BrahmaMudi 23rd March Episode:కావ్య డైరెక్షన్ లో బాబు పెంపకం, బిడ్డను వదిలేయమని అపర్ణ శాసనం..!
రాజ్ మీద సెటైర్లు వేస్తూ.. పంచ కత్తిరించి.. బాబుకి కట్టమని చెబుతుంది. కావ్య చెప్పినట్లే రాజ్ చేస్తాడు. దానిని చూసి.. పిల్లాడికి క్లాత్ కట్టడం రాదు కానీ.. బిడ్డను కనేసి తెచ్చాడు అని విసుక్కుంటుంది.
Brahmamudi
BrahmaMudi 23rd March Episode:కావ్య ఆ దేవుడు కృష్ణయ్య దగ్గర తన బాధ చెప్పుకుంటూ ఉంటే.. ఇందిరాదేవి వింటుంది. ఏంటని ఆమె అడిగితే.. తన భర్త మంచివాడని.. గొప్పవాడని.. ఎలాంటి తప్పు చేయడని, తనకు నమ్మకం ఉందని అంటుంది. తొందరపడి నిర్ణయం తీసుకొని.. పుట్టింటికి వెళ్లి కూర్చోలేనని చెబుతుంది. అయితే.. కావ్య నమ్మకం నిజం అవ్వాలని ఇందిరాదేవి కూడా ఆ దేవుడిని ప్రార్థిస్తుంది.
Brahmamudi
ఇక.. తన కొడుకు చేసిన పనికి అపర్ణ తెగ ఫైర్ అయిపోతూ ఉంటుంది. ఇన్నాళ్లు తన కొడుకు తప్పు చేయడని... అందరితో చెప్పేదాన్నని.. అలాంటిది ఇంత పెద్ద తప్పు చేస్తాడా అని అంటుంది. భార్య అంటే ఇష్టం లేకపోతే విడిపోవాలి.. విడాకులు తీసుకోవాలి కానీ.. ఇలా ఇంకొకరితో బిడ్డను కంటాడా అని భర్తతో చెప్పుకొని తిడుతుంది.
Brahmamudi
ఇక... రాజ్ బిడ్డను నిద్రపుచ్చలేక చాలా తిప్పలు పడుతూ ఉంటాడు. ఏడుస్తున్న బిడ్డను ఓదార్చలేక.. ఇక్కడ నువ్వు ఏడ్చినా.. నేను ఏడ్చినా ఎవరూ పట్టించుకోరు అనుకుంటాడు. తర్వాత.. ఎలాగోలా తిప్పలు పడి నిద్రపుచ్చుతాడు. తర్వాత.. కావ్య వెళ్లి కింద పడుకుంటుంది. మధ్యలో ఆ బుడ్డోడు నిద్రలేచి ఏడుస్తూ ఉంటాడు. వాడు.. నిద్రలో రాజ్ మీద టాయ్ లెట్ వెళతాడు. ఆ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక.. డైపర్ కూడా లేదని రాజ్ కంగారుపడతాడు. అప్పుడు కావ్య.. తిట్టుకుంటూ.. రాజ్ మీద సెటైర్లు వేస్తూ.. పంచ కత్తిరించి.. బాబుకి కట్టమని చెబుతుంది. కావ్య చెప్పినట్లే రాజ్ చేస్తాడు. దానిని చూసి.. పిల్లాడికి క్లాత్ కట్టడం రాదు కానీ.. బిడ్డను కనేసి తెచ్చాడు అని విసుక్కుంటుంది.
Brahmamudi
తెల్లారే... ధాన్యలక్ష్మి, అనామిక హాల్లో కూర్చొని కాఫీ తాగుకుంటూ కావ్య ఇంకా గొడవ ఎందుకు చేయడం లేదని.. కామ్ గా తన పని తాను చేసుకొని వెళ్లిపోతోంది ఏంటి అనుకుంటూ ఉంటారు. రుద్రాణి వచ్చి.. గదిలో గొడవ చేసే ఉంటుందిలే అని చెబుతుంది. ఈ లోగా అపర్ణ వస్తే.. ఆమె మీద కూడా.. ధాన్యలక్ష్మి, రుద్రాణి లు సెటైర్లు వేస్తారు.
Brahmamudi
అప్పుడే బాబు ఏడుస్తూ ఉంటాడు. ఆ ఏడుపులు కింద దాకా వినిపిస్తూనే ఉంటాయి. దీంతో.. రాజ్ కి బాబు ని హ్యాండిల్ చేయడం రావడం లేదని.. నువ్వు వెళ్లి సహాయం చేయమని అపర్ణకు కాలేలా రుద్రాణి మాట్లాడుతుంది. అపర్ణకు కోపం వచ్చేలా.. రుద్రాణి, ధాన్యలక్ష్మిలు ఒకరి తర్వాత ఒకరు అంటూనే ఉంటారు. ఆ మాటలతో అపర్ణకు విపరీతమైన కోపం వస్తుంది. ఆ కోపం మొత్తాన్ని రాజ్ మీద చూపిస్తుంది.
రాజ్ బిడ్డను ఎత్తుకొని కిందకు రావడంతో.. రాజ్ పై అపర్ణ ఇంత ఎత్తు ఎగరుతుంది. ఆ బిడ్డను తల్లి దగ్గరే వదిలేసి రమ్మని అంటుంది. అయితే... బాబుని తండ్రి లేని బిడ్డను చేయలేను అని రాజ్ తేల్చి చెబుతాడు. అయితే.. ఇక నుంచి.. నువ్వు , నీ కొడుకు ఇద్దరూ ఈ ఇంటి వారసులు కారని.. ఎలాంటి సంబంధం ఉండదు అని తేల్చి చెబుతుంది. మరి.. అపర్ణ నిర్ణయాన్ని రాజ్ ఎలా తీసుకుంటాడు..అసలు ఆ బాబు ఎవరు..? కావ్య అసలు నిజం ఎలా బయటపెడుతోందనే విషయం ఆసక్తిగా మారింది.