- Home
- Entertainment
- TV
- BrahmaMudi Serial: కళ్యాణ్ ప్రేమకు కరిగిపోయిన కనకం, స్వప్నను బలి చేస్తున్న రుద్రాణి..!
BrahmaMudi Serial: కళ్యాణ్ ప్రేమకు కరిగిపోయిన కనకం, స్వప్నను బలి చేస్తున్న రుద్రాణి..!
అపర్ణ.. రాజ్ కావ్యను వదిలేసిన తర్వాత, తాను ఇష్టపడుతున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అదే నిజమైతే, అదే జరగాలని కోరుకుంటాను అని అనుకుంటుంది. నా కొడుకు సంతోషం కంటే, నాకు ఏదీ ముఖ్యం కాదు అని తనలో తానే అనుకుంటుంది.

Brahmamudi
BrahmaMudi Serial:రాజ్ ఎవరూ చూడకుండా శ్వేతతో మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి అపర్ణ షాకౌతుంది. అసలు రాజ్ ని గుడిలో కలిసిన అమ్మాయి ఎవరు? కావ్యతో ఎందుకు క్లోజ్ గా ఉంటున్నాడని ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోగా రాజ్ తన ఫోన్ కాల్ పూర్తి చేసుకొని వెనక్కి తిరిగేలోగా తల్లి కనపడుతుంది. ఏమీ తెలియనట్లుగా వెళ్లిపోతుంటే.. తప్పుకొని వెళ్తున్నావా? తప్పించకొని వెళ్తున్నావా? అసలు నువ్వు ఏం చేస్తున్నావ్ రాజ్ అని అపర్ణ అడుగుతుంది. దేని గురించి అడుగుతున్నావో అర్థం కావడం లేదు అని రాజ్ అంటాడు. ‘కావ్య గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోకుండా, ముందుగానే గుడిలో అమ్మాయి గురించి అడగడం ఎందుకులే ’ అని మనసులోనే అనుకొని, బయటకు మాత్రం కావ్య విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నావ్ అని అడుగుతుంది.
‘నేను ముందుగానే చెప్పాను కదా మమ్మీ’ అంటాడు. ‘నువ్వు చెప్పినదానికీ, చేసే దానికీ సంబంధం ఉండటం లేదు, ఎందుకు ప్రతి విషయంలోనూ తనకు సపోర్ట్ చేస్తున్నావ్. గుడిలో కూడా ఎందుకు సపోర్ట్ చేశావ్?’ అని అడుగుతుంది. ‘ కళావతి తప్పు చేయకపోయినా నిందించారు కాబట్టి, సపోర్ట్ చేశాను. అందులో ప్రేమ ఎక్కడ ఉంది?’ అని అడుగుతాడు. ‘ పెళ్లి పత్రిక విషయంలోనూ అంతే సపోర్ట్ చేశావ్ కదా?’ అంటే,..‘నేను తనకోసం కాదు మమ్మీ, కళ్యాణ్ కోసం మాట్లాడాను, వాడు ప్రేమించిన అమ్మాయి వాడికి దూరమైపోతుందేమో అని భయపడ్డాను, అందుకే అలా మాట్లాడాను’ అని బదులిస్తాడు. ‘కానీ మాకు అలా కనిపించలేదు. నీ భార్య కాబట్టే సపోర్ట్ చేసినట్లు కనపడింది. మాకే అలా అనిపించింది అంటే, ఆ కావ్యకు అనిపించదా? అది నిజమని అనుకొని నీ మీద ఆశలు పెట్టుకోదా?’ అని నిలదీస్తుంది. ‘ అలా జరగదు మమ్మీ, నేను మాటిస్తున్నాను’ అంటాడు. ‘ మాట మెదడుకు సంబంధించినది, అది మనసుకు అర్థం కాదు, దానిని ప్రేమ అనే అనుకుంటుంది’ అని అంటుంది. దానికి రాజ్‘ నాకు ఎప్పటికీ కళావతి మీద ప్రేమ కలగదు’ అని తేల్చిచెబుతాడు. మరి కావ్యకు కలిగితే అని అపర్ణ అడిగితే, దానికి తాను బాధ్యుడిని కాదు అంటాడు. మనసులో ఏముందో అలా ఉండమని, హద్దుల్లో ఉండమని చెబుతుంది. అయితే, రాజ్ మాత్రం.. తాతయ్య ఆరోగ్యం బాగుపడే వరకు మాత్రమే కళావతి తన జీవితంలో ఉంటుందని. ఆ తర్వాత తన జీవితంలో నుంచి వెళ్లిపోయేలా చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.దీంతో, అపర్ణ.. రాజ్ కావ్యను వదిలేసిన తర్వాత, తాను ఇష్టపడుతున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అదే నిజమైతే, అదే జరగాలని కోరుకుంటాను అని అనుకుంటుంది. నా కొడుకు సంతోషం కంటే, నాకు ఏదీ ముఖ్యం కాదు అని తనలో తానే అనుకుంటుంది.
Brahmamudi
ఇక, తర్వాత కావ్య... కళ్యాణ్ చేతికి ఓ తాయత్తు కడుతుంది. నీ మీద ఏ చెడు దృష్టి పడకుండా కడుతున్నాను అని చెబుతుంది. మీరు ఉండగా నాకు ఏమీ కాదు వదిన అని కళ్యాణ్ అంటే, నేనుండగానే మొక్క ఎండిపోయింది కదా అంటుంది. కానీ మీరు మొక్క మార్చేశారు కదా అంటాడు. ఆ మాట కనకం చెవిన పడుతుంది. అంటే కావ్య.. ఆ మొక్క మార్చిందా అని తెలిసి షాకౌతుంది. మరోవైపు కావ్య, కళ్యాణ్ మాట్లాడుకుంటూనే ఉంటారు. నా చేతుల్లోనే పెళ్లి పత్రిక కాలిపోయింది కదా అంటుంది. కానీ, పెళ్లి ఆగిపోలేదు కదా అని కళ్యాణ్ అంటాడు. దీంతో, కావ్య దేవుడి దయ కూడా ఉండాలి పెళ్లి జరగాలంటే అంటుంది. కానీ, కళ్యాణ్ మాత్రం ఇప్పుడు తన లైఫ్ ఇలా మారిపోవడానికి కారణం మీరే వదిన అని, మీ తర్వాత, నా కవి మనసును అర్థం చేసుకుంది అనామిక అంటూ.. ఆమె గురించి కూడా చాలా గొప్పగా మాట్లాడతాడు. కళ్యాణ్ మాటలు విని కనకం కంట్లో కూడా నీళ్లు తిరుగుతాయి. అనామిక నాకు దూరం అయ్యి ఉంటే, నా జీవితంలోకి మరో అమ్మాయి వచ్చేది కాదని, జీవితాంతం తన జ్నాపకాలతోనే ఒంటరిగా మిగిలిపోతాను అని అంటాడు. అయితే, కావ్య అలా మాట్లాడకూడదని, జరిగినవన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండమని చెబుతుంది.
Brahmamudi
కానీ, కళ్యాణ్ మాటలు విని కనకం మనసు చలించిపోతుంది. కళ్యాణ్ ఏ మూలో అప్పూని ఇష్టపడుతున్నాడని అనుకున్నానని, అందుకే వీళ్ల పెళ్లి ఆపాలని అనుకున్నానని, కానీ ఇంతలా అనామికను ప్రేమిస్తున్నాడని తెలిసిన తర్వాత, ఈ పెళ్లిని ఆపాలని అనుకోవడం మంచిది కాదని, తన కూతురి సంతోషం కోసం మరో ఆడపిల్ల సంతోషాన్ని నాశనం చేయడం,కళ్యాణ్ ముఖం మీద చిరు నవ్వు చెరిపేయడం మంచిది కాదని, ఒకవేళ తన కూతురితో పెళ్లి చేసినా అది తన కూతురి జీవితానికి మంచిది కాదని అనుకుంటుంది. తెలీకుండానే చాలా పెద్ద తప్పు చేయాలని అనుకున్నానని, ఇప్పటి వరకు పెళ్లి ఆపాలని అనుకున్నానని, ఇక నుంచి ఏం జరిగినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఈ పెళ్లి జరిపించాలి అనే నిర్ణయం తీసుకుంటుంది.
Brahmamudi
మరోవైపు దుగ్గిరాల ఇంట్లో పెళ్లి పనులు మొదలుపెడతారు. పసుపు కొడుతూ ఉంటారు. పెళ్లి పిలుపుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయితే, ఈ సీరియల్ లో మరో సీరియల్ ని కూడా క్లబ్ చేశారు. ఆ రెండు సీరియల్స్ కలిపి కొన్ని సీన్లు చూపించారు. ఆ సొదే ఈ ఎపిసోడ్ అంతా సాగుతుంది. ‘ నువ్వు, నేను , ప్రేమ’ సీరియల్ లోని హీరో హీరోయిన్లతో కలిసి, కళ్యాణ్ పెళ్లికి ఆహ్వానిస్తారు. ఎక్కువగా ఆ సీరియల్ నే చూపించారు.
మరోవైపు, రుద్రాణి, రాహుల్ కూర్చొని పెళ్లి ఎలా ఆపుదామా అని ఆలోచిస్తూ ఉంటారు. పెళ్లి పనులు మొదలయ్యాయని, రాజ్, కావ్య పెళ్లి పత్రికలు పంచడానికి రెడీ అయ్యారని ఇంకెప్పుడు పెళ్లి ఆపుతావ్ అని అంటాడు. అనామిక కూడా ఈ ఇంటి కోడలు అయితే, కావ్యతో కలిసి మనల్ని ఇబ్బంది పెడుతుంది ఎలా పెళ్లి ఆపుదాం అని రాహుల్ అడుగుతాడు. అయితే, స్వప్న కారణంగా పెళ్లి ఆగిపోయేలా చేద్దాం అని, అరుణ్ మండపంలోకి వచ్చి, స్వప్న కడుపులో బిడ్డకు కారణం అని చెప్పేలా చేద్దాం అంటాడు. స్వప్న వల్ల పెళ్లి ఆగిపోయేలా చేద్దాం, తర్వాత స్వప్నను ఇంట్లో నుంచి తరిమేద్దాం అని ప్లాన్ వేస్తారు.
ఇక, మరోవైపు అప్పూ ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. కళ్యాణ్ పెళ్లి పనుల్లో వెళ్లి సహాయం చేయమని తండ్రి మూర్తి చెబుతాడు. అప్పూ తాను వెళ్లలేను అంటుంది. నువ్వు వెళ్లకపోతే, నువ్వు వచ్చే వరకు పెళ్లి చేసుకోకుండా ఆగిపోతాడుఅని, వాళ్లు ఏదో అన్నారని మీ స్నేహాన్ని ఎందుకు దూరం చేసుకుంటావని, ఈ రెండు రోజులుకళ్లు మూసుకుంటే పెళ్లి అయిపోతుందని తండ్రి అప్పూకి సలహా ఇస్తాడు.
కమింగప్ లో కళ్యాణ్ పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఈ నువ్వు, నేను ప్రేమ సీరియల్ హీరోయిన్లు కూడా ఈ పెళ్లికి వస్తారు. ఆ సందడి కమింగ్ ఎపిసోడ్ లో చూపించనున్నారు.