బిగ్ బాస్ టైటిల్ ఎవరిదో తేల్చేసిన బెజవాడ బేబక్క, ఈసారి సంచలనమేనట!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 టైటిల్ విన్నర్ ఎవరో లీక్ చేసింది బేబక్క. సదరు కంటెస్టెంట్ పేరు మీడియా ముఖంగా వెల్లడించింది.
Bigg boss telugu 8
బిగ్ బాస్ తెలుగు 8 సక్సెస్ఫుల్ గా మూడో వారంలో అడుగుపెట్టింది. 14 మంది కంటెస్టెంట్స్ తో గ్రాండ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. వీరిలో మొదటి వారానికి గాను బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.
Bigg boss telugu 8
సోషల్ మీడియా స్టార్ హోదాలో బెజవాడ బేబక్క బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. బిగ్ బాస్ ఇంట్లో ఆమె పెద్దగా ప్రభావం చూపలేదు. వయసు రీత్యా టాస్క్ లలో పోటీ పడలేకపోతున్నారు. బెజవాడ బేబక్కలో అగ్రెషన్ కరువైంది. ఆమె సాఫ్ట్ యాటిట్యూడ్, కామ్ బిహేవియర్ మేకర్స్ కి అంతగా నచ్చకపోయి ఉండొచ్చు. అలాగే గత సీజన్స్ లో పరిశీలించినా ఏజ్ బార్ లేడీ కంటెస్టెంట్స్ త్వరగా ఇంటిని వీడారు.
ఇక రెండో వారం శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యాడు. ఇది అనూహ్య పరిణామం. శేఖర్ బాషా ఎలిమినేట్ అవుతున్నట్లు ఎలాంటి సమాచారం లేదు. అలాగే ప్రేక్షకుల్లో ఆయనపై పాజిటివ్ ఒపీనియన్ ఉంది. ఈ సీజన్ కి గాను ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్నాడు.
ఆదిత్య ఓం, శేఖర్ బాషాలలో ఒకరు ఇంటిని వీడాల్సి ఉంది. ఎవరు ఎలిమినేట్ కావాలో హౌస్ మేట్స్ నిర్ణయించాలని హోస్ట్ నాగార్జున కోరారు. మెజారిటీ కంటెస్టెంట్స్ శేఖర్ బాషా బయటకు వెళ్లాలని నిర్ణయించారు. దాంతో శేఖర్ బాషా ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. శేఖర్ బాషా భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ కారణంగా హౌస్ మేట్స్ ఆదిత్య ఓం కి సపోర్ట్ చేసి శేఖర్ బాషాను ఇంటికి పంపారు.
శేఖర్ బాషా ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అనే వాదన వినిపించింది. ప్రస్తుతం హౌస్లో 12 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో 8 మంది నామినేషన్స్ లో ఉన్నారు. నిఖిల్, సోనియా, ఆదిత్య ఓం, నబీల్ మినహాయించి అందరూ నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు వచ్చే వారం ఇంటిని వీడనున్నారు.
ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ విన్నర్ ఎవరో బెజవాడ బేబక్క తేల్చేసింది. ఒక వారం హౌస్లో ఉన్న బేబక్క నిర్ణయం ప్రకారం విష్ణుప్రియ టైటిల్ విన్నర్ అవుతుందట. తన ఫేవరేట్ కంటెస్టెంట్ విష్ణుప్రియ అని చెప్పిన బేబక్క... టైటిల్ విన్నర్ ఆమెనే అని తేల్చేసింది.
అయితే విష్ణుప్రియ ఇంకా స్ట్రాటజిక్ గా ఆడాలి. తన ఎనర్జీ ఉపయోగించి తెలివిగా గేమ్ ఆడితే టైటిల్ ఆమెదే అని తేల్చేసింది. మరి అదే నిజమైతే చరిత్ర అవుతుంది. గత 7 సీజన్స్ లో బిగ్ బాస్ తెలుగు టైటిల్ ని లేడీ కంటెస్టెంట్ కొట్టింది లేదు. గీతా మాధురి, శ్రీముఖి టైటిల్ కోసం పోటీపడ్డారు. కానీ రన్నర్ పొజిషన్ తో సరిపెట్టుకున్నారు.
మరి బేబక్క అంచనా ప్రకారం విష్ణుప్రియ టైటిల్ విన్నర్ అవుతుందో లేదో చూడాలి. బిగ్ బాస్ 8 మొదలై ఇంకా ఐదు వారాలు కూడా గడవలేదు. అప్పుడే ఒక అంచనాకు రావడం కష్టమే. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని తెలుస్తుంది. కొత్త కంటెస్టెంట్స్ కూడా వచ్చాక ఒక స్పష్టత రావచ్చు. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చే సెలెబ్స్ కి టైటిల్ గెలుచుకునే అవకాశం ఉండదు.
పాపులారిటీ పరంగా చూస్తే విష్ణుప్రియ టాప్ లో ఉంది. గేమ్ పరంగా నిఖిల్ ముందంజలో ఉన్నాడు. నాగ మణికంఠ, యష్మి గౌడ, ప్రేరణ, సోనియాల నుండి కూడా విష్ణుప్రియకు పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. చెప్పాలంటే బిగ్ బాస్ తెలుగు 8 ఇంకా ఊపందుకోలేదు.