MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • BrahmaMudi January 4th Episode: కావ్య కు అండగా రాజ్, తిండి కూడా తినకుండా ఏడ్చేస్తున్న అప్పూ..!

BrahmaMudi January 4th Episode: కావ్య కు అండగా రాజ్, తిండి కూడా తినకుండా ఏడ్చేస్తున్న అప్పూ..!

మధ్యలో మా అమ్మ జోలికి ఎందుకు వస్తున్నావ్ అంటూ రాహుల్ దూరిపోతాడు. స్వప్న కూడా గట్టిగానే బదులిస్తుంది. ప్రకాశం కూడా తన మతిమరుపు.. నీకు వస్తే. ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అంటాడు. 

4 Min read
Author : ramya Sridhar
Published : Jan 04 2024, 11:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Brahmamudi

Brahmamudi

BrahmaMudi January 4th Episode: భోజనాల దగ్గర కావ్య వడ్డిస్తుంటే.. అందరూ కావ్య వాయిస్తారు. అది నచ్చని ఇందిరాదేవి.. అందరికీ క్లాస్ పీకుతుంది. అంతేకాదు.. కావ్య చేసిన వంట అమృతంలా ఉందని పొగుడుతుంది. ఇక నేటి ఎపిసోడ్ లో భోజనాల తర్వాత అందరికీ కావ్య పాయిసం ఇస్తుంది. అందరూ తీసుకుంటూ ఉంటారు. ధాన్యలక్ష్మి మాత్రం.. ‘ విషం కక్కేవారి చేతులతో అమృతం ఇచ్చినా, అది విషమే అవుతుంది నాకు వద్దు’ అంటుంది. అది విని అందరూ షాకౌతారు. వెంటనే ప్రకాశం.. ‘మరి నువ్వు ఇంకా ఎందుకు బతికున్నావ్..? కావ్య పాయిసం ఇస్తే విషం అన్నావ్ , ఇందాక కావ్య వండిన వంటే కదా తిన్నావ్.. ఇంకా పోలేదేంటి? అంత అయిష్టంగా ఉంటే.. పొద్దునే ఐదింటికి లేచి అందరికీ టీ, కాఫీ, గ్రీన్ టీ , మసాలా అన్నీ ఇచ్చి, అందరికీ మినపట్టు, దోశ, చట్నీ, తర్వాత మధ్యాహ్నం భోజనం అంతా నువ్వు వండేసై. విషం లా ఉన్నా కూడా..అందరం లొట్టలేసుకొని మింగేస్తాం’ అని కౌంటర్ ఇస్తాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Brahmamudi

Brahmamudi

ఇష్టం ఉంటే బయటకు చెప్పాలి. అయిష్టం ఉంటే లోపలే దాచుుకోవాలి. ఇలా పది మంది ముందు వెల్లగక్కితే.. మీ సంస్కారం ఏంటి అనేది బయటపడుతుంది అని, వద్దు అనుకుంటే అపర్ణ లాగా వద్దు అంటే సరిపోతుంది కదా అని ఇందిరాదేవి కూడ ధాన్యలక్ష్మికి క్లాస్ పీకుతుంది. ‘ మీరందరూ నా మీద యుద్ధం ప్రకటిస్తున్నారా? మీ మనవరాలి, ఆమె కుటుంబం మొత్తం  కలిసి ఏం చేశారో మర్చిపోయారా?’ అని ధాన్యం అడుగుతుంది. వెంటనే స్వప్న కలగజేసుకొని.. ‘ మర్చిపోయారు. మా వాళ్లు అంత నేరం, ఘోరం చేసినా చేయకపోయినా అంరదూ మర్చిపోయారు. మీరే ఇంకా మర్చిపోకుండా  గుర్తుపెట్టుకున్నారు. బాహుబలి1, బాహుబలి2 లాగా మా అత్త నోరు మూసుకొందని, మీరు కొత్త అవతారం ఎత్తారా ’ అని ధాన్యలక్ష్మిని స్వప్న కడిగేస్తుంది. మధ్యలో మా అమ్మ జోలికి ఎందుకు వస్తున్నావ్ అంటూ రాహుల్ దూరిపోతాడు. స్వప్న కూడా గట్టిగానే బదులిస్తుంది. ప్రకాశం కూడా తన మతిమరుపు.. నీకు వస్తే. ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అంటాడు.

37
Brahmamudi

Brahmamudi

తర్వాత కావ్య అందరికీ పాయిసం ఇస్తుంది. అందరూ తింటూ ఉంటారు. అనామిక మాత్రం తినకుండా చూస్తూ ఉంటుంది. అసలు ఈ పాయిసం తనకు నచ్చలేదు అని చెబుతుంది. వెంటనే రాజ్ తిని.. ‘ ఏంటి ఇది స్వీటా..? స్వీట్ కన్నా.. ఇంకా ఏదైనా పెద్ద పదం ఉంటే చెప్పు...కవి నువ్వు చెప్పురా.. అమృతం. లా ఉంది.’ అని అంటాడు. రాజ్ మాటలకు చాలా మంది ఫేసులు మాడిపోతాయి.  రాజ్ మాత్రం.. స్వీట్ చాలా బాగుందని కావ్యను పొగిడేస్తాడు.  తర్వాత.. మిగిలిన స్వీట్ గిన్నెలను కూడా  తీసుకువెళ్లి.. వాళ్ల అమ్మ, పిన్ని కి ఇస్తాడు. వాళ్లు కూడా తినేలా చేస్తాడు. ‘ నాకు సంస్కారం అంటే నేర్పిందే నువ్వు పిన్ని, అలాంటిది నవ్వే.. ’ అని రాజ్ అనగానే.. ధాన్యం కూడా తీసుకొని తినేస్తుంది. అప్పటి వరకు తినని అనామిక , రుద్రాణిలు కూడా తినేస్తారు. అది చూసి కావ్య సంతోషిస్తుంది. తర్వాత కావ్యను కూడా తినమని రాజ్ చెబుతాడు. 

‘నానమ్మ ఎప్పుడూ చెప్పేమాటే. ఉమ్మడి కుటుంబం అంటే ఉన్నతమైన కుటుంబం. సంతోషాన్ని పంచుకోవాలి. తప్పులు తొక్కి పారేయాలి’ అంటాడు. వెంటనే ఇందిరాదేవి.. నా అసలైన వారసుడు వీడే అని మురిసిపోతుంది. తర్వాత.. కళ్యాణ్, అనామికలను వేర్వేరుగా పడుకోవాలి అని ఇందిరాదేవి చెబుతుంది. దానికి ఎవరు ఎక్కడ పడుకోవాలి అనే చర్చ జరుగుతుంది. తర్వాత.. అందరూ కలిసి హాల్లో పడుకుందాం అని ప్రకాశం అడిగితే.. అందరూ ఐడియా బాగుందని అంటాడు. సందు దొరికినప్పుడల్లా స్వప్న మాత్రం రుద్రాణి పై సెటైర్లు వేస్తూనే ఉంటుంది.

47
Brahmamudi

Brahmamudi

మరోవైపు అప్పూ ఇంట్లో చికెన్ వండుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్లంతా అప్పూ ఏంటి ఇలా వింతగా ప్రవర్తిస్తోందని చూస్తూ ఉంటారు. తన కోపాన్ని, బాధనీ లోపలే దాచుకొని ఆ కసి మొత్తం వంటలో చూపిస్తూ.. వండుతూ ఉంటుంది. ఏడుస్తూ కూర్చుంటుందని అనుకుంటే.. ఇలా మౌనంగా భయపెడుతోందని, మగరాయుడిలా పెరిగిన పిల్ల.. ఒక్కసారిగా వంట గదిలోకి దూరింది ఏంటని కనకం ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత.. అన్నం, కూర అయ్యాయని అప్పూ అందరినీ పిలుస్తుంది.

57
Brahmamudi

Brahmamudi

అందరూ భోజనానికి కూర్చున్న తర్వాత అప్పూనే స్వయంగా వడ్డిస్తుంది. అందరూ అన్నం తినడం మొదలుపెట్టగానే.. అప్పూ నోట్లో ముద్దపెట్టుకోబోయి ఆగిపోతుంది.  కళ్యాణ్ ఆలోచనలు వెంటనే అప్పూకి గుర్తుకువస్తాయి. అవి తలుచుకొని అప్పూ ఏడ్చేస్తుంది. తినలేక.. చేతులు కడిగేసుకుంటుంది.  కనకం, మూర్తి ఎంత అడిగినా చెప్పకుండా..గదిలోకి వెళ్లి తలుపేసుకుంటుంది. కడుపులోని ఆకలినిని మనసులోని బాధ మింగేసిందని.. రాజ్యం అంటుంది. 

67
Brahmamudi

Brahmamudi


మరోవైపు దుగ్గిరాల కుటుంబం మొత్తం పడుకోవడానికి రెడీ అవుతారు. కళ్యాణ్ మాత్రం.. పడుకోవద్దని, ఏదైనా గేమ్ ఆడదాం అంటాడు. ట్రూత్ ఆర్ డేర్ ఆడదాం అని కళ్యాన్ అడుగుతాడు.అందరూ సరే అంటారు. కావ్య రాజ్ ని పక్కకు పిలిచి.. పడక గది రహస్యాలు చెప్పొచ్చు అంటుంది. అది విని రాజ్ వద్దూ అరుస్తాడు. కానీ, మిగిలిన వాళ్లు అందరూ ఆడదాం అనేస్తారు. తప్పక రాజ్ కూడా ఆడాల్సి వస్తుంది.

77
Brahmamudi

Brahmamudi

బాటిల్ తిప్పినప్పుడు మొదట ఇందిరాదేవికి వస్తుంది. తర్వాత.. అనామికకు వస్తుంది. ట్రూత్ అని అనామిక చెప్పేస్తుంది. ధాన్యలక్ష్మి ప్రశ్న అడుగుతుంది. ‘ అమ్మాయి అందగాడని ప్రేమించావా? ఆస్తి చూసి ప్రేమించావా?’ అని అడుగుతుంది. కళ్యాణ్ కవితలు చూసి ప్రేమించాను అని అనామిక చెబుతుంది. తిరిగి తిరిగి రాజ్ దగ్గరకు వస్తుంది. రాజ్ డేర్ చెబుతాడు. దానికి కళ్యాన్.. వదినకు ప్రపోజ్ చేసి ముద్దు కూడా పెట్టాలి అంటాడు. అది విని రాజ్ ఇరుక్కుంటాడు. అపర్ణ కు ఈ డేర్ నచ్చదు. వద్దు అంటుంది. అయినా కళ్యాణ్ వినిపించుకోడు. రాజ్ ప్రపోజ్ చేయాల్సిందే అని పట్టుపడతాడు. ఇక రాజ్ ప్రపోజ్ చేయడానికి రెడీ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.కమింగప్ లో. రాజ్ శ్వేతతో కలిసి ఐస్ క్రీమ్ తింటూ ఉంటాడు. అది కాస్త.. కావ్య కంటపడుతుంది. మరి  రేపు ఏం జరుగుతుందో చూద్దాం..

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Timings: టైమ్ మారింది భయ్య.. ఇక బిగ్ బాస్ అభిమానులకు పండగే? అందరికి అందుబాటు సమయానికి సీజన్ 10
Recommended image2
Agnipariksha 2: రైతు బిడ్డ సింగర్‌ ఝాన్సీ సంచలనం.. బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫస్ట్ కంటెస్టెంట్‌ కన్ఫమ్‌
Recommended image3
Sivaji Remuneration: మరోసారి బిగ్‌ బాస్‌ కి యాంకర్‌గా శివాజీ.. ఊహించని రెమ్యూనరేషన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved