రోహిణి ఎలిమినేటెడ్! ఆ టాప్ కంటెస్టెంట్ కి కూడా షాక్!
ఫైనల్ వీక్ లో షాకింగ్ ఎలిమినేషన్స్ చోటు చేసుకున్నాయి. రోహిణి తో పాటు మరో మోస్ట్ పాపులర్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతున్నారు. ఫైనలిస్ట్స్ ఎవరో స్పష్టత వచ్చేసింది .
Bigg boss telugu 8
14వ వారం నామినేషన్స్ చాలా కీలకం. ఫినాలేకి ఒక్క అడుగుదూరంలో జరిగే ఈ నామినేషన్స్ ఆసక్తిరేపుతాయి. ప్రతి సీజన్లో ఒకరు టికెట్ టు ఫినాలే గెలుచుకుని ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటారు. అవినాష్ సీజన్ 8లో టికెట్ టు ఫినాలే పొందారు. ఆ విధంగా అవినాష్ మొదటి ఫైనలిస్ట్ గా టాప్ 5 లో చోటు దక్కించుకున్నాడు. మిగతా ఆరుగురు నామినేషన్లో ఉన్నట్లు బిగ్ బాస్ ప్రకటించారు. ఫినాలేకి ప్రేక్షకులే పంపాలనే ఉద్దేశంతో బిగ్ బాస్ నేరుగా వారిని నామినేట్ చేశాడు.
డిసెంబర్ 6 శుక్రవారం ఓటింగ్ ముగిసింది. లైన్స్ క్లోజ్ అయ్యాయి. ఓటింగ్ లో ఎవరు సత్తా చాటారు? డేంజర్ జోన్లో ఉంది ఎవరనే ఆసక్తి నెలకొంది. అందుతున్న సమాచారం ప్రకారం గౌతమ్, నిఖిల్ ఓటింగ్ లో పోటీపడుతున్నారు. వీరిద్దరి మధ్య టఫ్ వార్ నడుస్తుంది. టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అవుతున్న నిఖిల్ కి గౌతమ్ ఛాలెంజ్ విసురుతున్నాడు. వీరిద్దరిలో ఒకరు విన్నర్ అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తుంది.
కాగా నిఖిల్ కంటే గౌతమ్ ముందంజలో ఉన్నాడట. గౌతం, నిఖిల్ మధ్య 2-3 శాతం ఓట్ల తేడా ఉందట. మొదటి రెండు స్థానాల్లో గౌతమ్, నిఖిల్ కొనసాగుతున్నారట. ఇక మూడో స్థానంలో నబీల్ ఉన్నాడట. రెండు రోజుల క్రితం వరకు నబీల్ డేంజర్ జోన్లో ఉన్నాడు. చివరి రోజుల్లో పుంజుకున్న నబీల్ టాప్ త్రీకి వచ్చాడు. నబీల్ తర్వాత నాలుగవ స్థానంలో ప్రేరణ ఉందట. వీరు నలుగురు ఫైనల్ కి వెళ్లడం ఖాయం అంటున్నారు.
Bigg boss telugu 8
బుల్లితెర స్టార్స్ విష్ణుప్రియ, రోహిణి ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారట. రోహిణి మొదట్లో ముందజలో ఉంది. ఆమె 4వ స్థానంలో కొనసాగింది. ఓటింగ్ చివరి దశలో రోహిణి వెనకబడింది. విష్ణుప్రియ ఐదో స్థానంలో ఉందట. ఆమె కూడా డేంజర్ జోన్లో ఉంది. విష్ణుప్రియ-రోహిణి మధ్య స్వల్ప ఓట్ల తేడా మాత్రమే ఉంది. వీరిద్దరూ ఎలిమినేట్ అయ్యారట.
Bigg boss telugu 8
అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం రోహిణి శనివారం ఎలిమినేట్ అయ్యింది. రోహిణి వైల్డ్ కార్డు ఎంట్రీ. చివరి వారాల్లో ఆమె బాగా ఆడారు. అయితే కీలకమైన 14వ వారం ఆడియన్స్ రోహిణికి హ్యాండ్ ఇచ్చారు. ఓట్లు వేయలేదు. పోటీ గట్టిగా ఉన్న నేపథ్యంలో రోహిణి వెనకబడిపోయింది.
ఇక ఆదివారం విష్ణుప్రియ ఎలిమినేట్ కానున్నారట. ఆమె ఇప్పటి వరకు హౌస్లో ఉండటమే ఎక్కువ అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. అందుకు కారణం.. ఆమె గేమ్ ఆడిన దాఖలాలు లేదు. ఎన్ని విమర్శలు వచ్చినా.. పృథ్వి వెనకాలే తిరిగింది. అతనితో రొమాన్స్ చేసింది.
కామెడీగా అతడు ఎలిమినేట్ అయితే ఆమెలో కనీస స్పందన కనిపించలేదు. చాలా లైట్ తీసుకుంది. పృథ్వి కూడా లేనప్పుడు విష్ణుప్రియ ఉన్నా వేస్ట్ అని ప్రేక్షకులు అనుకున్నారేమో ఎలిమినేట్ చేశారు. రోహిణి, విష్ణుప్రియ ఎలిమినేషన్ నేపథ్యంలో నిఖిల్, గౌతమ్, అవినాష్, ప్రేరణ, నబీల్ టాప్ 5 కంటెస్టెంట్స్ గా ఫైనల్ కి వెళ్లారు.