమెకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఒక మిలియన్ కి పైగా ఆమెను ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు.
కాగా రవీనా టాండన్ తో బాలకృష్ణ ఒక చిత్రంలో నటించడం విశేషం. వీరి కాంబోలో 1993లో విడుదలైన బంగారు బుల్లోడు సూపర్ హిట్ కొట్టింది. రవి రాజాపినిశెట్టి దర్శకత్వం వహించాడు. రమ్యకృష్ణ మరో హీరోయిన్ గా నటించింది. బంగారు బుల్లోడు మంచి విజయం సాధించినప్పటికీ మరలా బాలకృష్ణ-రవీనా టాండన్ కలిసి నటించలేదు. రవీనా టాండన్ ఎక్కువగా హిందీ చిత్రాలు చేయడం కూడా దీనికి కారణం.
బాలయ్య ఈ ప్రాజెక్ట్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. మంచి ఆరంభం ఇవ్వడం ద్వారా గట్టి పునాది వేయాలని ఫిక్స్ అయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మోక్షజ్ఞను ట్రోల్ చేస్తున్నారు. చాలా కాలంగా బాలకృష్ణ-ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఉంది. ఇటీవల జరిగిన పరిణామాలతో ఈ గొడవలు తారా స్థాయికి చేరాయి.
నందమూరి ఫ్యాన్స్ రెండు వర్గాలుగా చీలిపోయారు. ఈ క్రమంలో మోక్షజ్ఞకు ఇది ఛాలెంజింగ్ గా మారింది. ఎన్టీఆర్ నటనలో, డాన్స్ లో ఎక్కడో ఉన్నాడు. మరి మోక్షజ్ఞ ఎన్టీఆర్ కి ఏ మేరకు పోటీ ఇవ్వగలడనే వాదన మొదలైంది. ఎన్టీఆర్ ని ఢీ కొట్టడం అంత సులభం కాదు. దేవర విజయంతో ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో అని రుజువు చేసుకున్నాడు. దేవర హిందీ వెర్షన్ రూ. 60 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.