మరో 24 గంటల్లో ముగియనున్న ఓటింగ్, విన్నర్ ఎవరో తేల్చేసిన ఆడియన్స్, వారిద్దరికీ షాక్!
కేవలం కొన్ని గంటల్లో ఓటింగ్ లైన్స్ క్లోజ్ కానున్నాయి. నామినేషన్స్ లో 6 మంది ఉన్నారు. ఎలిమినేటైన కంటెస్టెంట్స్ ఫైనల్ కి వెళ్లే ఛాన్స్ కోల్పోతారు. మరి ఓటింగ్ లో ఎవరు టాప్, ఎవరు లీస్ట్?
14వ వారం నామినేషన్స్ చాలా కీలకం. ఎలిమినేట్ అయితే ఇన్ని వారాల కష్టం వృధా అవుతుంది. టైటిల్ కొట్టినా కొట్టకున్నా... ఫైనల్ కి వెళితే అదో కిక్. షోకి వచ్చినందుకు సక్సెస్ అయ్యామనే భావన కలుగుతుంది. అదే సమయంలో టైటిల్ రేసులో ఉంటారు. గ్రాండ్ ఫినాలేలో కనిపించడం ద్వారా మంచి రీచ్ లభిస్తుంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశలో ఉంది. మరో వారం రోజుల్లో విన్నర్ ఎవరో తేలిపోనుంది. ప్రస్తుతం హౌస్లో 7 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. టికెట్ టు ఫినాలే గెలిచిన అవినాష్ నేరుగా ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. మిగిలిన వారిలో మరో నలుగురు ఫైనల్ కి వెళ్తారు. ఒకరు ఎలిమినేటై.. ఐదుగురు ఫైనల్ కి వెళ్లినా ఆశ్చర్యం లేదు. సీజన్ 7లో ఆరుగురు కంటెస్టెంట్స్ ని ఫైనలిస్ట్స్ గా ప్రకటించారు.
సోమవారం ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. శుక్రవారం అర్ధరాత్రి తో ముగియనుంది. మరి ఓటింగ్ లో ఎవరు టాప్ లో ఉన్నారు? ఎవరు అత్యల్ప ఓటింగ్ తో డేంజర్ జోన్లో ఉన్నారు? అనే ఉత్కంఠ నెలకొంది. పలు మీడియా సంస్థల అనధికారిక పోల్స్ ప్రకారం.. గౌతమ్ టాప్ లో ఉన్నాడు. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ చివరి వారాల్లో టైటిల్ రేసులోకి వచ్చాడు. మిగతా కంటెస్టెంట్స్ అంత స్ట్రాంగ్ గా లేరు.
Bigg boss telugu 8
ఈ క్రమంలో బిగ్ బాస్ ఆడియన్స్ గౌతమ్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తుంది. ఇక రెండో స్థానంలో నిఖిల్ ఉన్నాడట. నిఖిల్ ఫస్ట్ వీక్ నుండి హౌస్లో ఉన్న కంటెస్టెంట్. ఈసారి అతడిదే టైటిల్ అనేది గట్టిగా జరుగుతున్న ప్రచారం. ప్రతి టాస్క్ లో నిఖిల్ 100 పర్సెంట్ ఇస్తాడు. అనేక విజయాలు సాధించాడు. అయితే నిఖిల్ కి నాన్ లోకల్ అనే ట్యాగ్ మైనస్ గా మారింది. అలాగే సోనియా, యష్మి ఎలిమినేషన్ కి అతడు పరోక్షంగా కారణం అయ్యాడనే అపవాదు ఉంది.
మూడో స్థానంలో ప్రేరణ ఉందట. ఈమె కూడా స్ట్రాంగ్ ప్లేయర్. కాకపోతే ప్రేరణ కొందరితో మాత్రమే సన్నిహితంగా ఉంటుంది. ఒక్కోసారి మాటలు జారేస్తుంది. గౌతమ్, నిఖిల్, ప్రేరణ టాప్ 3లో ఉన్నారు. ఈ ముగ్గురు ఫైనల్ లో కనిపించడం ఖాయం. ఇక నాలుగో స్థానంలో రోహిణి ఉందట. రోహిణి గత రెండు మూడు వారాలుగా తనలోని పవర్ చూపిస్తుంది. టాస్క్ లలో ఆడ పులిలా విజృంభిస్తుంది.
రోహిణి గ్రాఫ్ పెరిగింది. విష్ణుప్రియ ఓటింగ్ లో ఐదో స్థానానికి పరిమితం కావడం అనూహ్య పరిణామం. భారీ ఫేమ్ ఉన్న విష్ణుప్రియ గేమ్ పరంగా వెనకబడింది. పృథ్వి వెనకాల తిరుగుతూ గేమ్ వదిలేసిన విష్ణుప్రియ టైటిల్ రేసు నుండి ఎలిమినేషన్ స్థాయికి పడిపోయింది. గత వారం కూడా ఆమె ఎలిమినేషన్ నుండి తృటిలో తప్పుకుంది. ఇక చివరి స్థానంలో నబీల్ ఉన్నాడట. ప్రస్తుత ట్రెండింగ్ ప్రకారం.. విష్ణుప్రియ, నబీల్ లలో ఒకరు అవుట్, ఇద్దరు ఇంటిని వీడినా ఆశ్చర్యం లేదు.
Bigg boss telugu 8
ఇక విన్నర్ ఎవరు అనేది ఆసక్తికర పరిణామం. ఈ వారం ఓటింగ్ లో గౌతమ్ ముందంజలో ఉన్నాడు. అదే ఫైనల్ వీక్ లో కూడా కంటిన్యూ అయితే గౌతమ్ విన్నర్ అవుతాడు. వైల్డ్ కార్డ్ కి టైటిల్ ఇస్తే విమర్శలు వెల్లువెత్తుతాయనే వాదన ఉంది. కాగా నిఖిల్ టైటిల్ కి అర్హుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.