బ్రహ్మముడి: కావ్య మాజాకా...అత్తను రెచ్చగొట్టి రాజ్ తిక్క కుదిర్చిందిగా..!
అప్పుడు అపర్ణ, రాజ్ ఎవరిమాట వినడని, కానీ తన మాట మాత్రం వింటాడని గర్వంగా చెబుతుంది. తన కొడుక్కి భోజనం తానే తినిపిస్తానని ఆ ప్లేట్ తీసుకొని రాజ్ దగ్గరకు వెళ్తుంది.
Brahma mudi: నేటి బ్రహ్మముడి ఎపిసోడ్ లో కావ్య, రాజ్ కి భోజనం తినిపించాలని అనుకుంటుంది. దాని కోసం భోజనం ప్లేట్ తీసుకొని వస్తుంది. అసలే, కావ్య మీద పీకల్లోతు కోపంలో ఉన్న రాజ్ ఆ భోజనం చేయడానికి ఇష్టపడడు. కావ్య చాలా చెప్పి చూస్తుంది. కానీ రాజ్ వినిపించుకోడు. ఒక్కసారి చెబితే అర్థం కాదా అని సీరియస్ అవుతాడు. కావ్యను అక్కడి నుంచి వెళ్లిపొమ్మని కసురుకుంటాడు. దీంతో, భోజనం ప్లేట్ అక్కడే పెట్టేసి వెళ్లిపోతుంటుంది. అది చూసిన రాజ్, ఈ తెలివి తేటలు నా దగ్గర చూపించకు, ఇదిగో ప్లేట్ అంటూ ఇచ్చి వెళ్లమంటాడు.
దీంతో, కావ్య ఇగో హర్ట్ అవుతుంది. మనసులో తనలో తానే మాట్లాడుకుంటుంది. ‘ ఏదో బాధలో ఉన్నారు కదా అని, ప్రేమగా మంచిగా భోజనం తినిపించాలి అనుకుంటే, మాట వినరు కదా. మీరు అంటున్న మోసమే చేసి, మీతో భోజనం ఎలా తినిపిస్తానో చూడండి ’ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక కావ్య, తన చిన్న అత్త గారితో కలిసి ఓ ప్లాన్ వేస్తుంది. ఎలాగైనా రాజ్ కి భోజనం తినిపించాలి అని వారు ప్లాన్ వేసుకుంటారు. సరిగ్గా అపర్ణ వాళ్ల ముందు నుంచి వెళ్తున్న సమయంలో వీరిద్దరూ కావాలని ఆమెకు వినిపించేలా మాట్లాడుకోవడం మొదలుపెడతారు.
Brahmamudi
రాజ్ భోజనం చేయలేదని, మీరు తినిపించగలరా చిన్నత్తయ్య, మీ వళ్ల కాదు అని అర్థం వచ్చేలా కావ్య మాట్లాడుతుంది. దీంతో, ధాన్యలక్ష్మి... చిన్నప్పటి నుంచి వాడిని చూస్తూ వస్తున్నాను. ఈ మాత్రం చేయలేనా అంటుంది. అప్పుడు కావ్య, చెయ్యలేరు చిన్న అత్తయ్య.. మీరే కాదు, మా అత్తయ్య వచ్చినా రాజ్ కి భోజనం తినిపించలేరు. ఎందుకంటే ఆయన అంత కోపంగా ఉన్నారు అని కావ్య కావాలనే అపర్ణకి వినిపించేలా గట్టిగా మాట్లాడుతుంది. వెంటనే ధాన్యలక్ష్మి.. ఏంటి కావ్య అంత మాట అన్నావ్, రాజ్ మా అక్క మాట వినడా..? వింటాడు అని ధాన్యలక్ష్మి అంటుంది. అది విన్న అపర్ణ వాళ్ల దగ్గరకు వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది. రాజ్ భోజనం చేయలేదనే విషయం వాళ్లు చెబుతారు. అప్పుడు అపర్ణ, రాజ్ ఎవరిమాట వినడని, కానీ తన మాట మాత్రం వింటాడని గర్వంగా చెబుతుంది. తన కొడుక్కి భోజనం తానే తినిపిస్తానని ఆ ప్లేట్ తీసుకొని రాజ్ దగ్గరకు వెళ్తుంది.
Brahmamudi
అపర్ణ వెళ్లే సరికి, రాజ్ కి కడుపులో బాగా ఆకలివేస్తూ ఉంటుంది. పౌరుషానికిపోయి కావ్య తెచ్చినప్పుడు తినడు. కానీ, తర్వాత ఆకలితో అలమటించిపోతాడు. అది కవర్ చేయడానికి నీళ్లు తాగుతూ ఉంటాడు. ఆ లోపు అపర్ణ భోజనం తీసుకొని వచ్చేస్తుంది. కావ్య చేసింది నేను తినను అని రాజ్ మొండికేస్తాడు. కానీ, అపర్ణ ఇది కావ్య చేసింది కాదు అని, తానే స్వయంగా చేశానని రాజ్ కి అబద్దం చెబుతుంది. ఆ తర్వాత కొడుక్కి ప్రేమగా భోజనం తినిపిస్తుంది. రాజ్ కూడా ఆనందంగా భోజనం చేసేస్తాడు. అలా రాజ్ తింటుంటే, కావ్య చాలా ఆనందపడుతుంది. కావ్య ఆనందాన్ని చూసి ధాన్యలక్ష్మి ముచ్చటపడుతుంది.
Brahmamudi
హాయిగా తినేసి, రాజ్ పడుకుంటాడు. ఆ తర్వాత అపర్ణ తానే ఛాలెంజ్ గెలిచాను అని సంబరపడుతుంది. అది కూడా ఛాలెంజ్ కోసం కాదని, తన కొడుకు మీద ప్రేమ తో చేశానని చెప్పి, అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక కావ్య లోపలికి వెళ్లిన తర్వాత మళ్లీ భోజనం టాపిక్ వస్తుంది. నువ్వు చెబితే తినలేదని, మా అమ్మతో పంపిస్తే తిన్నానని నువ్వు నవ్వుకుటున్నావ్ కదా అని రాజ్ కావ్యతో అంటాడు. అయ్యో లేదు. అత్తయ్యే స్వయంగా నీకోసం వండి తీసుకొచ్చి, తినిపించారు అని కావ్య కవర్ చేయబోతోంది. అయితే, రాజ్ అది మా అమ్మ చేసిన వంట కాదు, అది నువ్వు చేసిందని నాకు తెలుసు అంటాడు. నా వంట మీరు గుర్తు పట్టారా అని కావ్య సంబరపడుతుంది. కొన్ని సార్లు మంచి విషయమే కాదు, చెత్త విషయాలు కూడా గుర్తుంటాయి అని రాజ్ అంటాడు. దానికి కావ్య ఆ చెత్తే కదా మీరు తిన్నారు అని కౌంటర్ ఇస్తుంది. అయితే , రాజ్ తన అమ్మ తెచ్చిందని మాత్రమే తిన్నాను అని సమాధానం చెప్పి, పడుకొని నిద్రపోతాడు. కావ్య మాత్రం తిట్టినా కూడా, భోజనం చేసిందుకు, తన వంట అని గుర్తు పట్టినందుకు మరింత సంబరపడుతుంది.
Brahmamudi
ఇక, ఇంట్లోవారందరూ హాల్లో సమావేశం అవుతారు. సీతారామయ్య ఇంట్లో వాళ్లందరినీ కూర్చోపెడతాడు. ఆ సమయంలోనే లాయర్ ఎంట్రీ ఇస్తాడు.తాను చెప్పినట్లుగా వీలునామా రాశారా అని లాయర్ ని అడుగుతాడు. ఆయన మీరు చెప్పినట్లే రాశాను సర్ అని అంటాడు. దీంతో, రుద్రాణి ముఖం వెలిగిపోతుంది. మిగిలిన వాళ్లు, ఇప్పుడు ఇదంతా అవసరమా అన్నట్లు ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ వీలునామా ఇంట్లో వాళ్లందరూ కచ్చితంగా తెలుసుకోవాలని అని సీతారామయ్య చెబుతాడు.
Brahmamudi
సరిగ్గా లాయర్ వీలునామా తీసుకొని చదివే సమయానికి రాజ్ అక్కడకు వస్తాడు. వెంటనే, ఆ వీలునామాను లాక్కుంటాడు. లాయర్ కి క్షమాపణలు చెప్పి, తమకు ఈ వీలునామాతో అసవరం లేదు అని చెబుతాడు. అందరి కళ్ల ముందే ఆ వీలునామాను ముక్కలుగా చింపి పారేస్తాడు. అది చూసి ఇంట్లో వారంతా షాకౌతారు. రుద్రాణి, రాహుల్ బిక్క మొహం వేస్తారు. మిగిలిన వారంతా సంతోషిస్తారు. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేయమని రాజ్ వాళ్ల తాతగారిని కోరతాడు. రాజ్ చేసిన పనికి వాళ్ల తల్లిదండ్రులు ఆనందిస్తారు. రాజ్ పై ప్రశంసలు కురిపిస్తారు. ఛాన్స్ దొరికింది కదా అని ధాన్య లక్ష్మీ , రుద్రాణి పై పంచ్ లు వేస్తుంది. దీంతో, చేసేది లేక రుద్రాణి కూడా కవర్ చేస్తుంది. అందరూ కలిసి ఉండటమే తనకు కావాల్సింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది.
కమింగప్ లో కావ్య, రాజ్ మాట్లాడుకుంటూ ఉంటారు. మనం కలిసి ఉంటే, తాతయ్య ఆరోగ్యం బాగుపడుతుందని కావ్య సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ, రాజ్ వినిపించుకోడు. అసలు తనను భార్యగా అంగీకరించను ఖరా ఖండిగా చెప్పేస్తాడు. దీంతో, కావ్య మీరు కూడా నటిస్తున్నారు అంటుంది. అవసరమైతే జీవితాంతం నటిస్తాను అని రాజ్ చెప్పగా, నేను నటిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను అని రాజ్ కి ఛాలెంజ్ విసిరి, అక్కడి నుంచి వెళ్తుంది.