BrahmaMudi 20th march Episode:నా జీవితం నీకే అర్పిస్తున్నా.. విడాకుల కాగితాలు చింపేసి, కావ్య కు రాజ్ ప్రపోజల్.
తప్పు చేస్తే నిజంగానే నేను కూడా వచ్చేదాన్ని కాదని.. తప్పు చేయలేదు కాబట్టి వచ్చిను అని ధైర్యం గా బదులిస్తుంది. ఈ లోగా కళ్యాణ్ వచ్చి వాళ్లను లోపలికి పిలవడంతో వీళ్లు ఆగిపోతారు.
Brahmamudi
BrahmaMudi 20th march Episode: కావ్య పిలిచిందని కనకం, మూర్తి , అప్పూ ఈవెంట్ కి వస్తారు. వాళ్లు వస్తుండగానే దెయ్యాల గుంపు రెడీ అయిపోతుంది. ధాన్యలక్ష్మి, రుద్రాణి, అనామిక ముగ్గురు ఎదురుపడతారు. ముందు రుద్రాణి మొదలుపెడుతుంది. ఏ ఫంక్షన్ వదలకుండా.. సిగ్గులేకుండా వచ్చారుగా అని రుద్రాణి మొదలుపెడుతుంది. అయితే... రుద్రాణికి అప్పూ ఇచ్చిపడేస్తుంది. ఇది తన అక్క ఇల్లు అని.. ఎవరు పిలవకపోయినా వస్తాము అంటుంది.
Brahmamudi
ఇక వెంటనే ధాన్యలక్ష్మి అందుకుంటుంది. ఎందుకురారు మీకు సిగ్గులేదు కాబట్టి వస్తారు అని అంటుంది. ఆమాటకు కనకం కోపంతో ధాన్యలక్ష్మి అని సీరియస్ అయితే.. నీ కూతురు ఇంకోసారి మా ఇంటికి రావద్దు అని చెప్పాను కదా అని అడుగుతుంది. వెంటనే అనామిక కూడా.. ఆ ప్లేస్ లో నేను ఉంటే ఇంకోసారి ఆ ఇంటి ముఖం కూడా చూసేదాన్ని కాదు అని అంటుంది. దానికి అప్పూ.. తప్పు చేస్తే నిజంగానే నేను కూడా వచ్చేదాన్ని కాదని.. తప్పు చేయలేదు కాబట్టి వచ్చిను అని ధైర్యం గా బదులిస్తుంది. ఈ లోగా కళ్యాణ్ వచ్చి వాళ్లను లోపలికి పిలవడంతో వీళ్లు ఆగిపోతారు.
Brahmamudi
కావ్య అందంగా ముస్తాబై.. మ్యారేజ్ డే సెలబ్రేట్ చేస్తున్న ప్లేస్ కి వస్తుంది. చాలా అందంగా ఉందని.. వాళ్ల పేరెంట్స్ మురిసిపోతారు. అనామిక, ధాన్యలక్ష్మి వాళ్లు మాత్రం.. తమ కుళ్లు మొత్తం ప్రదర్శిస్తారు. ఇక.. రాజ్ రావడం కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. రాజ్ ఎలాంటి న్యూస్ చెబుతాడా అని వెయిట్ చేస్తూ ఉంటారు. కనకం, మూర్తి దంపతులు, అప్పూ కాస్త టెన్షన్ పడుతూ ఉంటారు.
Brahmamudi
ఇక.. రాజ్ రావడం రావడమే తన చేతిలో నుంచి కాగితాలు బయటకు తీస్తాడు. ఆ కాగింతాలేంటి నాన్న అని అపర్ణ అడుగుతుంది. విడాకుల కాగితాలు అని రాజ్ చెబుతాడు. ఆ మాట విని అక్కడ ఉన్న ఫ్యామిలీ మొత్తం షాకైపోతుంది. అయితే.. ఆ విడాకుల కాగితాలను చేతిలో పట్టుకొని.. మరో చేతితో కావ్య చెయ్యి అందుకొని.. రాజ్ పైకి తీసుకొని వెళతాడు.
Brahmamudi
రాజ్ ఏం చెబుతాడా అని కావ్య టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ విడాకుల పత్రాలు తనకు కళావతి ఇచ్చిందని చెబుతాడు. తాను అలా ఇవ్వడానికి కారణం తానే అని చెబుతాడు. సంవత్సరం నుంచి నేను మారతానని.. తనను అర్థం చేసుకుంటానని ఎంతో ఎదుురుచూసిందని.. కానీ తాను మారకపోవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకుందని చెబుతాడు.
Brahmamudi
ఈ సంవత్సరకాలంలో తాను ఏరోజూ కళావతిని ప్రేమగా దగ్గరకు తీసుకున్నది లేదని, అర్థం చేసుకున్నది కూడా లేదని రాజ్ అంటాడు. తాను ఒక్క సంతకం చేస్తే.. తాము విడిపోతాం అని కూడా తనకు తెలుసు అంటాడు. కానీ.. పెళ్లంటే అర్థం అది కాదని.. తాను ఈ విడాకులు కళావతికి ఇవ్వాలని అనుకోవడం లేదని చెబుతాడు. తన చేతిలోని విడాకుల పత్రాలను చింపి విసిరేస్తాడు.
Brahmamudi
తర్వాత.. జీవితాంతం నిన్ను ప్రేమగా చూసుకుంటానని.. ఇది మన పెళ్లి రోజు కాదని... ఈరోజే నిజమైన పెళ్లి అని అంటాడు. ఈ రోజు నుంచి కొత్త జీవితం ప్రారంభిద్దాం అంటూూ.. ఉంగరం బయటకు తీస్తాడు. ఆ ఉంగరాన్ని ప్రేమగా... కావ్య చేతికి తొడుగుతాడు. కావ్య ఆనందం మొత్తం కళ్లలోనే కనపడుతుంది. కుటుంబ సభ్యులంతా కూడా ఆనందంతో చప్పట్లు కొడుతూ ఉంటారు. అపర్ణ, ధాన్యలక్ష్మి, అనామిక మాత్రం అయిష్టంగా చప్పట్లు కొడుతూ ఉంటారు.
Brahmamudi
అయితే..అదంతా కావ్య కల. రాజ్ మారిపోయి.. తనకు ఉంగరం తొడిగినట్లు ఊహించుకుంటుంది. ఇదంతా నిజంగా జరగలేదా అని డీలా పడిపోతుంది. అయితే.. అదే జరిగేలా తనకు అనిపిస్తోందని.. ఇందిరాదేవి ధైర్యం చెప్పి.. కావ్యను ఫంక్షన్ జరిగే ప్రదేశానికి తీసుకువెళ్తుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.
మరి రేపటి ఎపిసోడ్ లో.. రాజ్ నిజంగా మారతాడా లేక.. కావ్యకు ఊహించని ట్విస్ట్ ఇస్తాడా అనేది తెలియాల్సి ఉంది.