బ్రహ్మముడి: రుద్రాణికి ఊహించని షాక్.. దెబ్బకు మూర్చపోయింది..!
అందులో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటుంది. నిజంగా అందులో ఆస్తి రాసి ఉంటే, చస్తానని బెదిరించి అయినా, ఆస్తి రాయించుకోవాలని అనుకుంటుంది. ఇక, రాహుల్ ఆ పేపర్ ని అతికించే పనిలో పడతాడు.
Brahmamudi
Brahmamudi: ఆస్తి కోసం రుద్రాణి వేసిన ప్లాన్ బోల్తా కొట్టింది. రాజ్ వచ్చి వీలునామా చింపేయడంతో చాలా నిరాశకు గురైంది. అయినా కూడా, ఆ వీలునామాలో ఏం రాసారో తెలుసుకోవాలని ఈరోజు ఎపిసోడ్ లో అనుకుంటుంది. మరి ఆమె ఏం తెలుసుకుంది. మళ్లీ ఆస్తి కోసం ఎలాంటి కుట్రలు చేసిందో, ఈ ఎపిసోడ్ లో చూద్దాం..
ఈ రోజు ఎపిసోడ్ కళ్యాణ్, అనామికలతో మొదలౌతుంది. తన తాతయ్య ఆరోగ్యం విషయం తెలిసినప్పటి నుంచి కళ్యాన్ అనామికతో మాట్లాడటం కుదరదు. దీంతో, ఏకంగా అనామిక అప్పు దగ్గర వెళ్లి, కళ్యాణ్ కి ఫోన్ చేయించి మరీ, బయట కలుస్తుంది. ఆ సమయంలో అనామిక కొంచెం కోపంగా ఉంటుంది. దీంతో, కళ్యాణ్ ఆమె కోపం పోగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆడ పిల్లలు కోపంగా ఉన్నా, అందంగా ఉంటారని, ఇక, అనామిక అయితే మరింత అందంగా ఉందని ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటాడు.అయినా, అనామిక కోపం పోదు. దీంతో, ఇంట్లో పరిస్థితులు సరిగాలేకపోవడం వల్ల అలా చేశాను అని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. అయితే, తాను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా, అప్పు ఫోన్ నుంచి చేయగానే లిఫ్ట్ చేసినందుకు తనకు కోపం వచ్చిందని అసలు విషయం చెబుతుంది. తనకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వాలని, అప్పూ కి ఇవ్వడానికి వీలు లేదని ఖరాఖండిగా చెప్పేస్తుంది. ఎలాంటి సమస్య వచ్చినా తనతోనే చెప్పుకోవాలని, తాను అర్థం చేసుకుంటానని చెబుతుంది.అయితే, కళ్యాణ్ మాత్రం నవ్వుతుంటాడు. ఎందుకు నవ్వుతున్నావ్ అని అనామిక సీరియస్ కావడంతో, తన తల్లితో సమానమైన ప్రేమను తనలో చూశానని చెబుతాడు. ఇక్కడ కూడా అనామిక అప్పు విషయం తీసుకువస్తుంది. అప్పు కి ఎక్కువ ప్రయార్టీ ఇస్తున్నావ్ అని వాపోతుంది. దీంతో, కళ్యాణ్ ఇక నుంచి అలా చేయనని మాట ఇస్తాడు. దీంతో, అనామిక కామ్ డౌన్ అయ్యి, త్వరగా పెళ్లి గురించి ఆలోచించమని అడుగుతుంది.
