MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • TV
  • కెమెరాలు జూమ్ చేసి దారుణంగా చూపించారు, నా కెరీర్ ఏం కావాలి, సోనియా ఆకుల ఫైర్ 

కెమెరాలు జూమ్ చేసి దారుణంగా చూపించారు, నా కెరీర్ ఏం కావాలి, సోనియా ఆకుల ఫైర్ 

పృథ్విరాజ్, నిఖిల్ లతో తాను హౌస్లో ప్రవర్తించిన తీరును తప్పుగా చూపించారని సోనియా ఆకుల ఫైర్ అయ్యింది. ఎడిట్ చేసిన వీడియోలతో బ్యాడ్ చేశారంటూ ఆవేదన చెందింది.  

3 Min read
Author : Sambi Reddy
Published : Oct 05 2024, 08:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Bigg boss telugu 8

Bigg boss telugu 8

సోనియా ఆకులపై సోషల్ మీడియాలో అత్యంత నెగిటివిటీ నడిచింది. హౌస్లో ఆమె ప్రవర్తన పట్ల ఆడియన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సోనియా ఆకులను ఎలిమినేట్ చేయాలన్న డిమాండ్ గట్టిగా వినిపించింది. నాలుగో వారం సోనియా నామినేషన్స్ లోకి వచ్చింది. ప్రేక్షకులు ఆమెకు ఓట్లు వేయలేదు. 

సోనియా ఆకుల ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించాడు. సోనియాతో హౌస్లో అత్యంత సన్నిహితంగా మెలిగిన నిఖిల్, పృథ్విరాజ్ ఆవేదనకు గురయ్యారు. నిఖిల్ కన్నీరు పెట్టుకున్నాడు. బయటకు వచ్చిన సోనియా ఆకుల ఎపిసోడ్స్ చూసి షాక్ అయినట్లు తెలుస్తుంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనను చాలా తప్పుగా చూపించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Bigg boss telugu 8

Bigg boss telugu 8


సోనియా ఆకుల మాట్లాడుతూ.. నేను హౌస్లో కిచెన్ చూసుకున్నాను. రేషన్ మేనేజ్ చేశాను. టాస్క్ లలో సత్తా చాటాను. అవేమీ చూపించలేదు. కేవలం నిఖిల్, పృథ్విలతో ఉన్నదే చూపించారు. మరి అదైనా పూర్తిగా చూపించారా.. అంటే లేదు. ముందుకు వెనుక కట్ చేసి చూపించారు. అలా ఎందుకు చేశారో బిగ్ బాస్ టీమ్ ని అడగాలి. 

నిఖిల్, పృథ్విలతో నా బాండింగ్ సిస్టర్, మదర్ వంటిది. వాళ్ళను అలానే చూశాను. అందుకే పెద్దోడు, చిన్నోడు అనే దాన్ని. పృథ్వి, నిఖిల్ లను హగ్ చేసుకున్నది చూపించారు. అంతకు ముందు ఏం జరిగింది అనేది చూపించలేదు. అందుకే ఆడియన్స్ తప్పుగా అర్థం చేసుకున్నారు. 
 

36
Bigg boss telugu 8

Bigg boss telugu 8

నేను ఓ టాస్క్ లో పోరాడి గెలిచాను. అందుకే పృథ్వి నన్ను హగ్ చేసుకుని కిస్ చేశాడు. నేను గెలిచినందుకు నా కంటే వారే ఎక్కువ సంతోషపడ్డారు. నా సంతోషాన్ని ఆ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఒక అబ్బాయిని మరో అబ్బాయి కూడా విన్నింగ్ స్పిరిట్ లో హగ్ చేసుకుంటాడు. కిస్ చేస్తాడు. నా విషయంలో దాన్ని అపార్థం చేసుకునేలా చూపించారు. 

ఒక ఎపిసోడ్ లో చేశారంటే ఓకే... కానీ ప్రతి ఎపిసోడ్లో అదే చేశారు. హౌస్లో అంత మంది ఉంటే నన్నే టార్గెట్ చేశారు. నేను చేతులు ఎక్కడ పెట్టినా జూమ్ చేసి మరీ చూపించారు. మరీ అంత క్రూరంగా చూపిస్తారా.. ఒకరి కెరీర్ ఏమవుతుంది. వాళ్లకు నేనొక్కదాన్నే టార్గెట్ అయ్యాను. 

హౌస్లో చాలా మంది బూతు పదాలు వాడారు. కేవలం పృథ్విని మాత్రమే నాగార్జున ప్రశ్నించాడు. సోనియాను ఒక్కదాన్నే చూపించారు. యష్మి నా పై చాలాసార్లు విమర్శలు చేసింది. అయినా నేను భరించాను. నామినేషన్స్ లో పృథ్వి, నిఖిల్ లను నేను వాడుకుంటున్నాను అంది. యష్మి వలె నేను దిగజారలేదు... అని అన్నారు. 

46
Bigg boss telugu 8

Bigg boss telugu 8

బిగ్ బాస్ మేకర్స్ తనను కావాలనే తప్పుగా చూపించారని కోణంలో ఆమె మాట్లాడారు. కాగా ప్రేక్షకులు నిజాయితీగా గేమ్ ఆడేవారిని మాత్రమే సపోర్ట్ చేస్తారు. మొదటి వారం నుండి సోనియా గేమ్ పరిశీలిస్తే .. నిజాయితీ  కనిపించలేదు. ఫేక్ ఎమోషన్స్, ఫేక్ రిలేషన్స్ ఆమె కొనసాగిస్తోంది. అత్యంత సన్నిహితంగా ఉండే నిఖిల్ ని ఉద్దేశించి కూడా ఇతర కంటెస్టెంట్స్ తో తప్పుగా మాట్లాడుతుంది, ఆరోపణలు చేస్తుంది. కంటెస్టెంట్స్ ని పర్సనల్ గా టార్గెట్ చేయడం కూడా సోనియాకు మైనస్ అని చెప్పాలి.

విష్ణుప్రియపై సోనియా వ్యక్తిగత ఆరోపణలు చేసింది. నీ డ్రెస్సింగ్ అసభ్యకరంగా ఉంటుంది. అడల్ట్ జోక్స్ వేస్తావు, అడల్ట్ కంటెంట్ ఇస్తున్నావు. నీకు ఫ్యామిలీ లేదంటూ ఘాటైన విమర్శలు చేసింది. బిగ్ బాస్ హౌస్ లో ఒక కంటెస్టెంట్ ప్రవర్తన, గేమ్ పై విమర్శలు చేయవచ్చు. కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడాన్ని ప్రేక్షకులు సహించరు. 

సోనియా ఆటిట్యూడ్, బిహేవియర్ సైతం అభ్యంతరకరంగా ఉంటున్నాయి. పృథ్విరాజ్, నిఖిల్ తో ఆమె ప్రవర్తన చాలా అసభ్యంగా తోస్తుంది. మేల్ కంటెస్టెంట్స్ తో సోనియా ఇబ్బందికర ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సోనియా పై అందుకే విపరీతమైన నెగిటివిటి నడిచింది.

56
Bigg boss telugu 8

Bigg boss telugu 8

సోనియా ఆకులకు పెద్దగా పాపులారిటీ లేదు. ఆమె కోరి బిగ్ బాస్ షోకి వచ్చింది. బిగ్ బాస్ సెలక్షన్ ప్రాసెస్ రెండు రకాలుగా ఉంటుంది. నిర్వాహకులు స్వయంగా కొందరు సెలెబ్స్ ని సంప్రదిస్తారు. వారు ఆసక్తి ఉంది అంటే, ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. నిర్వాహకులు సంప్రదించిన సెలెబ్స్ కి డిమాండ్ ఉంటుంది. వారు పెద్ద మొత్తంలో  రెమ్యూనరేషన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. బేరసారాలు ఆడొచ్చు. 

రెండో ఎంపిక విధానంలో కొందరు సెలెబ్స్ స్వయంగా బిగ్ బాస్ నిర్వాహకులను సంప్రదిస్తారు. తమకు ఆసక్తి ఉందని తెలియజేస్తారు. పెద్దగా ఫేమ్ లేని సెలెబ్స్ ఇలా చేసే అవకాశం ఉంది. బిగ్ బాస్ షో వలన వెలుగులోకి రావచ్చని ఆశపడతారు. సోనియా ఆకుల అదే విధంగా సీజన్ 8లో కంటెస్ట్ చేసిందని సమాచారం. 


 

66
Bigg boss telugu 8

Bigg boss telugu 8

కాగా ఎవరికైనా కూడా చెప్పుకోదగ్గ రెమ్యూనరేషన్ అయితే బిగ్ బాస్ నిర్వాహకులు ఇస్తారట. అది లక్షల్లోనే ఉంటుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సోనియా వారానికి రూ. 1.5 లక్షల ఒప్పందం పై హౌస్లో అడుగుపెట్టిందట. ఆ లెక్కన నాలుగు వారాలకు సోనియాకు రూ. 6 లక్షలు ముట్టాయని సమాచారం. 

బిగ్ బాస్ తెలుగు 8 లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇక్కడ  తెలుసుకోండి 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved