MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • BrahmaMudi Serial 1st january epidode:పాపం కావ్యకు నరకం చూపించిన కుటుంబం, అండగా నిలిచిన రాజ్..!

BrahmaMudi Serial 1st january epidode:పాపం కావ్యకు నరకం చూపించిన కుటుంబం, అండగా నిలిచిన రాజ్..!

ఇక నుంచి అయినా నీ స్వార్థం నువ్వు చూసుకో, నీ కాపురం చూసుకో, మమ్మల్ని వదిలేయ్.. మా ధరిద్రం నీకు అంటకుండా చూసుకో అని మూర్తి చెప్పి వెళ్తుంటారు.

6 Min read
Author : ramya Sridhar
Published : Jan 01 2024, 11:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
Brahmamudi

Brahmamudi

BrahmaMudi Today:ఎన్నో ఆటంకాలు, గొడవలు, ట్విస్టులతో కళ్యాణ్, అనామికల పెళ్లి జరిగింది. చివరి నిమిషంలో అయినా అనామికతో పెళ్లి ఆగిపోయి అప్పూతో జరుగుతందని ఆశపడిన ఫ్యాన్స్ కి నిరాశే మిగిలింది. ఎట్టకేలకు పెళ్లి జరిగిపోయింది. అందరూ వెళ్లిపోయిన తర్వాత.. కావ్య తన తల్లిదండ్రులతో మాట్లాడుతుంది. ‘తన అత్తారింట్లో జరిగిన పెళ్లిలో తన పుట్టింటి వాళ్లు ఉండాలని ఆశపడ్డాను, కానీ  ఇన్ని అవమానాలు జరగడం, మీరు మనసు కష్టపెట్టుకొని వెళ్లడం చూస్తుంటే తట్టుకోలేనంత బాధ అనిపిస్తోందమ్మా’ అని కావ్య బాధపడుతుంది. దానికి కనకం.. ‘ మా వాళ్ల నిన్ను కూడా అవమానించారు కదమ్మా, దానికి మాకెంత బాధగా ఉంటుంది.’ అని అంటుంది. వెంటనే మూర్తి.. ఏం జరగకూడదని తాను ముందు నుంచి అనుకున్నానో అదే జరిగిందంటాడు. ఇప్పటి నుంచి ఆ ఇంట్లో పదునైన కత్తులు, బాణాలకు నువ్వే ఎదురు నిలపడాలని, ఉత్త చేతులతో పోరాడమని ఉచిత సలహాలు ఇవ్వడం తప్ప, నీ పుట్టింటివారు నీకు ఏవిధంగానూ సహాయం చేయలేరు. ఇక నుంచి అయినా నీ స్వార్థం నువ్వు చూసుకో, నీ కాపురం చూసుకో, మమ్మల్ని వదిలేయ్.. మా ధరిద్రం నీకు అంటకుండా చూసుకో అని మూర్తి చెప్పి వెళ్తుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
Brahmamudi

Brahmamudi

వెంటనే ధాన్యలక్ష్మి వచ్చి... వెళ్లండి కానీ మళ్లీ రాకండి అంటుంది. ‘ఇప్పటి వరకు మా పక్కనే ఉంటూ, మమ్మల్ని నమ్మిస్తూ, అవకాశం  దొరికితే పెళ్లి ఆపించి, మీ కూతురితో పెళ్లి జరిపించాలని చూసింది చాలు. మీ అందరి అసలు స్వరూపం బయటపడింది. ఇంక మిమ్మల్ని మా ఇంట్లో బంధువులుగా ఏ వేడుకకు పిలవరు. ఒకవేళ మా ఇంటి పెద్దరికం సంస్కారం కాదని పిలిచినా, మీరు ఎవరూ మా గడప తొక్కడానికి వీళ్లేదు.’అని ధాన్యలక్ష్మి అల్టిమేటం చేస్తుంది.

310
Brahmamudi

Brahmamudi


కావ్య చిన్న అత్తయ్య అని పిలిచినా.. అలా పిలిచే హక్కు నీకు లేదు అని ధాన్యలక్ష్మి అంటుంది. ‘ ఇందులో  మా అక్క తప్పేమీ లేదు’అని అప్పూ చెప్పే ప్రయత్నం చేసినా ధాన్యలక్ష్మి వినదు. ‘అసలు తప్పంతా నాది, మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలని మా అక్క చెప్పినా నేను వినలేదని, మిమ్మల్ని నమ్మి, వెనకేసుకువచ్చాను. అది నా తప్పు అని ఇప్పుడే అర్థమైంది.’ అని అంటుంది. ‘అంత మాట అనకండమ్మ, తప్పు మా వైపే ఉంది. కానీ, ఇందులో మా కావ్య చేసింది ఏమీ లేదు’అని కనకం చెప్పినా ధాన్యలక్ష్మి వినిపించుకోదు.  పులి మంచిదని తోడులు, సింహం సిఫార్సు చేయక్కర్లేదని, మీ ఇంట్లో అందరూ అవకాశవాదులే అని, అవకాశాన్ని బట్టి ఆశలను నిజం చేసుకోవాలి అనుకునేవారే అని అంటుంది.

