- Home
- Entertainment
- TV
- BrahmaMudi Serial 21st December: డబ్బు కోసం అనామిక, పెళ్లి ఆపడానికి రుద్రాణి మాస్టర్ ప్లాన్స్...!
BrahmaMudi Serial 21st December: డబ్బు కోసం అనామిక, పెళ్లి ఆపడానికి రుద్రాణి మాస్టర్ ప్లాన్స్...!
వీళ్ల డిస్కర్షన్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. తన కొడుకు అమూల్ బేబీ అని, అనామిక ఫైర్ బ్రాండ్ అని నాలాగే మరో ప్రకాశం అవుతాడు అనిపిస్తోందని కళ్యాణ్ తండ్రి అంటాడు. అందరూ నవ్వేసుకుంటారు.

Brahmamudi
BrahmaMudi Serial 21st December:కళ్యాణ్ పెళ్లిలో భాగంగా దుగ్గిరాల కుటుంబం మొత్తం రిసార్ట్ కి చేరుకుంటుంది. రిసార్ట్ చాలా బాగుందని అందరూ చూస్తుంటారు. చాలా పెద్ద రిసార్ట్ బుక్ చేశారు అని సుబాష్ అంటే, జరిగేది మా తమ్ముడి పెళ్లి కదా ఆ మాత్రం లేకపోతే ఎలా అని రాజ్ అంటాడు. దానికి అనామిక ‘ జరిగేది మీ తమ్ముడి పెళ్లి మాత్రమే కాదు, నాది కూడా, ఇక నుంచి నేను కూడా మీ ఇంటి కోడలినే, నన్ను కూడా మీ తమ్ముడితో పాటు గుర్తుపెట్టుకోండి’ అంటుంది. వెంటనే ధాన్యలక్ష్మి.. అప్పుడే తన కోడలు హక్కుల గురించి మాట్లాడేస్తోంది అని మురిసిపోతుంది. అందరూ నవ్వుకుంటారు. వెంటనే ఇందిరాదేవి.. ఈకాలం ఆడపిల్లలు మారిపోయారు అంటుంది. కావ్య మాత్రం.. ఎన్ని మార్పులు వచ్చినా, ఆడపిల్ల అత్తారింట్లో అడుగుపెట్టిన తర్వాత, బాధ్యతలతో పాటు భయాలు కూడా ఉంటాయి కదా అమ్మమ్మ అంటుంది. వెంటనే రుద్రాణి నువ్వెక్కడ భయపడ్డావ్..? మమ్మల్ని భయపెట్టావ్ కానీ అంటుంది. దానికి కారణం మీరే కదా అని కావ్య రివర్స్ కౌంటర్ ఇస్తుంది. ఈ టాపిక్ ఆపేయమని ఇందిరాదేవి అంటే, అనామిక.. తాను మాత్రం భయపడే రకం కాదని, ఏదైనా సూటిగా మాట్లాడతానని, కళ్యాణ్ కూడా అదే నచ్చింది అని అంటుంుది. కళ్యాన్ వెంటనే, నువ్వు ఏదైనా సూటిగానే మాట్లాడతావ్ కానీ, నా విషయంలోనే మూడు నెలలు తిప్పి, పిప్పి చేశావ్ అంటాడు. వెంటనే అందరూ నవ్వేస్తారు. ఆడపిల్లలు ఈజీగా దొరికొస్తే, విలువ ఇస్తారా కవి గారు అని కావ్య అంటుంది.
Brahmamudi
ఒదినా పార్టీ మార్చేశావా అని కళ్యాణ్ అమాయకంగా ఫేస్ పెడితే, ఆడవాళ్లు అంతేరా అని రాజ్ అందుకుంటాడు.వెంటనే కావ్య కౌంటర్ వేయాలని చూస్తుంటే, సుభాష్, ఈ టాపిక్ ఆపేయమని చెబుతాడు. అంతేకాదు, ఆడపిల్లలు భయపడకుండా ఉండాలని చెబుతాడు. అదే టైమ్ కి అప్పూ, కనకం,మూర్తి ఆటోలో దిగుతారు. వీళ్ల డిస్కర్షన్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. తన కొడుకు అమూల్ బేబీ అని, అనామిక ఫైర్ బ్రాండ్ అని నాలాగే మరో ప్రకాశం అవుతాడు అనిపిస్తోందని కళ్యాణ్ తండ్రి అంటాడు. అందరూ నవ్వేసుకుంటారు.
Brahmamudi
కళ్యాణ్ నవ్వడంతో అనామికకు కోపం వస్తుంది. నేను నిన్ను కంట్రోల్ చేస్తున్నానా అని అనామిక అంటే.. లేదని నువ్వు ఏది చెబితే అదే కరెక్ట్ అంటాడు. వాళ్ల మాటలు చూసి అప్పూ బాధపడుతుంది. అప్పూ బాధ చూసి, ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెబుతుంది. అప్పూ పర్వాలేదని, తనకు ఈబాధ తప్పదని, ఉంటానని చెబుతుంది. వాళ్ల సంతోషంగా ఉండటం చూస్తే, తన మనసు బండరాయిలా మారిపోతుందని, కళ్యాణ్ అనామిక మెడలో తాళి కడితే, తన ప్రేమ చచ్చిపోతుందేమోచూస్తాను అంటుంది. ఈలోగా, అప్పూని కళ్యాణ్ చూస్తాడు. వెంటనే వచ్చి చెయ్యి పట్టుకొని పక్కన నిలపెట్టుకుంటాడు. నువ్వే నాకు తోటి పెళ్లి కొడుకు అంటాడు. తోటి పెళ్లికొడుకు అంటే అబ్బాయి ఉండాలి కదా అని ధాన్యలక్ష్మి అంటే, బ్రో ఎప్పుడు అమ్మాయిలా ఉంది అంటాడు.
తర్వాత అప్పూ గురించి చాలా గొప్పగా చెబతాడు. ‘ తనకు పరిచయం అయినప్పటి నుంచి అప్పూ ఏరోజూ అమ్మాయిలా లేదు. నేను బాధపడితే నవ్వించింది. భయపడితే ధైర్యం చెప్పింది. అలసిపోయి ఆగిపోతే ముందుకు నడిపించింది. మౌనంగా ఉంటే, మాట్లాడేలా చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే, నా బ్రోనే నా బలం.’ అని కళ్యాణ్ అంటాడు. తన చెల్లి గురించి అంత బాగా చెప్పినందుకు కావ్య సంతోషించి థ్యాంక్స్ చెబుతుంది. తర్వాత కళ్యాన్.. ఈ పెళ్లి అయ్యేంత వరకు తోడి పెళ్లి కొడుకులా నావెంటే ఉండాలి అని అడుగుతాడు. ఆ మాటలకు అనామిక ముఖం మాడిపోతుంది. అప్పూ పరిస్థితికి కనకం, మూర్తి బాధపడతారు.
Brahmamudi
ఈలోగా స్వప్నకు అరుణ్ నుంచి ఫోన్ వస్తుంది. అరుణ్ ఫోన్ ఎందుకు చేశాడా అని ఆలోచించి, మాట్లాడటానికి పక్కకు వెళ్తుంది. తన ప్లాన్ అమలు అవుతున్నందుకు రుద్రాణి సంతోషిస్తుంది. అరుణ్ ఫోన్ చేయగానే, స్వప్న తిడుతుంది. ‘నేను కనపడలేదని బెంగ పెట్టుకున్నావా’ అని అడుగుతాడు. ‘డబ్బులు తీసుకొని కూడా మోసం చేశావ్’ అని స్వప్న తిడుతుంది. అరుణ్ మాత్రం.. నీపై ప్రేమ ఉందని, నిన్ను, రాహుల్ ని విడదీయాలని అనుకున్నానని, మధ్యలో కావ్య వచ్చి నన్ను పట్టుకుంటుందని పారిపోయానని, ఇప్పుడు మళ్లీ నిన్ను సొంతం చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అని అరుణ్ అంటాడు.
Brahmamudi
‘ నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు నేనే తండ్రి ’ అనిచెప్పడానికి కళ్యాణ్ పెళ్లికి వస్తాను అని బెదిరిస్తాడు. నేను ఈ విషయం చెప్పగానే, మీ అత్తగారు, రాహుల్ నిన్ను గెంటేస్తారని, అలా జరగకముందే, నువ్వే నా దగ్గరకు వచ్చేయ్.. నిన్ను మహారాణిలా చూసుకుంటాను, బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో.. అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అరుణ్ చెప్పినట్లు చేస్తే, అందరూ తనదే తప్పు అని అనుకుంటారని, ఈ విషయం కావ్య కు చెప్పడమే బెటర్ అని అనుకుంటుంది.
Brahmamudi
ఈలోగా నువ్వు, నేను ప్రేమ సీరియల్ లో హీరో ఫ్యామిలీ అంతా.. ఈ పెళ్లికి వస్తారు. వీరికి దుగ్గిరాల కుటుంబం మొత్తం స్వాగతం చెబుతారు. ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. వీరి పరిచయాలే చాలా సేపు జరుగుతాయి. ఈలోగా స్వప్న అక్కడికి వచ్చేస్తుంది. కావ్యకి ఎప్పుడు అరుణ్ గురించి చెబుదామా అని ఎదురుచూస్తూఉంటుంది. స్వప్న కంగారు చూసి రాహుల్ హ్యాపీగా ఫీలౌతాడు. తర్వాత వెళ్లి, స్వప్నను ఏమైందని తెలియనట్లుగా మాట్లాడతాడు. కావాలని, అరుణ్ విషయం బయటపెడుతుందా అని చాలా రకాలుగా అడుగుతాడు. ఇద్దరూ ఒకరినొకరు వాదించుకుంటారు. తర్వాత రుద్రాణి ఎంట్రీ ఇస్తుంది. స్వప్న కంగారులో ఉందని, ఇద్దరూ సంతోషంగా ఫీలౌతారు. కావ్యకు చెబుతుందేమో అని రాహుల్ అంటే, అస్సలు చెప్పదని అంటాడు. స్వప్న కారణంగానే పెళ్లి ఆగిపోయేలా చేయాలని ప్లాన్ చేస్తారు. అరుణ్ కి ఫోన్ చేసి రిసార్ట్ కి రమ్మని చెప్పమని అంటుంది.
Brahmamudi
తర్వాత కళ్యాణ్ అప్పూతో కలిసి ఒకే గదిలోకి వస్తారు. అలా ఉన్నావ్ ఏంటి అని కళ్యాణ్ అడుగుతాడు. లగేజ్ అంతా మోయించావ్ అని తిడుతుంది. వీళ్లిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే, అనామిక వస్తుంది. కళ్యాణ్ ని ట్యూన్ చేసి, డబ్బులు ఇచ్చేలా అంగీకరించేలా చేయాలని అనుకొని వెళ్తుంది. కానీ, అక్కడ అప్పూ ఉండే సరికి ఆగిపోతుంది. పర్సనల్ గా మాట్లాడాలి అని అడుగుతుంది. అప్పూ వెళ్లిపోబోతుంటే, డోర్ దగ్గర కాపలా ఉండమని అడుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్ లో హల్దీ వేడుకలు జరుగుతున్నాయి.