- Home
- Entertainment
- TV
- Brahmamudi Serial Today:అరుణ్ అడ్రస్ కనిపెట్టేసిన కావ్య, దుగ్గిరాల ఇంట్లో అడుగుపెట్టిన కనకం కి గుండె పగిలే వా
Brahmamudi Serial Today:అరుణ్ అడ్రస్ కనిపెట్టేసిన కావ్య, దుగ్గిరాల ఇంట్లో అడుగుపెట్టిన కనకం కి గుండె పగిలే వా
స్వప్నను రుద్రాణి కనీసం మనిషిలా కూడా చూడటం లేదని బాధపడుతుంది. స్వప్న తింగరి తనాన్ని తలుచుకొని బాధపడుతుంది. అదంతా విన్న కావ్య.. నెల రోజులు ఎదురుచూస్తూ కూర్చుంటే కుదరదని, ఎలాగైనా తప్పు లేదని నిరూపించాలని అనుకుంటుంది.

Brahmamudi
Brahmamudi Serial Today: తన అక్క తప్పు చేయలేదని, కనీసం డీఎన్ఏ టెస్టు కూడా చేయించవద్దని కావ్య అనుకుంటూ ఉంటుంది. లోగా, రాజ్ ని రాహుల్ నెమ్మదిగా తన ట్రాప్ లో పడిపోతున్నాడు. అలా రాజ్ కూడా రాహుల్ ట్రాప్ లో పడిపోతే తన అక్కని కాపాడటం కష్టమని కావ్య అనుకుంటుంది. అందుకే, రాజ్ ని మళ్లీ లైన్ లో తీసుకువచ్చే పని చేస్తుంది. తన అక్క అసలు ఏ పరిస్తితిలో ఉంది అనే విషయాన్ని జస్ట్ ఒక సింపుల్ సిట్యువేషన్ క్రియేట్ చేసి అర్థమయ్యేలా చేసింది. దాని కోసం.. బెడ్రూమ్ లోకి రాగానే, రాజ్ పై సీరియస్ అవుతుంది. తనను మోసం చేసి, ఆఫీసులో శ్రుతి అనే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నావని నిలదీస్తుంది. ఆ మాటకు రాజ్ షాకైపోతాడు. తను కేవలం ఎంప్లాయ్ అని, తాను బాస్ అని చెబుతాడు. అయితే, కావ్య మాత్రం తన దగ్గర సాక్ష్యం ఉందని, ఓ ఫోటో చూపిస్తుంది. ఆ ఫోటోలో రాజ్, శ్రుతి కలిసి దిగిన ఓ ఫోటో ఉంటుంది. అదిచూసిన రాజ్..ఒక్క ఫోటో చూసి ఎలా ఆరోపణలు చేస్తావ్ అంటాడు. కావ్య మాత్రం, మీ ఇద్దరి మధ్య ఏమీ లేదని తనకు సాక్ష్యం కావాల్సిందే అంటుంది. అసలు ఏముందని సాక్ష్యం చూపించడానికి అని రాజ్ అన్నప్పుడు, స్వప్న టాపిక్ తీసుకువస్తుంది కావ్య. మరి, తన అక్క ఎలా సాక్ష్యం చూపిస్తుంది అని అడుగుతుంది.
