BrahmaMudi 2nd February Episode:రెడీ అవ్వడం రాదు అన్న రాజ్.. లుక్స్ మార్చేసిన కావ్య, అదరగొట్టిన అప్పూ..!
దానికి రాజ్.. ముందు నీకు టేస్ట్ ఉండాలి అని.. ఇంతకు మంచి కారణాలు చెప్పమని అడగొద్దని.. నువ్వు నిజంగా అప్పలమ్మవేనని.. తన భార్యగా అన్ ఫిట్ అని చెప్పేసి వెళ్లిపోతాడు. బోర్డు మీద కారణాలు చూసి కావ్య రగిలిపోతుంది.
Brahmamudi
BrahmaMudi 2nd February Episode:గత ఎపిసోడ్ లో కావ్య.. శ్వేత గురించి నిలదీసిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఎపిసోడ్ లోనూ అదే కంటిన్యూ అయ్యింది. కావ్య ఏడుస్తూ.. తన బాధ చెప్పుకుంటుంది. ‘ ఏనాడు మీరు నన్ను భార్య గా ఎవరికీ చెప్పుకున్నది లేదు. ఏ నాడు కనీసం నన్ను తాకను కూడా తాకలేదు.ఒక ముద్దు ముచ్చట లేకుండా నిస్సారంగా బతుకుతున్నాను. అయినా నేను మీరే కావాలని కోరుకుంటున్నాను. నేను మీతో సర్దుకుపోతున్నాను. ఇంతలా సర్దుకుంటున్న నన్ను ఎందుకు కాదు అంటున్నారు’ అని కావ్య అడిగితే.. వంద కారణాలు ఉన్నాయి అని అంటాడు. ఇప్పుడు కారణాలు రాసి చూపిస్తాను అని వైట్ బోర్డు దగ్గరకు వెళతాడు.
Brahmamudi
కానీ రాజ్ కి రాయడానికి కారణాలు దొరకవు. దీంతో ఆలోచిస్తూ ఉంటాడు. దీంతో.. కావ్య మీరేమీ కథలు రాయడం లేదు పాయింట్స్ రాయండి అంటుంది. దానికి.. ఇదే నువ్వు నాతో అడ్డంగా వాధిస్తావ్ అని రాస్తాడు. దానిపై కూడా కావ్య వాధిస్తుంది. మొత్తానికి కావ్య మాటలతో ఇబ్బంది ఉందని.. మూడు పాయింట్స్ రాస్తాడు. కావ్య.. రాయండి.. రాయండి అని రెచ్చగొడుతూ ఉంటుంది. దీంతో రాజ్.. అప్పలమ్మలా రెడీ అవుతావ్ అని నాలుగో పాయింట్ రాస్తాడు. ఆ మాటకు కావ్యకు పిచ్చి కోపం వస్తుంది. కానీ.. రాజ్.. తాను స్వరాజ్ గ్రూప్ ఎండీలా ఉంటానని.. కానీ నువ్వు మాత్రం.. మాట్టిబొమ్మకు చీర చుట్టినట్లు ఉంటావ్ అని సెటైర్ వేస్తాడు.
Brahmamudi
‘ఏదైనా పార్టీకి వెళితే.. భర్త స్టేటెస్ పెంచేలా రెడీ అవ్వాలని, మట్టి రంగు, మసి రంగు తప్ప.. నీకు అసలు టేస్ట్ తెలుసా . మెడలో ఏం వేసుకోవాలో తెలుసా? జడ ఎలా వేసుకోవాలో తెలుసా? గాజులు ఎలా వేసుకోవాలో తెలుసా? నీకు నా భార్యగా ఉండేందుకు ఒక్క క్వాలిటీ అయినా ఉందా?’ అని రాజ్ అడుగుతాడు. దానికి కావ్య.. మా ఆయన బంగారయ్య అవన్నీ చేయించి ఇస్తే నేను వేసుకోను అన్నానా అని అంటుంది. దానికి రాజ్.. ముందు నీకు టేస్ట్ ఉండాలి అని.. ఇంతకు మంచి కారణాలు చెప్పమని అడగొద్దని.. నువ్వు నిజంగా అప్పలమ్మవేనని.. తన భార్యగా అన్ ఫిట్ అని చెప్పేసి వెళ్లిపోతాడు. బోర్డు మీద కారణాలు చూసి కావ్య రగిలిపోతుంది.
Brahmamudi
ఇక ఇంట్లో పెద్దవాళ్లంతా హాల్ లో కూర్చొని ఉంటారు. అప్పుడు . కావ్య ఆఫీసుకు వస్తోంది కదా.. ఎలా పని చేస్తోంది అని అపర్ణ అడుగుతుంది. వెంటనే ప్రకాశం సూపరో సూపరు అని అంటాడు. ఆ మాటలకు ధాన్యలక్ష్మికి కోపం వచ్చి.. మిమ్మల్ని అడగలేదు కదా అని అంటుంది. ఆ తర్వాత సుభాష్.. కావ్య డిజైన్స్ ని చాలా గొప్పగొ పొగుడుతాడు. ఇంట్లో పెద్దాయన కూడా.. కావ్య డిజైన్స్ చూశానని.. చాలా బాగున్నాయని.. ఈ కాలం వారికి కూడా నచ్చేలా ట్రెండీగా ఉన్నాయి అని అంటాడు. అపర్ణ దేవి కూడా.. ఆయనకు నచ్చాయంటే.. అందరికీ నచ్చి తీరుతాయి అని అంటుంది. అందరూ కావ్యను పొగడుతూ ఉండటంతో నచ్చక ధాన్యలక్ష్మి వెళ్లిపోతూ ఉంటుంది. అదే విషయం ప్రకాశం అడిగితే.. నోరు మూసుకోమని ధాన్యం అంటుంది.
Brahmamudi
అయితే.. తన కొడుకును తక్కువ చేసి మాట్లాడుతుందని.. అపర్ణ దేవి కి కోపం వస్తుంది. అందరి ముందు భర్తను తక్కువ చేసి మాట్లాడతావా అని సీరియస్ అవుతుంది. నేను తలుచుకుంటే నీ పరువు పోతుందని, నా కోడలి పరువు నేనే తీయడం ఎందుకు అని ఆగుతున్నాను అని అంటుంది. ఆమె కౌంటర్ కి ధాన్యలక్ష్మికి ఫ్యూజులు ఎగిరిపోతాయి.
సరిగ్గా అదే సమయానికి కళ్యాణ్ వస్తాడు. దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని అడుగుతాడు. ఛాన్స్ దొరికిందని ప్రకాశం సెటైర్ వేస్తాడు. అయితే... తన శోభనం గురించి ఏమో అని కళ్యాణ్ సంబరపడతాడు. కానీ అది కాదని.. మీ అమ్మకి మా అమ్మ గడ్డి పెట్టిందని చెబుతాడు. అయితే.. మా అమ్మ ఈ మధ్య రుద్రాణి అత్త దగ్గర ట్యూషన్ నేర్చుకుంటుంది అని కళ్యాణ్ అంటాడు.
Brahmamudi
ఆ తర్వాత నెమ్మదిగా తన శోభనం టాపిక్ తీసుకువస్తాడు. అది గమనించి కావాలని కళ్యాణ్ ని ఏడిపించాలని.. ముహూర్తం కుదరకపోతే.. ఏడాది వరకు శోభనం జరిగేది కాదు అని ఇందిరాదేవి అంటుంది. ఆ మాట విని కళ్యాణ్ భయపడతాడు. అందరూ కావాలని.. కళ్యాణ్ ఏడిపించడం మొదలుపెడతారు. ఆ టాపిక్ వదిలేయమని సుభాష్.. అంటే.. అలా ఎలా వదిలేస్తారని.. పెళ్లి తర్వాత విడిగా ఉండటం ఎంత కష్టమో అని కళ్యాన్ అంటాడు. నీ బాధ మాకు అర్థమైందిలే అని అపర్ణ అంటుంది. ఉంటే.. నా మీద కొంచెం అయినా జాలి చూపించారా అని కళ్యాణ్ అడుగుతాడు.
Brahmamudi
వెంటనే ధాన్యలక్ష్మి కలగజేసుకొని.. ఇలాంటివి మీ అన్నయ్య మీద చూపిస్తారు. కానీ నీమీద, నా మీద కాదు అని అంటుంది. ఇక.. ఇందిరాదేవి క్లాస్ పీకుతుంది. ఈ ఇంట్లో అందరికీ అందరూ సమానమేనని.. అపర్ణ ఆల్రెడీ పంతులు గారికి ఫోన్ చేసి మంచి ముహూర్తం పెట్టమని అడిగిందని చెబుతుంది. దానికి ధాన్యం.. నా కొడుకు గురించి ఎవరో పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. తల్లిగా నేను చూసుకోగలను అంటుంది. దానికి అపర్ణ.. మంచిదని.. నాకు కూడా శ్రమ తగ్గుతుందని, తన కొడుకు, కోడలి గురించి పట్టించుకునే సమయం దొరుకుతుందని అంటుంది. వెంటనే వాళ్ల ఆయనను పిలిచి .. కావ్యకు నగలు చేయించాలని, కావ్యతోనే డిజైన్స్ వేయించమని అంటుంది. వెంటనే ధాన్యలక్ష్మి కూడా తన కోడలికి కూడా నగలు చేయించాలని.. డిజైన్స్ తెప్పించమని అడుగుతుంది. వీళ్లిద్దరూ కొట్టుకొని తన శోభనం జరిగేలా లేరని కళ్యాణ్ బాధపడతాడు.
Brahmamudi
మరోవైపు అప్పూ.. పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్తుంది. ఆ ఇంటి మహిళ చాలా కంగారులో ఉంటుంది. పిజ్జాకి డబ్బులు ఇస్తుంది కానీ.... తన బాధకు కారణం చెప్పదు. కానీ.. ఆమె కూతురిని రౌడీలు కిడ్నాప్ చేస్తారు. ఆ విషయం అప్పూకి తెలుస్తుంది. పోలీసులకు కంప్లైంట్ చేద్దాం అని అప్పూ అంటే... వాళ్లు నా కూతురిని చంపేస్తారని ఆమె భయపడుతుంది. తన దగ్గర డబ్బులు కూడా లేవని ఆమె ఏడుస్తుంది.
Brahmamudi
మరోవైపు రాజ్ తన మాటలు బాధిస్తున్నాయి అన్నాడని.. మూతికి ప్లాస్టర్ వేసుకొని కాఫీ ఇవ్వడానికి కావ్య వెళ్తుంది. ఆ ప్లాస్టర్ తీసి.. ఏంటి విషయం అని రాజ్ అడుగుతాడు.నా మాటలు ఇబ్బంది పెడుతన్నాయి అన్నారని.. ఇలా చేశాను అని చెబుతుంది. అంతేకాదు.. 30 రోజుల్లోగా నేనే మీకు తగిన భార్యను అని నిరూపిస్తానని ఛాలెంజ్ కూడా చేస్తుంది. దీని కాన్ఫిడెన్స్ ఏంటబ్బా.. నిజంగానే అలా చేస్తుందా అని రాజ్ కంగారుపడి.. తర్వాత దీనికి అంత సీను లేదులే అనుకుంటాడు.
Brahmamudi
ఇక.. ఇంట్లో శోభనం ఏర్పాట్లు చేస్తున్నారని అనామికలో కంగారు మొదలౌతుంది. వాళ్ల అమ్మకి ఫోన్ చేసి ఈ శోభనం ఎలా ఆపించాలి అని అడుగుతుంది. కళ్యాణ్ ఆఫీసుకు వెళ్లడానికి ఒప్పుకోవడం లేదు కానీ.. ఈ శోభనానికి మాత్రం తొందరపెడుతున్నాడని.. మొదలుకాక ముందే ఆపేస్తే బెటర్ కదా అంటుంది. అయితే.. వాళ్ల అమ్మ మాత్రం.. ముందే ఆపితే అందరూ తప్పు నీదే అంటారని.. మరో ప్లాన్ చెబుతుంది. ఆ ప్లాన్ విని అనామిక థ్యాంక్స్ మమ్మీ అని సంబరపడుతుంది. అల్లుడు గారిని గుప్పెట్లో పెట్టుకోమని వాళ్ల అమ్మ సలహా ఇస్తుంది. అనామిక సరే అంటుంది.
Brahmamudi
ఇక.. అప్పూ.. రౌడీల బారి నుంచి పాపను కాపాడటానికి ఓ ప్లాన్ వేస్తుంది. తన ఫ్రెండ్స్ తో కలిసి పాపను కాపాడే ప్రయత్నం చేస్తుంది.
Brahmamudi
ఇక.. కమింగప్ లో.. కావ్యను ఎవరో అప్పలమ్మ లా ఉందని కామెంట్ చేశారని.. తన లుక్ మార్చేస్తాను అని స్వప్న మారుస్తుంది. లుక్ మార్చేసిన కావ్యను చూసి రాజ్ షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు.