55 లక్షల ప్రైజ్ మనీలో నిఖిల్ కి దక్కేది ఎంతంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ముగిసింది. టైటిల్ ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నడుమ నిఖిల్ మలయక్కల్ విన్నర్ గా అవతరించాడు. నిఖిల్ కి భారీ ప్రైజ్ మనీ దక్కింది. అయితే అందులో నిఖిల్ కి కొంత మేర మాత్రమే అందుతుంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 15న ముగిసింది. అందరిలో విన్నర్ ఎవరనే ఉత్కంఠ నెలకొంది. అవినాష్, గౌతమ్, ప్రేరణ, నబీల్, నిఖిల్ టాప్ 5 కంటెస్టెంట్స్ గా ఫినాలేకి వెళ్లిన సంగతి తెలిసిందే.
అవినాష్, గౌతమ్ వైల్డ్ కార్డు ఎంట్రీలు కాగా.. మిగతా ముగ్గురు కంటెస్టెంట్స్ మొదటి వారం నుండి హౌస్లో ఉన్నారు. కంటెస్టెంట్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీ అందుకుంటాడు. గత 7 సీజన్స్ కి బిగ్ బాస్ తెలుగు ప్రైజ్ మనీ రూ. 50 లక్షలుగా ఉంది. అలాగే ఒక కారు, ప్లాట్ వంటి బహుమతులు కూడా విన్నర్ కి అందిస్తారు.
అవినాష్, ప్రేరణ, నబీల్ ఒక్కొక్కరిగా ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ఇక టైటిల్ రేసులో గౌతమ్, నిఖిల్ మిగిలారు. వీరికి నాగార్జున సూట్ కేసు ఆఫర్ చేశాడు. డబ్బులు తీసుకుని టైటిల్ రేసు నుంచి తప్పుకోవచ్చని సూచించారు. ఇద్దరిలో ఎవరూ డబ్బులు తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు. ఈ క్రమంలో నాగార్జున టైటిల్ విన్నర్ ని ప్రకటించేంచుకు సిద్ధమయ్యారు. ముఖ్య అతిథిగా రామ్ చరణ్ ని నాగార్జున ఆహ్వానించారు.
బిగ్ బాస్ వేదికపైకి వచ్చిన రామ్ చరణ్ హోస్ట్ నాగార్జునతో గేమ్ ఛేంజర్ విశేషాలు పంచుకున్నారు. అనంతరం నాగార్జున విన్నర్ ని ప్రకటించాడు. నిఖిల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 టైటిల్ విన్నర్ అంటూ నాగార్జున చేయి పైకి లేపాడు. దాంతో ఉత్కంఠకు తెరపడింది.
కాగా రూ. 54,99999 ఈ సీజన్ కి గాను ప్రైజ్ మనీగా ఫిక్స్ చేశారు. దీన్ని రౌండ్ ఫిగర్ చేద్దామన్న నాగార్జున రూ. 55,00000లుగా నిర్ణయించారు. కాబట్టి ఈ మొత్తం టైటిల్ విన్నర్ కి దక్కుతుంది. అయితే మధ్యలో ఎవరైనా.. కంటెస్టెంట్ నాగార్జున ఆఫర్ చేసిన డబ్బులు తీసుకుని టైటిల్ రేసు నుండి తప్పుకుంటే.. ఆ మొత్తాన్ని ప్రైజ్ మనీ నుండి తగ్గిస్తారు.
నిఖిల్ టైటిల్ విన్నర్ అయ్యాడు. అదే సమయంలో ఎవరు కూడా డబ్బులు తీసుకుని రేస్ నుండి తప్పుకోలేదు. దాంతో ప్రైజ్ మనీ మొత్తం నిఖిల్ కి అందింది. గత ఏడు సీజన్స్ లో ఇదే హయ్యెస్ట్ ప్రైజ్ మనీ. అలాగే నిఖిల్ కి దాదాపు రూ. 7 లక్షల విలువ చేసే మారుతి సుజుకీ కారు బహుమతిగా అందించారు. ఇక రెమ్యూనరేషన్ గా మరో రూ 33.75 లక్షలు నిఖిల్ ఆర్జించాడు.
అయితే ప్రైజ్ మనీలో భారీ కోత ఉంటుంది. రూ. 55 లక్షలు పూర్తిగా నిఖిల్ కి దక్కవు. ఆదాయపన్ను చట్టాల ప్రకారం ప్రైజ్ మనీని సాధారణ ఆదాయంగా పరిగణించరు. పెద్ద మొత్తంలో టాక్స్ కట్ చేస్తారు. 30.9 శాతం టాక్స్ కటింగ్ ఉంటుంది. అంటే రూ. 16.9 లక్షలు... దాదాపు రూ. 17 లక్షలు మినహాయిస్తారు. కారు ధరలో కూడా టాక్స్ కటింగ్ ఉంటుంది. అన్నమాట సంగతి..