BrahmaMudi 26th January Episode:అనామిక పెట్టిన చిచ్చు.. కావ్యకు కలిసొచ్చింది..సపోర్ట్ గా మారిన అత్త..!
చదివిన చదువుకు తగిన ఉద్యోగం చూసుకోవమని మూర్తి అంటాడు, దానికి అప్పూ,, తాను ఆ పనిలోనే ఉన్నానని.. అది దొరికే వరకు ఈ డెలివరీ జాబ్ చేస్తానని.. తర్వాత.. మానేస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
Brahmamudi
BrahmaMudi 26th January Episode:కళ్యాణ్.. రాజ్ ఫోన్ తీసుకొని వస్తాడు. మెసేజ్ చూడమని కావ్యకు ఇస్తాడు. కానీ.. కావ్య చూడటానికి ఇష్టపడదు. దీంతో.. కళ్యాణ్ ఆ మెసేజ్ లు చదువుతాడు. ఆ మెసేజ్ లలో పెద్దగా ఏమీ లేదని , కానీ వారి మధ్య స్నేహానికి మించి ఏదో ఉందని అనిపిస్తోందని అంటాడు. ఆ మాటకు కావ్య కంగారు పడుతుంది. తర్వాత కళ్యాణ్.. ఫోన్ మళ్లీ బెడ్ మీద పెట్టేస్తాడు.
Brahmamudi
తర్వాత... పక్కకు తీసుకువెళ్లి మీరు అన్నయ్య పక్కనే ఉండాలి వదిన అని చెబుతాడు. దానికి కావ్య.. ఆయన మనసులో నేను లేకుండా.. పక్కన ఉండి మాత్రం ఏం లాభం అని అంటుంది. దానికి కళ్యాణ్.. లేదు.. మీరు అన్నయ్యతో పాటు ఆఫీసుకు కూడా వెళ్లాలి అని అంటాడు. ఏ ఇంట్లో ఉండి ఏం మాట్లాడుతున్నారు కవి గారు.. కిచెన్ లో టిఫెన్లు రెడీ చేస్తాను అని వెళ్లిపోతుంది.
Brahmamudi
ఇక.. సీన్ కట్ చేస్తే.. ఇంట్లో అప్పూ పనికి వెళ్లడానికి రెడీ అవుతుంది. ఎక్కడికి అని కనకం, మూర్తి అడిగితే.. కొత్తగా డెలివరీ బాయ్ పని దొరికింది అని చెబుతుంది. వద్దు అని.. ఇంకా చదువుకోవాలని ఉంటే చదువుకోమని కనకం చెబుతుంది. అయితే.. నాన్నకు తన చదువు పేరిట ఇంకా భారం కావాలని అనుకోలేదని చెబుతుంది. ఇప్పటికే స్వప్న అక్కకి చాలా చదివించారని, నేను చదివిన చదువు చాలాు అని అంటుంది. అయితే.. చదివిన చదువుకు తగిన ఉద్యోగం చూసుకోవమని మూర్తి అంటాడు, దానికి అప్పూ,, తాను ఆ పనిలోనే ఉన్నానని.. అది దొరికే వరకు ఈ డెలివరీ జాబ్ చేస్తానని.. తర్వాత.. మానేస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
Brahmamudi
కావ్య బెడ్రూమ్ లోకి వెళుతుంది. అప్పుడే.. శ్వేత నుంచి ఫోన్ వస్తుంది. కావ్య ఆ ఫోన్ పట్టుకోగానే.. వెనక నుంచి వచ్చిన రాజ్ ఫోన్ లాక్కుంటాడు. అంతే.. కావ్యకు విపరీతంగా కోపం వస్తుంది. కానీ.. కళ్యాణ్ మాటలు గుర్తుకు వస్తాయి. ఎంత కోపం వచ్చినా, ఆవేశం వచ్చినా చూపించకూడదని, మనం స్పై చేస్తున్నామనే అనుమానం రాకూడదు అని చెప్పడంతో.. కూల్ అవతుంది. ఈలోగా రాజ్... న్యూ క్లైంట్ అని చెబుతాడు. ఆ ఒక్కమాటకు.. సంబంధం లేకుండా.. ఏవేవో మాట్లాడేస్తుంది. అసలు.. ఏం మాట్లాడుతుుందో కూడా రాజ్ కి అర్థం కాదు. కావ్య తన ఆక్రోశం మొత్తాన్ని అర్థం కాక.. కొత్త, పాత అంటూ ఏదేదో మాట్లాడి వెళ్లిపోతుంది. ఇది తెలివైనదా, పిచ్చిదా, అర్థం చేసుకుందా, అనుమానించిందా అనేది రాజ్ కి అర్థంకాక జుట్టు పీక్కుంటాడు. ఈ లోగా శ్వేత ఫోన్ చేసి.. రమ్మని అడిగితే.. ఆఫీసులో చిన్న పని ఉందని అది అయిపోగానే వస్తాను అని చెబుతాడు.
Brahmamudi
ఇక.. ఇంట్లో హాల్ లో మరో రచ్చ మొదలౌతుంది. కళ్యాణ్ వచ్చి... పెద్దమా.. గీజర్ రిపేర్ చేసే టెక్నీషియన్ పిలిచానని.. ఎప్పుడు రమ్మంటావ్ అని అడుగుతాడు. అవసరం లేదు అని అపర్ణ అంటుంది. నిన్న కావాలి అన్నావ్ కదా పెద్దమ్మా అంటే..నిన్న తెలీక అన్నాను.. నా కొడుకు రాజ్ కి చెప్పి చేయించుకుంటాను లే అంటుంది. అంటే.. అన్నయ్యని, నన్ను వేరుగా చూస్తున్నావా పెద్దమ్మ అని కళ్యాన్ అడుగుతాడు. అలా తాను అనుకోలేదని.. కానీ అలానే చూడాలని కొందరు చూస్తున్నారు అని అపర్ణ అంటుంది.
Brahmamudi
వెంటనే.. ధాన్యలక్ష్మి అందుకుంటుంది.నేను నిన్న అన్నమాటలకే అలా అంటున్నాను అని చెప్పొచ్చు కదా అక్క.. ఇంత డొంక తిరుగుడు ఎందుకు అని అడుగుతుంది. డొంక తిరుగుడు ఏమీ లేదు.. నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను.. కళ్యాణ్ కి చెబితే.. నా కొడుక్కి ఎందుకు చెప్పావ్ అని అంటారు అందుకే చెప్పను అంటున్నాను అని అపర్ణ అంటుంది. ఇన్నాళ్లు వేరే.. ఇప్పుడు వేరు.. నా కొడుక్కి పెళ్లైంది.. వాడికి భార్య వచ్చింది.. వాడి భార్య బాధపడకూడదు కదా అని ధాన్యలక్ష్మి అంటుంది. అయితే.. ఆ విషయం నీ కొడుక్కి చెప్పుకో అని అపర్ణ బదులిస్తుంది.
Brahmamudi
అధికారం మొత్తం నీ కొడుకు చేతుల్లో ఉంటే.. నా కొడుకు ఏం చేస్తాడు అని ధాన్యలక్ష్మి అంటుంది. వెంటనే సుభాష్.. ధాన్యలక్ష్మి ఏమాట్లాడుతున్నావ్ అని అడుగుతాడు. నిజమే కదా బావగారు అని తన అక్కసు అంతా వెళ్లగక్కుతుంది. మధ్యలో రుద్రాణి.. వాళ్ల గొడవకు ఆజ్యం పోస్తూ ఉంటుంది. వీళ్ల గొడవ చూసి ఇందిరాదేవి కి విపరీతంగా కోపం వస్తుంది. ఇద్దరు కోడళ్లను బయటకు తీసుకొని వెళ్తుంది.
Brahmamudi
అక్కడ కూడా కోడళ్లకు ఆమె క్లాస్ పీకుదామని చూస్తే.. వాళ్లిద్దరూ నా కొడుకు అంటే.. నా కొడుకు అని గొడవ పడుతూనే ఉంటారు. ఇద్దరినీ ఆపమని అరుస్తుంది.కులాయి దగ్గర కొట్టుకున్నట్లు కొట్టుకుంటున్నారని.. అదొక్కటే తక్కువైందని.. అది కూడా పెట్టిస్తాను అని చెబుతుంది. అది కూడా మీ కొడుకులకు చెప్పను లే.. నా కొడుక్కి చెప్పి పెట్టిస్తాను.. ఇద్దరూ కొట్టుకోండి.. బిందె అయినా సొట్టపోవాలి.. లేదంటే.. మీ తల అయినా బొప్పి కట్టాలి అని అంటుంది. తాను ఉండగానే మీరు ఇలా కొట్టుకుంటున్నారని.. ఇద్దరికీ సీరియస్ గా క్లాస్ పీకుతుంది. అత్త ముందు ఎలా మాట్లాడాలి.. కోడలి ముందు ఎలా మాట్లాడాలో తెలుసుకోమని చెబుతుంది. అయినా కూడా .. ఇద్దరూ వాదించుకుంటూనే ఉంటారు.
ఇక కమింగ్ అప్ లో వీరి గొడవ కారణంగా కావ్యకు కలిసొచ్చేలా కనపడుతోంది. కావ్య వచ్చి తన అత్త అపర్ణ ని తాను ఆఫీసులో డిజైనర్ గా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నట్లు చెబుతుంది. నీకు కిచెన్ కరెక్ట్ అని ధాన్యలక్ష్మి అనడంతో అపర్ణకి కోపం వచ్చి.. నా కోడలు ఎక్కడ ఉండాలో చెప్పడానికి నువ్వు ఎవరు అని అంటుంది. కావ్య.. నువ్వు ఆఫీసుకు వెళ్లు అని చెబుతుంది. ఆ మాట విని కావ్య, కళ్యాణ్ సంబరపడతారు. అనామిక ముఖం మాడిపోతుంది.