- Home
- Entertainment
- TV
- BrahmaMudi Serial 29th December:నిజం కక్కించే మందు తెచ్చిన స్వప్న, అప్పూతో తాగించిన పద్దూ
BrahmaMudi Serial 29th December:నిజం కక్కించే మందు తెచ్చిన స్వప్న, అప్పూతో తాగించిన పద్దూ
రుద్రాణి స్టేజ్ మీదకు అడుగుపెట్టి.. ఫిదాలోని వచ్చిండే సాంగ్ కి అదిరిపోయేలా డ్యాన్స్ వేస్తుంది. తర్వాత అపర్ణ, సుభాష్ లు వచ్చి శీతాకాలం మనసు పాటకు తమకు వచ్చినట్లు డ్యాన్స్ వేస్తారు.

Brahmamudi
BrahmaMudi Serial 29th December: నిన్నటి ఎపిసోడ్ లో మురళి మరో అమ్మాయితో చనువుగా ఉండటం విక్కీ చూస్తాడు. ఆవేశంగా వెళ్లి మురళి చొక్కా పట్టుకుంటాడు. అది చూసిన అరవిందకు కోపం వచ్చి తన తమ్ముడిని కొడుతుంది. నేటి ఎపిసోడ్ లోనూ అదే కంటిన్యూ అయ్యింది. అక్క కొట్టిందని విక్కీ , విక్కీని కొట్టినందుకు అరవింద బాధపడుతూ ఉంటారు. అరవిందను పద్మావతి, కావ్య ఓదారుస్తారు. మరోవైపు విక్కీకి రాజ్ ధైర్యం చెబుతాడు. అక్క సంతోషం కోసం క్షమాపణలు చెప్పమని రాజ్ అనడంతో విక్కీ సరే అంటాడు. కావ్య కూడా అరవిందకు అర్థమయ్యేలా మాట్లాడుతుంది. విక్కీతో ప్రేమగా మాట్లాడమని చెబుతుంది. పద్దూ కూడా అరవిందకు అదే చెబుతుంది. అరవింద సరే అంటుంది. విక్కీతో మాట్లాడటానికి అరవింద వెళ్తుండగా... విక్కీ రాజ్ ఎదురౌతారు. ఇద్దరూ ఒకరినొకరు హత్తుకొని ఏడుస్తారు. తర్వాత కొట్టినందుకు అరవింద క్షమాపణలు చెబుతుంది. అయితే... విక్కీ తనదే తప్పు అని ఒప్పుకుంటాడు.
Brahmamudi
తర్వాత, సంగీత్ కి గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తారు. మరికాసేపట్లో డ్యాన్స్ ప్రోగ్రాం మొదలౌతుందనగా సుభాష్ వాళ్లు మందు పార్టీ ఏర్పాటు చేసుకుంటారు. ఎవరికీ అనుమానం రాకుండా కూల్ డ్రింక్స్ బాటిల్స్ లో మందు కలుపుకుంటారు. అది తెలియని అనామిక తండ్రి.. ఆ మందు కలిపిన కూల్ డ్రింక్ ని మార్వాడీ సేటుకు ఇప్పిస్తాడు. ఆయన కూడా అది తేడాగా ఉందే అనుకుంటూ తాగేస్తాడు.
Brahmamudi
తర్వాత సంగీత్ మొదలౌతుంది. కావ్య, పద్దూలు యాంకరింగ్ మొదలుపెడతారు. ప్రోగ్రామ్ లో భాగంగా తమను తమ భర్తలు ఎత్తుకొని తిప్పాలి అంటుంది. అది విని రాజ్, కావ్య షాకౌతారు. తమ వళ్లకాదు అనుకుంటారు. వీళ్లు కూడా తర్వాత వద్దులే అనుకొని సెటైర్లు వేస్తారు. తర్వాత సంగీత్ డ్యాన్సులు మొదలుపెడదాం అని చెబుతారు. తర్వాత.. మందు తాగిన బ్యాచ్.. తాము తాగింది కూల్ డ్రింక్ అని నమ్మించడానికి ప్రయత్నిస్తారు.
Brahmamudi
తర్వాత, రుద్రాణి వచ్చి డ్యాన్స్ చేస్తారని కావ్య చెబుతుంది. రుద్రాణి స్టేజ్ మీదకు అడుగుపెట్టి.. ఫిదాలోని వచ్చిండే సాంగ్ కి అదిరిపోయేలా డ్యాన్స్ వేస్తుంది. తర్వాత అపర్ణ, సుభాష్ లు వచ్చి శీతాకాలం మనసు పాటకు తమకు వచ్చినట్లు డ్యాన్స్ వేస్తారు. వీళ్లు డ్యాన్స్ చేస్తుంటే స్వప్న వచ్చి.. కావ్యను పక్కకు పిలుస్తుంది. తన దగ్గర ట్రూత్ సిరప్ ఉందని, అది మురళికి ఇస్తే..నిజాలు బయటపడతాయని సలహా ఇస్తుంది. ఎవరూ చూడకుండా జ్యూస్ లో ఆ డ్రింక్ కలుపుతుంది. అది తెచ్చి మురళికి ఇస్తుంది.
Brahmamudi
మురళి తాగిన తర్వాత వచ్చి ఇదే విషయానికి కావ్యకు చెబుతుంది. మరికాసేపట్లో వాడు నిజాలు చెప్పేస్తాడని కావ్య, స్వప్నలు సంబరపడతారు. ఆ ట్రూత్ సిరప్ పనిచేస్తుందని, పద్దూకి పిలిచి అదే విషయాన్ని చెబుతారు. కానీ, పద్దూ టెన్షన్ పడుతుంది. నిజం తెలిస్తే.. అరవింద తట్టుకోలేదని పద్దూ చెబుతుంది.
Brahmamudi
తర్వాత మురళి గట్టిగా అరవిందను పిలుస్తాడు. స్టేజీ మీదకు వెళ్లి మైక్ పట్టుకొని నీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి అని మొదలుపెడతాడు.‘ దేవతలాంటి నీకు ద్రోహం చేయాలని అనుకున్నాను, నన్ను నమ్మిన నిన్ను మోసం చేయాలని అనుకున్నాను. నేను చేసిన పాపానికి ఏ శిక్ష వేసినా తప్పులేదు. నేను దేవుడిని కాదు, రాక్షసుడిని. నీకు తెలీకుండా నీకు ఒక్క మాట చెప్పకుండా నేను పార్టీలో మందు తాగాను( అందరినీ టెన్షన్ పెట్టి చివరకు మాట మారుస్తాడు) తెలీకుండా తాగాను, ఇంకోసారి అలా చేయను. నన్ను క్షమించు’ అని అంటాడు. తర్వాత మైక్ ఇవ్వడానికి కావ్య, పద్దూ దగ్గరకు వచ్చి.. ఇచ్చి వెళ్లిపోతాడు. ట్విస్ట్ ఏంటంటే.. స్వప్న కలిపిన సిరప్ జ్యూస్ మురళి తాగలేదు. ఎవరు తాగారో కూడా వారికి అర్థం కాదు. ఎవరు మందు తాగిన మైకంలో మాట్లాడుతున్నారో, సిరప్ తాగి మాట్లాడుతున్నారో కూడా అర్థం కాదు.
Brahmamudi
తర్వాత కళ్యాణ్, అనామికలను డ్యాన్స్ చేయడానికి పిలుస్తారు. అక్కడ కూడా కళ్యాణ్ అప్పూని పిలుస్తాను అంటాడు. అప్పూ ఎందుకు అని అనామిక చెప్పినా, కళ్యాణ్ వినిపించుకోడు. అప్పూని పిలుస్తాడు. అప్పూ రాను అంటున్నా కూడా కళ్యాణ్ వినిపించుకోడు. అనామిక వచ్చి.. కళ్యాణ్ ని తీసుకొని వెళ్లిపోతుంది. అది చూసి అప్పూ మనసులో ఎవరో ఉన్నారని పద్దూ అనుకుంటుంది. ఆ ట్రూత్ సిరప్ అప్పూకి ఇవ్వాలి అని అనుకుంటుంది. మరోవైపు కళ్యాణ్ వాళ్లు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అప్పూకి పద్దూ సిరప్ కలిపిన జ్యూస్ తెచ్చి ఇస్తుంది. ఆ జ్యూస్ తాగిన మైకంలో వాళ్లను డ్యాన్స్ ని ఆపండి అని అప్పూ అరుస్తుంది.
Brahmamudi
తర్వాత పాట మార్చమని అడుగుతుంది. బృందావనంలోని చిన్నదో వైపు, పెద్దదో వైపు పాట ప్లే అవుతుంది. అప్పూ కళ్యాన్ తో డ్యాన్స్ వేస్తుంది. అయితే.. అది చూసి కనకం కి అనుమానం వస్తుంది. పద్దూని పిలిచి అడిగితే, అసలు విషయం చెబుతుంది. అప్పూ ప్రేమించింది కళ్యాణ్ అని కనకం చెప్పడంతో పద్దూ కూడా షాకౌతుంది. అప్పూ ఇప్పుడు నోరు తెరిస్తే, ఈ పెళ్లి ఆగిపోతుందని కనకం బయపడుతుంది. అప్పూ కూడా డ్యాన్స్ మధ్యలో కళ్యాన్ ని హగ్ చేసుకొని ఐలవ్ యూ అని చెబుతుంది. అది విని అక్కడ ఉన్నవారంతా షాకౌతారు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.