బ్రహ్మముడి: ఆస్తి కోసం రుద్రాణి కుట్ర, ప్లాన్ రివర్స్ చేసిన రాజ్..!
ఆ తాగిన మైకంలో తమ బుద్ది గురించి నిజాలు మాట్లాడుకుంటారు. చాలా దారుణంగా మాట్లాడుకుంటారు. ఆస్తి రాగానే స్వప్నను వదిలించుకొని వరల్డ్ టూర్ వెళ్లాలని రాహుల్ అనుకుంటూ ఉంటాడు.
Brahmmamudi
Brahma mudi serial: తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న మరో తెలుగు సీరియల్ బ్రహ్మ ముడి. ఈ సీరియల్ టీఆర్పీ పరంగా దూసుకుపోతోంది. నిన్నటి ఎపిసోడ్ లో రుద్రాణి , సీతారమయ్య దగ్గరకు వెళ్లి ఆస్తి రాయించుకోవడం కోసం ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఎపిసోడ్ లోనూ అదే కంటిన్యూ అయ్యింది. మరి టీవీలో రాకముందే, ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో ఓసారి చూద్దాం...
Brahmamudi
Braha mudi : ఈ రోజు ఎపిసోడ్ లో రుద్రాణి సీతారామయ్యతో మాట్లాడుతూ ఉంటుంది. సీతారమయ్య ఆరోగ్యంగా ఉండాలని తాను దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ మొదలుపెట్టి, నెమ్మదిగా ఆస్తి విషయం దగ్గరకు వస్తుంది. ‘నా పెళ్లి పెటాకులై, పుట్టింకి వచ్చినప్పుడు నాకు అన్ని హక్కులు ఉన్నాయని అన్నారు. కానీ ఇప్పుడు ఇంట్లో వాళ్లు నాకు ఏ హక్కులు లేవని, అసలు ఇంటి సభ్యురాలినే కాదు అని, పని మనిషిలాగా చీప్ గా చూస్తున్నారు’ అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తుంది. వాళ్లతో నేను మాట్లాడతానని సీతారామయ్య సర్ది చెప్పబోతుంటే, ‘ వాళ్లతో మాట్లాడాల్సిన అవసరం లేదు నాన్న, నాకు, నా కొడుకు కూడా ఈ ఇంటి వారసత్వ హక్కు కల్పించు. నువ్వు ఉన్నప్పుడే నన్ను పరాయి వాళ్లలాగా చూస్తున్నారు. ఆ మాయదారి క్యాన్సర్ వళ్ల మీకు జరగరానిది జరిగితే, నాకు దిక్కు ఎవరు నాన్న. అందుకే, నువ్వు ఉన్నప్పుడు నా పేరుమీద, నా కొడుకు పేరుమీద ఓ వంతు వాటా రాస్తే చాలు. అంతకన్నా పెద్దగా నాకు ఆశలేమీ లేవు. నాకు తెలుసు, నువ్వు నాకు, నా కొడుకు అన్యాయం చేయవు. కానీ, అందరితో పాటు ఆస్తి మీద మాకు కూడా హక్కు ఉండేలా ఈ పేపర్ మీద రాస్తే, మాకు కూడా బాధ్యత ఉంటుంది. ఎవరు ఎప్పుడు ఎలా మారతారో తెలీయదు కదా నాన్న, లోకం తీరే అలా ఉంది. మిమ్మల్నే నమ్ముకొని ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడ ఉన్నవారందరికీ లీగల్ గా ఆస్తిలో వాటాలు ఉన్నట్లే, నాకు కూడా ఆ హక్కు కల్పించండి. ఏ లోకంలో ఉన్నా, మిమ్మల్ని ఇలవేల్పుగా పూజించుకుంటాను ’ అంటూ ఎమోషనల్ డైలాగులు కొట్టి, ఏడ్చుకుంటూ అక్కడి నుంచి బయటకు పరుగులు తీస్తుంది.
Brahmamudi
రుద్రాణి అలా బయటకు వెళ్లడం ధాన్య లక్ష్మీ చూస్తుంది.రుద్రాణి అక్కడి నుంచి డైరెక్ట్ గా తన కొడుకు దగ్గరకువెళ్తుంది. అక్కడకు వెళ్లే సరికి, రాహుల్ తాగుతూ ఉంటాడు. వెళ్లి, రాహుల్ పక్కన కూర్చొని ఇప్పటి వరకు నటించిన ఆ ఏడుపు కన్నీటిని తుడుచుకుంటుంది. ఏడ్చావా అని రాహుల్ అడిగితే, జీవించాను అని చెబుతుంది. మీ నాన్న కాని నాన్న నమ్మేశాడా అని రాహుల్ అడగగా, నమ్మేలా నటించాను అని చెబుతుంది. అంతేకాదు, కొడుకుతో కలిసి మందు తాగుతుంది. ఆ తాగిన మైకంలో తమ బుద్ది గురించి నిజాలు మాట్లాడుకుంటారు. చాలా దారుణంగా మాట్లాడుకుంటారు. ఆస్తి రాగానే స్వప్నను వదిలించుకొని వరల్డ్ టూర్ వెళ్లాలని రాహుల్ అనుకుంటూ ఉంటాడు.
Brahmamudi
మరో వైపు కావ్య, అందరికీ టీలు, టిఫిన్లు రెడీ చేస్తుంది. ధాన్యలక్ష్మీ అందరిని పిలుస్తుంది. ఇక అందరూ టిఫిన్ చేయడానికి వెళ్తుండగా, లాయర్ వస్తాడు. సీతారామయ్య లాయర్ ని పిలిచాడు అనే విషయం ఇంట్లో సభ్యులందరికీ తెలిసిపోతుంది. వెంటనే లాయర్ సీతారామయ్య గదిలోకి వెళతాడు. అది చూసి రుద్రాణి సంబరపడుతుంది. మిగితా ఇంటి సభ్యులందరూ షాకైపోతారు. ఇదంతా రుద్రాణి తన ప్లానేనని, తమకు ఆస్తి రావడం ఖాయం అని సంబరపడుతుూ ఉంటుంది.మరోవైపు లాయర్ , సీతారమయ్య గదికి వెళతాడు.
Brahmamudi
భార్యను బయటకు పంపించి సీతతారమయ్య లాయర్ తో మాట్లాడి, వీలునామా రాయిస్తాడు. అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాక, ఇంట్లోని వారంతా నిలపడి అలానే చూస్తూ ఉంటారు. ఆస్తులు పంపకాలు చేస్తున్నారు అని రుద్రాణి క్లారిటీ ఇస్తుంది. ఇక, లాయర్, సీతారామయ్య చెప్పినట్లుగా వీలునామా రాయించి తీసుకువస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
Brahmamudi
ఇక, రుద్రాణి ప్లాన్ తెలుసుకున్న తర్వాత ధాన్య లక్ష్మి ఆలోచనలో పడిపోతుంది. తన మతిమరుపు భర్తతో అదే విషయం గురంచి మాట్లాడుతూ ఉంటుంది. ఆస్తి కోసం రుద్రాణి కచ్చితంగా గొడవ చేస్తుందని, వాటా రాయించుకుంటుందని బాధపడుతుంది.
Brahmamudi
అదే జరిగితే తన కొడుకు కళ్యాణ్ నష్టపోడతాడని తన బాధను వెల్లగక్కుతుంది. రుద్రాణి కళ్యాణ్ కి ఆస్తి రాకుండా చేస్తుందని భయమేస్తుంది అంటే, రాజ్ చూస్తూ ఊరుకోడని సముదాయిస్తాడు. ఇక తన అన్నయ్య మీద తనకు నమ్మకం ఉందని, తన అన్నయ్య అన్ని బాధ్యతలు సమర్థవంతంగా చూసుకుంటాడని చెబుతాడు. ఇక రాజ్ ఉండగా కళ్యాణ్ కి అన్యాయం జరగదని క్లారిటీ ఇస్తాడు.
Brahmamudi
ఇక చిట్టి, అపర్ణ వెళ్లి సీతారామయ్యతో మాట్లాడతారు. రుద్రాణి వచ్చి ఆస్తిలో వాటా అడిగిందనే విషయం వారికి సీతారామయ్య చెబుతాడు. ఆస్తి పంపకాలు, అమ్మకాలు చేయవద్దు మామయ్య అని అపర్ణ సలహా ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రుద్రాణికి ఆస్తి ఇస్తే, రాహుల్ నిలపెట్టలేడంటుంది. ఆస్తి వాటాలు వేయవద్దని, దాని వల్ల చీలికలు మొదలౌతాయని చెబుతుంది.
Brahmamudi
ఇక, రాజ్ కి అన్నం తినిపించడానికి కావ్య ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అయితే, రాజ్ మాత్రం నువ్వు పెడితే నేను తినాలా? తినను అంటూ పంతం పడతాడు. ఎప్పటిలాగానే ఇద్దరూ మళ్లీ కీచులాట ఆడుతూ ఉంటారు. ఇక, రాజ్ తో అన్నం తినిపించడానికి తన అత్తను రంగంలోకి దించుతుంది. ఇక, కమింగ్ అప్ లో లాయర్ వచ్చి వీలునామా చదవడానికి రెడీ అవుతాడు. కానీ, రాజ్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చి, వీలునామా చింపేస్తాడు. మరి, ఆ తర్వాత ఏంజరుగుతుందో చూడాలి.