410
Brahmamudi

Brahmamudi

పాపం.. కావ్యను ఏమీ అనొద్దని అప్పూ ప్రాధేయపడుతుంది.  కానీ, అప్పూపై ధాన్యలక్ష్మి చాలా నిందలు వేస్తుంది. తన కొడుకుని అమాయకుడిని చూసి వలలో వేసుకోవాలని చూశావని, స్నేహం పేరుతో ప్రేమలో దింపాలని చూశావని అంటుంది. తన కొడుకుది మంచి మనసు కాబట్టి, నీ తప్పుని కూడా తన తప్పుగా భావించాడు అని చాలా మాటలు అంటుంది. మళ్లీ వాడి కాపురంలోకి కానీ, జీవితంలోకి కానీ తొంగి చూశావంటే మర్యాదగా ఉండదు అని అప్పూకి వార్నింగ్ ఇస్తుంది. పనిలో పనిగా.. కావ్యపై చాలా మాటలు మాట్లాడుతుంది. 

510
Brahmamudi

Brahmamudi


‘మావైపు తప్పు జరగకూడదనే ఉద్దేశంతోనే దాని మనసు చంపి, ఈ పెళ్లికి తీసుకువచ్చాం. అది కూడా తప్పేనని తెలిసిపోయింది. కానీ, ఒక్క విషయం చెప్పే అవకాశం ఇవ్వండి. మీ దృష్టిలో మాది స్వార్థం, అత్యాశ అయ్యి ఉండొచ్చు. కానీ, ఇందులో మా కావ్య మాత్రం నిరపరాధి. అదొక్కటి నమ్మితే చాలు’అని మూర్తి కూడా ధాన్యలక్ష్మి ప్రాధేయపడతాడు. కానీఅతని మాటలను కూడా ధాన్యలక్ష్మి నమ్మదు. తమ కొడుకు జీవితంలోకి తొంగి చూడకడదని, మీ హద్దుల్లో మీరు ఉండాలి అని కనకం, అప్పూలకు వార్నింగ్ ఇస్తుంది.

610
Brahmamudi

Brahmamudi

వధూవరులు ఇంట్లోకి వస్తుంటే, కావ్యను హారతి ఇవ్వమని చెబుతారు. కానీ అనామిక తల్లి అందుకు అంగీకరించదు. ‘ఈ పెళ్లి ఆపాలని కావ్య కుట్ర చేసిందని, అలాంటి తనతో తన కూతురికి హారతి ఇప్పిస్తారా, అన్యాయం చేయాలనుకున్న మనిషితో ఎలా హరతి ఇవ్వమంటారు. దుగ్గిరాల ఇంటికి మీరు గొప్ప గొప్ప ఇంటి నుంచి కోడలిగా తెచ్చుకుంటారని అనుకున్నాం. కానీ మీ కోడలి కుటుంబం ఎలాంటిదో చూశాం. ఆ కుటుంబం నుంచి వచ్చిన కావ్య.. తన చెల్లిలి స్థానంలో అనామిక ఉంటే, ఎలా మనస్పూర్తిగా హారతి ఇస్తుంది’ అని అనామిక తండ్రి అంటాడు.

710
Brahmamudi

Brahmamudi

కళ్యాణ్ అతనిని ఆపాలని చూస్తుంటే..అది నిజమే కదా అని తన పేరెంట్స్ కి  అనామిక వత్తాసు పలుకుతుంది. ‘ అనామిక, నువ్వు కూడా మా వదినను అపార్థం చేసుకుంటున్నావ్’అని కళ్యాణ్ నచ్చచెప్పాలని చూస్తే.. కావ్య ఎలాంటిదో మన పెళ్లిలో తెలుసుకున్నాను అని, మంచిదానిలా నటించి మోసం చేయాలని చూసిందని, తన చెల్లిలి కోసం సాటి ఆడపిల్ల పెళ్లి ఆగిపోవాలని చూసిందని  అనామిక ఆరోపిస్తుంది. కావ్య హారతి ఇవ్వడానికి అనామిక అంగీకరిందు.

ఇందిరాదేవి.. అనామికకు నచ్చచెప్పాలని ప్రయత్నిస్తుంది. అలాంటి గొడవను ఇక్కడిదాకా మోసుకురాకూడదు అని సర్ధిచెబుతుంది. కానీ, మధ్యలో రుద్రాణి దూరి.. కావ్య పెళ్లి పెటాకులు చేయాలని చూసిందని, అనామికకు సపోర్ట్ గా మాట్లాడుతుంది. అపర్ణ సైతం అనామిక చెప్పిందే కరెక్ట్ అని , అప్పూ గురించి కూడా దారుణంగా మాట్లాడుతుంది. కావ్య.. తన కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడవద్దని కావ్య ప్రాధేయపడినా.. అపర్ణ చాలా దారుణంగా మాట్లాడుతుంది. కానీ, వాళ్ల మాటలకు ఇందిరాదేవి మండిపోతుంది. ఎవరికి ఇవ్వాల్సినవి వాళ్లకు ఇచ్చి, సెటైర్లు వేస్తుంది.

810
Brahmamudi

Brahmamudi

ధాన్యలక్ష్మి సైతం కావ్య, అప్పూలదే తప్పు అని మాట్లాడుతుంది. అందరూ కలిసి, కావ్యపై నిందలు వేస్తారు. కావ్య హారతి ఇవ్వడం తనకి కూడా ఇష్టం లేదని ధాన్యలక్ష్మి కూడా మాట్లాడుతుంది.  అనామిక.. తర్వాత.. కావ్య హారతి ఇస్తానంటే తనకు వద్దని, అసలు హారతి లేకుండా అయినా లోపలికి వస్తాను అని అంటుంది. కళ్యాణ్ చాలా నచ్చచెప్పాలని ప్రయత్నించినా.. ఎవరూ నమ్మరు. కళ్యాన్ మాత్రం తనకు హారతి కావ్య ఇవ్వాలని అంటాడు. వదిన వల్లే తాను అనామికను కలిశానని, వదిన వల్లే తాము ఒక్కటయ్యాం అని.. వదినే హారతి ఇస్తేనే తాను లోపలికి వస్తాను అని చెబుతాడు. అయితే.. కళ్యాణ్ నిర్ణయం మార్చుకోకపోతే.. తాను అసలు ఇంట్లోకే రాను అని అనామిక తేల్చిచెబుతుంది. పుట్టింటికి వెళ్లిపోతాను అంటుంది. ఆ మాటకు అందరూ షాకౌతారు.

కానీ, కావ్య మంచి మనసుతో.. హారతి తాను ఇవ్వను అని, మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది.  వెంటనే రాజ్ సపోర్ట్ చేస్తాడు. ‘ విన్నారు కదా ఇది కావ్య సంస్కారం. ఇంట్లో ఇందరు తప్పుపట్టినా , మీ కూతురి మంచే కోరుకుంది. నాకు తెలుసు.. కళ్యాణ్, అనామికల పెళ్లి జరగాలని ఎంత బలంగా కోరుకుందో. ఆమె సంకల్పం వల్లే.. ఈ రోజు మీకూతరు మా ఇంటి కోడలిగా అడుగుపెడుతుంది. అది మీరు మీ అమ్మాయి గుర్తిస్తే మంచిది’ అని అనామిక తండ్రి సుబ్రహ్మణ్యం కి రాజ్ అర్థమయ్యేలా చెబుతాడు.
 

910
Brahmamudi

Brahmamudi

రాజ్ తమకు డబ్బులు ఇచ్చి సహాయం చేస్తున్నాడు కాబట్టి.. ఈ సమయంలో గొడవ చేయవద్దని , మళ్లీ తన భార్యను ఇన్ సల్ట్ చేశామని రాజ్ డబ్బులు ఇవ్వకపోతే మనం రోడ్డున పడతాం అని సుబ్రహ్మణ్యం.. అనామిక చెవిలో చెబుతాడు. దీంతో  అనామిక కాస్త వెనక్కి తగ్గుతుంది. వెంటనే సుబ్రహ్మన్యం... కావ్యకు క్షమాపణలు చెబుతాడు. నువ్వే హారతి ఇవ్వమని అడుగుతాడు. దీంతో.. కావ్య హారతి ఇచ్చి, వధూవరులకు ఇంట్లోకి స్వాగతిస్తుంది.  రాజ్, ఇందిరాదేవి మాత్రమే సంతోషిస్తారు.

తర్వాత.. అనామికను ఆమె తల్లిదండ్రులు పక్కకు తీసుకువెళ్లి మాట్లాడతారు. కావ్య మీద డైరెక్ట్ గా వార్ చేస్తున్నట్లుగా మాట్లాడుతున్నావ్ ఏంటి అని తల్లి శైలజ అడుగుతుంది. తనకు కావ్యను చూస్తుంటే మండిపోతుందని అందుకే అలా మాట్లాడాను అని అనామిక చెబుతుంది. కానీ, చాలా కూల్ గా ఉండాలని తండ్రి సుబ్రహ్మణ్యం చెబుతాడు. అనామిక మాత్రం..కావ్య కళ్యాన్ ముందు మంచిగా ఉంటూ.. వెనక నుంచి.. అప్పూతో పెళ్లి చేయాలని చూసిందని , అలాంటి మనిషితో ఇలా కాకుండా ఇంకా ఎలా మాట్లాడాలి అని అనామిక అడుగుతుంది. అప్పటికే.. తాను చాలా పద్దతిగా మాట్లాడానని, కొత్తగా  అత్తారింట్లో అడుగుపెట్టానని ఆలోచించి మరీ మాట్లాడాను అంటుంది.

1010
Brahmamudi

Brahmamudi

వెంటనే తండ్రి సుబ్రహ్మణ్యం..నీకు ఎంత కోపం ఉన్నా, ఇంట్లో అందరికీ కావ్య అంటే ప్రేమ ఉంది, కావ్యతోనే హారతి ఇప్పించాలని పట్టుబట్టారని చెబుతాడు. కళ్యాణ్ కూడా కావ్యకు సపోర్ట్ చేయడం తనకు నచ్చలేదని అనామిక అంటుంది. దానికి తల్లి శైలజ.. ముందు నీ మొగుడిని నువ్వు కంట్రోల్ లో పెట్టుకోమని సలహా ఇస్తుంది.  కావ్య, స్వప్నలు గొడవల కారణంగా అనుకోకుండా ఈ ఇంటి కోడళ్లు అయ్యారని,  కానీ నువ్వు అలా కాదు కదా.. అందరి దృష్టిలో నీ పై మంచి అభిప్రాయం ఉంటుందని, నువ్వు ఏది చెబితే వాళ్లు వింటారని, అది నీకు మంచి అడ్వాంటేజ్ అని తండ్రి అనామికకు సలహా ఇస్తాడు.

కావ్య తో కోపంగా ఉండకని, నవ్వుతూ ఉండమని, అవకాశం దొరికినప్పుడు మాత్రమే కావ్యను ఇరికించమని సలహా ఇస్తారు. అందరి ముందు తనకు కావ్య అంటే కోపం లేదని, కేవలం ఇంటి కోసం మాత్రమే అలా చేస్తున్నానని నమ్మించమని సలహా ఇస్తారు. తల్లిదండ్రుల బ్రెయిన్ వాష్ తో అనామికకు ఓ క్లారిటీ వస్తుంది. తర్వాత ఇంటి హాల్లో అందరూ కూర్చొని ఉంటారు. పెళ్లి జరిగిందని అందరూ సంతోషంగా ఉంటారు. ధాన్యలక్ష్మి తనకు కోడలు కాదు.. కూతురు వచ్చినట్లుగా ఉందని, అలా చూసుకుంటాను అని చెబుతుంది. రుద్రాణి మాత్రం మరోసారి అప్పూ విషయం తీసుకువస్తుంది. ఆ విషయం వదిలేయమని కావ్య, ఇందిరాదేవి ఆపేస్తారు. తర్వాతి శుభకార్యానికి తమ ఇంటికి తీసుకువెళతాం అని అనామిక తల్లిదండ్రులు అంటే, లేదు..తమ ఇంట్లోనే కార్యం జరిపించాలని అపర్ణ దేవి అంటుంది.

కమింగ్ అప్ లో కావ్య అందరికీ భోజనాలు వడ్డిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా అందరూ కావ్యను ఎవాయిడ్ చేస్తారు. ముఖ్యంగా ధాన్యలక్ష్మీ చీదరించుకుంటున్నట్లుగా మాట్లాడుతుంది. దానికి కావ్య బాధపడుతుందని రాజ్ సపోర్ట్ చేస్తాడు. తనను పిలిచి మరీ  తనకు వడ్డించమని అడిగి, చాలా రుచిగా ఉన్నాయని తింటూ ఉంటాడు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Timings: టైమ్ మారింది భయ్య.. ఇక బిగ్ బాస్ అభిమానులకు పండగే? అందరికి అందుబాటు సమయానికి సీజన్ 10
Recommended image2
Agnipariksha 2: రైతు బిడ్డ సింగర్‌ ఝాన్సీ సంచలనం.. బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫస్ట్ కంటెస్టెంట్‌ కన్ఫమ్‌
Recommended image3
Sivaji Remuneration: మరోసారి బిగ్‌ బాస్‌ కి యాంకర్‌గా శివాజీ.. ఊహించని రెమ్యూనరేషన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved