MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • BrahmaMudi serialDecember8th 2023 Episode: బాధలో కళ్యాణ్... అండగా నిలిచిన అప్పూ, కనకం ప్లాన్ కనకందే..!

BrahmaMudi serialDecember8th 2023 Episode: బాధలో కళ్యాణ్... అండగా నిలిచిన అప్పూ, కనకం ప్లాన్ కనకందే..!

అది విన్న తర్వాత, హోమం జరిపిస్తే, సమస్య తగ్గిపోతుందని పంతులుగారు చెప్పారు కదా, మీ కాపురం కూడా సవ్యంగానే ఉంటుందని, భయపడకండి అని ఇందిరాదేవి కళ్యాణ్ కి ధైర్యం చెబుతుంది. ఇక, కావ్య చెప్పింది విని అందరిలాగానే కనకం కూడా నిజమని నమ్ముతుంది.

ramya Sridhar | Published : Dec 08 2023, 11:13 AM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Brahmmamudi

Brahmmamudi

BrahmaMudi serial  December8th Episode:ఎలాగైనా కళ్యాణ్ పెళ్లి చెడగొట్టాలని కనకం డిసైడ్ అయిపోతుంది. తాను అనామికను బాధపెడుతున్నానా అని ఒక క్షణం ఆలోచిస్తుంది కానీ, తన కూతురు కోసం ఆ పనిచేయక తప్పదు అని నిర్ణయించుకుంటుంది. ఇప్పటికే పంతులు ద్వారా అబద్ధం చెప్పిస్తుంది. తర్వాత, ధాన్యలక్ష్మి బుర్ర కూడా పాడుచేసేస్తుంది. తమ కాలనీలో జాతకదోషం ఉన్నా పెళ్లి చేసుకోవడం వల్ల ఇబ్బందులు పడ్డారని చెబుతుంది. దీంతో, ధాన్యలక్ష్మి భోజనం చేస్తూ కూడా అదే ఆలోచిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులు మొత్తం  ఏమైంది అని ధాన్యలక్ష్మిని అడుగుతారు. అయితే, ఈ పెళ్లి ఎందుకో ఆపేయడమే మంచిది అనిపిస్తోంది అంటుంది. ‘అనవసరంగా ఏమీ ఆలోచించకుండా కళ్యాణ్ ఇష్టపడ్డాడని పెళ్లి కి ఒప్పుకున్నామని, కానీ , పంతులు గారు చెప్పిన తర్వాత ఈ పెళ్లి జరగకపోవడమే మంచిదనిపిస్తోంది’ అని ధాన్యలక్ష్మి అంటుంది. అది విని కళ్యాణ్ బాధపడిపోతాడు. భోజనం మధ్యలోనే ఆపేసి అక్కడి నుంచి లేచి వెళ్లిపోతాడు. పాపం.. కావ్య కళ్యాన్ ని ఆపాలని ప్రయత్నిస్తుంది. రాజ్  కూడా  కళ్యాణ్ ని ఆపుతాడు. 

27
Brahmmamudi

Brahmmamudi

కళ్యాణ్ మనసు తేలికపరచాలని కావ్య ప్రయత్నిస్తుంది. ‘నేను, మీ అన్నయ్య జాతకాలు చూడకుండానే పెళ్లి చేసుకున్నాం. మేం సంతోషంగా లేమా?  మొన్న సర్ ప్రైజ్ అని చెప్పి బయటకు తీసుకువెళ్లాడు కదా. ఆరోజు ఆయన హనీమూన్ కి కూడా తీసుకువెళ్లాలని అనుకున్నారు.’ అని సిగ్గుపడుతూ చెబుతుంది. ఆ మాట విని రాజ్ షాకౌతాడు. కానీ, కవర్ చేయమని సైగ ఇస్తుంది. ఎప్పటిలాగానే ఇద్దరూ కలిసి తెగ నాటకం ఆడేస్తూ ఉంటారు. వీళ్లిద్దరూ అలా చేస్తున్నప్పుడు  అపర్ణ, రుద్రాణి తప్ప అందరూ సంతోషిస్తారు. కళ్యాణ్ మనసు తేలిక చేయడానికి వారిద్దరూ అలా మాట్లాడతారు.

37
Brahmmamudi

Brahmmamudi

అది విన్న తర్వాత, హోమం జరిపిస్తే, సమస్య తగ్గిపోతుందని పంతులుగారు చెప్పారు కదా, మీ కాపురం కూడా సవ్యంగానే ఉంటుందని, భయపడకండి అని ఇందిరాదేవి కళ్యాణ్ కి ధైర్యం చెబుతుంది. ఇక, కావ్య చెప్పింది విని అందరిలాగానే కనకం కూడా నిజమని నమ్ముతుంది. తన కూతురి కాపురం చాలా బాగుందని అనుకొని సంబరపడిపోతుంది.

47
Brahmmamudi

Brahmmamudi

ఇక, ఇక్కడ సీన్ కట్ చేస్తే, రాజ్ కావ్య గదిలోకి వెళతారు. అక్కడ కావ్య చెప్పిన అబద్ఘాలకు రాజ్ సీరియస్ అవుతాడు. ‘నిజంగానే ఇంట్లో వాళ్లు హనీమూన్ కి పంపితే ఏం చేయాలి’ అని రాజ్ అడుగుతాడు. రాజ్ అంత సీరియస్ గా అడిగినా , కావ్య మాత్రం ఎప్పటిలాగానే అమాయకంగా ఫేస్ పెట్టి డైలాగులు చెబుతుంది. గుక్కతిప్పుకోకుండా, సిగ్గుపడుతూ హనీమూన్ గురించి రాజ్ ని కన్ ఫ్యూజ్ చేస్తూ  మాట్లాడుతుంది. ఎప్పటిలాగానే వీరిద్దరి ఫన్నీ గొడవ జరుగుతుంది.

57
Brahmmamudi

Brahmmamudi

తెల్లారితే, ఇంట్లో హోమం ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. స్వప్న రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే కనకం స్వప్న కోసం జ్యూస్ తీసుకొని వస్తుంది. రెడీ అవుతున్న స్వప్నను చూసి, ఏంటి రెడీ అవుతున్నావ్ అని అడుగుతుంది. దానికి స్వప్న.. ఇంట్లో హోమం ఉంది కదా.. ఈ మాత్రం రెడీ అవ్వకపోతే ఏం బాగుంటుంది అని అడుగుతుంది. అయితే, కనకం మాత్రం స్వప్నను అసలు కిందకు కూడా రావద్దు అని చెబుతుంది. ఆ పొగ వల్ల కడుపులో బిడ్డకు మంచిది కాదు అని చెప్పి, కిందకు రావద్దు అంటుంది. పాపం, స్వప్న ఆశలన్నీ అడియాశలు అయిపోతాయి.

67
Brahmmamudi

Brahmmamudi

ఇక, అంతలో అప్పూ మూడు నిమ్మ చెట్లు తీసుకొని వస్తుంది. మూడు తెమ్మన్నావ్ చాలా బరువు అయ్యాయి అని చెబుతుంది. అప్పుడే సరిగ్గా కళ్యాణ్ అక్కడికి వస్తాడు. రావడం రావడమే, మూడు ఎందుకు తెమ్మన్నారు ఆంటీ అని అడుగుతాడు. అయితే,  ఎందుకైనా మంచిదని అవసరం అవుతుందని తెమ్మనన్నాను అని చెబుతుంది. కానీ, కనకం దీనిపై ఏదో ఒక ప్లాన్ చేసి ఉండొచ్చు. అది బయటపడకుండా జాగ్రత్తపడుతుంది.

ఇక, మొక్కలు ఇచ్చేసి అప్పూ వెళ్లిపోతుంటే, కళ్యాణ్ ఆపేస్తాడు. తనకు చాలా భయంగా ఉందని, తమ పెళ్లి ఆగిపోతుందేమో అని భయపడతాడు. కానీ, అప్పూ ధైర్యం చెబుతుంది. మీ ప్రేమ నిజం అయితే, మీ పెళ్లి జరుగుతుంది అని ధైర్యం చెప్పి, కళ్యాణ్ వెంటే ఉంటుంది. ఇంతలోనే, అనామికతో పంతులుగారు హోమం పూర్తి చేసి ఇద్దరిచేత నిమ్మ మొక్క నాటిస్తాడు.

77
Brahmmamudi

Brahmmamudi


మొక్క నాటేసమయంలో తమ పెళ్లి జరగాలని, కళ్యాణ్, అనామిక దండం పెట్టుకుంటారు. అది చూసి అప్పూ లోలోపల బాధపడుతుంది. ఇంట్లోవాళ్లు కూడా ఆ మొక్క బతకాలని కోరుకుంటారు. కనకం మాత్రమే, ఆ మొక్క బతకదని, మీ పెళ్లి జరగదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ పూర్తౌతుంది. మరి రేపటి ఎపిసోడ్ లో కనకం ఎలాంటి మ్యాజిక్కులు చేస్తుందో, వాటిని రుద్రాణి కనిపెడుతుందో లేదో చూడాలి.

ramya Sridhar
About the Author
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు. Read More...
 
Recommended Stories
Top Stories