టైటిల్ మిస్ అయినా పర్లేదు, విష్ణుప్రియకు కావాల్సింది దక్కింది, స్టార్ యాంకర్ ఫుల్ హ్యాపీ!
విష్ణుప్రియ టైటిల్ కోల్పోయినప్పటికీ ఆమెకు ఎలాంటి చింతలేదు. అందుకు కారణం ఆమె కోరుకున్నది దక్కింది. భారీగా లాభపడింది. ఆ వివరాలు ఏమిటో చూద్దాం..
Bigg Boss Telugu 8
టైటిల్ ఫేవరేట్ గా బరిలో దిగిన విష్ణుప్రియ కనీసం ఫైనల్ కి కూడా వెళ్లలేకపోయింది. పసలేని గేమ్ తో ఆమె ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. పృథ్విరాజ్ మోజులో గేమ్ వదిలేసింది. 14వ వారం బిగ్ బాస్ ఇంటిని వీడింది. అయితే ఈ సీజన్ కి గాను హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న విష్ణుప్రియ, టైటిల్ విన్నర్ కి మించిన మొత్తం రాబట్టిందట.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి గాను విష్ణుప్రియ టైటిల్ ఫేవరేట్ గా బరిలో దిగింది. ఆమె ఫేమ్, పాపులారిటీతో తలపడే కంటెస్టెంట్స్ లేరు. దాంతో విష్ణుప్రియకు టైటిల్ కొట్టడం కేక్ వాక్ అనుకున్నారు అందరూ. బిగ్ బాస్ తెలుగులో ఫస్ట్ టైం టైటిల్ అందుకున్న లేడీ కంటెస్టెంట్ గా రికార్డులకు ఎక్కుతుందని భావించారు. కానీ విష్ణుప్రియ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. విష్ణుప్రియ హౌస్లో తన మార్క్ చూపించలేకపోయింది. ఎఫైర్ నడపడానికి హౌస్లో కి వచ్చాను అన్నట్లు ఆమె ప్రవర్తించారు.
కన్నడ సీరియల్ నటుడు పృథ్విరాజ్ పై విష్ణుప్రియ ఎనలేని ప్రేమ కనబరిచింది. డే వన్ నుండే అతడంటే విష్ణుప్రియకు చాలా ఇష్టం. పృథ్వికి దగ్గర కావాలని ఆమె భావించేది. కానీ సోనియా ఆకుల అడ్డుపడుతూ ఉండేది. సోనియా ఆకుల 4వ వారం ఎలిమినేట్ అయ్యాక విష్ణుప్రియకు లైన్ క్లియర్ అయ్యింది. సందర్భం ఉన్నా లేకున్నా పృథ్వికి ముద్దులు, హగ్గులు ఇచ్చేస్తుంది. అతడి మాయలో గేమ్ పూర్తిగా పక్కన పెట్టేసింది.
నువ్వు గేమ్ సీరియస్ గా తీసుకోకపోతే.. ఆడియన్స్ కూడా నిన్ను సీరియస్ గా తీసుకోరని నాగార్జున ఒక వారం హెచ్చరించాడు. ఫ్యామిలీ వీక్ లో హౌస్లోకి వచ్చిన విష్ణుప్రియ తండ్రి కూడా... పృథ్వితో నీ ప్రవర్తన తప్పుగా వెళుతుంది. జాగ్రత్తగా ఆడమని సూచించారు. విష్ణుప్రియ మాత్రం తన తీరు మార్చుకోలేదు. ఎంతో కొంత ఫేమ్ ఉన్న సెలబ్రిటీ కావడంతో గేమ్ ఆడకున్నా 14 వారాలు నెట్టుకొచ్చింది. డబుల్ ఎలిమినేషన్ నేపథ్యంలో రోహిణి, విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యారు.
అయితే విష్ణప్రియ టైటిల్ కొట్టకున్నా.. విన్నర్ ప్రైజ్ మనీ కంటే ఎక్కువ మొత్తంలో ఆర్జించింది అట. ఈ సీజన్ కి గాను విష్ణుప్రియ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఆమెకు వారానికి రూ. 4 లక్షల పారితోషికం అట. ఆ లెక్కన 14 వారాలకు రూ. 56 లక్షలు వసూలు చేసిందట. బిగ్ బాస్ షో ప్రైజ్ మనీ రూ. 50 లక్షలు మాత్రమే. ఫినాలే లో ఎవరైనా అమౌంట్ తీసుకుని రేసు నుండి తప్పుకుంటే... విన్నర్ కి ఇచ్చే అమౌంట్ ఇంకా తగ్గుతుంది. కాబట్టి, టైటిల్ చేజారినప్పటికీ విష్ణుప్రియ రెమ్యూనరేషన్ రూపంలో భారీగా ఆర్జించింది.
విష్ణుప్రియ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. హాట్, గ్లామరస్ ఫోటో షూట్స్ తో కాకరేపుతూ ఉంటుంది. విష్ణుప్రియ దయ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేసింది. జేడీ చక్రవర్తి ప్రధాన పాత్ర చేసిన ఈ సిరీస్ పాజిటివ్ టాక్ రాబట్టింది.