BrahmaMudi 22nd March Episode: కావ్యకు సవతి పోరు, సంబరంలో అనామిక, రుద్రాణి బాటలో ధాన్యలక్ష్మి అడుగులు.!
కావ్య అక్కడ పుట్టింటికి వెళ్లలేక ఆ బిడ్డను పెంచుకుంటూ ఇక్కడే కాలం గడిపేస్తుందని.. ఆ బిడ్డ ఇంటి వారసుడు అయిపోతే.. కళ్యాణ్ కి అన్యాయం జరిగినట్లే కదా అని అనామిక అంటుంది.
Brahmamudi
BrahmaMudi 22nd March Episode: ఇక.. కావ్య జీవితం నాశనం అయ్యిందని...పెళ్లి రోజు పెటాకులు అయ్యిందని.. అనామిక, రుద్రాణి సంబరంగా ఉంటారు. ఇద్దరూ కలిసి కూల్ డ్రింక్ తాగుతూ తమ సంతోషాన్ని పంచుకుంటూ ఉంటారు. ఇక..రాజ్ పరువు పోయిందని రుద్రాణి సంబరంగా అంటుంది. అయితే.. ధాన్యలక్ష్మి తిడుతుంది. రాజ్ పరువు పోయిందంటే.. ఈ ఇంటి పరువు పోయినట్లే అని ఆ విషయం తెలియడం లేదా అని ధాన్యలక్ష్మి సీరియస్ అవుతుంది. అయినా తాను రాజ్ ని చిన్న పిల్లాడు అప్పటి నుంచి చూస్తున్నాను అని.. రాజ్ అలాంటి తప్పు చేసి ఉండడు అని అంటుంది. కళ్లెదురుగా సాక్ష్యం కనపుడుతున్నా కూడా అలా మాట్లాడుతున్నావేంటి ధాన్యలక్ష్మి అని రుద్రాణి అంటుంది.
Brahmamudi
వెంటనే రాహుల్ కూడా.. ధాన్యలక్ష్మి అత్త చెప్పిన దాంట్లో నిజం ఉందని, రాజ్ ఒక్క తప్పు కూడా చేయడని.. ఇంత పెద్ద తప్పు చేశాడు అంటే నేను కూడా నమ్మను అంటాడు. ఇక అనామిక అందుకుంటుంది. మీరు బావ గారిని మరీ ఆకాశంలోకి ఎత్తేయకండి.. ఆయన ఆల్రెడీ బిడ్డతో పాతాళంలో కూరుకుపోయాడు అని చెబుతుంది. ఇక్కడ ఆలోచించాల్సింది ఇది కాదని.. కావ్య అక్కడ పుట్టింటికి వెళ్లలేక ఆ బిడ్డను పెంచుకుంటూ ఇక్కడే కాలం గడిపేస్తుందని.. ఆ బిడ్డ ఇంటి వారసుడు అయిపోతే.. కళ్యాణ్ కి అన్యాయం జరిగినట్లే కదా అని అనామిక అంటుంది.
Brahmamudi
నా కళ్ల ముందు కళ్యాణ్ కి అన్యాయం జరిగితే నేను ఊరుకుంటానా అని ధాన్యలక్ష్మి అంటుంది. నువ్వు చూస్తుండగానే ఇవన్నీ జరుగుతున్నాయి కదా అని రుద్రాణి అంటుంది. దీంతో.. ధాన్యలక్ష్మి ఆలోచనలో పడుతుంది. అయితే.. మా అక్కకి బాగా జరిగిందని నేను సంబరపడకూడదని.. తన కొడుక్కి అన్యాయం జరుగుతోందని అనుకుంటుంది. ఎలాగైనా రాజ్ ని గద్దె దించి.. తన కొడుక్కి పట్టాభిషేకం చేయాల్సిందే అని అనుకుంటుంది. దాని కోసం ఈ దుగ్గిరాల ఇంట్లో కురుక్షేత్రం అయినా సృష్టిస్తాను అని అంటుంది. ఆ మాటకు అనామిక సంబరపడుతుంది. ఇంతకాలానికి నువ్వు నా దారిలోకి వచ్చావ్ అని రుద్రాణి అంటే.. నీ దారి ధరిధ్రం అని తెలిసినా రాక తప్పలేదు అని ధాన్యలక్ష్మి అనుకుంటుంది. అయితే.. నువ్వు కళ్యాణ్ కి పట్టం కడితే.. వాడిని దించి.. నా కొడుక్కి దక్కేలా చేస్తాను అని రుద్రాణి మనసులో అనుకుంటుంది.
Brahmamudi
ఇక.. ఇందిరాదేవి.. కావ్య పరిస్థితి చూసి జాలి పడుతుంది. తానే అనవసరంగా విడాకుల ఐడియా ఇచ్చానని.. ఆ ఐడియా ఇవ్వకపోయినా బాగుండేది అని అనుకుంటుంది. ఆమె కావ్యకు క్షమాపణలు కూడా చెబుతుంది. అయ్యొ అమ్మమ్మగారు.. మీరు నాకు క్షమాపణలు చెప్పడం ఏంటి అని కావ్య వారిస్తుంది. పుట్టింటికి రమ్మని మీ అమ్మ పిలిస్తే..ఎందుకు వెళ్లలేదు.. ఇంత మొండి ధైర్యం ఎలా వచ్చింది అని అంటుంది. కావ్య మాత్రం.. తనకు జరగాల్సిన న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదలను అని అంటుంది. ఆమె బాధగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
Brahmamudi
ఇక.. కావ్య తన ఆరాధ్య దైవం కృష్ణుడి దగ్గర కూర్చొని తన బాధ మొత్తం చెప్పుకుంటుంది. తన భర్త తనపై ప్రేమను చూపిస్తాడు అనుకుంటే.. ఇలా బిడ్డను ఎత్తుకొని వచ్చాడు అని అంటుంది. అయినా తన భర్త ఈ సంవత్సరకాలంలో ఏనాడు ఒక్క తప్పు చేయలేదని.. కష్టంలో ఉన్నప్పుడు తన కుటుంబానికి ఆపద్భాందవుడు లా ఆదుకున్నాడని.. ఎవరికి కష్టం వచ్చినా సహాయం చేశాడని.. అలాంటి వ్యక్తి తప్పు చేయడు అని కావ్య కృష్ణయ్యతో అంటుంది.
Brahmamudi
ఆ మాటలు ఇందిరాదేవి వింటుంది. ఇంత చిన్న వయసులో నీకు ఇంత మెచ్యూరిటీ ఎలా వచ్చింది..? చిన్నతనం నుంచి వాడిని చూస్తున్నమాకే నమ్మకం కలగలేదు..? నీకు ఇంత నమ్మకం ఏంటి అని అడుగుతుంది. ఆయన సంవత్సరంలో ఒక్క తప్పు కూడా చేయలేదని.. సడెన్ గా ఈరోజు తప్పు చేసే వ్యక్తి కాదని కావ్య నమ్మకంగా చెబుతుంది. దీని వెనక ఏదో రహస్యం ఉందని.. ఆ రహస్యాన్ని తాను చేధిస్తాను అని కావ్య అంటుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.