MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • BrahmaMudi 6th January episode:శ్వేతతో రొమాంటిక్ గా రాజ్, రుద్రాణి నెత్తిన కూర్చుంటానన్న స్వప్న..!

BrahmaMudi 6th January episode:శ్వేతతో రొమాంటిక్ గా రాజ్, రుద్రాణి నెత్తిన కూర్చుంటానన్న స్వప్న..!

తర్వాత కావ్య.. రాజ్ కి కాఫీ ఇద్దాం అంటే అక్కడ లేడని.. ఎక్కడికి వెళ్లాడని అడుగుతుంది. ఏదో ఫోన్ వచ్చిందని వెళ్లాడని చెబుతారు. ఇక.. అందరూ కాఫీ ని పొగుడుతుంటే.. అనామికకు కోపం వస్తుంది

4 Min read
ramya Sridhar
Published : Jan 06 2024, 10:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
Brahmamudi

Brahmamudi

BrahmaMudi 6th January episode: అనామిక కాఫీ పెట్టడం సరిగా రాలేదని ఫీలౌతుంది. వెంటనే రుద్రాణి.. నువ్వేమీ ఫీలవ్వకు.. కావ్య, స్వప్న అంటే పేదరికంలో పుట్టి పెరిగారు కాబట్టి వాళ్లకు అన్ని పనులు వస్తాయి.. నువ్వు అలా కాదు కదా.. మహారాణిలా పెరిగావ్.. నీకు ఈ పనులు ఎలా వస్తాయి అని అంటుంది. అప్పుడే కిందకు వస్తున్న స్వప్న చెవిన ఆ మాటలు వినపడతాయి. తాము పేదరికంలో ఉన్నా.. తాను కూడా మహారాణిలా పెరిగాను అని స్వప్న అంటుంది. వెంటనే రుద్రాణి.. ఒక్క మాట అనగానే కోపం ముంచుకొచ్చిందా అని అడుగుతుంది. అందరి ముందు కోడలిని ఇలా తక్కువ చేసి  మాట్లాడకూడదని మీకు  తెలిస్తే, నాకు ఎందుకు కోపం వస్తుంది అని స్వప్న అంటుంది. వీళ్ల గొడవ మధ్యలోనే రాజ్ కి శ్వేత నుంచి ఫోన్ వస్తుంది.

210
Brahmamudi

Brahmamudi

ఫోన్ తీసుకొని పక్కకు వెళ్లిపోతాడు. మరోవైపు కావ్య అందరికీ మళ్లీ ఫ్రెష్ గా కాఫీలు పెటట్ుకొని వస్తుంది. అనామికకు ఇస్తుంటే.. తనకు అక్కర్లేదు అని చెబుతుంది. కళ్యాణ్ మాత్రం.. కాఫీ ఎంత బాగుందో  అని, ప్రకాశం కూడా వావ్ అంటూ కాఫీని పొగిడేస్తూ ఉంటారు. కళ్యాన్ అనామికతో మా వదిన దగ్గర నేర్చుకో అని చెబుతాడు. తర్వాత కావ్య.. రాజ్ కి కాఫీ ఇద్దాం అంటే అక్కడ లేడని.. ఎక్కడికి వెళ్లాడని అడుగుతుంది. ఏదో ఫోన్ వచ్చిందని వెళ్లాడని చెబుతారు. ఇక.. అందరూ కాఫీ ని పొగుడుతుంటే.. అనామికకు కోపం వస్తుంది.

310
Brahmamudi

Brahmamudi

మరోవైపు రాజ్ ని ఎలా కలవాలా అని శ్వేత ఎదురు చూస్తోంది. రాజ్ కి ఫోన్ చేస్తూనే ఉంటుంది. మీ తమ్ముడి పెళ్లి తర్వాత.. లాయర్ తో మాట్లాడాలని, విడాకుల గురించి మాట్లాడాలి అన్నావ్ కదా అని శ్వేత గుర్తు చేస్తుంది. లాయర్ అపాయింట్మెంట్ తీసుకున్నావా అని రాజ్ అడుగుతాడు. తీసుకున్నానని.. ఒకసారి ఆలోచించమని.. ఒక్కసారి ప్రోసీడింగ్ మొదలుపెడితే, మధ్యలో ఆపడానికి ఉండదు అని శ్వేత అంటే.. తాను అసలు ఆ విషయంలో ఆలోచించను అని, అపాయింట్మెంట్ ఎప్పుడో కనుక్కోమని అంటాడు. 9కి అని శ్వేత చెబితే.. తాను రెడీ అవుతాను అని చెబుతాడు. ఈ లోగా కావ్య వచ్చి కాఫీ ఇస్తుంది. అప్పుడే రెడీ అవుతున్నారంటే.. అర్జెంట్ మీటింగ్ ఉందని వెళ్లాలి అంటాడు. బ్రేక్ ఫాస్ట్ అని కావ్య అడిగితే.. తినే టైమ్ లేదు అంటాడు. బయట తింటానులే అంటాడు. రాజ్ కి బయట ఫుడ్ నచ్చదని.. తానే స్వయంగా టిఫిన్ రెడీ చేసి ఆఫీసుకు వెళ్లి ఇవ్వాలి అని అనుకుంటాడు.

410
Brahmamudi

Brahmamudi

మరోవైపు కాఫీ విషయంలో తనకు జరిగిన అవమానం గురించి అనామిక రగలిపోతూ ఉంటుంది. అది ఛాన్స్ గా తీసుకున్న రుద్రాణి వచ్చి... మరింత రెచ్చగొట్టాలని ఫిక్స్ అవుతుంది. అనామిక కు కాఫీ తెచ్చి ఇస్తుంది. నీ కోసం నేనే స్వయంగా తెచ్చి ఇచ్చాను అని చెబుతుంది. నాకు అక్కర్లేదు అని అనామిక అన్నా.. కాఫీ తీసుకునేలా ఒప్పిస్తుంది. తన అవమానం గురించి రగలిపోతుంది. అది కావ్య  తెలివితేటలని.. ఇంట్లో ఎవరి ఇష్టం లేకపోయినా కోడలిగా అడుగుపెట్టి.. ఇప్పుడు అందరినీ గ్రిప్ లో పెట్టుకుంది అంటే.. ఎంత టాలెంట్ ఉండి ఉండాలి అని కావ్య మీద నెగిటివ్ గా ఎక్కిస్తుంది. 

510
Brahmamudi

Brahmamudi

తనకు అలాంటి డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదని అనామిక అంటే.. అలా చేయకపోతే.. నువ్వే సమస్యల్లో పడతావ్ అని అంటుంది. కావ్యలాగా నువ్వు కూడా అందరినీ నీ గ్రిప్ లో పెట్టుుకోవాలని, అలా చేయాలి అంటే.. ముందు కళ్యాణ్ ని గ్రిప్ లో పెట్టుకోమని సలహా ఇస్తుంది. కళ్యాణ్ తన మాట వింటాడు అని అనామిక అంటే.. కావ్య విషయంలో రాడు అని.. చూపిస్తాడు. కావ్య బుద్ధి అందరికీ తెలిసేలా చేయాలని, అప్పుడు అందరూ నీ దారిలోకి వస్తారు అని సలహా ఇస్తుంది. అనామిక వెంటనే సరే అంటుంది. అయితే.. నిన్ను నా వైపు తిప్పుకున్నానని రుద్రాణి మనసులో హ్యాపీగా ఫీలైతుంది.

610
Brahmamudi

Brahmamudi

మరోవైపు శ్వేత, రాజ్ లు లాయర్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. లాయర్ ఇంకా రాకపోవడంతో. రాజ్ విసుక్కుంటాడు. అలా విసుక్కుంటే తనకు నచ్చదని శ్వేత అంటుంది. మరి నీ కోపం పోవాలంటే ఏం చేయాలి అని రాజ్ అడిగితే.. ఐస్ క్రీమ్ కావాలని అంటుంది. ఇద్దరూ కలిసి బండి దగ్గర ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. మరోవైపు రాజ్ కోసం కావ్య.. బ్రేక్ ఫాస్ట్ తీసుకొని ఆటోలో వస్తూ ఉంటుంది. దారిలో రాజ్ ఐస్ క్రీమ్ తింటూ కనపడతాడు. ఆటో ఆపిమరీ చూస్తుంది. శ్వేతతో రాజ్ చనువుగా ఉండటం చూసి షాకౌతుంది.

710
Brahmamudi

Brahmamudi

ఇంపార్టెంట్ మీటింగ్ అని చెప్పి.. రోడ్డు మీద అమ్మాయితో ఐస్ క్రీమ్ తింటున్నాడేంటి అని షాకౌతుంది. వెంటనే ఫోన్ చేస్తుంది. రాజ్ మాత్రం.. తాను ఆఫీసులోనే ఉన్నాను అని అబద్ధం చెబుతాడు. పనిలో ఉన్నాను అని చెప్పి, ఫోన్ కట్ చేస్తాడు. కావ్యకు బాదేసి ఆటోలో వెళ్లిపోతుంది. ఈ లోగా లాయర్ శ్వేతకు ఫోన్ చేస్తాడు. లాయర్ ని ఆఫీసుకే రమ్మని శ్వేత చెబుతుంది. ఇద్దరూ కలిసి కారులో ఆఫీసుకు వెళ్లిపోతారు.

810
Brahmamudi

Brahmamudi

కావ్య వెళ్తున్న ఆటోని రాజ్ క్రాస్ చేయడానికి చూస్తూ ఉంటాడు. ఆటో డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ.. దారి ఇవ్వడం లేదని.. కారు అడ్డంగా ఆపి, డ్రైవర్ ని తిట్టబోతాడు. ఆటోలో ఉన్న కావ్య.. రాజ్ చూడకుండా ముఖాన్ని కప్పుకుంటుంది. రాజ్ మాత్రం.. ఆటో డ్రైవర్ ని పిచ్చి పిచ్చిగా తిట్టేస్తాడు. శ్వేత నచ్చచెప్పి రాజ్ ని తీసుకొని వెళ్లిపోతుంది. ఆటో డ్రైవర్ .. రాజ్ గురించి తప్పుగా మాట్లాడితే.. కోపం వచ్చి కావ్య క్లాస్ పీకుతుంది.

910
Brahmamudi

Brahmamudi

మరోవైపు స్వప్న ఇంట్లో రచ్చ చేయడం మొదలుపెడుతుంది. తాను ఏ తప్పు చేయలేదు అని రుజువు అయితే.. తనను నెత్తిన పెట్టుకుంటాను అన్నావ్ కదా అని గుర్తు చేసి.. కుర్చీ తెచ్చి రుద్రాణి తలమీద పెడుతుంది. నెత్తిమీద కూర్చోపెట్టుకొని.. తనను ఇల్లంతా తిప్పమని అడుగుతుంది. ఇంట్లో వాళ్లు అందరూ స్వప్న అడిగిన దానికి నవ్వుకుంటూ ఉంటారు. స్వప్న మాటలకు రుద్రాణికి చిర్రెక్కిపోతుంది.  స్వప్న కూడా ఏ మాత్రం తగ్గదు. తనను జాగ్రత్తగా చూసుకోవడంలేదని, తన బాగోగులు పట్టించుకోవడం లేదని, ఆమె సోకులు మాత్రమే చూసుకుంటోందని మండిపడుతుంది.

1010
Brahmamudi

Brahmamudi

మరోవైపు స్వప్న ఇంట్లో రచ్చ చేయడం మొదలుపెడుతుంది. తాను ఏ తప్పు చేయలేదు అని రుజువు అయితే.. తనను నెత్తిన పెట్టుకుంటాను అన్నావ్ కదా అని గుర్తు చేసి.. కుర్చీ తెచ్చి రుద్రాణి తలమీద పెడుతుంది. నెత్తిమీద కూర్చోపెట్టుకొని.. తనను ఇల్లంతా తిప్పమని అడుగుతుంది. ఇంట్లో వాళ్లు అందరూ స్వప్న అడిగిన దానికి నవ్వుకుంటూ ఉంటారు. స్వప్న మాటలకు రుద్రాణికి చిర్రెక్కిపోతుంది.  స్వప్న కూడా ఏ మాత్రం తగ్గదు. తనను జాగ్రత్తగా చూసుకోవడంలేదని, తన బాగోగులు పట్టించుకోవడం లేదని, ఆమె సోకులు మాత్రమే చూసుకుంటోందని మండిపడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved