MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • BrahmaMudi 9th January Episode:కళ్యాణ్ లుక్ మార్చిన అనామిక, రాజ్ కి చుక్కలు చూపించిన కావ్య..!

BrahmaMudi 9th January Episode:కళ్యాణ్ లుక్ మార్చిన అనామిక, రాజ్ కి చుక్కలు చూపించిన కావ్య..!

   తర్వాత.. అలిగిన అనామికను కళ్యాణ్ బుజ్జగిస్తాడు. అనామికు నచ్చినట్లు ఉంటానని మాట కూడా ఇస్తాడు. ముద్దు పెట్టబోతుంటే.. అనామిక ఆపేస్తుంది. ఇక.. కళ్యాణ్ ని తానే స్వయంగా రెడీ చేస్తానని అంటుంది.

4 Min read
Author : ramya Sridhar
Published : Jan 09 2024, 10:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Brahmamudi

Brahmamudi

BrahmaMudi 9th January Episode: రాజ్ మరో అమ్మాయితో రోడ్డు మీద ఐస్ క్రీమ్ తినడం, చనువుగా ఉండటం కావ్య చూసిన విషయం తెలిసిందే. అదే తలుచుకొని బాధపడుతూ ఉంటుంది.  అసలు ఆ అమ్మాయి ఎవరు..? ఆమెతో ఎందుకు అంత చనువుగా ఉన్నాడని ఆలోచిస్తుండగానే  రాజ్ వచ్చేస్తాడు. దీంతో.. ఒక్కసారిగా కావ్య పైకి లేస్తుంది. సడెన్ గా లేవడంతో రాజ్ భయపడతాడు. ఏమైంది అంటే.. టిఫిన్ తెచ్చిన క్యారేజ్ ఏది అని అడుగుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Brahmamudi

Brahmamudi

ఆఫీసులో మర్చిపోయాను అనిరాజ్ అంటే.. రేపు మర్చిపోకుండా తీసుకురమ్మని అడుగుతుంది. టిఫిన్ బాక్స్ ని కూడా వదలరా అని రాజ్ అంటే,, ఏదైనా వదిలేస్తే.. మళ్లీ తిరిగి రావడం లేదు అని కావ్య అంటుంది. కాఫీ తాగుతారా.. అది కూడా బయట తాగి వచ్చారా అంటుంది. బయట తాగడం ఏంటి..? నేను స్నానం చేసి వచ్చాక తాగాలా వద్దా ఆలోచిస్తా అని రాజ్ అంటే.. తాగాలా వద్ద కాదు.. కావాలా వద్దా అది క్లారిటీ కావాలి అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.  కావ్య.. ఇంత సీరియస్ గా ఎందుకు ఉందా అని రాజ్ ఆలోచిస్తుంటే.. సీరియస్ లుక్ ఇచ్చి.. టవల్ చేతిలో పెట్టి వెళ్లిపోతుంది. అసలు.. కావ్యకు ఏమైందా అని రాజ్ అనుకుంటాడు.

39
Brahmamudi

Brahmamudi

ఇక.. కళ్యాణ్ ఇంట్లో ఎప్పటిలాగానే రెడీ అవుతాడు. ఎలా ఉన్నాను అంటే.. అంకుల్ లా ఉన్నావ్ అని అనామిక అంటుంది. తాను క్లాస్ ఉన్నానని అప్పూ చెబుతూ ఉండేదని.. నీకు నచ్చలేదా అని కళ్యాణ్ అడుగుతాడు. అప్పూ పేరు ఎత్తే సరికి అనామికకు కోపం వచ్చి వెళ్లిపోతుంటే.. చెయ్యి పట్టుకొని ఆపేస్తాు. తర్వాత.. దగ్గరకు లాక్కుంటాడు. బ్యాగ్రౌండ్ లో రొమాంటిక్ సింగ్  వేస్తారు.  తర్వాత.. అలిగిన అనామికను కళ్యాణ్ బుజ్జగిస్తాడు. అనామికు నచ్చినట్లు ఉంటానని మాట కూడా ఇస్తాడు. ముద్దు పెట్టబోతుంటే.. అనామిక ఆపేస్తుంది. ఇక.. కళ్యాణ్ ని తానే స్వయంగా రెడీ చేస్తానని అంటుంది.

49
Brahmamudi

Brahmamudi


మరోవైపు రాజ్ కి కావ్య సీరియస్ లుక్ తోనే కాఫీ తెచ్చి ఇస్తుంది. ఆ కాఫీ ఇచ్చేటప్పుడు కూడా.. తన కోపాన్ని డైలాగుల రూపంలో క్లాస్ పీకుతుంది. రాజ్ ఏ మాట మాట్లాడితే.. ఆ మాటకు కౌంటర్ వేస్తూనే ఉంటుంది. కావ్య టార్చర్ కి రాజ్ కి తిక్క ఎక్కుతుంది. ఏమైందని.. ఎందుకు ఇలా ప్రవర్తిస్తోందని తల బాదుకుంటాడు.

59
Brahmamudi

Brahmamudi

ఇక.. మాట ఇచ్చినట్లుగాే కళ్యాణ్ లుక్ మత్తం అనామిక మార్చేస్తుంది.  అమాయకంగా ఉండే వాడిని రాక్ స్టార్ లుక్ లోకి మార్చేస్తుంది. అది చూసి కళ్యాణ్ మొదట కంగారుపడతాడు.  కోడి ఈకలు లేచినట్లు ఉన్నాయి అంటే.. అది లేటెస్ట్ ట్రెండ్ అని చెబుతుంది. తర్వాత డ్రెస్ కి తగినట్లుగా స్టైల్ గా నడవమని చెబుతుంది. కళ్యాణ్ కి సరిగా రాదు. మళ్లీ మళ్లీ ప్రయత్నించినా రాదు. అది కూడా ఎలా నడవాలో.. అనామిక నేర్పుతుంది. ఇప్పుడు హీరోలా ఉన్నావ్ అని అనామిక మెచ్చుకుంటుంది. కళ్యాన్ మాత్రం.. జాతరలో పులివేషం లా ఉందని భయపడతాడు. ఇంట్లోవాళ్లు చూసి.. మెచ్చుకోవాలి అని.. మళ్లీ మేకప్ వేస్తుంది.

69
Brahmamudi

Brahmamudi


సీన్ కట్ చేస్తే.. అప్పూ.. ఎక్కడికో బ్యాగ్ సర్దుకుంటూ ఉంటుంది. ఎక్కడికి అని మూర్తి అడిగితే.. పిజ్జా డెలివరీకి అని చెబుతుంది. అయితే.. నువ్వు కష్టపడితే తప్ప... ఇళ్లు గడవదా అని కనకం అంటుంది. మూర్తి కూడా అదే నచ్చచెప్పాలని చూస్తాడు. కానీ  అప్పూ.. చదువు ఆపనని, రెండు తాను హ్యాండిల్ చేయగను అంటుంది. అది కాదు అని ఏదో చెప్పబోతే.. తాను  అప్పూ అని.. మళ్లీ అమ్మాయిలా మార్చాలని అనుకోకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

అప్పూ మారిపోవాలని ప్రయత్నించినా తన వల్ల కావడం లేదు అని కనకం బాధపడుతుంది. అయితే.. అప్పూకి పెళ్లి చేస్తే సమస్య  తీరుతుందని రాజ్యలక్ష్మి అంటుంది.  కళ్యాణ్ లాంటి మంచి మనిషి.. అప్పూ జీవితంలోకి రావాలి అని రాజ్యం అంటుంది. అప్పూ పెళ్లికి ఒప్పుకోదు అని కనకం అంటే.. ఒప్పించాలి అని రాజ్యం అంటుంది. కానీ, అప్పూ మనసులో గాయం ఇంకా పచ్చిగానే ఉందని, మారడానికి సమయం పడుతుందని, అప్పటి వరకు దానిని ఇబ్బంది పెట్టకూడదు అని మూర్తి అంటాడు. కానీ, అలానే వదిలేస్తే.. అప్పూ ఇంకా మొండిగా మారుతుందని, అప్పుడు మన చేతిలో ఏమీ ఉండదు అని , ఆలోచించమని రాజ్యం చెబుతుంది.

79
Brahmamudi

Brahmamudi

దుగ్గిరాల ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉంటారు. రోజూ ఇదే పప్పా అని రాజ్ అంటే.. మళ్లీ కావ్య కౌంటర్ వేస్తుంది. కావ్య ప్రవర్తనకు మళ్లీ రాజ్ ఆలోచనలో పడిపోతాడు. ప్రకాశం మాత్రం.. కావ్య వంట అద్భుతుంగా ఉందని క్లాస్ పీకుతాడు. ఈ లోగా కళ్యాన్ ఎంట్రీ ఇస్తాడు. అది చూసి ఇంట్లో అందరూ షాకౌతారు. కళ్యాణ్.. అందరి ముందుకు రాడానికి భయపడుతుంటే.. అనామిక తీసుకొస్తుంది. డ్రెస్ అదిరింది అని రాజ్ అంటాడు. అందరూ.. బాగుందని ప్రశంసిస్తారు. అయితే.. ఆ క్రెడిట్ అంతా తనకే ఇవ్వాలని అనామిక చెబుతుంది.

89
Brahmamudi

Brahmamudi

పెళ్లాం రాగానే లుక్ మార్చేసిందని, ఇంకా ఎం మారుస్తుందో అని రుద్రాణి సెటైర్ వేస్తుంది. అయితే.. బార్య కోసం బట్టలు మార్చుకోవడంలో తప్పేమీ లేదని, క్యారెక్టర్ మారిపోతోనే ప్రాబ్లం అని రాజ్ కి సెటైర్ వేస్తుంది. తర్వాత.. ఇంట్లో రామయ్య..వీధిలో కృష్ణయ్య లా మారొద్దని అంటుంది. ఎవరి గురించి అంటున్నావ్ అని రుద్రాణి అంటే.. రాహుల్ ని అంటుంది. తర్వాత.. కళ్యాణ్ నిజాయితీ పరుడు అని మెచ్చుకుంటుంది.  వెంటనే ధాన్యలక్ష్మి.. ఆ నిజాయితీ నువ్వు కూడా అలవాటు చేసుకుంటే బాగుంటుంది అని కావ్య బాధపడేలా మాట్లాడుతుంది. కావ్యను అనేసరికి ఇందిరాదేవికి కోపం వస్తుంది.

కావ్య కళ్యాణ్ గురించి మంచిగానే చెప్పింది కదా..ఎందుకు అలా మాట్లాడుతుున్నావ్ అని అడుగుతుంది. మంచిగా మాట్లాడితే సరిపోదు.. మంచి కూడా కోరుకోవాలి కదా అని ధాన్యం అంటుంది. అది చాలా కష్టం అని అపర్ణ మళ్లీ కావ్య మీద సెటైర్లు వేస్తుంది.  మధ్యలో రుద్రాణి దూరితే.. సుభాష్ కరెక్ట్ గా సెటైర్ వేస్తాడు.

99
Brahmamudi

Brahmamudi


భోజనం తర్వాత.. కావ్య అలా ఎందుకు మాట్లాడుతోందా అని రాజ్ తెగ  ఆలోచిస్తూ ఉంటాడు. అంతలోనే కావ్య వచ్చేస్తుంది. అందరి ముందు ఎంటి డైలాగులు అని , వెటకారంగా ఎందుకు మాట్లాడుతున్నావ్ అని అడుగుతాడు. అసలు ఏంటి సంగతి అని అడుగుతాడు.  నిజంగా తెలికుండానే అడుగుతున్నారా అని అడుగుతుంది. అవునని అంటాడు. తర్వాత.. నన్ను పెళ్లి చేసుకున్నందుకు బాధపడుతున్నారా అని అడుగుతుంది. అవును అని రాజ్ అంటాడు. తర్వాత.. నేను చేసిన తప్పేంటి అని అడుగుతాడు..? క్లారిటీ కోసం అడిగాను అని,  ఆ క్లారిటీ వచ్చాక అడుగుతాను అని చెబుతుంది. కావ్య మాట్లాడింది రాజ్ కి ఏ మాత్రం అర్థం కాదు. కొట్టడానికి పూల కుండీ ఎత్తుతాడు.. గృహ హింస కేసు అవుతుందని కావ్య అనడంతో.. ఆగిపోయి పడుకుంటాడు.

కమింగప్ లో.. కావ్య పూజకు అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. రుద్రాణి కావాలనే.. దీపం కుందీ పడేస్తుంది. తర్వాత.. మళ్లీ రచ్చ మొదలౌతుంది. అందరూ కలిసి కావ్యను తిడుతూ ఉంటారు. ఆ రచ్చ రేపటి ఎపిసోడ్ లో చూద్దాం...

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sivaji Remuneration: మరోసారి బిగ్‌ బాస్‌ కి యాంకర్‌గా శివాజీ.. ఊహించని రెమ్యూనరేషన్‌
Recommended image2
Bigg Boss Telugu Winners :కళ్యాణ్ పడాల నుంచి శివబాలాజీ వరకు బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
Recommended image3
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved