MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • BrahmaMudi 11th January Episode:అప్పూకి యాక్సిడెంట్.. ఆగిన కళ్యాణ్ వ్రతం...!

BrahmaMudi 11th January Episode:అప్పూకి యాక్సిడెంట్.. ఆగిన కళ్యాణ్ వ్రతం...!

 కిందకు వెళ్తున్న సమయంలో.. కావ్యకు కనకం నుంచి ఫోన్ వస్తుంది. తర్వాత మాట్లాడమని రాజ్ అన్నా కావ్యవినకుండా.. ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అవతల నుంచి కనకం ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది అని కావ్య అడిగితే... అప్పూకి యాక్సిడెంట్ అయ్యిందనే విషయం చెబుతుంది

5 Min read
Author : ramya Sridhar
Published : Jan 11 2024, 10:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Brahmamudi

Brahmamudi

BrahmaMudi 11th January Episode: కొత్తగా పెళ్లైన కళ్యాణ్, అనామికలకు ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయించాలని అందరూ అనుకుంటారు. అయితే, కేవలం కళ్యాన్ దంపతులే కాదని, రాహుల్- స్వప్న, రాజ్- కావ్యలు కూడా పూజలో కూర్చోవాలని ఇంటి పెద్ద ఇందిరాదేవి నిర్ణయిస్తుంది. కావ్య, స్వప్నలను కూడా పూజకు రెడీ అవ్వమని చెబుతుంది. దీంతో.. స్వప్న చాలా అందంగా రెడీ అవుతుంది. కానీ.. తన చీర కుచ్చిళ్లు సరిగా లేవు అని.. అత్త అని గట్టిగా కేకలు పెడుతుంది. ఏమైందా అని  రుద్రాణి, రాహుల్ పరిగెత్తుకొని వస్తారు. ఏంటి..? ఏమైంది అని అడుగుతారు. దానికి స్వప్న.. తన చీర కుచ్చిళ్లు సరిగా రాలేదని పట్టుకోమని అడుగుతుంది . దానికి రుద్రాణి.. ఏంటి.. నేను నీ కాళ్ల దగ్గర కూర్చోవాలా అని అడుగుతుంది. కాళ్ల దగ్గర కాకపోతే చేతుల దగ్గర కూర్చుంటారా అని స్వప్న కౌంటర్ వేస్తుంది. రాహుల్ మాత్రం.. తనకు ఏమీ తెలియదన్నట్లుగా.. ఫోన్ రాకున్నా వచ్చినట్లు  ఈ పరిస్థితి నుంచి ఎస్కేప్ అవుతాడు. స్వప్న మాత్రం.. వదలకుండా.. రుద్రాణిని కుచ్చీళ్లు సరి చేయమని అడుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Brahmamudi

Brahmamudi

దీంతో... స్వప్నను ఉరికించి మరీ పట్టుకొని చితకబాదినట్లు.. రుద్రాణి ఊహించుకుంటుంది. కానీ.. అది కల మాత్రమే. స్వప్న చిటికెలు వేసి మరీ రియాల్టీలోకి తీసుకువచ్చి.. ఊహల్లో తనను కొట్టింది చాల్లే కానీ, నిజంగా కుచ్చీళ్లు పట్టుకోమని అంటుంది. తప్పక రుద్రాణి... స్వప్న కాళ్ల దగ్గర కూర్చొని.. కుచ్చీళ్లు పట్టుకుంటుంది. అలా పట్టుకున్నందుకు రుద్రాణి రగిలిపోతుంటే... స్వప్న మాత్రం చాలా సంతోషిస్తుంది. అయిపోయి.. బయటకు వెళ్లిన తర్వాత.. కొడుకును రుద్రాణి తిడుతుంది. నువ్వు చేయకపోతే.. నాతో చేయించుకుంటుందని, అందుకే పారిపోయి వచ్చానని అంటాడు. పెళ్లాం కాళ్లు పట్టుకోవడం కంటే ఇంకో దరిద్రం ఏదైనా ఉంటుందా అని రాహుల్ అంటే.. అదే నీ పెళ్లాం కాళ్లు.. నీ తల్లి పట్టుకుంటే బాగుంటుందా అని రుద్రాణి అడుగుతుంది. అంతే.. మళ్లీ ఎక్కడ తల్లి తిడుతుందా అని ఫోన్ రాకపోయినా వచ్చినట్లు ఉరితాడు కొనుక్కోవడానికి లోన్ ఇస్తారా అంటూ.. వెళ్లిపోతాడు.

39
Brahmamudi

Brahmamudi

ఈ లోగా.. పంతులుగారు వచ్చి.. మూడు జంటలను వ్రతానికి కూర్చోమని చెబుతాడు. కళ్యాణ్, అనామికలు దిగుతారు. వాళ్లని చూసి ధాన్యలక్ష్మి మురిసిపోతుంది. తర్వాత.. రాహుల్- స్వప్నలు కిందకు దిగితే.. రుద్రాణి ముఖం తిప్పుకుంటుంది. వెంటనే స్వప్న సెటైర్ వేస్తుంది. వాళ్ల ని వాళ్ల అత్తయ్య పొగిడిందని, మీరు ఎందుకు ఆముదంలో ముంచిన ముఖం లా  ఉందని సెటైర్ వేస్తుంది. తర్వాత.. రాజ్ , కావ్యలను పిలుస్తారు. 

49
Brahmamudi

Brahmamudi

వీళ్లు మాత్రం ఇంకా రెడీ కారు. ఎప్పటిలాగానే ఇద్దరూ కీచులాడుకుంటూ ఉంటారు. సరిగ్గా.. కిందకు వెళ్తున్న సమయంలో.. కావ్యకు కనకం నుంచి ఫోన్ వస్తుంది. తర్వాత మాట్లాడమని రాజ్ అన్నా కావ్యవినకుండా.. ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అవతల నుంచి కనకం ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది అని కావ్య అడిగితే... అప్పూకి యాక్సిడెంట్ అయ్యిందనే విషయం చెబుతుంది. హాస్పిటల్ లో ట్రీట్మెంట్ జరుగుతుందని, డాక్టర్లు ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదని కనకం ఏడుస్తుంది.  ఏం చేయాలో తెలియడం లేదని కంగారుపడుతుంది.  మరోవైపు డాక్టర్లు అప్పూకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం అప్పూ స్పృహ లో లేదని కనకం చెబుతుంది, అది విని కావ్య కూడా కంగారుపడుతుంది. కంగారుపడొద్దని.. తాను వచ్చేస్తాను అని  చెప్పి కావ్య ఫోన్ పెట్టేస్తుంది.

59
Brahmamudi

Brahmamudi

రాజ్.. పద ఇద్దరం వెళదాం అంటే.. వద్దు నేను ఒక్కదాన్నే వెళతాను అని, కింద వ్రతం జరుగుతుందని.. అందరూ మన కోసం ఎదురుచూస్తూ ఉన్నారని, మీరు వాళ్లను ఏదో ఒకటి కన్విన్స్ చేయమని, నేను వెళ్లి వస్తాను అని చెప్పి.. కావ్య వెనక గేటు నుంచి వెళ్లిపోతాను అంటుంది. అప్పూ కి యాక్సిడెంట్ అయ్యిందని తెలిస్తే.. వ్రతం ఆగిపోతుందని, మళ్లీ అనామిక, ధాన్యలక్ష్మి ఫీలౌతారని, మనం లేకుండా.. కింద వ్రతం జరిగేలా చూడమని చెప్పి కావ్య వెళ్లిపోతుంది.

69
Brahmamudi

Brahmamudi

రాజ్ ఒక్కడే కిందకు దిగుతాడు. దీంతో కావ్య ఏది అని అడుగుతారు. కళావతి బయటకు వెళ్లింది అని రాజ్ చెబుతాడు. ఆ మాట విని అందరూ షాకౌతారు. ఇక అంతే బయటకు వెళ్లిందా అని.. ఒకరి తర్వత మరొకరు కావ్యను తిట్టడం మొదలుపెడతారు. చిన్న పని ఉందని బయటకు వెళ్లిందని రాజ్ అంటే.. వ్రతం ఉందనే విషయం మర్చిపోయిందని, పూజను కావాలని లేటు చేయాలని ఇప్పుడు బయటకు వెళ్లిందని అని ధాన్యలక్ష్మి సెటైర్లు వేస్తుంది. కావ్యను తిడుతుంటే స్వప్నకు కోపం వస్తుంది. నిజంగా అర్జెంట్ పని కాకపోయి ఉంటే.. కావ్య వెళ్తుంటే రాజ్ ఒప్పుకుంటాడా అని అంటుంది. కానీ, రాహుల్ ఊరుకోడు. స్వప్న పై అరుస్తాడు. దీంతో... స్వప్న.. నీకు పనిలేకపోతే.. వేరే వాళ్లకు పని ఉండదా అని స్వప్న కామెంట్ చేస్తుంది.

79
Brahmamudi

Brahmamudi

రుద్రాణి, ధాన్యలక్ష్మి ఒకరి తర్వాత మరొకరు కావ్యను తిడుతుంటే.. తమ సంగతి వదిలేయమని, తాము వ్రతంలో కూర్చోకపోయినా పర్వాలేదని.. మిగిలిన ఇద్దరు జంటలతో పూజ చేయించమని రాజ్ అంటాడు. మొదటి నుంచి అదే కోరుకుంటున్న ధాన్యలక్ష్మి.. మంచి మాట చెప్పావ్ అని.. వ్రతం ఈ ఇద్దరితోనే చేయించమని పంతులుకి చెబుతుంది. కానీ,  అపర్ణకి కూడా కోపం వస్తుంది. నా కోడలి మీద ఉన్న కోపాన్ని తన కొడుకుపై  చూపిస్తున్నావ్.. అంటే నా  కొడుకు పూజలో కూర్చోవద్దా? నీ కోడలు వచ్చిన దగ్గర నుంచి నీలో స్వార్థం బాగా పెరిగిపోయింది అని అపర్ణ కోపంగా మాట్లాడుతుంది. నాకు నచ్చినా, నచ్చకపోయినా కావ్య తన కొడుకు భార్య అని,  ఇది ఈ ఇంటి వారసులు చేయించుకుంటున్న వ్రతం.. నా కొడుకు కూర్చోవాల్సిన పనిలేదా అని అరుస్తుంది.

 ఇందిరాదేవి కూడా.. రాజ్, కావ్యలు వ్రతం లో కూర్చోవాల్సిందే అంటుంది. పర్వాలేదు నానమ్మ..కళావతి కోసం మీరంతా ఎందుకు ఎదురుచూడటం అని రాజ్ అంటే.. కళ్యాణ్ కూడా ఒప్పుకోడు. నువ్వు, వదిన లేకపోతే ఎలా అన్నయ్య.. నువ్వు ఇంటి పెద్దవాడివి నువ్వు ఉండాల్సిందే, మా అమ్మ మర్చిపోతే, నేనెలా మర్చిపోతాను, వదిన రావాల్సిందే, వ్రతంలో కూర్చోవాల్సిందే అని పట్టుపడతాడు. తర్వాత.. వదిన రావడానికి ఎంత సమయం పడుతుంది అంటే.. గంట పట్టొచ్చు అంటాడు. గంట తర్వాతే వ్రతం జరుగుతంది అని కాళ్యాణ్ అంటాడు. అనామిక ముఖం మాడిపోతుంది.

89
Brahmamudi

Brahmamudi

ఈలోగా రుద్రాణి.. అన్నదమ్ములు రామలక్ష్మణుల్లా ఉన్నా.. వచ్చినావళ్లు సరిగా ఉండాలి కదా అంటుంది. స్వప్న మాత్రం.. ఓపిక లేకపోతే వెళ్లి మేకప్ వేసుకోండి అని తన అత్తపై సెటైర్ వేస్తుంది. ధాన్యలక్ష్మి సైతం అపర్ణ అన్న మాటలకు హర్ట్ అవుతుంది. నేను  ఓ మూల కూర్చుంటాను అంటే.. ప్రకాశం.. మాత్రం ఈశాన్యం కూర్చోకు అని సెటైర్ వేస్తాడు. మరోవైపు వీళ్లు వ్రతం ఆపేశారు... ఎలా అని రాజ్ ఫీలౌతూ ఉంటాడు.

ఈలోగా కావ్య.. హాస్పిటల్ కి  చేరుకుంటుంది. కనకం ని  హత్తుకొని ఓదారుస్తుంది. అప్పూ పరిస్థితి చూసి.. కనకం  బాగా ఏడుస్తుంది.  యాక్సిడెంట్ ఎలా జరిగిందని కావ్య అడిగితే... ఎవరో కారుతో గుద్దారని.. చూసిన వాళ్లు ఆస్పత్రిలో చేర్పించారు అని చెబుతుంది. కావ్య... ఐసీయూలో ఉన్న అప్పూని చూస్తుంది.. నీకు ఏమీ కాదు అంటూ.. కావ్య కూడా ఏడుస్తుంది. తర్వాత.. కావ్య తన తండ్రిని ఓదారుస్తుంది. మూర్తి మాత్రం  అప్పూకి యాక్సిడెంట్ అయిందనే షాక్ లో ఉంటాడు. అసలు అప్పూ ప్రాణాలతో బయటపడుతుందా అని ఏడుస్తాడు. ఆ మాటలు విని కనకం మరింత ఏడిస్తే.. కావ్య ధైర్యం చెబుతుంది.

ఈ లోగా డాక్టర్లు బయటకు వచ్చి.. రక్తం ఎక్కించాలని, రేర్ బ్లడ్ గ్రూప్ అని.. తమ హాస్పిటల్ లో కూడా లేదని, బయట ఎక్కడైనా ప్రయత్నించమని చెబుతుంది.  రాజ్ కి ఫోన్ చేసి చెప్పమని, రాజ్ తప్ప.. మనల్ని ఆదుకునేవాళ్లు ఎవరూ లేరు అని కనకం అంటుంది. అయితే.. ఇప్పుడు కాదని.. తప్పదు అనుకుంటే  చేస్తాను, ఆలోగా తన ప్రయత్నం తాను చేస్తాను అని చెబుతుంది.
 

99
Brahmamudi

Brahmamudi

దుగ్గిరాల  ఇంట్లో అందరూ కావ్య కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అనామికకు చిరాకు వస్తుంది.  ఈ వ్రతం జరగదని తనకు అర్థమైందని పీటల మీద నుంచి లేస్తుంది. ధాన్యలక్ష్మి తనకు కూడా ఈ వ్రతం జరగదు అనిపించదని అంటుంది.  అనామిక మాత్రం.. అసలు కావ్యకు వ్రతం జరగడం ఇష్టం లేదని, అందుకే.. పూజ మొదలుపెట్టకముందే బయటకు వెళ్లిపోయిందని అంటుంది. కావ్య కోరుకున్నట్లే వ్రతం ఆపేద్దాం అంటుంది.  వాళ్ల వదినను తప్పుగా అర్థం చేసుకుందని కళ్యాణ్ నచ్చ చెబుతాడు.

వీళ్ల మాటలు విని భరించలేక.. నిజంగా కావ్య అర్జెంట్ పనిమీద వెళ్లిందని, మీరు వ్రతం ఆపకూడదు అని కూడా చెప్పిందని రాజ్ అంటాడు.  కమింగ్ అప్ లో.. రాజ్ అప్పూ కి యాక్సిడెంట్ అయ్యిందనే విషయం చెప్పేస్తాడు.  కళ్యాణ్ వచ్చి..రక్తం ఇఛ్చే అవకాశం ఉండొచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu Winners :కళ్యాణ్ పడాల నుంచి శివబాలాజీ వరకు బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
Recommended image2
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Recommended image3
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved