- Home
- Entertainment
- TV
- BrahmaMudi Serial:డబ్బు కోసం అనామిక పేరెంట్స్ కుట్ర, పెళ్లి కి రెడీ అయిన శ్వేత, ఇరకాటంలో రాజ్
BrahmaMudi Serial:డబ్బు కోసం అనామిక పేరెంట్స్ కుట్ర, పెళ్లి కి రెడీ అయిన శ్వేత, ఇరకాటంలో రాజ్
ధాన్యలక్ష్మి కూడా.. మామయ్యగారి ఆరోగ్యం సడెన్ గా ఇలా జరిగింది అంటే భయంగా ఉందని ఈ పెళ్లి సంబంధం వల్లే మామయ్య ఏదైనా జరిగితే బాధపడాల్సి వస్తుందని అంటుంది. రాజ్, అపర్ణ.. ముందే అలాంటి నిర్ణయం తీసుకోవద్దని చెబుతారు.

Brahmamudi
BrahmaMudi Serial: దుగ్గిరాల ఇంట్లో పెళ్లి పనులు జరుగుతూ ఉంటాయి. రుద్రాణి హాల్లో కూర్చుంటే.. స్వప్న కూడా వచ్చి రుద్రాణి పక్కనే కూర్చుంటుంది. అది రుద్రాణికి నచ్చదు. తర్వాత, వెండి బాసికం, పుస్తెలు గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే, రుద్రాణి.. ముక్కుపుడకతో సహా అన్నీ మనతోనే కొనిపించేలా ఉన్నారు అని రుద్రాణి అంటుంది. ఎందుకు అలా అన్నావ్ అని అపర్ణ అంటే, డబ్బు చూసే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారని అనిపిస్తోందని రుద్రాణి అంటుంది. రాహుల్ కూడా.. తనకు కూడా అలానే అనిపించింది అని చెబుతాడు.
Brahmamudi
అయితే, రాజ్.. అలా అనొద్దు అంటాడు, తన పెళ్లి, రాహుల్ పెళ్లి చాలా గొడవల మధ్య జరిగిందని, కనీసం కళ్యాణ్ పెళ్లి అయినా, ప్రశాంతంగా జరగాలి అంటాడు. ఇందిరాదేవి కూడా అదే సమర్ధిస్తుంది. అనామిక వైపు నుంచి ఏం తక్కువ అయినా, గొడవ చేయవద్దని, మనం సర్దుకుందామని, ముఖ్యంగా రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది. ఈలోగా సీతారామయ్య కాస్త గుండెల్లో నొప్పిఉందని లేచి తన గదిలోకి వెళ్లిపోతుంటాడు. మధ్యలో పడిపోతోబోతుంటే.. రాజ్ వెళ్లి పట్టుకుంటాడు. అందరూ సీతారామయ్య చుట్టూ చేరుతారు. తనకు ఏదోలా ఉందని సీతారామయ్య అనగానే, రాజ్ డాక్టర్ కి ఫోన్ చేస్తాడు.
Brahmamudi
ఈ పెళ్లి పోస్ట్ పోన్ చేసుకుందాం అని అనామిక వాళ్ల ఫ్యామిలీకి చెబుదాం అని కళ్యాణ్ అంటాడు. వెంటనే రుద్రాణి, ఈ పెళ్లి అనుకున్నప్పటి నుంచి ఇలా జరుగుతోందని, అసలు ఈ పెళ్లి జరిగేలా కనిపించడం లేదు అని రుద్రాణి అంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందో తనకు తెలుసు అని కళ్యాణ్ అంటాడు. నిమ్మ మొక్క మార్చడం వల్లే ఇలా జరుగుతోందని కళ్యాణ్ భావిస్తాడు. అదే విషయం చెప్పబోతాడుకానీ,కావ్యను చూసి ఆగిపోతాడు. కానీ, తాతయ్య ఆరోగ్యం కోసం పెళ్లి ఆపేద్దాం అంటాడు. కానీ, కావ్య మధ్యలో దూరి ముందు డాక్టర్ వచ్చిన చూసిన తర్వాత నిర్ణయం తీసుకుందాం అని అంటుంది. ధాన్యలక్ష్మి కూడా.. మామయ్యగారి ఆరోగ్యం సడెన్ గా ఇలా జరిగింది అంటే భయంగా ఉందని ఈ పెళ్లి సంబంధం వల్లే మామయ్య ఏదైనా జరిగితే బాధపడాల్సి వస్తుందని అంటుంది. రాజ్, అపర్ణ.. ముందే అలాంటి నిర్ణయం తీసుకోవద్దని చెబుతారు.
Brahmamudi
ఇంతలో డాక్టర్ వచ్చి సీతారామయ్యను పరీక్షిస్తూ ఉంటారు. ఇందిరాదేవి భయపడుతుంటే, రాజ్ ధైర్యం చెబుతాడు. అదే సమయానికి కళ్యాణ్ కి అనామిక తండ్రి ఫోన్ చేస్తాడు, వాళ్లకు ఫోన్ లిఫ్ట్ చేసి పెళ్లి జరగదు అని చెప్పాలని అనుకుంటాడు. కానీ అపర్ణ వద్దు అని వారిస్తుంది. ‘ జాతకంలో దోషం కారణంగా తాతయ్యకు ఏదైనా అయితే అందరం తట్టుకోలేం’ అని కళ్యాణ్ అంటాడు. ఆ సమయంలో కనకం ఫేస్ మాడిపోతంది. ఆ జాతకం డ్రామా కనకమే చేస్తుంది కాబట్టి, కాస్త గిల్టీ గా ఫీలౌతుంది. ఇందిరాదేవి కూడా.. జాతక దోషానికి నివారణ చేశాం కదా అంటుంది. వదిన మొక్క మార్చిందనే విషయం చెబితే, అందరూ వదినను దోసిని చేస్తారని, ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు అని కళ్యాణ్ భావిస్తాడు.
Brahmamudi
తర్వత డాక్టర్ పరందామయ్యను పూర్తిగా చెక్ చేస్తాడు. మీరు హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వడం మంచిదని డాక్టర్ సూచిస్తాడు. అదే విషయం ఇంట్లో వాళ్లకు చెబుతానంటాడు. కానీ, పరందామయ్య అలా చెప్పొద్దు అంటాడు. తన మనవడి పెళ్లి జరుగుతోందని, ఇప్పుడు తాను హాస్పిటల్ లో చేరితే, పెళ్లి ఆగిపోతుందని, తనలాంటి పండుటాకు కోసం, చిగురాకుల జీవితాలను నాశనం చేయకూడదని, జాతకం పేరిట అమ్మాయి జీవితం నాశనమౌతుందని, ఈ విషయం చెప్పొద్దు అని పరందామయ్య అడుగుతాడు. డాక్టర్ నచ్చచెప్పాలని చూసినా కూడా పరందామయ్య వినడు. ఇక చేసేదిలేక, ఆయన చెప్పినదానికి డాక్టర్ అంగీకరిస్తాడు.
వెంటనే బయటకు వచ్చి, పరందామయ్య ఆరోగ్యం బాగానే ఉందని, ప్రమాదం ఏమీ లేదని చెబుతాడు. దీంతో, ఇంట్లోవాళ్లంతా సంతోషిస్తారు. కాకపోతే, కొన్ని ట్యాబ్లెట్స్ రాసి ఇచ్చి, తర్వాత ఏదైనా కాంప్లికేషన్స్ వస్తే, అప్పుడు హాస్పిటల్ లో అడ్మిట్ చేద్దాం అని చెప్పి డాక్టర్ వెళతాడు. తర్వాత, ఇందిరాదేవి సంతోషంగా సీతారమయ్య దగ్గరకు వెళ్తుంది. ఆయన కూడా.. మనవడి పెళ్లి ఆగడానికి వీల్లేదని చెబుతాడు. ఆమె కూడా సరే అంటుంది.
Brahmamudi
మరోవైపు అనామిక తల్లిదండ్రులు టెన్షన్ పడుతూ ఉంటారు. పెళ్లి ఏర్పాట్లు అన్నీ వాళ్లే చేస్తున్నారు కాబట్టి, ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అని అనామిక తండ్రి అంటాడు. ఖర్చు తప్పిందని సంతోషపడమని ఆయన భార్యచెబుతుంది. పెళ్లి ఖర్చు తప్పిందని సంతోషంగానే ఉందని, కాకపోతే నగలు పెట్టమంటే ఏం చేయాలని అని ఫీలౌతాడు. అలా వాళ్లు ఏమీ చేయరని వాళ్లకు గోల్డ్ దుకాణాలు ఉన్నాయి కదా అంటుంది. ఈలోగా, అనామిక తండ్రికి అప్పుల వాళ్లు ఫోన్లు చేస్తూ ఉంటారు. పెళ్లికాగానే డబ్బులు ఇచ్చేస్తాం అని అనామిక తండ్రి చెబుతూ ఉంటాడు. డబ్బు ఇవ్వకుంటే సీతారామయ్యకు చెబుతా అని అప్పు ఇచ్చిన వాళ్లు బెదిరిస్తారు. తర్వాత, వీళ్లిద్దరూ.. పెళ్లికాగానే కళ్యాణ్ తో రూ.2కోట్లు తీసుకోవాలని అనుకుంటాడు.
Brahmamudi
తర్వాత, రాజ్.. నువ్వునేను ప్రేమ సీరియల్ హీరో విక్కీ కి ఫోన్ చేసి పెళ్లికి రమ్మని ఆహ్వానిస్తాడు.మరోవైపు కావ్య.. పెళ్లికి చీరలు సెలక్ట్ చేసుకుంటూ ఉంటుంది. మధ్యలో ఏదో పని గుర్తుకువచ్చి బయటకు వెళ్తుంది. అప్పుడే రాజ్ వచ్చి బ్యాగులో మొత్తం తన చీరలే పెట్టుకుంటుందని, తనకు పెట్టడం లేదు అనుకుంటూ వెళతాడు. అప్పుడే శ్వేత ఫోన్ చేస్తుంది. అయితే, తనకు కలవడం కుదరదు అని, కళ్యాణ్ పెళ్లి అని, రిసార్ట్ కి వెళ్తున్నాం అని చెబుతాడు. అలా చెప్తుండగానే, కావ్య వస్తుంది. మరోవైపు శ్వేత.. రిసార్ట్ పేరు అడుగుతుంది. పక్కకు వెళ్లి రాజ్ ఫోన్ మాట్లాడుదాం అనుకుంటే, కావ్య పిలుస్తుంది... గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నారా అని అడుగుతుంది. రాజ్ షాకైపోతాడు. ఆఫీసు విషయాలే కదా మీరు మాట్లాడేది అంటుంది. ఫోన్ కట్ చేయకుండానే కావ్య ని విషయం ఏంటి అని అడుగుతాడు. పెళ్లికి డ్రెస్ గురించి అడుగుతున్నాను అంటుంది. అదంతా శ్వేత వినేస్తుంది. కావ్య మాటలు విని శ్వేత హ్యాపీగా నవ్వుతుంది. తర్వాత శ్వేత మాత్రం.. రిసార్ట్ పేరు చెప్పమని అడుగుతుంది. రాజ్ కూడా చెప్పేస్తాడు. శ్వేత ఆ పెళ్లికి వెళ్లాలి అని డిసైడ్ అవుతుంది. కమింగప్ లో పెళ్లి రిసార్ట్ లో మొదలౌతుంది.