Brahmamudi
ఇక, సీన్ కట్ చేస్తే, ఇంట్లో రుద్రాణి టెన్షన్ గా తిరుగుతూ ఉంటుంది. చివరి నిమిషంలో ఆస్తి ప్లాన్ ప్లాప్ కావడంతో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అసలు, ఆ వీలునామాలో నాన్న తనకు ఆస్తి రాశాడా? రాస్తే, ఎంత రాశాడో తెలుసుకోవాలని అనుకుంటుంది. దాని కోసం చింపి పడేసిన వీలునామా వెతకాలని అనుకుంటుంది. కరెక్ట్ గా తానే వెళ్లే సరికి, పని అమ్మాయి వాటాిని డస్ట్ బిన్ లో పడేస్తుంది. ఎవరూ చూడకుండా వెళ్లి, ఆ పేపర్ ముక్కలను తాను తెచ్చుకుంటుంది. కొడుకుతో కలిసి ఆ వీలునామా పేపరును అతికించి, అందులో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటుంది. నిజంగా అందులో ఆస్తి రాసి ఉంటే, చస్తానని బెదిరించి అయినా, ఆస్తి రాయించుకోవాలని అనుకుంటుంది. ఇక, రాహుల్ ఆ పేపర్ ని అతికించే పనిలో పడతాడు.
Brahmamudi
ఇక, చిట్టి తన భర్త సీతారామయ్యతో మాట్లాడుతుంది. అసలు వీలునామాలో ఏం రాశావ్ అని అడుగుతుంది. అదే సమయంలో, అతికించిన వీలునామా పేపర్ చదవడానికి రాహుల్ ప్రయత్నిస్తూ ఉంటాడు. రాహుల్ తిప్పలు పడతుుండటంతో, రుద్రాణి ఆ వీలునామాను చదువుతుంది. కానీ, అందులో రాసింది చూసి షాకౌతుంది. తన తదనంతరం ఆస్తిని ఎవరూ అమ్ముకోవడానికి, ఇతరుల పేర్ల మీద మార్చడానికి వీలు లేదు. ఆస్తి ఎప్పటిలాగానే అందరూ అనుభవించేలా వీలునామా రాయడం విశేషం. వారసత్వ సంపద గా తన మునిమనవళ్లకు ఆస్తి దక్కుతుందని, ఉమ్మడి కుటుంబం నుంచి ఎవరైనా వెళ్లిపోతే, వాళ్లకు ఆస్తిలో చిల్లు గవ్వకూడా దక్కదు అని ఆయన వీలునామాలో రాయిస్తాడు. అది చదివి రుద్రాణి షాకౌతుంది. ఏకంగా కళ్లు తిరిగి పడిపోతుంది. తర్వాత రాహుల్, నీళ్లు తట్టి లేపుతాడు. ఈ సీన్ ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చుతుంది.
Brahmamudi
ఇక, మరో వైపు రాజ్ తన తాతయ్య ఆరోగ్యం గురించి డాక్టర్లతో మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా, డాక్టర్ ని ఏకంగా తన ఇంటికి తీసుకువెళ్లాలని రాజ్ భావిస్తాడు. అదే విషయం తన అమ్మ అపర్ణతో పంచుకుంటాడు. ఇక, ఆ తర్వాత రాజ్ ని ఆ డాక్టర్ ని తన ఇంటికి తీసుకువస్తాడు. అతను సీతారామయ్య రిపోర్ట్ ని చెక్ చేస్తాడు. చెక్ చేసి, ఆయన ఆరోగ్యానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు అని కుటుంబం మొత్తం తో కలిసి చెబుతాడు.
Brahmamudi
రాహుల్, , రుద్రాణి తప్ప ఆ డాక్టర్ చెప్పింది విని, అందరూ సంబరపడిపోతారు. ఆయన ఆ కాలం నాటి వ్యక్తి కాబట్టి, ఆయన తీసుకున్న ఆహారం, ఇప్పటికీ ఫాలో అవుతున్న లైఫ్ స్టైల్ కారణంగా ఎక్కువ కాలం జీవిస్తారని, ఆయన రోగం నయం అవుతుందని చెబుతారు.
Brahmamudi
మధ్యలో అందరూ కలిసి రుద్రాణి పై సెటైర్లు వేస్తారు. సమయం దొరికిందని స్వప్న , కావ్య కూడా రుద్రాణి పై సెటైర్లు వేస్తారు.ఇక,కమింగ్ అప్ లో రాజ్ తో కావ్య ప్రేమగా మాట్లాడాలని ప్రయత్నిస్తుంది కానీ, రాజ్ ఎప్పటిలాగానే చిటపటలాడతాడు. దీంతో, కావ్య రాజ్ తో ఛాలెంజ్ చేస్తుంది.