BrahmaMudi 5th March Episode:కనకం గొంతు పిసికిన రాజ్, కావ్యను కాపాడేసిన బావ..!
నేను ఆడను అని రాజ్ వెళ్లిపోతే.. కావ్య వాళ్లు మాత్రం గేమ్ కంటిన్యూ అయిపోతారు. ఎలాగైనా గేమ్స్ ఆడించం ఆపేయాలని కావ్య వేసిన డిజైన్స్ మీద ఇంక్ పోస్తాడు.
Brahmamudi
BrahmaMudi 5th March Episode:ధాన్యలక్ష్మి అన్నమాటలకు సుభాష్ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ప్రకాశం వచ్చి ఓదారుస్తాడు. నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను అనుకున్నావా అన్నయ్య.. నాకు మతిమరుపు మాత్రమే ఉందని, సైట్ ఇంకా రాలేదని అంటాడు. ధాన్యలక్ష్మి అన్నది కూడా కరెక్టేనని.. నా తమ్ముడే కదా అని మాటలు అనేశాను.. వాడి కూడా మనసు ఉంటుందనే విషయం మర్చిపోయాను అని సుభాష్ చెబుతాడు. చిన్నప్పటి నుంచి నా తమ్ముడు ఫర్ఫెక్ట్ గా ఉండాలని అనుకుంటూ ఉంటానని.. అందుకే.. నీకు మతిమరపు ఉన్న విషయం కూడా మర్చిపోయాను అని అంటాడు. దానికి ప్రకాశం.. మనలోపం చూడని వాడే మనవాడు అవుతాడని.. ఇఫ్పటి వరకు తనకు ఏ విషయంలోనూ భయం వేయలేదని.. ఎందుకంటే మా అన్నయ్య పక్కన ఉన్నాడనే ధైర్యం అని.. ఇక ముందు కూడా నువ్వు నాకు తోడుగా ఉండాలి అన్నయ్య అని అంటాడు.
Brahmamudi
సీన్ కట్ చేస్తే... కనకం ఇంట్లో రచ్చ మొదలౌతుంది. కావాలనే రాజ్ వినిపించేలా కావ్య, భాస్కర్ లు క్యారమ్స్ ఆడుతున్నాం అని అంటారు. అది విని.. రాజ్ నేను కూడా ఆడతాను అని వస్తాడు. ఇక, ఆట మొదలైన దగ్గర నుంచి భాస్కర్ కావ్యకు సపోర్ట్ చేస్తూ ఉంటే.. రాజ్ కి ఫుల్ ఫ్రస్టేషన్ వస్తుంది. చివరకు గేమ్ కావ్య గెలవడంతో తట్టుకోలేకపోతాడు. తర్వాత.. నేను ఆడను అని రాజ్ వెళ్లిపోతే.. కావ్య వాళ్లు మాత్రం గేమ్ కంటిన్యూ అయిపోతారు. ఎలాగైనా గేమ్స్ ఆడించం ఆపేయాలని కావ్య వేసిన డిజైన్స్ మీద ఇంక్ పోస్తాడు.
Brahmamudi
తర్వాత.. కావ్యను కళావతి టీ తీసుకొని రా అంటాడు. కావ్య లేవబోతుంటే.. బావతో ఆడుకో అని, టీ నేను ఇస్తాను అని కనకం అంటుంది. ఆ సీన్ కి కనకం గొంతు పిసికినట్లుగా రాజ్ ఊహించుకుంటాడు. ఆ సీన్ చాలా ఫన్నీగా ఉంటుంది.
Brahmamudi
తర్వాత... డిజైన్స్ ఇవ్వమని.. వాటిని క్లైంట్స్ కి పంపాలి అని అంటాడు. ఇంక్ పడటంతో కావ్య కంగారుపడుతుంది. రాజ్ మాత్రం... క్లైంట్స్ కి పంపాలి అని, ఇప్పటికిప్పుడు మళ్లీ డిజైన్స్ వేయమని అడుగుతాడు. వాటిని వేయడానికి 12 గంటలు పట్టిందని కావ్య అంటే... మళ్లీ.. 12 గంటలు కూర్చొని వేయమని అంటాడు.
Brahmamudi
అయితే.. బాస్కర్ వచ్చి.. ఆ డిజైన్స్ తాను ఆల్రెడీ ఫోటోలు తీసి ఉంచాను అని ఫోటోలు చూపిస్తాడు. ఇక రాజ్ ఫ్యూజులు ఎగిరిపోతాయి. దీంతో.. వేరే ఆటలు ఆడుకుందాం అని కావ్యను వాళ్ల బావ తీసుకొని వెళతాడు.
Brahmamudi
ఇక.. అపర్ణ వచ్చి.. ఇంట్లో ధాన్యలక్ష్మి చేసిన పెంట గురించి అత్తగారు ఇందిరాదేవి తో చెబుతుంది. మీరు ఇంట్లో విషయాలు అస్సలు పట్టించుకోవడం లేదని అపర్ణ ముందు వాపోతుంది. ధాన్యలక్ష్మి ఏమైనా అన్నదా అని అడిగితే... నన్ను అయితే.. తోటికోడలుగా భరిస్తాను. కానీ.. ఈసారి మా ఆయనపై అరిచింది అని చెబుతుంది. సుభాష్ పై అరిచిందా అని షాకౌౌతుంది. ప్రకాశం తప్పు చేస్తే... ఆయన మందలిస్తుంటే.. తన భర్త పై అరుస్తారా, అవమానిస్తారా అంటూ అరిచిందని చెబుతుంది. ఆ మాటలకు మా ఆయన చాలా చిన్నబుచ్చుకున్నారని.. నా తమ్ముడిని ఒక్క మాట అనే హక్కు కూడా నాకు లేదా అని బాధపడ్డారు అని చెబుతుంది. అయ్యో అని ఇందిరాదేవి అనుకుంటుంది. అయితే.. వాళ్లిద్దరూ అన్నదమ్ములు మళ్లీ కలిసిపోతారని వాళ్లకు అంత ప్రేమ ఉందని, ఆ విషయంలో తనకు ఆ భయం లేదని.. కాకపోతే .. ధాన్యలక్ష్మి ప్రవర్తన ప్రమాదకరంగా మారుతోందని.. ఇలా మారితే... ఆమె త్వరలోనే ఇల్లు ముక్కలు కాయడం అని అంటుంది.
ఇక కమింగప్ లో.. కావ్య వాళ్ల బావతో ఫైర్ క్యాంప్ దగ్గర ఆడుకుంటూ ఉంటే.. కావ్య కాలు కాలబోతుందని.. రాజ్ కంగారుపడతాడు. ఈ క్రమంలో రాజ్ చేతికి, వాళ్ల బావ కాలికి కాలుతుంది. అయితే.. వాళ్ల బావను పట్టించుకోకుండా.. కావ్య రాజ్ కోసం తాపత్రయపడుతుంది.