BrahmaMudi 19th February Episode:పెత్తనం కోసం అనామిక పెంట.. కళ్యాణ్ ని తనవైపు తిప్పుకోగలను అన్న అప్పూ..!
మీ అబ్బాయి జీవితం ఎప్పడూ ఎవరో ఒకరి కాళ్ల కింద బతకాల్సి వస్తుంది అని అనామిక అంటుంది. అలా జరగనివ్వను అని ధాన్యలక్ష్మి.. అనామికను తీసుకొని హాల్ లోకి వస్తుంది.
Brahmamudi
BrahmaMudi 19th February Episode: అనామిక షాపింగ్ వెళ్లాలని ఆశపడుతుంది. కానీ కళ్యాణ్ దగ్గర కనీసం క్రెడిట్ కార్డు కూడా లేదని, అవి కూడా కావ్య దగ్గరే ఉన్నాయని తెలుసుకొని మండిపోతుంది. వెంటనే తన అత్త దగ్గరకు వెళ్లి ఎక్కిస్తుంది. తాను రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చానని.. అలాంటి తాను తన భర్తతో షాపింగ్ కి వెళ్లడానికి కూడా డబ్బుల కోసం చేతులు చాచలేను అని అంటుంది. కావ్య ఆఫీసుకు వెళ్తుంది కాబట్టి ఇంటి పెత్తనం మీకైనా ఇవ్వమనండి..లేదంటే నాకైనా ఇవ్వమనండి అని అంటుంది. లేదంటే.. మీ అబ్బాయి జీవితం ఎప్పడూ ఎవరో ఒకరి కాళ్ల కింద బతకాల్సి వస్తుంది అని అనామిక అంటుంది. అలా జరగనివ్వను అని ధాన్యలక్ష్మి.. అనామికను తీసుకొని హాల్ లోకి వస్తుంది.
Brahmamudi
అప్పుడే రాజ్-కావ్యలు ఆఫీసుకు బయలుదేరుతూ ఉంటారు. అప్పుడు కూడా కావ్య తన బావ గురించే చెబుతూ ఉంటుంది. నేను దూరం అయ్యానని మా బావ బెంగ పెట్టుకొని టీలు ఎక్కువగా తాగేసి ఛాయ్ దాసు అయిపోయాడు అంటుంది. ఛాయ్ ధాస్ ఏంటి అని రాజ్ అంటే.. మరి మందు అలవాటు లేదు కదా అని చెబుతుంది. ఆ మాటలకు రాజ్ ముఖం మాడ్చేస్తాడు.
Brahmamudi
ఇక అప్పుడే హాల్ లో ధాన్యలక్ష్మి పంచాయతీ మొదలౌతుంది. అనామికను లాక్కొస్తుంది. ఏమైంది ఇప్పుడు ఎందుకు లాక్కొస్తున్నావ్ అని ఇంట్లో అందరూ అడుగుతారు. అయితే తనని తన కోడలిని ఇంట్లో పనివాళ్లలాగా చూస్తున్నారని, ఇక సెక్యురిటీ గార్డ్, తోటమాలిని కూడా తీసేసి ఆ పనులు తన భర్త, కొడుక్కి అప్పగించమని చెబుతుంది. ఇఫ్పుడు ఎవరు మిమ్మల్ని ఏమన్నారు అని ఇందిరాదేవి అంటే... నోరు తెరచి అనలేదని అంటుంది . కానీ.. ఈ ఇంట్లో కావ్యను తప్ప మరొకరిని కోడలిగా చూడటం లేదని, తన కోడలు మాత్రం కోడలు కాదా అని ప్రశ్నిస్తుంది. కావ్యకు మాత్రమే అన్ని అధికారాలు ఇస్తున్నారని, తన కోడలికి ఇవ్వడం లేదని బాధపడుతుంది. అయితే... ఈ ఇంటి పెత్తనం పెద్దకోడలికి మాత్రమే ఇస్తామనే విషయం నీకు తెలీదా అని ఇందిరాదేవి అడుగుతుంది. ఇంతకాలం అపర్ణక్క తమ మీద పెత్తనం చేసిందని, ఇప్పుడు కావ్య తన కోడలి మీద పెత్తనం చేస్తుందని ధాన్యలక్ష్మి అంటుంది.
Brahmamudi
ధాన్యలక్ష్మి తిక్కగా అందరితో గొడవకు దిగుతోందని.. ఆమె భర్త ప్రకాశం తిడతాడు. ఇంటికి కోడలు వచ్చిన తర్వాత.. నిన్ను పుట్టింటికి పంపిస్తే బాగోదని ఆగుతున్నానని, లేకపోతే బస్సు ఎక్కించి పుట్టింటికి పంపించేవాడిని అని చెబుతాడు.
Brahmamudi
అయితే... వెంటనే సుభాష్.. తన తమ్ముడిని ఆగమని.. నువ్వు ఈ ఇంటికి దుగ్గిరాల కోడలివి. నీకు ఏహైనా అన్యాయం జరిగిందా? నిన్ను కానీ, అనామికను కానీ ఎవరైనా ఏమైనా అన్నారా అని చాలా మంచిగా, మర్యాదగా అడుగుతాడు. అప్పుడు అనామిక షాపింగ్ వ్యవహారం, క్రెడిట్ విషయం మొత్తం బయటకు చెబుతుంది. కావ్య ఆఫీసుకు వెళితే..ఆమె వచ్చేంత వరకు డబ్బులు లేక ఇబ్బందిపడుతూ ఉండాలా అని అంటుంది.
Brahmamudi
వెంటనే స్వప్న అందుకొని.. మొన్న అందుకే కదా కావ్య ఇంట్లో డబ్బు ఇచ్చి వెళితే మీరు దొంగతనం ముద్ర వేశారు అని సీరియస్ అవుతుంది. అయితే.. నువ్వు మా దుగ్గిరాలకోడలివి కాదు.. నీకు సంబంధం లేదు అంటుంది. రుద్రాణి కూడా.. మనకు సంబంధం లేదు మాట్లాడొద్దు అని చెప్పడంతో స్వప్న ఆగుతుంది. తర్వాత.. ఇప్పుడు దీనికి సమాధానం నేను కాదు.. కళ్యాణ్ చెబుతాడు అని అపర్ణ అంటుంది.
Brahmamudi
వెంటనే కళ్యాణ్.. తనకు క్రెడిట్ అవసరం లేదని పెద్దమ్మను నేను లాకర్ లో పెట్టమని చెప్పాను అని.. ఇప్పుడు తాళం కావ్య వదిన దగ్గర ఉంది కాబట్టి.. వదిన దగ్గర తీసుకుంటాను అని అనామికతో అన్నాను. ఈలోగా అత్తా కోడళ్లు ఇద్దరూ కలిసి ఇలా రచ్చ చేశారు అని కళ్యాణ్ చెబుతాడు. ఇప్పుడేమంటారు అని అపర్ణ అంటుంది. అయితే.. ధాన్యలక్ష్మి మాత్రం కావ్య ఆఫీసుకు వెళ్తుంది కాబట్టి.. పెత్తనం తన కోడలు అనామిక కు ఇవ్వాలి అని అడుగుతుంది. ఆ మాటకు అందరూ షాకౌతారు.
ఇక స్వప్న తగులుకుంటుంది. ఇది ఆమె ప్లాన్. మొదటి నుంచి కావ్యకు తాళాలు ఇవ్వడం ఈమెకు ఇష్టం లేదని.. అందుకే ఏదో ఒక విధంగా కావ్యను అర్హురాలు కాదు అని ప్రూవ్ చేయాలి అనుకున్నారు. మొన్న దొంగతనం నేరం వేశారని, వీళ్లకు తోడు మా అత్త రుద్రాణి కూడా చేరి.. సలహాలు ఇష్తుంది.. అందుకే ఇలా చేస్తున్నారని స్వప్న అంటుంది. నువ్వు మధ్యలో మాట్లాడొద్దు అని ధాన్యలక్ష్మి అంటే.. నేను నీ కోడలిని కాదు, నీ వంశం కాదు. నా అత్త వేరే, నా మొగుడు వేరే.. నాతో పెట్టుకుంటే ఇత్తడి అయిపోతుందని వార్నింగ్ ఇస్తుంది. సీన్ మాత్రం అందరిపోతుంది. స్వప్న ఆవేశపడుతుంటే కావ్య ఆపుతుంది.
Brahmamudi
అయితే.. అపర్ణ సముదాయిస్తుంది. ఇంతకాలంలో ఎప్పుడూ నేను నిన్ను తోటికోడలు లా కాకుండా, చెల్లిలా చూశానని గుర్తు చేస్తుంది. నీ కోడలు వచ్చిన దగ్గర నుంచి చెప్పుడు మాటలు విని పాడైపోతున్నావని, నీకు ఏదైనా సమస్య వచ్చింది అంటే.. సామరస్యంగా చెప్పమని.. ఇలా గొడవ చేయవద్దని చెబుతుంది. ఇందిరాదేవి కూడా.. అపర్ణ చెప్పిందే కరెక్ట్ అని ఫుల్ సపోర్ట్ చేస్తుంది. నీ కోడలికి కూడా అర్థమయ్యేలా చెప్పమని, ఇంటి బాధ్యతలు ఎవరికి ఇవ్వాలో తనకు తెలుసు అని అంటుంది. ఇక.. కళ్యాణ్ ని పిలిచి కార్డులు తీసుకోమని, నీకు కావాల్సినంత ఖర్చు పెట్టుకోమని చెబుతుంది. తర్వాత.. మీ ఆవిడ చెయ్యి నువ్వు పట్టుకో.. మీ అమ్మకి ఇవ్వకు అని చెబుతుంది.
Brahmamudi
కళ్యాణ్ కూడా సరే అని అంటాడు. అక్కడితో పంచాయతీ ముగుస్తుంది. అనామికను కళ్యాణ్, ధాన్యలక్ష్మిని ప్రకాశం, స్వప్నను రాహుల్ లోపలికి తీసుకొని వెళతారు. రాజ్ ని మాత్రం కావ్య తీసుకొని వెళ్తుంది. ఇక.. రుద్రాణి ఒక్కతే ఒంటరిగా మిగులుతుంది. తన చెయ్యి పట్టుకొని తీసుకువెళ్లడానికి తనకు మొగుడు లేడని ఫీలౌతుంది.
Brahmamudi
సీన్ కట్ చేస్తే.. ఆఫీసులో రాజ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. కావ్య ఇంకా రాలేదంటేని..కాలుకాలిన పిల్లిలా తిరుగుతూ ఉంటాడు. ఫోన్ చేసి అడుగుదామంటే.. అహం అడ్డొచ్చి ఆగిపోతాడు. తన డిజైనర్ శ్రుతిని పిలుస్తాడు. కావ్య గురించిచ అడుగుతాడు. శ్రుతి తెలీదని చెబుతుంది. ఇక్కడ కూడా సందు దొరికితే.. శ్రుతి కూడా రాజ్ మీద సెటైర్లు వేస్తుంది. అప్పుడే శ్వేత కూడా ఎంట్రీ ఇస్తుంది. కావ్య ఎదురుగా శ్వేతకు ట్రీట్ ఇవ్వాలని రాజ్ అనుకుంటాడు. కానీ.. కావ్య ఆపీసుకు రాలేదని టెన్షన్ పడుతూ ఉంటాడు.
Brahmamudi
అయితే.. టెన్షన్ ఏంటని శ్వేత అడిగితే.. బావ పేరు చెప్పి కావ్య మెళికలు తిరిగిపోతోందని చెబుతాడు. తను వాళ్ల బావ కోసం వెళితే నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అని శ్వేత అడుగుతుంది. నాకు ఏమీ బాధలేదు అంటాడు. కానీ.. కావ్య కోసం ఎదురుచూస్తూనే ఉంటాడు. బావ అని పేరు వినపడగానే.. రాజ్ చాలా ఇరిటేట్ అవుతూ ఉంటాడు. అదంతా శ్వేత గమనిస్తూనే ఉంటుంది. ఎందుకు అంతలా ఫ్రస్టేట్ అవుతున్నావ్ అని శ్వేత అడిగితే.. నేను ఫ్రస్టేట్ అవుతున్నానా అని కూడా ఫ్రస్టేట్ అవుతాడు. కావ్య వాళ్ల బావ కోసం వెళ్లడంతో నువ్వు తట్టుకోలేకపోతున్నావ్ అని శ్వేత అంటుంది. కానీ.. తనకు ఏమీ బాధలేదని అంటాడు. కానీ.. ల్యాప్ టాప్ ఓపెన్ చేసి కూడా కావ్య ఇంకా రాలేదనే ఆలోచిస్తూ ఉంటుంది.
Brahmamudi
ఎందుకు అంతలా ఫ్రస్టేట్ అవుతున్నావ్ అని శ్వేత అడిగితే.. నేను ఫ్రస్టేట్ అవుతున్నానా అని కూడా ఫ్రస్టేట్ అవుతాడు. కావ్య వాళ్ల బావ కోసం వెళ్లడంతో నువ్వు తట్టుకోలేకపోతున్నావ్ అని శ్వేత అంటుంది. కానీ.. తనకు ఏమీ బాధలేదని అంటాడు. కానీ.. ల్యాప్ టాప్ ఓపెన్ చేసి కూడా కావ్య ఇంకా రాలేదనే ఆలోచిస్తూ ఉంటుంది.
Brahmamudi
ఇక.. కళ్యాణ్, అనామికలు షాపింగ్ వెళ్లి రిటర్న్ అవుతారు. మధయలో తన ఫ్రెండ్ ని కలవాలని కళ్యాణ్ అంటాడు. అయితే... వాళ్ల కారుకు అప్పూ ఎదురుపడుతుంది. అప్పూని చూడగానే కళ్యాణ్ మంచిగా వెళ్లి మాట్లాడటానికి వెళతాడు. ఇక టైమ్ వచ్చింది కదా అని.. అప్పూ తో అనామిక సెటైర్లు వేస్తుంది. ఒకప్పుడు ఫ్రెండ్ అంటూ కళ్యాణ్ నీ వెంట తిరిగేవాడు అని.. ఇప్పుడు నాతో ఉన్నాడు అని అంటుంది. కళ్యాణ్ ఆపమన్నా అనామిక ఆపకుండా కౌంటర్లు వేస్తుంది. ఏదో పిజ్జా డెలివరీ చేసుకొని బతుకుతోంది లే అని అంటుంది. చేసే పనిలో నిజాయితీ ఉంటే.. తాను ఏ పనైనా చేస్తాను అని అప్పూ అంటుంది.
కళ్యాణ్ తనకు పని ఉందని, తర్వాత కలిసి మాట్లాడుకుందాం అని కారు ఎక్కుతాడు. కళ్యాణ్ కారు ఎక్కిన తర్వాత.. అప్పూ ని అనామిక చాలా మాటలు అంటుంది. నువ్వు కళ్యాణ్ ని దక్కించుకోవడానికి ఎన్ని ప్లాన్లు వేసినా... చివరకు కళ్యాణ్ నాకే దక్కాడని.. ఇఫ్పటికైనా నీ స్థాయి ఏంటో అర్థమైందా అని అనామిక అంటుంది. ఆ మాటలకు అప్పూ కూడా సరిగ్గా బదులిస్తుంది. ఇప్పుడు తలుచుకున్నా.. నీ మొగుడిని నా వైపు తిప్పుకోవడం నాకు పెద్దపని కాదని, ఎందుకంటే తన ప్రేమలో నిజాయితీ ఉందని, నన్ను రెచ్చగొట్టి నీ కాపురం పాడు చేసుకోవద్దని, కళ్యాణ్ మంచివాడని, మంచిగా చూసుకోమని సలహా ఇస్తుంది.