BrahmaMudi 29th January Episode:నా కోడలు ఎంత గొప్పో.. నీ కోడలికి అది కూడా చేతకాదు.. అత్తారింట్లో కావ్యకు మంచి
కావ్యను అడిగి పెసరట్టు పెట్టించుకొని తింటాడు. అనామిక మాత్రం... అటు కావ్య చేసింది తినడానికి అహం.. అత్త చేసిన మాడిపోయిన బ్రెడ్ తినలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది.
Brahmamudi
BrahmaMudi 29th January Episode:అప్పూ కొత్త జాబ్ లో జాయిన్ అవుతుంది. తనకు జాబ్ ఇప్పించిన ఫ్రెండే అప్పూ గురించి తక్కువ చేసి మాట్లాడుతుంది. కళ్యాణ్ తో నువ్వు స్నేహం చేసింది డబ్బు కోసమే కదా అని, అందుకే కదా ప్రేమ డ్రామా ఆడావు అంటుంది. అయితే.. తాను అలా కాదు అని అప్పూ అనేసరికి.. మరి.. చివరి నిమిషంలో నీ ప్రేమ విషయం ఎలా బయటపడింది..? పరువు కోసం ఆ కళ్యాణ్ నీ మెడలో తాళి కడతాడు అనుకున్నావ్ కదా.. అదే జరిగి ఉంటే ఆ కోటకు మహారాణి అయ్యేదానివి.. అప్పుడు నాకు కనీసం అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదు.. కానీ నీ బ్యాడ్ లక్ అలా జరగలేదు. అని వాళ్ల ఫ్రెండ్ మరింత తక్కువ చేసి మాట్లాడుతుంది. ఆ మాటలకు అప్పూకి విపరీతంగా కోపం వస్తుంది. చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నావ్ కదా.. డబ్బుల కోసం పోరగాళ్ల వెంట పరిగెత్తే రకం కాదు నేను.. జాబ్ ఇప్పించినవు కాబట్టి ఊరుకుంటున్నా లేకుంటే.. చంపి బొంద పెట్టేసేదాన్ని అని సీరియస్ వార్నింగ్ ఇచ్చి అప్పూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
Brahmamudi
దుగ్గిరాల ఇంట్లో అందరూ బ్రేక్ ఫాస్ట్ చేయడానికి కూర్చుంటారు. అయితే.. తమ బ్రేక్ ఫాస్ట్ మేమే చేసుకుంటాం అని ధాన్యలక్ష్మి చెప్పడంతో.. కావ్య వాళ్లకు తప్ప.. అందరికీ బ్రేక్ ఫాస్ట్ పెడుతుంది. ప్రకాశం.. టిఫిన్ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ధాన్యలక్ష్మి మాడిపోయి బ్రెడ్ తీసుకొని వస్తుంది.అది చూసి అందరూ నవ్వుకుంటారు. అయితే.. ప్రకాశం.. తాను ఆ గడ్డి తినలేను అని చెబుతాడు. కావ్యను అడిగి పెసరట్టు పెట్టించుకొని తింటాడు. అనామిక మాత్రం... అటు కావ్య చేసింది తినడానికి అహం.. అత్త చేసిన మాడిపోయిన బ్రెడ్ తినలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది.
Brahmamudi
ఈ లోగా.. కావ్యకు కళ్యాణ్ సైగ చేస్తూ ఉంటాడు.. వదిన అడగండి అని.. కావ్య వద్దులే అంటుంది. కానీ కళ్యాణ్ బలవంత పెట్టడంతో.. కావ్య ధైర్యం చేసి.. అపర్ణను అత్తయ్య అని పిలుస్తుంది.. ఏంటి కావ్య అని అపర్ణ అంటే.. మన ఆఫీసులో డిజైనర్ గా జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను అని చెబుతుంది. ఆ మాట విని ఇంట్లో కొందరు సంతోషిస్తారు. రుద్రాణి, అనామిక మాత్రం ముఖాలు మాడ్చేస్తారు. కావ్య చెప్పిన మాటలకు కళ్యాన్.. వావ్ సూపర్ మంచి ఐడియా వదిన.. మీ టాలెంట్ ని కిచెన్ కి కాకుండా.. ప్రపంచానికి తెలిసేలా చేయాలి అని మెచ్చుకుంటాడు.
Brahmamudi
నువ్వు ఆగరా అని ధాన్యలక్ష్మి అంటే.. తాను అంతకముందు పిచ్చివాడిలా గదిలో కూర్చొని కవితలు రాసుకునేవాడినని.. కానీ వదిన గుర్తించి పేపర్ లో వేయడం వల్లే కదా నేను కవిగా గుర్తింపు సంపాదించాను.. అనామిక కూడా నచ్చాను అని అంటాడు. ఏమీ చెప్పలేక అనామిక ఓ వెర్రి నవ్వు నవ్వుతుంది. కానీ.. వెంటనే రుద్రాణి అందుకుంటుంది. దొంగతం చేస్తాను అని పోలీసులకు చెప్పినట్లు ఉంది అని అంటుంది. అదేమి పోలిక అని సుభాష్ అడిగితే.. కావ్య ఆఫీసుకు వెళ్లకపోవడానికి కారణం అపర్ణ వదినేకదా.. పొయ్యి పొయ్యి.. వదినను పర్మిషన్ అడుగుతోంది.. అని రుద్రాణి అంటుంది.
ఇచ్చిన మాట మీద నిలపడటం వీళ్ల వంశం లోనే లేదు.. మాట తప్పడం, మోసం చేడయడం తప్ప వీళ్లకు ఏం చేతనఅవుతుంది లే అని కావ్యపై ధాన్యలక్ష్మి అక్కసు వెళ్లగక్కుతుంది. కావ్య ఏదో చెప్పడానికి చిన్నఅత్తయ్య అని పిలుస్తుంది.. అయితే.. తనను అత్తయ్య అని పిలిచే అర్హత లేదు అని ధాన్యం అంటుంది. వెంటనే.. స్వప్న.. పేరు పెట్టి పిలవమని చెబుతుంది. ఆ మాటకు ధాన్యలక్ష్మికి కోపం వస్తుంది. ఎంత ధైర్యం ఉంటే.. నన్ను పేరు పెట్టి పిలవమంటావ్ అని అడుగుతుంది. దానికి స్వప్న... సరిగ్గా బదులు చెబుతుంది.
Brahmamudi
‘ అత్తయ్య అంటే అర్హత లేదన్నారు.. పేరు పెట్టి పిలిస్తే.. ఎంత ధైర్యం అంటున్నారు.. నోటికి వచ్చినట్లు మాట్లాడకండి.. ఇందాక మా వంశం గురించి కూడా మాట్లాడారు. కొంచెం మర్యాద ఇచ్చి పుచ్చుకోండి’ అని స్వప్న లైఫ్ట్ రైట్ ఇచ్చి పడేస్తుంది. అయితే స్వప్న చాలా బాగా మాట్లాడిందని.. ప్రకాశం మెచ్చుకోవడం విశేషం.
Brahmamudi
ఆ తర్వాత.. ధాన్యలక్ష్మి.. ‘ మా అక్క కావ్యను ఆఫీసుకు వెళ్లొద్దని.. ఇల్లు చూసుకోమని ఎప్పుడో చెప్పింది కదా.. అందరికీ ఇంత టైమ్ కి వండి వదిలేస్తే చాలు.. ఆఫీసుకు వెళ్లి రాజ్యాలు ఏలుదాం అని చూస్తోంది.’ అని ధాన్యలక్ష్మి తన కడుపులో ఉన్నదంతా కక్కుతుంది. దానికి కావ్య.. నేను కచ్చితంగా వెళతాను అని అనలేదని.. మా అత్తగారిని పర్మిషన్ అడుగుతున్నాను అంతే అంటుంది. ఒక్కసారి వద్దు అన్న తర్వాత.. మళ్లీ వెళ్లమని ఎలా అంటుంది..? నీకు వంటిల్లే కరెక్ట్ ప్లేస్ అని ధాన్యలక్ష్మి బదులిస్తుంది.
అయితే.. ధాన్యలక్ష్మి మాటలకు అపర్ణ ఈగో హర్ట్ అవుతుంది. ‘ నా కోడలు ఎక్కడ ఉండాలో డిసైడ్ చేయడానికి నువ్వు ఎవరు..? నా కోడలు వండి తగలేయడానికి వంట మనిషిలా కనపడుతోందా? అయినా నవ్వు ఈ ఇంటిని ఏలే మహారాణిలా శాసనాలు చేయడం మొదలుపెట్టావ్. నీకు, నీ కోడలికి ఇంటి ముందు ఒక్క ముగ్గు వేయడం వచ్చా..? నా కోడలు వేసిన డిజైన్స్ కి ఇంటర్నేషనల్ మార్కెట్ లో పేరు వచ్చింది. అది తెలుసా మీకు..? ఏమండి.. కావ్య వేసిన డిజైన్స్ వల్ల మనకు ఏ కాంట్రాక్ట్ వచ్చిందండి..?’ అని తన భర్త సుభాష్ అని అడుగుతుంది. అతను వెంటనే ఉత్సాహంగా.. ఆ కంపెనీ డీటేల్స్ చెబుతాడు.( ఇక్కడ అనామిక ముఖం మాడ్చేస్తుంది)
Brahmamudi
ఇక కావ్య సపోర్ట్ సిస్టమ్ ఇందిరాదేవి అందుకుంటుంది. ‘ వంట రుచిగా చేస్తుంది కాబట్టి.. కావ్యను వంట చేయమన్నాం తప్ప.. కావ్యని వంట మనిషిలా చూస్తావేంటి ధాన్యలక్ష్మి.. ఆడది ఎదుగుతుంటే.. మరో ఆడది అడ్డుకుంటే చూడటానికి ధరిద్రంగా ఉంటుంది.’ అని ఆమె తన కోడలు ధాన్యలక్ష్మికి బుద్ది చెబుతుంది. వెంటనే అపర్ణ.. నా కోడలు ఆఫీసుకు వెళ్లడానికి నీ బోడి పర్మిషన్ ఎవరికి కావాలి..? నీ ఏడుపు ఏదో నువ్వు ఏడువు అని.. కావ్య నువ్వు ఆఫీసుకు వెళ్తున్నావ్?. ఏడ్చేవాళ్లు ఏడ్వనీ.. నీకు, నాకు సంబంధం లేదు అని అపర్ణ అంటుంది.
ఆ మాటలకు ధాన్యలక్ష్మి.. ఈ మహాతల్లిని చూసి మేం ఏడ్వాలా అంటుంది. ఆ మాటలకు అపర్ణకి మరింత కోపం వస్తుంది.. షటప్ ధాన్యలక్ష్మి అంటూ పైకి లేస్తుంది. ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావేంటి.. అని సీరియస్ అవుతుంది. ఆమెను సుభాష్ కూల్ చేస్తాడు. తర్వాత.. కావ్యను సంతోషంగా ఆఫీసుకు రమ్మని సుభాష్ అంటాడు. ఈ రోజు మంచి రోజని.. మీ అత్తమామలు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి.. ఈరోజు నుంచే ఆఫీసుకు వెళ్లమని ఇందిరాదేవి చెబుతుంది.
Brahmamudi
ఇక కావ్య వెంటనే వెళ్లి రాజ్ ని తికమకపెట్టి.. తాను కట్టుకోవడానికి ఏ చీర బాగుంటుందో సెలక్ట్ చేయమని అడుగుతుంది. రాజ్ ఓ చీర సెలక్ట్ చేస్తే.. అది కాదని.. వేరే చీర సెలక్ట్ చేసుకుంటుంది. తర్వాత.. కొత్త చీర కట్టుకొని.. ఏ రాజ్యం ఏలడానికి అని రాజ్ అడిగితే.. తాను కూడా ఆఫీసుకు వస్తున్నాను అని చెబుతుంది. ఆ మాట విని రాజ్ షాక్ అవుతాడు. రాజ్ కి అర్థం కాకుండా కవిత్వం భాషలో ఏదేదో మాట్లాడుతుంది. అయితే.. కావ్య ఆఫీసుకి రావడానికి రాజ్ నేను ఒప్పుకోను అంటే.. తనకు తన అత్త పర్మిషన్ ఇచ్చిందని చెబుతుంది. ఆ మాటలకు రాజ్ నవ్వుకుంటాడు. మా అమ్మ అస్సలు ఒప్పుకోదని నవ్వేసుకుంటూ ఉంటాడు. కాదు.. నిజం అని కావ్య అంటే.. మా అమ్మ ఆరోగ్యానికి ఏమైందని.. హాస్పిటల్ కి తీసుకువెళ్లాాలి అనుకుంటాడు. కానీ.. కావ్య అత్తయ్య ఆరోగ్యానికి ఏమీ కాలేదు అని కావ్య చెబుతుంది. తర్వాత.. నేను ఆఫీసుకు వస్తే మీకు అడ్డేంటి అని అడుగుతుంది. శ్వేత వస్తుందని తెలిసిపోతుంది ఎలా అని రాజ్ పీక్కుంటూ ఉంటాడు.
Brahmamudi
ఆ విషయం బయటకు చెప్పకుండా... మా అమ్మ ఒప్పుకోవడం ఏంటి అని.. అయినా నాకు చెప్పాలి అంటాడు. నువ్వు ఏదైనా కల కన్నావా అని రాజ్ అంటే కవలలను కన్నాను అని అంటుంది. అది విని రాజ్ ఏంటి అంటే.. మీకు అత్తయ్యగారు నాకు పర్మిషన్ ఇచ్చారో లేదో తెలియాలంటే.. కిందకు వెళితే సరిపోతుంది.. మీరు బయటకు వెళితే నేను చీర మార్చుకుంటాను అని చెబుతుంది. తర్వాత.. రాజ్ వెళ్లాక.. మీరు నన్ను ఆఫీసుకు ఎందుకు వద్దు అంటున్నారో.. తెలుసుకోవడానికే నేను వస్తున్నాను అని అనుకుంటుంది.
రాజ్ కిందకు వెళ్లి.. వాళ్ల అమ్మ కావ్యకు పర్మిషన్ ఇవ్వడం ఏంటా అని ఆలోచించుకుంటూ కిందకు దిగుతుంటే.. అపర్ణ ఆపేస్తుంది. నువ్వు ఒక్కడివే వస్తున్నావేంటి..? నీ భార్య ఏది అని అడుగుతుంది. ఆ మాటకే రాజ్ షాకౌతాడు.. ఈ లోగా కావ్య నేను రెడీ అయ్యాను అత్తయ్య అని కిందకు వస్తుంది. చీర బాగుందని అపర్ణ మెచ్చుకుంటుంది. ఆఫీసుకు త్వరగా వెళ్లాలని అపర్ణ చెబుతుంది. కావ్య సరే అని అంటుంది. అక్కడ ఏం జరుగుతుందో రాజ్ కి ఏమీ అర్థం కాదు.
Brahmamudi
కావ్య కావాలనే.. వారిద్దరూ మాట్లాడుకోవాలని దేవుడుకి దండం పెట్టుకోవడానికి వెళతాను అని చెప్పి వెళ్తుంది. కావ్య లేదని.. రాజ్.. వాళ్ల అమ్మని అడుగుతాడు. తప్పక ఒప్పుకున్నాను అని అపర్ణ చెబుతుంది. తర్వాత.. రాజ్, కావ్యలు కారులో ఆఫీసుకు బయలుదేరబోతారు. అసలు.. మా అమ్మను ఏం మాయ చేశావ్ అని రాజ్ అడుగుతాడు.. దానికి కావ్య కృష్ణ మాయ అని చెబుతుంది. అయితే.. మా అమ్మ నీ మాయలో పడినా నేను పడను అనుకొని రాజ్.. కావ్యను కారు ఎక్కించుకోకుండా ఆఫీసుకు వెళ్లిపోతాడు. దీంతో కావ్య.. అయితే.. మీ రాచకార్యాలకు ఆఫీసులోనే చేస్తున్నారనుకుంట.. అందుకే.. ఎప్పడూ నేను ఆఫీసు వస్తాను అన్నా మీరు ఏమీ అనలేదు.. ఇప్పుడు ఇలా రియాక్ట్ అవుతున్నారు అని అనుకుంటుంది.
కమింగప్ లో.. కావ్యను ఇంకా ఆఫీసుకు ఎందుకు వెళ్లలేదు లేదు అంటే క్యాబ్ కోసం చూస్తన్నాను అంటుంది. షేర్ ఆటో దొరకలేదా అని ధాన్యలక్ష్మి సెటైర్ వేస్తే.. కావ్య ఈ ఇంటి పెద్ద కోడలు అని.. ఆటోలో వెళ్లాల్సిన అవసరం లేదని.. తన కారు ఇచ్చి పంపుతుంది. అక్కడ ఆఫీసులో కూడా అందరూ కావ్య కోసం బొకేలు పట్టుకొని ఎదురుచూస్తూ ఉంటారు. అది చూసి.. రాజ్ కూడా షాకైపోతాడు.