Brahmamudi
‘మీరంతా కలిసి మా అక్క మీద వేసి నింద ఏంటి? ఆఖరికి దాని కడుపులో పుట్టబోయే బిడ్డ మీద కూడా కళంకం వేశారు కదా ? ఇదేం న్యాయం? ఇదెక్కడి ధర్మం? మీరు శ్రుతితో ఉన్నట్లు చనువుగా మా అక్క వాళ్ల ఫ్రెండ్ తో ఉంటే, మీరు దాని మీద నింద వేశారు కదా? ఇప్పుడు కూడా మీరు కింద రాహుల్ నే సమర్థిస్తూ మాట్లాడి వస్తున్నారు. ఇంత పక్షపాతం ఎందుకు? నేను, శ్రుతి గురించి మీ గురించి తప్పుగా మాట్లాడితే ఎంత కోపం వచ్చిందో? మీరు మా అక్క గురించి, వాళ్ల ఫ్రెండ్ గురించి తప్పుగా మాట్లాడితే దానికి కూడా అంత కోపం రాదా? మరి మీరు ఎందుకు రాహుల్ కి సపోర్ట్ చేస్తున్నారు? రాహుల్ మీ ఇంటి వాడు కాబట్టి, మా అక్క మీ ఇంటి ఆడపిల్ల కాదు కాబట్టి. అంతేనా? ఇక నుంచి అయినా ఒకరిమీద నింద వేసే ముందు నిజానిజాలు తెలుసుకోని వేయండి’ అని చెప్పి, బెడ్ మీద కావ్య పడుకుంటుంది. రాజ్ కావ్య మాటలకు కాస్త ఆలోచనలో పడతాడు. వెళ్లి తను కూడా బెడ్ మీద పడుకుంటాడు. ఆ సమయంలో రాజ్ కి డౌట్ వస్తుంది. కావ్య వైపు తిరిగి ‘ మరి నగలు తాకట్టుపెట్టి, డబ్బులు ఎందుకు ఇచ్చింది?’ అంటాడు. దానికి కావ్య ఇరిటేట్ అవుతుంది. ‘ రామాయణం అంతా విన్నాక సీతకు రాముడు ఏమౌతాడు అని అడిగినట్లుంది. మా అక్క కోటీశ్వరుల ఇంటికి కోడలు అయ్యిందని తెలిసి, ఇదిగో ఇలాంటి ఫోటోలు చూపించి, మీలాంటి వాళ్లు నమ్ముతారు అని తెలిసి బ్లాక్ మెయిల్ చేస్తే, ఈ తింగరి ముఖంది, డబ్బంతా తీసుకువెళ్లి వాడి బొంద మీద కొట్టింది చాలా’ అని ఆన్సర్ ఇస్తుంది. అది విన్న తర్వాత రాజ్ పక్కకు తిరిగి పడుకుంటాడు. ఆ తర్వాత మళ్లీ రాజ్ కి ఇంకో డౌట్ వస్తుంది.
Brahmamudi
‘ ఈ ఫోటో చూపించి నువ్వు నన్ను అడిగినట్లు శ్రుతిని కూడా అడిగావా?’ అని రాజ్ అంటాడు. దీంతో కావ్య సీరియస్ అవుతుంది. ‘నాకు బుద్ది లేదా? బుర్రలో గుజ్జు లేదా? కామన్ సెన్స్ లేదని అనుకుంటన్నారా’ అని అంటుంది. ఆ మాటలకు రాజ్ బెదిరిపోతాడు. ఇవన్నీ నాకు లేవని అంటోందా లేక, ఆ రాహుల్ కి లేవు అంటోందా? అని అయోమయంలో పడతాడు. మళ్లీ ఇంకో డౌట్ వస్తుంది. ‘ ఇదిగో నువ్వు మళ్లీ అరవనంటే, లాస్ట్ డౌట్. నాకు, శ్రుతికి ఏదో ఉందని నువ్వు నమ్మినట్లా? నమ్మనట్లా?’ అని అడుగుతాడు. దానికి కావ్య ‘మీకంత సీన్ లేదని నాకు తెలుసులేండి’ అంటుంది. ఏంటే కూశావ్ అని రాజ్ అడిగితే ‘అదే మీకు సీన్ ఉంది కానీ, ఆ సీన్ లో నేను లేను కదా అన్నాను, పడుకోండి’ అంటుంది తర్వాత ఇద్దరూ చెరోవైపు పడుకొని నిద్రపోతారు.
Brahmamudi
తెల్లారితే కావ్య కిచెన్ లో వంట చేస్తూ ఉంటుంది. ధాన్యలక్ష్మి కిచెన్ లోకి వచ్చి సీరియస్ గా ఉంటుంది. ఏమైంది అని కావ్య అడిగితే, స్వప్న టీ అడిగినా, రుద్రాణి రచ్చ చేస్తోందని బాధపడుతుంది. స్వప్నను రుద్రాణి కనీసం మనిషిలా కూడా చూడటం లేదని బాధపడుతుంది. స్వప్న తింగరి తనాన్ని తలుచుకొని బాధపడుతుంది. అదంతా విన్న కావ్య.. నెల రోజులు ఎదురుచూస్తూ కూర్చుంటే కుదరదని, ఎలాగైనా తప్పు లేదని నిరూపించాలని అనుకుంటుంది.
Brahmamudi
ఇంతలా కావ్యకు ఒక ఫోన్ వస్తుంది. ఎవరో ఒక అబ్బాయి అరుణ్ ఇంటి అడ్రస్ ని కావ్యకు పంపుతాడు. అరుణ్ ని పట్టుకుంటే అన్ని సమస్యలు తొలగిపోతాయి అని కావ్య ఫిక్స్ అయ్యి రాజ్ దగ్గరకు వెళ్తుంది. అర్జెంట్ గా బయటకు వెళ్లాలని అడుగుతుంది. అరుణ్ ఇంటి అడ్రస్ దొరికిందని వెళదాం అని అడుగుతుంది. రాజ్ రావడానికి ఇష్టపడడు. టెస్టులు చేస్తే నిజం తెలిసిపోతుంది కదా ఆ మాత్రం దానికి ఇవన్నీ ఎందుకు అంటాడు. అయితే, కావ్య ‘ అమ్మమ్మగారు చెప్పినా కూడా మీ అత్తయ్య, రాహుల్ మా అక్కను వేధిస్తూనే ఉన్నారు. నానా మాటలు అని అవమానిస్తున్నారు. మా అక్క గురించి తెలిసిందే కదా? ఎదురు మాట్లాడితే ఇంట్లో గొడవ అవుతుంది’ అని కావ్య చెబుతుంది. రాజ్ మాత్రం తనకు ఆఫీసులో పని ఉందని వెళ్లాల్సిందే అంటాడు. దీంతో, కావ్య తాతయ్య టాపిక్ తెచ్చి రాజ్ ని లాక్ చేస్తుంది. అరుణ్ ని పట్టుకుంటే, ఇంట్లో ఏ గొడవలు ఉండవని రాజ్ బుర్రకి ఎక్కిస్తుంది. దీంతో రాజ్ ఆలోచనలో పడతాడు. కళావతి చెప్పింది కరెక్టే అని అనుకుంటాడు. తర్వాత కావ్యను బయటకు తీసుకువెళ్లడానికి రెడీ అవుతాడు.
Brahmamudi
మరోవైపు కళ్యాణ్ పెళ్లి టాపిక్ వస్తుంది. త్వరలోనే ముహూర్తాలు పెట్టుకోవాలని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగా రాజ్ కిందకు వస్తాడు. అందరూ రాజ్ తో ఏదో విషయం మాట్లాడాలి అనుకుంటే, రాజ్ మాత్రం కావ్య దగ్గరకు వెళ్తాడు. రాజ్ ని చూసినా కావ్య చూడనట్లు ప్రవర్తిస్తుంది. రాజ్ కి కాలి వెళ్లిపోదాం అనుకుంటాడు. కానీ ఎదురుగా తాతయ్య కనిపించేసరికి ఆగిపోతాడు. అందరూ రాజ్ ని గమనిస్తూ ఉంటారు. రాజ్ వెళ్లి కావ్య కొంగుకి చేతులు తుడుచుకుంటూ ఉంటాడు. అది చూసి అపర్ణకి కాలిపోతూ ఉంటుంది.
Brahmamudi
కావ్య రాజ్ ని వదిలించుకొని వెళ్లినా, రాజ్ వదలకుండా కావయను బయటకు తీసుకువెళ్లడానికి నానా తంటాలు పడుతూ ఉంటాడు. కావ్య కు తెలిసినా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. కావ్య అందరికీ టీలు ఇవ్వడానికి వెళితే, కావ్య వెనకే రాజ్ తిరుగుతూ ఉంటాడు. కావ్య వెనకాలే తిరుగుతున్నావ్ ఏంటి అని అడిగితే న్యూస్ పేపర్ కావాలి అని ఏదో కవర్ చేయబోతాడు. కావ్య ఎక్కడికి వెళ్తే.. అక్కడికే వెళ్తూ ఉంటాడు. అందరూ వింతగా చూస్తూ ఉంటారు. ఫైనల్ గా బయటకు వెళదాం అని అడుగుతాడు. మళ్లీ ఏదో సోది మాట్లాడుతుంటే, ఆపేసి చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్లిపోతాడు. వెళ్లేటప్పుడు బయటకు వెళ్తున్నాం అని చెప్పేసి వెళతారు.
మరోవైపు ఇంట్లో స్వప్నకు ఇవ్వడానికి కనకం వంటలు తయారు చేస్తుంది. వాటిని సర్దుతూ ఉంటుంది. తల్లిగా తాను చెయ్యాల్సినవి చేస్తున్నాను అని కనకం అంటుంది. మూర్తి వెళ్లొద్దని, స్వప్న గుణం మంచిది కాదు అని చెబుతాడు. కనకం మాత్రం నిర్ణయం మార్చుకోదు.
కమింగప్ లో కనకం దుగ్గిరాల ఇంటికి వెళ్తుంది. స్వప్నను ముద్దు పెట్టి ప్రేమగా పలకరిస్తుంది. అక్కడ కూడా రుద్రాణి పెంట చేయాలని చూస్తుంది. స్వప్న కడుపులో బిడ్డకు తంతడ్రి రాహుల కాదు అని చెబుతుంది.