BrahmaMudi 30th January Episode:కోడలి హోదాలో కావ్య.. ఆఫీసులోనూ స్వాగతాలు.. రాజ్ కి ఊహించని షాక్
అనామిక నస తట్టుకోలేక.. తాను కూడా ఆఫీసుకు వెళ్లడానికి ఆలోచిస్తాను అని కళ్యాణ్ అంటాడు. సరే అని అనామిక వెళ్లిపోతుంది. కళ్యాణ్ మళ్లీ కవితలు రాసుకుంటూ ఉంటాడు.
Brahmamudi
BrahmaMudi 30th January Episode: ఇంట్లో కళ్యాణ్ కవితలు రాసుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి అనామిక వస్తుంది. కావాలనే అనామిక వచ్చిందని తెలిసినా.. నన్ను కవిని కానన్నవాడిని కత్తితో పొడుస్తా అంటూ కవిత రాస్తూ ఉంటాడు. దీంతో.. అనామిక మళ్లీ పిలుస్తుంది. ఏంటి అంటాడు.. ఏం చేస్తున్నావ్ అని అడిగితే.. నా పాటకు పల్లివి లేదు కవితకు.. మరో కవిత రాయమని చెప్పారని.. అదే రాస్తున్నాను అంటాడు. నువ్వు ఇంట్లోనే ఉంటావా అని అడుగుతుంది. అవును అని కళ్యాణ్ అంటాడు. దానికి అనామిక... మీ నాన్న , పెదనాన్న, రాజ్, ఆఖరికి అత్తెరసు చదువుకున్న కావ్య కూడా ఆఫీసుకు వెళ్లారు.. నువ్వు వెళ్లవా అని అడుగుతుంది. వాళ్లంతా వెళ్లాక నేను వెళ్లి ఏం చేయాలి అని కళ్యాణ్ అంటాడు. నా అవసరం లేదు కదా అని కళ్యాణ్ అంటే.. మరి కావ్య అవసరం ఉందా అని అడుగుతుంది.
Brahmamudi
మా వదిన ఆఫీసుకు వెళ్లింది అంటే.. ఓ అర్థం పరామర్థం ఉన్నట్లే.. మా వదిన అద్భుతమైన డిజైన్లు వేస్తుంది అని చెబుతాడు. ఆ మాటలకు అనామికకు మరింత మండిపోతుంది. ఆ కావ్య జపం చేసింది చాలు.. నువ్వు కూడా ఆఫీసుకు వెళ్లు అని అంటుంది. నాది ముందు నుంచి బిజినెస్ మైండ్ కాదు.. ఇలా కవితలు రాసుకుంటాను అని కళ్యాణ్ అంటే.. అందుకే.. అందరూ నిన్ను తక్కువ చేసి చూస్తున్నారు. ఇంట్లో పనులన్నీ చెబుతున్నారని.. మీ అమ్మగారు ఫీలౌతున్నారు.. నేను కూడా బాధపడనా అని అనామిక అంటుంది. దానికి కళ్యాణ్ నేను కూడా ఓ బోర్డ్ ఆఫ్ మెంబర్ అని చెబితే... ఏదో ముష్టి వేశారు లే అంటుంది. అనామిక నస తట్టుకోలేక.. తాను కూడా ఆఫీసుకు వెళ్లడానికి ఆలోచిస్తాను అని కళ్యాణ్ అంటాడు. సరే అని అనామిక వెళ్లిపోతుంది. కళ్యాణ్ మళ్లీ కవితలు రాసుకుంటూ ఉంటాడు.
Brahmamudi
ఇక..కావ్య ఆఫీసుకు వెళ్లడానికి క్యాబ్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంట్లో కూర్చున్న అపర్ణకు కావ్య కనపడటంతో పిలుస్తుంది. ఇంకా.. ఆఫీసుకు ఎందుకు వెళ్లలేదు.? రాజ్ టైమ్ కి వెళ్లాడు కదా అని అంటుంది. అయితే.. క్యాబ్ కోసం ఎదురుచూస్తున్నాను అని కావ్యచెబుతుంది. వెంటనే ధాన్యలక్ష్మి.. మీకు షేర్ ఆటోలు అలవాటే కదా అని సెటైర్ వేస్తుంది. ఆ మాటలకు అపర్ణకు మరింత కాలుతుంది. కావ్య ఈ ఇంటికి, వంశానికీ పెద్ద కోడలు అని, ఆటోలో వెళ్లాల్సిన ఖర్మ ఈ ఇంటి కోడలికి లేదని చెబుతుంది. వెంటనే ఇందిరాదేవి.. బాగా చెప్పావ్ అపర్ణ అని మెచ్చుకుంటుంది.
ఆ తర్వాత అపర్ణ తన కారు కీస్ కావ్యకు తెచ్చి ఇచ్చి.. నా కారులో వెళ్లమని చెబుతుంది. పర్వాలేదు అత్తయ్య అని కావ్య అన్నా.. అపర్ణ వినిపించుకోదు. ఈ ఇంటి వారసుడు భార్య హోదాలో నువ్వు ఆఫీసుకు వెళ్తున్నావని.. నువ్వు ఖరీదైన కారులో వెళితేనే అక్కడ నీకు గౌరవం ఉంటుందని చెబుతుంది. ఎక్కువ మాట్లాడితే.. ఖరీదైన కారు కొనిపెడతాను అని చెబుతుంది. కారు కీ చేతిలో పెట్టి.. మొదటి రోజు వెళ్తున్నావ్?. మంచి రోజు వెళ్తున్నావ్.. సంతోషంగా వెళ్లు.. దర్జాగా వెళ్లు అని చెబుతుంది.
Brahmamudi
అపర్ణ చేసిన పనికి ఇందిరాదేవి సంతోషిస్తుంది. మంచి పనిచేశావ్ అపర్ణ.. ఇంటి కోడలి హోదాను పెంచావ్ అని మెచ్చుకుంటుంది. కావ్యను కూడా ఆఫీసులో మంచిగా పని చేసుకోమని. ఇంట్లో వాళ్లు అనే మాటలు పట్టించుకోవద్దు అని అంటుంది. కావ్య అమ్మమ్మ, అత్తగారి కాళ్లకు నమస్కారం చేస్తుంది. అయితే.. నీ మీద ప్రేమతో నేను ఈ పని చేయలేదని.. ఈ ఇంటి కోడలికి ఉన్న హోదా అలాంటిది అని అందుకే ఇచ్చాను అని చెబుతుంది. అదంతా చూసి ధాన్యలక్ష్మి ముఖం మాడ్చుకుంటుంది.
ఇక.. ప్రకాశం కనీసం ఆఫీసుకు వెళ్లాలి అనే విషయం మర్చిపోయి.. బ్యాగ్ చూసుకొని గుర్తు తెచ్చుకుంటాడు. ఇంతలో ధాన్యలక్ష్మి వచ్చి.. . మీ అన్నయ్య వెంట మీరు ఆఫీసుకు వెళ్తున్నారు కానీ.. కళ్యాణ్ ని ఎందుకు తీసుకువెళ్లడం లేదు.. కావ్య కూడా ఆఫీసుకు వెళ్తోంది అని చెబుతుంది, కావ్య ఆఫీసుకు వస్తున్నందుకు ప్రకాశం చాలా సంతోషిస్తాడు. అయితే.. కళ్యాణ్ ని మాత్రం తాము ఆఫీసుకు రావద్దు అని చెప్పలేదని.. వాడి లోకం వాడు ఉంటూ రావడం లేదు అని చెబుతాడు. కానీ.. కళ్యాణ్ వచ్చే వరకు మీరు కూడా ఆఫీసుకు వెళ్లను అని పంతం పట్టండి అని అంటుంది. దానికి ప్రకాశం అంగీకరించడు. కోపంగా ఆఫీసుకు వెళ్లిపోతాడు.
Brahmamudi
ఇక.. రాజ్ ఆఫీసుకు వెళ్లేసరికి అంతాత హడావిడిగా ఉంటుంది. ఏంటా అని అడిగితే.. మేడమ్ వస్తున్నారు అని చెబుతారు. మేడమ్ ఎవరా అని రాజ్ అనుకునేలోగా కావ్య కారులో దిగుతుంది. వీళ్లంతా వెళ్లి బొకేలు ఇచ్చి హడావిడి చేస్తారు. అది చూసి రాజ్ కి విపరీతంగా కోపం వస్తుంది. ఎందుకు ఇంత హడావిడి అని కావ్య శ్రుతిని అడిగితే.. అంతకముందు వీరు ఎండీ భార్యగా వచ్చేవారని.. ఇఫ్పుడు అఫీషియల్ గా వచ్చారు కదా అందుకే అని చెబుతుంది.
Brahmamudi
ఇక..రాజ్ కి తప్పక కావ్యకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తాడు. దానిలో కావ్యకు పది సంవత్సరాలు కంపెనీలో ఉద్యోగం చేసేలా అపాయింట్మెంట్ ఇవ్వడం విశేషం. కాసేపు సీటు గురించి ఇద్దరూ చర్చించుకుంటారు. తర్వాత.. కావ్య.. మీరు ఏం చేశారో.. ఏం చేస్తున్నారో.. ఏం చేయబోతున్నారో తేల్చుకోవడానికి వచ్చాను అని చెబుతుంది. ఆ మాటలకు రాజ్.. దాని అర్థం ఏంటా అని ఆలోచిస్తాడు.