BrahmaMudi 27th January Episode:కావ్య , కళ్యాణ్ డ్రామా లో పడిపోయిన ధాన్యం, రుద్రాణి కి చెమటలు పట్టించిన స్వప
మేం నిన్ను చంపడం ఏంటి అని రుద్రాణి అడిగితే... ఈ ట్యబ్లెట్స్ కారణం అని స్వప్న అంటుంది. ఈ ట్యాబ్లెట్స్ డేట్ ఎక్స్ పైర్ అయ్యాయి అని.. ఇవి వేసుకుంటే నాకు రియాక్షన్ వచ్చి చనిపోతానని స్వప్న అంటుంది.
Brahmamudi
BrahmaMudi 27th January Episode: ఇందిరాదేవి తన ఇద్దరు కోడళ్లకు.. బుద్ధి చెబుతుంది. మీరు ఇద్దరూ ఒక మాట మీద ఉంటే.. మూడో మనిషి చెప్పుడు మాటలు విని సమస్యలు తెచ్చుకునే అవకాశం ఉండదు అని చెబుతుంది. మీరే ఇలా గొడవలు పడితే.. మీ కోడళ్లు మీ మాట ఎలా ఉంటారు..? కలిసి ఉండమని ఎలా చెబుతారు..? పెద్దవాళ్లే అనుకోగా లేనిది.. మేం అనుకుంటే తప్పా అని కోడళ్లు అనుకుంటారు.. అత్త మీద గౌరవం పోతుంది. అత్త మాట మీద విలువ లేకుండా పోతుంది.. మీరు మీ కోడళ్లకు ఆదర్శంగా ఉండాలి.. తప్పుదోవ పట్టించేలా ఉండకూదడు అని కోడళ్లకు వార్నింగ్ ఇచ్చి వెళుతుంది. అలా చెప్పి ఇందిరాదేవి వెళ్లగానే... సారీ అక్క.. ఇవ్వాల్సిన విలువ ఇస్తే.. నేనెందుకు ఇలా ఉంటాను అని ధాన్యలక్ష్మి అంటుంది. దానికి మండిన అపర్ణ.. తాను ఇక నుంచి నీ జోలికి రాను అని.. తన జోలికి మాత్రమే తాను చూసుకుంటానని.. ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో అంతే ఇస్తాను అని అంటుంది. అపర్ణ ఏమన్నదో అర్థం కాక ధాన్యలక్ష్మి తలగోక్కుంటుంది.
Brahmamudi
మరోవైపు స్వప్నకు రుద్రాణి యాపిల్ తెచ్చి ఇస్తుంది. ట్యాబ్లెట్స్ గురించి స్వప్న అడిగితే.. రాహుల్ తో తెప్పించాను అని చెబుతుంది. తర్వాత.. ఆ ట్యాబ్లెట్స్ దగ్గర నుంచి.. స్వప్న వీడియో రికార్డు చేస్తుంది. ‘నా పేరు స్వప్న. నేను కడుపుతో ఉన్నాను. నాకు ట్యాబ్లెట్స్ కావాలని మా అత్తను అడిగాను. మా ఆయనతో తెప్పించింది. వీళ్లు నన్ను చంపాలని ప్లాన్ చేస్తున్నారు’ అని వీడియో రికార్డు చేస్తుంది. అది విని రుద్రాణి, రాహుల్ షాకౌతారు. మేం నిన్ను చంపడం ఏంటి అని రుద్రాణి అడిగితే... ఈ ట్యబ్లెట్స్ కారణం అని స్వప్న అంటుంది. ఈ ట్యాబ్లెట్స్ డేట్ ఎక్స్ పైర్ అయ్యాయి అని.. ఇవి వేసుకుంటే నాకు రియాక్షన్ వచ్చి చనిపోతానని స్వప్న అంటుంది.
Brahmamudi
తనపై చాలా నిందలు వేశారని, కానీ వాటిని తప్పు అని తాను నిరూపించుకున్నాను అని స్వప్న అంటుంది. కానీ మీరు మాత్రం నన్ను డైరెక్ట్ గా ఏమీ చేయలేక ఈ ట్యాబ్లెట్స్ తో నన్ను చంపాలని చూశారు, ఈ విధంగా నా మీద పగ, కసి తీసుకోవాలని అనుకుంటున్నారు అని స్వప్న అంటుంది. ఆ మాటలకు రుద్రాణికి దిమ్మ తిరిగి పోతుంది. చూసుకోకుండా తెచ్చాను అని రాహుల్ అంటాడు. ఆ ట్యాబ్లెట్స్ పట్టుకొని.. కిందకు వెళ్లి రచ్చ చేస్తాను అని స్వప్న వార్నింగ్ ఇస్తుంది. ఇంట్లో వాళ్లకు చెప్పి.. ఇంట్లో నుంచి మిమ్మల్ని బయటకు గెంటేయమని చెబుతానని, పోలీసులకు ఫోన్ చేస్తాను అని, మీడియాని కూడా పిలుస్తాను అని వాళ్లను బెదిరిస్తుంది. దీంతో.. రాహుల్, రుద్రాణిలు.. తాము సరిగా చూసుకోలేదని, పొరపాటు అయ్యిందని.. ఈ సారి డేట్ చేసుకొని ట్యాబ్లెట్స్ తెస్తామని.. ఇద్దరూ కలిసి స్వప్నను బతిమిలాడుతారు. ఆవేశంలో నువ్వు ఓ లాజిక్ మిస్ అవుతున్నావ్.. నీకు ఏదైనా అయితే.. మా మీదే అనుమానం వస్తుందని మాకు కూడా తెలుసు అని రుద్రాణి అంటుంది. స్వప్న కూడా.. ఆ విషయం నాకు తెలుసు అని.. జాగ్రత్తగా ఉండమని.. ఈసారి ఏదైనా నామీద కుట్ర చేయాలని చూస్తే.. ఈ వీడియో మీడియాలో వస్తుంది అని వార్నింగ్ ఇస్తుంది.
Brahmamudi
ఇక కావ్య.. ఇంట్లో అపర్ణను టిఫిన్ ఏం చేయమని అడుగుతుంది. పెసరట్టు చేయమని ప్రకాశం అడుగుతాడు. అపర్ణ కూడా అందరికీ అదే చేయమని చెబుతాడు. అయితే.. మాకు వద్దు అని.. నేనే చేస్తాను అని ధాన్యలక్ష్మి అంటుంది. ధాన్యలక్ష్మి వంట చేస్తాను అంటే.. ప్రకాశం భయపడిపోతూ ఉంటాడు. ధాన్యలక్ష్మి మాత్రం ఇక నుంచి మన వంట మనమే చేసుకుంటామని.. ఎవరో చేస్తే మేం తినము అని ధాన్యం అంటే... తన కోడలు మాత్రమే వంట చేయాలి అని అపర్ణ అంటుంది. వీళ్ల గొడవ మొత్తం రాజ్, కళ్యాణ్ వింటారు. తాను మాత్రం వదిన చేసిందే తింటాను అని కళ్యాణ్ అంటాడు. మరి పిన్నికి ఏం చెబుతావ్ అని రాజ్ అడిగితే పెద్దమ్మ మీదకు తోసేస్తా అంటాడు. దానికి రాజ్.. రెండు పులులు కొట్టుకుంటే.. మరెవరో లాభపడినట్లు ఉంది రా అని రాజ్ అంటాడు. ఆ మాటలు వినగానే కళ్యాణ్ కి ఓ ఐడియా వస్తుంది.
Brahmamudi
అపర్ణ, ధాన్యలక్ష్మి మధ్య ఉన్న చిచ్చుతో... కావ్యను ఆఫీసుకు పంపించాలని అనుకుంటాడు. వెంటనే రాజ్ కి థ్యాంక్స్ చెప్పి.. కావ్య దగ్గరకు పరుగులు తీస్తాడు. వచ్చి.. కావ్యను ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. చట్నీ చేస్తున్నాను అని కావ్య అంటే.. కళ్యాణ్ అది పక్కన పెట్టి.. మీరు ఆఫీసుకు వెళ్లు మంచి ఐడియా వచ్చింది అని చెబుతాడు. అసలే వాళ్లిద్దరి మధ్య అసలే పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోందని.. ఎందుకులే వద్దు అని కావ్య అంటుంది. కాసేపు ఇద్దరూ ఈ విషయాన్ని గ్రాంధికంలో మాట్లాడుకుంటారు.తర్వాత.. మామూలు భాషలో మాట్లాడుకుందాం అని కావ్య అంటే.. కళ్యాణ్ ఇక ఐడియా ఇస్తాడు. కానీ... వాళ్లిద్దరి మధ్య గొడవ పెరుగుతుందని వద్దు అని కావ్య ఫీలౌతుంది. అయితే.. కళ్యాణ్.. వాళిద్దరూ నేను పుట్టకముందు నుంచే కలిసి ఉన్నారని.. త్వరలోనే మళ్లీ కలిసిపోతారని.. వాళ్ల గురించి భయపడాల్సిన అవసరం లేదని.. అన్నయ్యతో మీరు ఆఫీసుకు వెళ్లాలి అని కావ్యకు చెబుతాడు. కావ్య ఏదో చెప్పాలని చూసినా వినిపించుకోడు. ఇక.. కావ్యకు తప్పదు.
Brahmamudi
వారి ప్లాన్ లో భాగంగా.. ధాన్యలక్ష్మి కి వినపడేలా.. మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరూ కలిసి ధాన్యలక్ష్మి వినాలని చాలా తెలివిగా మాట్లాడుకుంటారు. అంటే మీరు ఈ రోజు నుంచి ఆఫీసుకు వెళ్లాలని అనుకుంటున్నారా అని కళ్యాణ్ అంటే.. అవునని.. తాను ఎంతకాలం కిచెన్ లో మగ్గిపోవాలని, కిచెన్ లో కిటికీ కి అంటుకున్న గ్రీజులా ఉండాలి.. వంటింటి కుందేలులా మిగిలిపోవాలి అని భారీ డైలాగులు కొడుతుంది. అది విని ధాన్యలక్ష్మికి కోపం వస్తుంది. కానీ మీ నిర్ణయాన్ని ఇంట్లో ఎవరూ ఒప్పుకోరు అని కళ్యాణ్ అంటాడు. కావ్య మాత్రం నేను ఆఫీసుకు వెళతానని, తన డిజైన్లతో కంపెనీ పేరు ప్రతిష్టలు పెంచుతాను అని అంటుంది. నా కొడుకును అసమర్థుడిని చేసి, నువ్వు ఆఫీసుకు వెళ్లి రాజ్యం ఏలుదాం అనుకుంటున్నావా.. చూస్తా.. నువ్వు ఆఫీసుకు ఎలా వెళతావో అని ధాన్యలక్ష్మి అనుకుంటుంది.
ఇక, అప్పూ కి మరో కొత్త ప్లేస్ లో ఉద్యోగం దొరుకుతుంది. వెంటనే ఆ పనిలో జాయిన్ అయిపోతుంది. తనకు జాబ్ ఇచ్చిన అమ్మాయి కూడా.. కళ్యాణ్ ని నువ్వు డబ్బు కోసమే కదా అంటూ చాలా తక్కువ చేసి మాట్లాడుతుంది. ఆ మాట విని అప్పూకి కోపం వస్తుంది. మరి ఆ కోపంతో అక్కడ కూడా ఉద్యోగం పోగొట్టుకుంటుందేమో చూడాలి.
కమింగప్ లో కావ్య ఆఫీసుకు వెళ్లాలి అనే నిర్ణయాన్ని అపర్ణకు చెబుతుంది. ఆ మాట విని ధాన్యలక్ష్మి వద్దు అనే నిర్ణయం తీసుకుంటే... అపర్ణ మాత్రం.. నా కోడలు ఆఫీసుకు వెళ్తుంది అని కావ్యకు సపోర్ట్ చేస్తుంది.